23 అక్టో, 2012

మారే హృదయం
మారే హృదయం

 యెదలో అభయం

ఏదో విధం అయోమయం

తరచూ దానికి గాయం

అయినా సిద్దం మర్నాడు ఉదయం

తప్పేంటో వోప్పేంటూ   తెలిసేలా లేదేమిటో

గమ్యం కాదని తెలిసినా అటు పయనమేమిటో

పశ్చాతాప్పం  ఆవిరి అయిపోతున్నదేమిటో

తన మాటైనా తను  వొకసారి విన దేమిటో

కొంచెం యిష్టం  కొంచెం కష్టం

చివరికి తనకే నష్టం

హృదయ స్పందన మారిపోతున్నది మాత్రం స్పష్టం

పడలేదంటూనే  పడుతూ వుంటే ఆగంటూ అగంటూ   ఆపేదెలా

యిది జరిగిందేప్పుడో ఎద అడిగిన్దేప్పుడో ?

ఏదో విధం అయోమయం

యెదలో భయం

హృదయం మళ్ళి భారం