మిధునం యిప్పుడే సెకండ్ షో చూసి రాస్తున్నా .
అతికష్టం మీద స్కూల్ లో చదువుతున్న మా అబ్బాయిని వొప్పించి
భార్య భార్తలం యిరువురం ఈ సినిమాకి వెళ్ళాం .సినిమా అయిపోయి వస్తుంటే
మా శ్రీమతి సినిమా హాల్ నుంచి యింటికి కార్ డ్రైవ్ చేస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది ,
చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకుని .అచ్చు అలాగే ముచ్చ టించు కునేవారు అని .
అది చూసి మా అబ్బాయి కుడా మమ్మీ యింత మంచి సినిమాకి నిన్ను వెళ్ళకుండా చేసి వుంటే చాల బాధ పడే వాణ్ణి అన్నాడు .
దానికి ప్రతిగా ఆమె ఈ సినిమాని మా ఆఫీసు లో అందర్నీ చూడ మంటా అంటూ కళ్ళు తుడుచుకుంది .
ఇద్దరే పాత్రలతో సినిమాని ఎక్కడా బోర్ కొట్ట కుండా తీయడం పెద్ద సాహసమే .నాకు తెలిసి మాతృదేవోభవ తర్వాత కళ్ళు చేమర్చింప చేసిన సినిమా యిదే .
తల్లిదండ్రులను ప్రేమించే ప్రతి వ్యక్తీ వాళ్లతో కలిసి చూడవలసిన సినిమా .తనికెళ్ళ భరణి జన్మ ధన్యః .
మరచిపోయిన ఆకాశవాణి అలనాటి ప్రారంభ సంగీతం , బాలానందం పాట , పాలు చేలు మ్యూజిక్ ,వార్తః సృయంతం అంటూ సంస్కృత వార్తలు చెప్పుకుంటూ పొతే చాలా వున్నాయి .
అయితే బాలుగారు ప్రారంభంలో కొంచెం మోతాదుకి మించిన నటన ప్రదర్శించినా తర్వాత సద్దుకుని పాత్రలో ఇమిడి పోయారు .లక్ష్మి కాక యింకేవర్ని ఆ పాత్రలో వుహించుకోలేము .భరణి గారికి హృదయపూర్వక అభినందనలు.
1 కామెంట్:
ఈ సినిమా తీస్తున్నారు అని తెలియగానే దాసు పాత్ర ఎవరు అని చూశాను చాలా ఆత్రంగా. శంకరాభరణం సినిమాలో లాగ అప్పటివరకు మనకు తెలియని వ్యక్తి చేత ఈ వేషం వేయిస్తేనే నప్పుతుందని అని నా అంచనా. బాలు అని తెలిసింది. దేవస్థానం సినిమా కలిగించిన నిరాశ వల్ల ఈ సినిమాలో దాసు పాత్ర బాలు అనేప్పటికి కొంత సరదా తగ్గిపోయింది. మిధునం పుస్తకానికి బాపుగారి బొమ్మలను చూసి, ఈ సినిమాలో నటీనటులను చూసి పొంతన కనపడక అదొక బాధ. నేను ఈ సినిమా ఇంకా చూడలేదు, ముంబాయిలో ఎక్కడా కనపడటం లేదు. నేను విజయవాడ వచ్చేప్పటికి ఇంకా ఉంటుందో లేదో మరి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి