వుజ్జోగం ,సజ్జోగం చెయ్యని చిన్నోడు , పెద్దోడు .ప్రతివాడు ఎమ్చేస్తున్నావ్ ?అనగానే రేలంగి నుంచి హైదరాబాద్ ట్రైన్ ఎక్కి నాలుగు రోజులు ఉద్యోగ ప్రయత్నం చేసినట్టుగా చేసి మళ్ళి వూరు వచ్చేసి బేవార్స్ గా తిరగడం , తొట్టిగాంగ్ తో గొడవలు పడడం . హీరో అందానికి మాత్రమె విలువనిచ్చి మిగత విషయాలు పక్కన బెట్టి ప్రేమించే హీరోయిన్ .రోడ్ మీద ఎదురు పడిన ప్రతివాడు మనకి పరిచయం వున్నా , లేక పోయినా ఎదురు ప డినప్పుడు చిరునవ్వు తో వాళ్ళకేసి చూస్తూ ప్రేమ తత్వాన్ని పంచాలే తప్ప ఏది సీరియస్ గా తీసుకోకుడదని నమ్మే తండ్రి .జీవితం లో సరైన ప్రణాళిక లేకుండా గాలివాటం లో బతికే వాళ్ళని మనుషుల లాగ చూడ కూడదని నమ్మే హీరోయిన్ తండ్రి .వీటి మద్య జరిగే సంఘర్షణ . ఆఖరికి లూజర్స్ కుడా విజేతలే అన్న ముగింపు . టూ కీ గా యిది కదా . మూడు గంటలు వోపికక గా కూర్చోవాలి .మద్యలో అన్నదమ్ముల సెంటిమెంట్ సీనులు .అగ్రనాయకుల తో సినిమా అంటే గొప్ప గా ఊహించుకుని సినిమా కి వస్తే నిరాశ తప్పదు . కనీసం వోక్కరిలో కుడా హీరో కి
ఉండవలసిన ధీరో ధాత్తమైన లక్షణాలు వుండవు .ఎంతసేపు యిదేంటి తోక్కలగా ఈరోజు యింత మంది అమ్మాయిలు పడిపోతున్నారు పలకరించడమే ఆలస్యం అనుకునే అవలక్షణం తప్ప .
మహేష్ పాత్ర నిడివి ఎక్కువ .నటన పరం గా కొట్టిన పిండి పాత్ర కాబట్టి అవలీలగా చేసేసాడు .సినిమా కొద్దిగా అన్న నడిస్తే తన వల్లే . వెంకటేష్ పాత్రలో ఎమొశానాలిటి ఎక్కువ నిడివి తక్కువ .వయసు కని పిస్తోంది మొఖం లో .మొత్తం గా ఈ సినిమా సీతమ్మ వాకిటికి మాత్రమె పరిమితమై పోయే వికసించని సిరిమల్లె చెట్టు .
ఈ సినిమా మొదటి రోజు మల్టీప్లెక్స్ లో చూడకపోతే లూజర్స్ కింద లెక్క అని పిల్లలు భావిస్తే ఇజ్జాత్ కా సవాల్ అని ఇన్ఫ్లుయెన్స్ వుపయోగించి రాత్రి పదకొండు గంటల షో కి ప్రసాద్స్ లో టికెట్స్ సంపాయించి రెండుగంటల దాక నిద్ర చెడ గోట్టుకు ని చూసిన సినిమా యిది . కాబట్టి పండగలలో టికెట్స్ దొరక లేదని దిగులు పడ వలసిన అవసరం యెంత మాత్రం లేదు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి