31 డిసెం, 2013

మబ్బు చాటు ప్రేమ



భ్రమల్లో తోసేసేదే ప్రేమా

భ్రమరం లా తిప్పెసేదే ప్రేమా

తిరస్కారాలని కూడా  మన్నించే సంస్కారం నేర్పేదే ప్రేమా

అవమానాల్ని కూడా  హలా హలం లా మింగించేదే ప్రేమా

అనుక్షణం గుర్తుకు తెచ్చేదే ప్రేమా

వియోగం లో కన్నీరే  ప్రేమా

కలయిక లో పన్నీరే ప్రేమా

కోల్పోయి నప్పుడు కలిగే భాదే ప్రేమా

మనసులో కలిగే మరణ వేదనే ప్రేమా

మాట రాని మధుర కావ్యమే ప్రేమా

తోట లోని సుధా పరిమళమే  ప్రేమా

అంతం కాని ఆరంభమే ఈ ప్రేమా

పంతాల మబ్బుల్లో దాక్కున్న రవి కిరణమే  ఈ ప్రేమ


2 కామెంట్‌లు:

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

దేవదాసు ప్రేమ, దెయ్యాలప్రేమలు
హత్యప్రేమ, ఆత్మహత్యప్రేమ
మోసకారిప్రేమ, యాసిడుప్రేమలు
ప్రేమలీల వొఠ్ఠి కామ గోల .
----- సుజన-సృజన

Unknown చెప్పారు...

అవును రాజారావుగారు నాకెప్పుడు అదే సంగ్దిత్వం.
అంతర్లినం గా ఈ ప్రేమలన్నింటి వెనక కామం దాగి ఉంటుందేమో అని .