2 సెప్టెం, 2012

ఏదైనా కొన్నాళ్ళే


ఎందుకో కో మరి ఈ స్దబత ?గత కొంత కాలం గా . పని వత్తిడి వల్లేమో ?బ్లాగ్  లో భావాలూ పంచుకుని ఊరట చెందే అవకాసం కూడా రావడం లేదు .ఏవి నిరుడు కురిసిన హిమసముహాలు ?లేదా హిమసముహాలు అలాగే వుండి  వుంటాయి మనం చూసి ఆస్వాదించే మనసు సమయం లేక సమూహాలు గా మిగిలి పోయి వుంటాయి .ప్రేమ ఉదృతం గా వునప్పుడు అది తప్ప ఏమి కనబడదు .అది తగ్గినప్పుడే వాస్తవాలు కనిపించి భాద్యతలు గుర్తుకొస్తాయి .రాత్రి ఎనిమిందింటికి ఆఫీసు నుంచి బయలు దేరుతూ యిప్పుడు మీ యింటికి వస్తున్నాను అంటే అంతకన్నానా అంటూ ఆనందం గా ఆహ్వానించే స్నేహితురాలు /ప్రియురాలు కొన్నాళ తర్వాత అదే సమయానికి  అదే ప్రశ్నకి సమాధానం గా ఈ టైం లోనా ?అంటూ సమాధానం యిస్తే ఉదృతి తగ్గి వాస్తవాలు కళ్ళముందు కని పిస్తున్నాయని అర్ధం .అదేంటి కాఫీ నే గా తాగేది ?అతని ప్రశ్న .అవుననుకో చూసే వాళ్ళు ఏమనుకుంటారు ?ఆమె సమాధానం .మరి యిన్నాళ్ళు గాంధారి పుత్రులా ?కళ్ళుమూసుకుని   వున్నారా ?యీవేళ మాత్రం నే వస్తానంటే అలిచిప్పలా కళ్ళు పెద్దవి చేసుకుని వాళ్ళ పనులు మానుకుని నే రాగానే వీళ్ళెం   చేస్తారా అని తలుపులు తీసుకుని చూడ టానికి అతని లో ఆవేశం .అబ్బ ఎప్పుడు నీ కోణం లోనే గాని నా తరఫున ఆలోచించావా ?ఏ టైం లో పడితే ఆ టైం లో వస్తే ?ఆమె మాట పూర్తయ్యే లోపే అతను  నా కు వీలయిన టైం లో నే వస్తా అయినా జనాల కోసం బతుకు తున్నవా ? నీ కోసం బతుకు తున్నవా ?ఆ జనాలేమన్న నీకు అన్నం పెడుతున్నారా ?నీ ప్రేమ ఉదృతం గా వునప్పుడు రాని  ఈ జనాలు యిప్పుడే ఎలా వచ్చారు ?నీ కిప్పుడు మొహం మొత్తిందని చెప్పు నీ నిజాయితీకి పాదాభివందనం చేసి నే తప్పుకుంటా .అంతే గాని జనాల వంక చెప్పకు వాళ్ళు మొదటి రోజు నుంచి వున్నారు వాళ్ళ వాళ్ళ కోణాలనుంచి మనల్ని గమనిస్తూనే వుంటారు .ప్రేమ తారా స్తాయికి వెళ్ళే వరకు ఏ అడ్డంకులు కనబడవు అక్కడ నుంచి కిందకి జారడం మొదలవ్వా గానే అప్పటి వరకు కనబడని జనాలు ,కులాలు ,మానాలు అన్ని గుర్తుకు వస్తాయి .ఏ భందాలయినా కొన్నాళ్ళే బావుంటాయి అవసరాలు తీరి పోయాక కొత్త తీరాలు వెత్తుకుంటూ పాత కెరటాలని వదిలించు కోవడం కోసం వంకలు వెతుక్కుంటాయి .యీ ప్రక్రియ వొక నిరంతర ప్రవాహం .యిక్కడ పాత్రలు అవే పాత్ర దారులు మారతారు .మరో గమ్యం వైపు సాగి పోతారు .
వొక సుధ  కావచ్చు,రాధిక కావచ్చు .సీత కావచ్చు .వీళంతా ఎవరు అంటే ?వీళ్ళకి  పరిచయం అయ్యి ప్రస్తుతం విడి పోయారో ?లేదో తెలీని స్తితి లో వున్న వాళ్ళ మాజీ తాజా స్నేహితుల  అనుమతి తో వొక ఉద్గ్రంధం రాయవలసి రావొచ్చు .అందుకని ప్రస్తుతం యిక్కడ కామా పెడుతున్నా . వాళ్ళు వప్పుకుంటే మాత్రం రాస్తాను సుమా .

4 వ్యాఖ్యలు:

sri చెప్పారు...

enta baaga chepparandi, open fact

Padmarpita చెప్పారు...

వాళ్ళు వద్దంటే మానేస్తారా ఏంటి? అయినా మీరు రాస్తున్నవి వాస్తవాలేగా:-) రాయండి!

రవిగారు చెప్పారు...

శ్రీ గారు ధన్యవాదాలు అవన్నీ చేదు నిజాలు . మన మత్తు వదిలే దాక కనబడని మరో కోణాలు .
అందుకే వొక సిని కవి'' కొంతకాలం కొంత కాలం కాలమాగి పోవాలి, నీ తోడూ కావాలి '' అని రాసాడే గాని
అంత కాలం అంత కాలం అని రాయలేదు
పద్మార్పిత గారు బహు కాల దర్సనం .వద్దు అంటే రద్దు చేస్తే ఏం ముద్దు వుంటుంది
వొక్క సారి గా ఆ కధలు రాస్తే ఉ కొట్టకుండా ఉలిక్కి పడతారని , ముందు గా యిచ్చే సూచన .
ఏదో వొక రోజు కొన్ని నిజాలు బయట పెట్టక తప్పదు . ప్రస్తుతం యి విషయం లో యింత కన్నా ఏమి చెప్పలేను .

Lakshmi Raghava చెప్పారు...

manasulo emunna స్వేచ్చగా చెప్పుకో గలిగేది మన బ్లాగులోనే అన్నది నిజం..అంతేకాదు అది ఎంతమందిని ఆలోచింప చేస్తుందో..ఎంతమందికి తమ అనుభవాలను గుర్తుకు తెస్తుందో...అందుకే మీరు ఇంకా ఇలాటివి రాయండి
లక్ష్మీ రాఘవ