4 ఆగ, 2013

యిది అదేనేమో ?



 


ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగే వాకింగ్ కి వెళుతూ వాళ్ళింటికి వెళ్ళా . అన్ని రోజుల్లాగే  వొక కాఫీ  కొన్ని కబుర్లతో భర్త భార్యల దగ్గర ఆ రోజు కి సెలవు తీసుకోవడమే అనుకున్నా . కానీ స్నేహితుల దినం ముందు రోజే మా స్నేహానికి తద్దినం పెట్ట వలసి వస్తుందని ఆ క్షణం నాకు తేలి లేదు . యింటి లోపలికి వెళ్ళ  గానే భార్య భర్త యిరువురు నవ్వుతు స్వాగతం  పలికారు . కూర్చునే లోపే సుధ  మీ కోక దుర్వార్త . నెక్స్ట్ వీక్ మా వారికి మాజీ సహచరుడు ,బొంబాయి లో మావారు పని చేసేటప్పుడు  మా యింటికి తరచూ వచ్చి పోయే కుటుంబ మిత్రుడు సమీర్ రెండు రోజుల పాటు ఆఫీసు పని మీద  హైదరాబాద్ వస్తూ మా యింట్లోనే దిగుతా అని యెస్మెస్ చేసాడు . సో మీరు ముందుగా మానసికం గా సంసిద్ధులు కండి అంది .
 నిజం గానే అది నాకు దుర్వార్తె. యింతకు ముందు వాళ్ళింటికి యిలాగే వచ్చిన ఆయన స్నేహితుడు తన'' పని''కా ని చ్చుకునే పోయాడు . అప్పుడు మా యిద్దరి మద్య పెద్ద రభసె  అయ్యింది . అయితే నిజమైన ప్రేమికులకి పోస్సేసివ్ నెస్ వల్ల తాత్కాలికం గా గొడవలొచ్చినా వాళ్ళిద్దర్నీ కలిపే ప్రేమ కొన్నాలకి ఆ తప్పుని క్షమిస్తుంది . అయితే అలంటి పరిస్తితులే మరోసారి ఎదురైనా పక్షం లోమళ్లీ తప్పు జరిగితే ఆ భంధం ఎటు దారి తీస్తుంది .?
 నా మనసు లో ఆందోళన మొదలయ్యింది . ఆమె స్వతహాగా  తప్పు చెయ్యదు . కాని తప్పు చేసే పరిస్తితులు ఎదురైతే మాత్రం ఏ  మాత్రం ప్రతిఘటించకుండా తల వగ్గెస్తున్ది.ఆమె భర్త  స్త్రీ స్వేఛ్చ పేరుతొ , తప్పొప్పులు యిరువురికి సమానమే . యిద్దరికీయిష్ట మైతే ప్రపంచం లో ఏ శక్తి ఆపలేదు అంటూ సహకరించే నైజం . అంటే వచ్చిన వాడి అదృష్టం . యింతలో కాలింగ్  బెల్ ఎవరో ఆపకుండా మొగిన్చేస్తున్నారు .ఆమె భర్త విసుక్కుంటూ  డోర్ తీసాడు .  వొక నల్లగా వున్న  వ్యక్తీ హాయ్ ఎలా వున్నారు అంటూ అతన్ని కౌగిలించు కుని , సుధ  దగ్గరగా వచ్చి చేతులు పిసికాడు .. ఆమె భర్త  పక్కన కుర్చుని కాళ్లు ముందుకు బార్లా చాపి సుధా పాదాల  వేళ్ళు  తగిలేలా పెట్టాడు . సుధా నా కళ్ళలోకి చూసింది నేను గమనిస్తున్నానా అనట్టు . వెంటనే కాలి వెళ్ళని ముడిచి అతని కాళ్ళకి తగల  కుండా జాగర్త  పడింది. వచ్చి వొక్క నిమిషం కాలేదు అప్పుడే ఆ వ్యక్తీమాక్సి లో వున్న   సుధ ని పై నుంచి కిందిదాకా చూస్తూ అబ్బో బాగా లావు అయినట్టు వున్నవే కొంచెం బొజ్జ కుడా అన్నాడు . ఏం లావు లేరా తమ్ముడు యిది గో యియన లాంటి వాళ్ళ దిష్టి తగిలి అంటూ నన్ను చూపించి యింకా ఏదో అన  బోయింది . నేను వెంటనే యిదేన్టండిమర్యాద   లేకుండా వచ్చిన ఆయన ఎవరో పరిచయం చెయ్య కుండా నే నా మీద జోకులు అన్నా'
దానికి ఆమె భర్త అదే నండి  నిందాకా నెక్స్ట్ వీక్ వస్తాడని చెబుతున్న సమీర్ ఇతనే అన్నాడు . నా కాళ్ళ   కింద భూమి కంపించినట్టు అయ్యిన్ది. ఈ క్షణం నుంచిమళ్ళి  వాడు వెళ్ళే వరకు నాకు టెన్షన్ . యింతలోనే వాడు ఆమె జబ్బ మీద చరిచి రా అక్కా మనిద్దరం పాని పూరి తిని వద్దాం  బయటకు వెళ్లి  అన్నాడు భర్త ముందే .అతను  అదేమీ పెద్ద విషయం కానట్టు టీవి చూస్తున్నాడు . నిజానికి వాళ్ళిద్దరి కులాలు కూడా  వొకటి కావు , జనాల కోసం వరసలు కలిపినట్టు గా స్పష్టంగా తెలుస్తోంది . ఆమె యింతలో వంటింటిలోకి వెళ్ళ బోతుంటే వాడు మనిద్దరం ఈరోజు వంటిల్లు షేర్ చేసుకుందాం నేను కుడా వస్తా అంటూ ఆమె వెనకనే వెళ్ళ  బోయాడు . ఆమె వుండు ప్రస్తుతానికి బొప్పాయి కోసి తీసుకు వస్తా తర్వాత చూద్దాం  అంటూ వెళ్ళిపోయింది . భర్త , అతని మిత్రుడు మాటల్లో  పడ్డారు నా ఉనికి కి అర్ధం లేకుండా . సో నేను వంటింట్లోకి వెళ్లి ఆమె తో చిన్న గా మాక్సి మార్చుకుంటే బావుంటుంది, అతను  నీ కాళ్ళని  తాకడం , జబ్బలు ముట్టుకోవడం నచ్చ లేదు అని చెప్పా .అంతే  ఆమె పళ్ళు పట పటా కొరుకుతూ ఆ అబ్బాయికి అలా తాకుతూ మాట్లాడే చనువు వుంది యింకా తాకుతాడు , నేను మాక్సి లోనే ఉంటా ఇష్టమైతే చూడు లేకపోతె , అని ఆగి పోయింది . నా కోపం తారా  స్తాయికి చెరిన్ది. యింతకు ముందు సారి  ఆమె భర్త  మరో స్నేహితుడు వచ్చినప్పుడు నేను వచ్చానని యిలాగే విసుగ్గా గొడవ పెట్టుకుని ఎలాగైతే వెల్ల గొట్టిందో యిప్పుడు కుడా నన్ను ఎలాగన్నా గొడవ పెట్టుకుని పంపించేయ్యలన ఆత్రం ఆమె లో కని  పిస్తోంది . అదే మాట అన్నా ఆమె తో . అవును రా నా యిష్టం ఏం చేస్తావ్?నా భర్త కి లేని బాధ నీకెందుకు ?
 మరి అప్పుడు దుర్గా దేవి గుళ్ళో యింకేప్పుడు వక్ర మార్గం లో వెళ్లనని ఆశ్వీర దించమని కోరావ్ గా ?యిది గో చూడు నువ్వెంత లా గొడవ పెట్టుకుని వెళ్ళ  గోడ దామనుకున్నా నేను రాత్రి పది దాక పోను అని నిక్కచ్చి గా చెప్పా. 
 యింతలో అతిధి వంటింటిలోకి వచ్చి ఆమె కి దగ్గర గా నిలబడి రాత్రికి ఏం చేద్దాం అని అడుగు తున్నాడు .  యిప్పటి నుంచి ఎందుకు రాత్రి ఆలోచిద్దాం . అంటూ నా కోపాన్ని రాజేసే ప్రయత్నం లో వుంది . యింతలో ఆమె భర్త రాగానే రాత్రికి ఏం చెయ్యలా అని చర్చిన్చుకుంటు న్నాం , పోనీ మన ఫామిలీ , సమీర్ హోటల్ కి పోదామా అంటోంది , మాట వరసకి కుడా మీరోస్తారా అని అడగ కుండా .  చూద్దాం  అంటూ వాళ్ళిద్దరూ వంటింటి లోంచి బయటకు వెళ్లారు . నేను మెల్లిగా ఆమె తో అదేంటి పొద్దున్నే డబ్బులు  లెవ్ అంటే వెయ్యి యిచ్చాకదా  అన్నా  . అవును ఆ డబ్బులతోనే వెళతాం . అనగానే నాకు మండి దేవుడి పటాల  వెనక పెట్టిన ఆ వెయ్యి తీసేసు కున్నా .ఆమె విస విసా బొప్పాయి ముక్కలు తీసుకుని హాల్ లోకి వచ్చి పెట్టింది . సమీర్ పట్టువదలని విక్ర మార్కుడిలా రా బయటకు పోయి పానీ పూరి తిందాం అంటున్నాడు . అబ్బో ఈ మాక్సి లో ఎలా రావడం ?నువ్వు మా అబ్బాయి వెళ్ళండి అంది . అదేంటి బొంబాయి లో ఎన్నో సార్లు మాక్సి మీదే  వెళ్లి పానీ పూరి తినే వాళ్ళం . అది కుడా సార్ బైక్ నడుపుతుంటే ఆయన వెనక మీ అబ్బాయి వాడి వెనక నేను నా వెనక మీరు మొత్తం నలుగురు వొకే బైక్ లో . నా మొఖం ఎర్రగా అయిపొయింది . కూర్చున్న భంగిమలతో సహా చెబుతున్నాడు . అందుకే అంత  చనువు ప్లస్ ఆత్రమ్. ఎప్పుడెప్పుడు వంటరి గా దొరుకుతుందా అన్నీ  ఫిక్స్ చేసుకుందామని కాబోలు . యింతలో ఆమె సెల్ మోగడం తో అమ్మా అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి మాట్లాడుతోంది . మరో రెండు నిమిషాల్లో అతిధి సెల్ మోగడం తో అతను  కుడా అదే బెడ్ రూమ్ కి వెళ్లి మాట్లాడుతున్నాడు .. భర్త కాంగా  టీవి చూస్తున్నాడు . యింక నావల్ల   కాలేదు నేను కూడా అదే బెడ్ రూమ్ లోకి దూరా . అతను  మంచం మీద బోర్లా పడుకుని సెల్ లో మాట్లాడుతున్నాడు . ఆమె అతని తల దగ్గర కుర్చుని సెల్ మాట్లాడుతోంది . భర్త హల్లో  టీవి  . ఇలాంటి సన్నివేసం ఏ  యింట్లోనూ చూడలేం 'వాళ్ళిద్దరి మద్య ఏ సంభంధం వుంటే ,(అది భర్త ప్రోత్సాహం తో)  యిది సాధ్యమో? .నేను ఆ గదిలోకి రావడం అతని సెల్ అయిపోవడం వొకే సారి జరిగాయి . అతను  నన్ను చూసి మళ్లీ హాల్ లోకి వచ్చేసాడు . యీమె వాళ్ళ అమ్మతొ యింకా మాట్లాడుతోనే వుంది అయినా గాని అలా మాట్లాడుతోనే తను కూడా  హాల్ లోకి వచ్చేసింది నన్ను అలానే బెడ్ రూమ్ లో వదిలేసి . నా పరిస్తితి భయంకరంగా తయారయ్యింది . కుటుంబ సబ్యులంతా ఆ సమీర్ రాగానే పొమ్మనలేక పొగ బెడుతున్నారని పించింది . నేను తప్పని సరి పరిస్తితుల్లో హాల్ లోకి వచ్చి ఆమె ఫోన్ అవ్వగానే అదేంటండి నేను రాగానే బెడ్ రూమ్ లోంచి వచ్చేశారు . నా కవమానం గా అనిపించింది . మేమిద్దరం వొకే ఫూట్టింగ్ లో వున్న పరాయి మగాళ్ళం కదా వోకల్లకి వోకలాగా యింకోకల్లకి వోకలాగానా అన్నా
 .అంతే వాళ్ళ భర్త కల్పించుకుని'' మీకు  సుధా మీద పోస్సేసివ్ నెస్ ఎక్కువ అయిపొయిన్ది. మనుషుల మీద అంత పోస్సేసివ్ నెస్ పనికి రాదు. వాళ్ళ స్వేఛ్చ ని వాళ్ళకి వదిలెయ్యాలి . సుధా నీకు యింతకు ముందే  గొడవ అయినప్పుడు చెప్పా  యింక కట్ చెయ్యమని నువ్వు వినలెదు. యిప్పుడు నేనే చెబుతున్నాయు ప్లీజ్  గో ఔట్ '' అనేసాడు .  నేను స్థాణువులా  నిలబడి పోయా . ఛి ఛి నా స్టేటస్ ఏంటి నా కీ మాటలు ఏంటి అని . దానికి కుడా అతను ఐ కేర్ అ ఫుట్ ఈవెన్ దిఅథెర్  మాన్ ఇస్ ప్రైమ్ మినిస్టర్ . అనేసి నాకు కింద మీటింగ్ వుంది అని వెళ్లి పోయాడు .మరి యిదే పెద్దమనిషి వొకసారి ప్రతి ఆడ మగ రిలేషన్ అక్కడికే దారి తీస్తుంది అన్నాడు మరి వీల్లిద్దరి  భందం ఎక్కడికి దారితీస్తే అతను  ఇక్కడికి వచ్చి యింటి దారి వెత్తుకుంటూ వచ్చాడుట? వాళ్ళింటికి యితని స్నేహితులు ఎవరు వచ్చినా పది నిమిషాల్లో ఏదో వంక తో బయటకు పోతాడు . పోనీ నువ్వు కూడా  రారా అని అనడు సరి కదా మీరిద్దరూ మాట్లాడు కొండని వెళ్లి పోతాడు . యింక వీళ్ళ అబ్బాయ్ అంతే అతిధి వస్తే అరగంట దాక బయటే . యిదేమి అవగాహనో కుటుంబం లో .. వొక పరాయి మగాడు , మాక్సి లో వున్న  వొక గృహిణి యిద్దరు మాత్రమె వుండగా ఆమెఅంత  రాత్రికూడా  చీపురు తీసి వంగి యిల్లూ తుడవడం . అతిధి నేరం నాదికాదు ఆకలిది అని మీద పడితే తప్పు ఎవరిది?
అందుకే నేను అన్ని మాటలు అనిపించుకుని కూడా  కాలు బయట పెట్ట లేదు . నా సాయ శక్తులా జరగా బోయే తప్పుని ఆపాలి ఎన్ని అవమానాలు భరించయినా సరే . భర్తకి లేని బాధ నీకెందుకురా మనసు ప్రశ్న  . ఆమెని నిజం గా ప్రేమించి ఏమి ఆశించకుండా గుండెల్లో నింపుకున్న ప్రేమికుడి గా ఆమె గుళ్ళో దుర్గా దేవికి యిచ్చిన మాట నిల బెట్టుకునే విధం గా నేను కొంతవరకన్నా ప్రయత్నించాలి . అందుకే అలాగే కుర్చీలో మౌనం గా కూర్చున్నా .
పాదుకి తెగులు సోకింది, తోటమాలి పట్టించుకోవడం లేదు సరి కదా తెగులునే పెంచి పోషిస్తున్నాడు . నేను ఆ పాదు కి పందిరిని అని భావించుకున్నా, అందుకే ఈ తాపత్రయం . బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పాదు కి కుడా ఆ తెగులంటే యిష్టం , తోటమాలి ప్రొత్సాహమ్. నిస్సహాయమైన పందిరి ఎంతకని కాపాడు తుంది మౌనం గా రోదించడం తప్ప.
 అతిధి వీడేప్పుడు  పోతాడా అని ఎదురు చూస్తున్నాడు . యింతలో వాళ్ళ అబ్బాయి వచ్చి ఆంకుల్ పానీ పురికి పోదాం రా అలాగే మమ్మీ  కూరలు కుడా తేవాలని చెప్పింది అని లాక్కు పోయాడు . వాళ్ళు అటు వెల్ల గానే యీమె అంత కట్ట డబ్బు , వెండి సామాను నావల్లో  పడేసి యిన్నాళ్ళు మీరు అప్పుడప్పుడు యిచ్చిన గిఫ్త్స్ , డబ్బులు తీసుకు పొండి అని మళ్ళి  వంటింటిలోకి వెళ్లి తన పని తానూ చేసుకుంటోంది . నా కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు . ఎవరి మంచి కోరి మనం కొవొత్తులా  కరిగి పోతున్నామో వాళ్లే  మనల్ని అర్ధం చేసుకోకుండా త్రునికరిస్తే?అలా పావుగంట మౌనం రాజ్యం ఏలింది . యింతలో అతిధి , అబ్బాయి కూరలు కొనుక్కుని వచ్చారు . నేను అతిధి తో మాటలు కలుపుతూ మీరు బొంబాయి లో చాలా క్లోజ్ అనుకుంటా అన్నా . అవునండి శుక్రవారం రాత్రి కల్లా యింటికి వచ్చి మళ్ళి  సోమవారం ఉదయం వెళ్ళే వాళ్ళం . అక్కడే వంట నిద్ర అన్నీను  అంటున్నాడు . యింతలో ఆమె వంటింటిలోంచి చింతపండు పులుసు పిసుక్కుంటూ వచ్చి యింకేంటి సమీర్ మీ ఆవిడా పిల్లలు ఎలా వున్నారు అంటూ నాకు  అతని నుంచి ఏ రహస్యాలు రాబట్ట కుండా జాగర్త పడింది . యింతలో వాళ్ళ ఆయన రావడం తో నా కదా ముగిసింది , అతను  రాగానే నేను మీకోసమే యింత సేపు కూర్చున్నా యిన్నాళ్ళ నా పరిచయం వల్ల కలిగిన యిబ్బందులకి మన్నించండి , ఈ సారి కచ్చితం గా మాట నిల బెట్టుకుంటా మీ యింటికి ఎప్పుడూ రాను అంటూ కళ్ళలో నీటి చారలు  కనబడ కుండా వెనక్కి తిరిగా ఆమె మొఖం కేసి కుడా చూడలేదు . గుండె బరువెక్కి అడుగులు పడటం లేదు . యింత తిట్టినా వాళ్ళ మీద నాకు ఆవగింజన్నంత అయినా కోపం లేదు . అదేంటో భవిష్యత్తులో నా మాట ఎలా నిల బెట్టుకోగాలనో? రాత్రంతా నిద్ర లేదు . భగవంతున్ని వోక్కట్టే కోరుకున్నా, ఆమె ప్రేమలో వీసమెత్తు నిజాయితీ వున్నా మమ్మల్ని కలిపి ఉంచు , లేదంటే వాళ్ళిద్దరికీ సద్బుద్దిని ప్రసాదించి రుజు మార్గం లో వెళ్ళేలా చెయ్యి. నేను ఈ భాదని అధిగమించే అంత  శక్తిని నాకివ్వు  శ్రీనివాసా . నిలువెత్తు స్వామి విగ్రహం చిరునవ్వు తో నన్ను ఆశ్వీర దిస్తొన్ది. ప్రేమ ఎన్ని తప్పులని అయినా మన్నిస్తుంది . అవతలి వాళ్ళకి కుడా మనంత ప్రేమ గుండెల్లో వుంటే నిద్ర పట్టకూడదు . యిరవై నాలుగు గంటల్లో సెల్ మొగాల్సిందే . లేదంటే వాళ్ళకి అంత ప్రేమ లేదు కాబట్టి ఆ అర్హతా లేదు .  నాది ప్రేమ అనే నమ్ముతున్నా ఎందుకంటె మేమెప్పుడు హద్దులు దాట లేదు కాబట్టి  యిది అదేనేమో. (జరగని కధ )
 కన్నీటిని దిగమింగుకుంటూ మౌనం గా వుండడం కష్టమే ప్రేమ విషయం లో .
 

కామెంట్‌లు లేవు: