6 జులై, 2013

అవసరాల అనుభంధాలు (చివరి భాగం )


 
మీరెందుకువచ్చారో చేపుతనన్నారు ? ఆమె మాటల ధోరణికి అడ్డు కట్ట వేస్తూ నా ప్రశ్న.

అదే చెబుతున్నాను . మా వారు అదో టైపు . తన పరిధిలో తను వుంటారు . మా పిన్ని కూతురు హాస్పిటల్  లో కోమా  లో వుంది ,బాబాయి డబ్బులు తేవడానికి కాకినాడ వెళ్లారు . యిక్కడ నేను తప్ప పిన్నికి  ఎవరు తెలిదు . నాకు మీరు తప్ప ఎవరు తెలిదు . ముఖ పరిచయమే అయినా ఏంటో ఆత్మీయులు లాగ అనిపిస్తారు . అందుకే చనువు తీసుకుని వచ్చాను . వొక్క పదివేలు వుంటే సర్దుతారా?నేను బాబాయి రాగానే యిచ్చే స్తాను . మావార్ని  అడుగు దామంటే భయమ్. మీ చుట్టాలతో  నాకు సంభంధం లేదని తిడతారు .

నిమ్స్ వాళ్లతో నే మాట్లాడి మీ బాబాయి వచ్చేదాకా డబ్బులకి వత్తిడి చేయొద్దని  చెబుతా లెన్ది. ఎందుకంటె మీకు చికిత్స కోసం యింకా చాలా అవసరం పడొచ్చు . అది కాక మేము కిందటి వారమే బాంకక్ , పాటయా  వెళ్లి వచ్చాం కుటుంబం తో . యింకా ఆ ఖర్చుల నుంచి తేరు కోలేదు . అని ఖచ్చితం గా చెప్పేసి ఆమె ముఖం లో హావ భావ విన్యాసాల కోసం వెతుకుతున్నా.

ఆమె ఏ మాత్రం తొట్రు  పాటు పడకుండా లేదండి డబ్బు యిప్పుడు చాలా అవసరం . మీరు చేసిన ఈ సాయానికి  మీరెప్పుడు ఎందుకు ఎలా ఎక్కడికి రమ్మన్నా  నేను రెడీ ..

ఈ సారి ఖంగు తినడం నా వంతయ్యింది . కిందటి వారం బాంగ్ కాక్ లో జరిగిన సంఘటన గుర్తొఛిన్ది. అక్కడ అడుగుఅడుగు కి మసాజ్  సెంటర్ లు వున్నాయి . కొంచెం కురచ బట్టలు వేసుకుని అమ్మాయిలు ఫూట్పాత్ మీద వెళ్ళే వాళ్ళని థాయ్ మసా అంటూ లోపలి పిలుస్తూ వుంటారు . హెడ్ , ఫుట్ మసాజ్ ఫ్యామిలీ  తో వెళ్ళే వాళ్ళు చేయించుకుంటూ వుంటారు . అది అందరికి కనబడే గదిలోనే చేస్తారు . మా కుటుంబం మొత్తం  పిల్లల తో సహా ఫుట్ మసాజ్ కి వెళ్ళాము . వోక్కోక్కల్లకి రెండు వందల బాత్స్ (మన నాలుగు వందల రూపాయలకి సమానం). నాది అయ్యాక బయట కుర్చీలో కూర్చున్నా . యింతలో యిద్దరు అమ్మాయిలు దగ్గరగా వచ్చి మీరిలా కుటుంబం తో రావడం ఏమి బాలెదు. మీరు రేపు వొంటరి గా రండి థాయ్ మాస చెస్తామ్. అన్నారు
దేనికి అన్నా.

సార్ మేముబతకాలంటే డబ్బు కావాలి . మూడు  వందల బాత్స్ కి థాయ్ మసా చెస్తామ్. యిక్కడ వ్యభిచారం చట్ట బద్దం . మేము చేసినదానికి మీరు ప్రతిస్పందించి ముందుకెళితే యింకొంచెం డబ్బులు వస్తాయి. దాంతో మా కుటుంబం గడవాలి . మా మగాళ్ళు కోపిష్టులు పని పాటా  లేకుండా తిరుగు తుంటారు . మేము బతికేదే టూరిస్టుల మీద. మీలాగ అందరు కుటుంబాలతో వచ్చి కాళ్ళు పిసికిన్చుకుని పొతే ఏమి లాభం?మీ కోసం రేపు నేను వేచి వుంటాను జేబులో బాగా డబ్బులు వేసుకుని రండి అని యింకా ఏదో చెప్పబోయే అంతలో మా వాళ్ళు రావడం తో అక్కడి నుంచి ముందుకు సాగి పొయా.

మళ్ళి యిప్పుడు అదే భావం తో వేరే భాషలో యిక్కడవింటున్నా . ఆమె చెప్పిన దానికి యీమె చెబుతున్న దానికి నాకు తేడా ఏమి కనబడ లేదు . మొన్నటి దాకా ప్రేమ దోమా అంటూ జనాలు ముసుగులు వేసుకున్నారని పిస్తుంది యివన్ని చూసాక . యిప్పుడు ఆ టైం వేస్ట్ పద్ధతులకి ఫుల్ స్టాప్ పెట్టేసి నాకిది నీ కిది పద్దతి వచ్చేసింది . ప్రేమల్ లెవ్ . ప్రేమించుకోవడాల్ లెవ్. మొన్న గుంటూరు క్యాంపు వెళుతున్నప్పుడు ఎదురు బెర్త్ లో కూర్చున్న అమ్మాయి ట్రైన్ దిగిపోతూ అన్న  మాటలు కూడా  గుర్తుకు వచ్చాయి . సార్ నేను యింత సేపు మీ హోదా చూసే మాట్లాడాను , అదే ఎందుకు పనికి రాని వాడు ఎదురు గా కూర్చుంటే వొక్క ముక్క మాట్లడతానా?మీరు నాకు ఎప్పటికైనా ఉపయోగ పడతారు అలాగే నేను కుడా మీకు ఎలాగైనా ఉపయోగ పడతాను . అంతా అవసరాల అనుభన్ధాలె. లేక పొతే మీరు మీ సెల్ ఛార్జింగ్ లో పెట్టి బాత్రూం కి వెళ్ళినప్పుడు నా సెల్ లో మిస్సేడ్ కాల్ ఎందుకు యిచ్చుకుంటాను ?అప్పుడప్పుడు చేస్తూ ఉంటా కొంచెం టచ్ లో వుండండి ప్లీజ్ అంటూ దిగి పోయింది .
 హలో ఏంటి సార్ ఆలోచనలలో పడ్డారు ?నా అవసరం కొద్ది అడగ వలసి వచ్చింది . నేను తీర్చగల అవసరం మీకు వుంటే నన్ను అడగండి ముందు నేనే తీరుస్తాను. దీపిక మాటలతో నా ఆలోచనా తరంగాలలో విహరించడం మానేసి మళ్ళి ఆఫీసు రూం లోకి వచ్చా .
 కొంచెం టచ్ లో వుండండి చెబుతాను అంటూ ఆమెని పంపిన్చేసా . నా మనసు మళ్ళి ఆలోచనలతో నిండి పోయింది . మనం అనామకుడు అయితే మనల్ని ఎవరు పలక రించారా?అవతలి వాళ్ళకి మనతో అవసరం లేక పొతే మన సెల్ మూగ బోవలసిన్దేనా?యిప్పుడు ప్రియురాలు వలక బోసే  ప్రేమ  రేపటి ఆమె అవసరానికిపెట్టుబడా ?
ఏమి ఆశించకుండా మనకోసమే కన్నీరునింపుకునే హృదయం ఎడారిలో ఎండ మావేనా? నా అన్వేషణకి ఆఖరి మజిలి లేదా?నా సెల్ మోగుతోంది . సుధ కాలింగ్ . ''మీరు డయల్ చేసిన నంబరు మీకెందుకు ఉపయోగ పడదు ''
నా కాలర్ ట్యూన్ మార్చుకున్నా ఆ సందేశం తొ. యిక చూస్తా ఎవరు చేస్తారో?