30 ఆగ, 2013

ఆది శంకరా చార్యులు మళ్ళి పుడితే



 
నిన్న నే భారవి సినిమా ఆది శంకరాచార్యులు చూసాక మనసులో వచ్చిన ఆలోచనలకి అక్షర రూపం .
ఆయన రాసిన భజగోవిందం , చిన్నప్పుడు నాన్నగారు టేప్ రికార్డర్ లో పొద్దున్నే పెడితే యెమ్ . యెస్ సుబ్బలక్ష్మి గొంతులో వింటూ స్కూల్ కి రెడీ అవడమే గుర్తు. దాని వెనక నిబిడిక్రుతమైన అర్ధం అప్పట్లో తెలిదు. నిన్న సినిమాలో విన్నాక భజగోవిందం పుస్తకం చదివా . అయన చెప్పింది వొకటే . కాంత ని చూసి వాంతి తెచ్చుకో భ్రాంతి లో పడకు . పాదాలు  దాటి ద్రుష్టి  పోనికు , వొక వేళ పోయినా మొహా వేసం లో పడక మాంసపు ఖండాలుగా మాత్రమె భావించి నీ దృష్టిని గోవిందుని  మీదే మరల్చి పుట్టిన జన్మకి సార్ధకత తెచ్చుకో అని . కాని నేటి ఆధునిక పరిస్తితులలో , గోవిందుని మీదే కాకుండా కాంతా  , కనకాల మీద కూడా  ద్రుష్టి పెడుతూ సమన్యాయం  చేద్దామని ఆధునిక మానవుని తాపత్రయం . తన కాంత మీద కాకుండా పరాయి కాంత మీదే ద్రుష్టి పెట్టడం , ఆ కాంత యీయన కనకాన్ని , మానాన్ని , ధనాన్ని దోచుకున్నాకా , అనారోగ్యాన్ని బహుమతి గా యిస్తే అవన్నీ యింటికి మోసుకు పోయి  షేస జీవితం అందరి తో చిత్కరించు కుంటూ మళ్ళి పునరపి జననం , పునరపి మరణం అంటూ శ్లేష్మం లో పడ్డ ఈగ లాగ కొట్టుకుంటూ గమ్యం చేర లేక పోతున్నాడు . అప్పట్లో మంచి చెబితే వినే వారు కాబట్టి ఆయన తత్వ భొదలు అప్పటికి సరైనవే . కాని వొక వేళ ఆది శంకరాచార్యులే యిప్పుడు పుడితే ఆయన ఆలోచనా విధానం తప్పక మారి వుండేది . అసలు అప్పట్లోనే ఆయన ఈ సమస్యకి మూలాన్ని అలోచించి వుంటే  పరిష్కారం ఇంకోలా వుండేది . ఆయన తన తపశ్శక్తి  తో లోకం లో శృంగారం కేవలం యిరవై అయిదు , ముప్పై అయిదు వయసు లో వున్న  భార్యా భర్తల మద్య మాత్రమె వుండే టట్టు నిర్భందించి వుండి  వుంటే ఈ నాడు కొత్త బంగారు లోకం లో వుండే వాళ్లం . ఈ అత్యా చరాలు , అక్రమ సంభంధాలు ,నిర్భయ చట్టాలు ఉండేవి కావు .
నేను రెండురోజులు ఊర్లో ఉండను మా ఆవిడకి తోడుగా పడుకుంటావా సుబ్బా రావు అని స్నేహితుడు , అడిగితె అబ్బా నేను మీ యింటికి వెళ్ళడం ఎందుకోయి మీ ఆవిడే మా యింటికొస్తే మేం ముగ్గురం హాయ్ గా ఎసి రూం లో వొకే మంచం మీద కబుర్లు చెప్పుకుంటూ పడు కోవచ్చు గా లాంటి సంభాషణలు విన గలిగి వుండే వాళ్ళం .
ప్రపంచం లో సగానికి పైగా నేరాలు సెక్స్ వల్లె. ఆడవాళ్ళ అందాలు చూడకు , రోచ్చ్చు లో పడకు అనే బదులు , పరాయి ఆడ వాళ్ళని చూసినా నిరాయుధుడై  ఏ  వికారాలు శరీరం  లో గాని , మనసులో గాని పుట్ట కుండా సృష్టి లో ఏర్పాటు చేసి వుంటే ? ఎటొచ్చి మగాడి బలహినతని సొమ్ము చేసుకుని జల్సాలు చేసే ఆడ జాతికి తీవ్రమైన నష్టం వాటిలోచ్చు గాక , మగ జాతి నిర్వీర్యం కాకుండా తమ శక్తి యుక్తుల్ని దేశాభి వృద్దికి ఉపయోగించ గలుగు తారు . అప్పుడు ఆడది అర్ధ రాత్రి  వొంటరిగా వెళ్ళ  గలిగి దేశానికి స్వతంత్రం తే గలుగు తుంది . (గాంధి గారికి క్షమాప్పనలు ). లేదా శృంగారం అన్నది అన్న పానియాల లాగ చాలా అవసరం దాన్ని పది ఏళ్ళకే పరిమితం చెయ్యడం సబబు కాదు అనుకుంటే పోనీ జీవితాంతం  భార్యా భర్తలకి  వయసు తో సంభంధం లేకుండా రాత్రిపూట కొన్ని ఘడియల విఘడియలకి పరిమితం చేసినా ఫర్వాలేదు . అయితే ఈ సదుపాయం కేవలం మొదటి సారి పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్న భార్యా భర్తలకి మాత్రమె వుండాలి . లేక పొతే వోకో మగాడు వంద పెళ్ళిళ్ళు చేసుకుని కొత్త సమస్యలు సృష్టించడమే గాకుండా విడాకులు కూడా  ఎక్కు వ అయ్యే అవకాశాలు ఎక్కువ . లేక పొతే శంకరా చారుల వారు భజగోవిందం తిరగ రాసి వొరై  మూడ మతి శృంగారం కోసం యిన్నేసి పెళ్ళిళ్ళు చేసుకుని నిర్వీర్యం అయ్యి బ్రస్టు పట్టకురా అని మార్చి రాయ వలసి వుంటుంది .

ఏమన్నా గాని సృష్టి లోనే  భగ వంతుడు ఆ భఘ యోగాన్ని కేవలం భార్య భర్తలకే పరిమితం చేసేసి వుంటే  అందరు శంకరాచార్యులు చెప్పినట్టే భజగోవిందం పాడుకుంటూ జన్మ ని సార్ధకత చేసుకునే వారే గదా . 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ravi garu,
meru cheppindi bagane undi kani adi dharma viruddam endukante srugaram anedi chala lotinadi andulo ento phylosophy nindi undi adi ardam kaka neti pichhi janalu danni ardam chesuko leka butu sexa marchesi brastu pattistunnaru..