25 అక్టో, 2012

బ్రాహ్మల్ని కించపరచడానికి'' దైనికనా రెడీ''




దైనికైనా రెడీ సినిమాకి కావాలని సెన్సార్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి  క్లియరెన్స్ యివ్వకుండా జాప్యం చేస్తున్నారని నిర్మాత

మోహన్ బాబు గగ్గోలు పెడితే ఏంటో అనుకున్నా గాని ఈ సినిమా చూసాకా ఆవిడ  అబ్యంతరాలు పెట్టడం లో అర్ధం వుందని పించింది . మొత్తం పంతొమ్మిది కట్స్ చెపితే దెబ్బలాడి బలవంతం గా బయటకు తెప్పించుకునట్టు గా వుంది . సినిమాలో ఎక్కువ భాగం బ్రాహ్మల్ని  సంభావన కోసం సొంగ కార్చుకుంటూ దేనికైనా రెడీ అనట్టు గా చూపించారు అదే డైలాగు బ్రహ్మానందం తో కూడా  చెప్పించారు . ఎన్నాళ్ళు  వాళ్ళని తిండి పోతుల్లగా , డబ్బుకు కక్కుర్తి పడే వాళ్ళలా చూపిస్తూ అదే హాస్యం అనుకోమనినవ్వు కొమంటే నవ్వుల పాలు అయ్యేది ఆ నిర్మాతలే . ఈ సినిమాలో కుడా చికెన్ ముక్కని , మటన్ ముక్కని ఆబగా బ్రాహ్మలు తిన్తునట్టు చూపించి వారిని యధా విధి గా అపహాస్యం చేసారు .యిదే విధం గా వేరే యే  కులం వారి మనోభావాలను దెబ్బతీస్తూ చూపిస్తే ఈ పాటికి ఆ సినిమా రీళ్ళని  నడి  రోడ్డుమీద తగల బెట్టి వుండే వారు . మంచితనం , సంస్కారం సబ్యత చేతకాని తనం గా అయిపోయాయి .అదే నిమ్నజాతి  కులాల మీద డైలాగు పక్కన బెట్టి వారి నాయకుల  విగ్రహం చూపించి  ఆ కాలని  వాళ్ళు దొంగలు గా చూపిస్తేనే పెద్ద గొడవ అయ్యింది.  యిందులో  బ్రహ్మాన స్త్రీ గా వేసిన పాత్రతో యింటికి ఎవరు వచ్చినా అచ్చు మా ఆయన లానే వున్నారు అంటూ డబ్బు కోసం వెకిలి గా ప్రవర్తించేలా చూపించి మకిలి హాస్యం గా మలిచారు . ముద్ద పప్పు ఆవకాయ నెయ్యి  వేసుకుని తినేస్తా అని హీరో చేత డైలాగులు చెప్పించారు .బ్రహ్మాన స్త్రీ తో మా ఆయనకి తెలిస్తే నీ గు పగిలి పోద్ది అని చెప్పించి మళ్లీ  బ్రహ్మానందం తో ఏం పగిలి పోద్ది అని రెట్టించి హీరో చేత నీ గుబ పగిలి పోద్దని ఆవిడా గారి ఉద్దేశం అని చెప్పించారు .యిలా చెప్పుకుంటూ పొతే చాలానే వున్నాయి . అదే మళ్లీ  రాజుల కులం లో టివి దర్పం అంటూ ఆ కులాన్ని పొగిడారు .లోకువ గా వున్నా వాళ్ళని చుస్తే మొట్ట బుద్దని , సినిమా ఇండస్ట్రీ లో సగానికి పైగా వుండి వాటి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున బ్రాహ్మాల్ని మళ్లీ  అదే సినిమాల్లో వెకిలి హాస్యం తో అపహాస్యం చేస్తున్నా కిమ్మనే వాడె వుండడు పోనీ లెద్దూ  మన కెందుకు వాళ్ళ పాపాన వాళ్లే  పోతారు  అని సర్దుకు పోయే తనం  తో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ వుండడం తో ఇలాంటి హాస్యం పేరు తో అపహాస్యం చేసే సినిమాలు వస్తూనే వుంటాయి . పోనీ సినిమా ఏమన్నా నా కళా ఖండమా  అంటే డీ , రెడీ ని కలిపి తీసిన కాపీ సినిమా .అక్కడక్కడ బ్రహ్మనందంవల్ల  పేలిన జోకులు తప్ప పనులు మానుకుని చూసే సినిమా మాత్రం కాదు . వొక నెలలో ఎలాగు టివి లో వచ్చేసే సినిమానే .

13 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

"పోగాలము దాపురించినవారు, దీప నిర్వాణ గంధమును,అరుంధని,మిత్ర వాక్యమును, మూర్కొనరు,కనరు,వినరని పెద్దలు చెప్పుదురు."

అజ్ఞాత చెప్పారు...

"పోగాలము దాపురించినవారు, దీప నిర్వాణ గంధమును,అరుంధని,మిత్ర వాక్యమును, మూర్కొనరు,కనరు,వినరని పెద్దలు చెప్పుదురు."

అజ్ఞాత చెప్పారు...

బ్రాహ్మణులు మళ్లీ ఆర్థికంగా పుంజుకోవడమే ప్రతివాడిలోనూ ఈ బహిరంగ కుళ్ళుకు కారణం. కానీ బ్రాహ్మణుల సంపత్తి సద్వినియోగమవుతుంది. సమాజానికి మేలే చేస్తుంది. ఇతరుల సంపదలా కాదు. మోహన్ బాబులాంటి వెకిలిక్యారెక్టర్లని అరెస్టు చేసి చెఱసాలకి పంపాలి. కులాల మీద సినిమాలు తీసి సమాజంలో అశాంతికి కారణమయ్యేవారు క్షమార్హులు కారు. దీని మీద ఒక చట్టం తేవాల్సిన అవసరం ఉంది.

అజ్ఞాత చెప్పారు...

దరిద్రులు. సినిమావాళ్ళకి అదో జాడ్యం.

అజ్ఞాత చెప్పారు...

బ్రాహ్మణులు పూర్వకాలం నుండి అన్ని కులాలని సమానంగా చూసారు. అందరికీ తమ విద్య నేర్పించారు. అంటరానితనం అన్నదే తెలియదు. యగ్ణయాగాదులు నిర్వహించి అందులో అన్ని జంతువులను ప్రేమతో చూసారు. అలాంటి బ్రాహ్మణులని ఈ సినిమా దరిద్రులు నీచంగా తీయడం బాగోలేదు.

అజ్ఞాత చెప్పారు...

అయ్యా,

ఇత గాడు మొదటినించి బ్రాహ్మణ ద్వేషి. తన అహంకారం తననే అంతం చేస్తుందని తెలీని మూర్ఖుడు. కొడుకులు సినిమాల్లో రాణించలేక పోతున్నారు. కూతురు చేష్టలు జగద్విదితమే. ఇత గాడి గురించి, ఇతని కుటుంబ గొప్పదనం గురించి ఆంద్ర దేశం మొత్తానికి తెలుసు.

n chandra sekhar

అజ్ఞాత చెప్పారు...

గతం లో మోహన్ బాబు అదిరింది అల్లుడూ అనే సినిమా లో కూడా ఇలానే చేసాడు. ఈ చిత్రం లో కుల దూషణ పాలు పెరిగినట్లుంది. సమజానికి నవ్వుకోవడానికి బ్రాహ్మణుడు ముడి సరుకు అవుతాడని కలి ప్రభావాన్ని చెబుతూ వ్యాస భగవానుడు భాగవతం లో అంటారు. కలి ప్రభావం అని సరిపెట్టుకోవడమే.

అజ్ఞాత చెప్పారు...

బ్రాహ్మణుల మీద సినేమాతీసి జొకులు వేసుకోవాలి. మరి వాళ్ల మీద సినేమాతీయాల్సిన అవసరమే లేదు. వాళ్ల జీవితాలే పెద్ద జోకులు. టి వి పెడితే చాలు వాళ్ల జీవితాలు ఆన్ లైన్ లో ప్రజలందరికి అవైలబుల్ గా ఉంటాయి. మచ్చుకి చంద్ర బాబు పైన కొడాలి నాని దండకం. తారా చౌదరి, రాయపాటి సాంబశివరావు సరసాలు. నిమ్మగడ్డ ప్రసాద్ జైల్ లో కూచొని ఉంటే నాగార్జున సిగ్గుఎగ్గు లేకుండా పదే పదే జైలుకి వేళ్లికి పరామర్శ చేసి వస్తాడు. ఈ సదరు పెద్ద హీరోగారు ఒక్క సారి కూడా ప్రజల సమస్యలపైన, అవినీతి ఉద్యమం పైన నోరు తెరచిన పాపాన పోడు. అవినీతి పరులను కలసి రావటానికి జైలుకి మాత్రం పోతాడు. అదే మిగతా భాష హీరోలు అమీర్ ఖాన్ లాంటి వారు బాంబేయ్ నుంచి డిల్లి కి వచ్చి అన్నా హజారే కి మద్దతు తెలిపాడు.

Saahitya Abhimaani చెప్పారు...

మనిషా మోహన్ బాబా అన్న సామెత ఊరికే పుట్టలేదు మాష్టారూ.

durgeswara చెప్పారు...

ఇది పైకి కులాలపై వెకిలితనం తో కూడిన దాడిగా కనిపిస్తున్నది . కానీ అసలు ఇదాడి ధర్మంపైనే ధర్మాన్ని ఆచరణాత్మకంగా అనుసరిస్తూ పట్టుకొస్తున్న వర్గం పై దాడిచేయటం ద్వారా మన సంస్కృతీ సాంప్రదాయాలను అవమానపరచడమే . దురదృష్టవశాత్తూ కులాల అహంకారంలో మునిగి ఉన్నమనం కలసి గొంతెత్తటం లేదు .

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

బ్రాహ్మణులు చాలా సాఫ్ట్ టార్గెట్ అందరికీ. అందుకే ఇలా ఎవరు పడితే వారు కుమ్మేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసేసి కాస్ట్ అట్రాసిటీ అని ఒకటి పెట్టాలి. ఏ కులాన్ని లోకువ చేసి ప్రవర్తించినా చట్ట వ్యతిరేకం అని చెప్పాలి.

అజ్ఞాత చెప్పారు...

ఇక పెళ్ళి చెయ్యడం తరవాయి ఈవేళ కోర్ట్ పోలీస్ ని కేస్ పెట్టమంది కదా ఏ చేస్తారో చూదాం. కేస్ మూసేసి మారేడు కాయ చేసేరా?..అప్పుడు నా సామిరంగా.....

అజ్ఞాత చెప్పారు...

ఖర్మ ఏమిటంటే, ఈ సినిమాకి పనిచేసిన నలుగురు రచయితల్లో ముగ్గరు బ్రాహ్మలు (వాళ్ళలో ఎంతమందికి జంధ్యం ఉంది అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం). మనకే మనమీద, బ్రాహ్మణత్వం మీద గౌరవం లేకపోతే ఇక వేరే వాళ్ళ నుంచి గౌరవాన్ని ఆశించడం తప్పు.