10 ఆగ, 2015

చాగంటి అయ్యో యేమిగంటి ?


Image result for chaganti pravachanam on shankara bharanam
చాగంటి వారి ప్రవచనాలు విని ఆస్వాదించి అభిమానులుగా మారిన వేలాది టీవి ప్రేక్షకుల్లో నేనోకన్ని . సరస్వతి పుత్రులు , ప్రవచన చక్రవర్తులు అనడం లో కించిత్తు సందేహం లేదు . అయితే అనుకోకుండా ఈ రోజు ఆఫీసు నుంచి వచ్చాక కాఫీ తాగుతూ టీవి ఆన్ చేస్తే వొక ఛానల్ లో శ్రీనగర్ కాలనీ లో సత్యసాయి నిగామాగం నుంచి లైవ్ లో ఆయన ప్రవచనం ప్రసారమవుతోంది . ఆహ ఏమి నా భాగ్యము అనుకుంటూ సౌండ్ పెంచి వింటున్నా .
''రాముడు మర్నాడు పట్టాభి సేకానికి సంసిద్ధుడు అవుతూ తండ్రి మాట నిలబెట్టడం కోసం అరణ్య వాసానికి వెళ్ళవలసి వస్తే రెండిటిని సమంగా స్వీకరిస్తూ  కార్యోన్ముఖుడై వెళ్ళిపోతాడు . గురు శిష్య సంభందాన్ని తెలిపే ఉదాత్త కావ్యం శంకరా భరణం . ఆ నాటి బాల శంకరం (తులసి) తన తల్లి (మంజుభార్గవి) తో కలిసి ఈనాడు వేదిక మీద నర్తిస్తుంటే కన్న తండ్రి (దర్శకుడు విశ్వనాధ్)ఎదురుగా వీక్షిస్తూ  ఆనంద భాష్పాలు  రాలుస్తుంటే  యిదొక అద్బుతమైన రోజులా నా జీవితం లో నిలిచి పోతుంది .శంకర శాస్త్రి  సంగీతానికి యెంత ప్రాధాన్యం యిస్తారో కూతురు పెళ్లి చూపు లప్పు డే  తెలుస్తుంది .అయన ఆర్దిక పరిస్తితి సహకరించక పోయినా స్నేహితుడి ప్రోత్సాహం తో పెళ్ళిచూపులకి సరే అంటాడు . అక్కడ అపశృతి పాడిన కూతురి చేత ఆరోహణ అవరోహణ చెప్పిస్తాడు . యిలా సినిమా కధ ని  ప్రవచనం లా చెప్పేస్తూ మద్యలో రామాయణ మహాభారతల ఘట్టాలతో పోలుస్తూ సాగి పోతోంది . పైగా మూడు రోజులనుంచి ఈ శంకరా భరణం సినిమా ముప్పై ఆరు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ప్రవచనాలు సాగి పోతున్నాయట . నాకు మంచి విందు భోజనం లో పంటి కింద రాయి వచ్చిన అనుభూతి కలిగింది .
మొన్ననే ఆయన ప్రవచనాల స్పూర్తి తో అరుణాచలం వెళ్లి అర్దరాత్రి గిరి ప్రదక్షిణ చేస్తే నేను మా సహచరులు ముగ్గురి తో కలిపి కేవలం నలుగురం మాత్రమె వున్నాము . మద్యలో ఆయన ప్రవచిచినట్టు గానే వూర  కుక్కలు కొంత దూరం వచ్చి వెనక్కి పొయెవి. అంతే గాని గుంపులు గుంపులు గా కాదు కదా కనీసం  నర  సంచారం లేదు . యింద్ర కీలాద్రి పర్వతం చూట్టూ  విజయవాడ  రోడ్ల మీద తిరిగితే ఎలా వుంటుందో అలాగే తిరువన్నామలై లో కూడా అనిపించిన్ది. అయితే అగ్ని లింగం అభిషేకానికి గర్భగుడిలో కుర్చునప్పుడు బయట వాతా వరణం తో సంభంధం  లేకుండా వేడి గా వుండడం భగవత్ నిదర్శనమ్. అయితే చాగంటి వారి ప్రవచనం విని వెళ్ళిన  వాళ్ళకి కొంత నిరాశ కలగడం సహజం . వారి ప్రవచనం లో కొంత అతిశయోక్తి ఉంటుందేమో అని పిస్తోంది . యిన్నాళ్ళు దైవ సంభంద విషయాల పైనే ప్రవచించిన  వారు యిప్పుడు కొత్తగా హిట్ సినిమాల మీద ప్రవచించడం వాటికి సందర్భోచితం గా రామాయణ మహాభారత ఘట్టాల్ని జోడించడం  అంత అభిలషణీయం కాదు . నేను టీవి చూస్తునప్పుడు  అప్పుడే ఆ గదిలోకి వచ్చిన మా అబ్బాయి డాడి  రేపు బాహుబలి గురించి కూడా   చెబుతారా? అంటూ తన గది లోకి వెళ్లి పోయాడు . ఏమో ఆలోచిస్తే శ్రీమంతుడు , బాహుబలి సినిమాల్లో కూడా వారు ప్రవచించ దగ్గ సన్నివేశాలు చాలానే వున్నాయని పించింది . వొక కన్నతల్లి తన చనుబాలని తన సొంత కొడుకు తో పాటు పెంచిన కొడుకు కి స్తన్యం యిచ్చి బాహుబలి అని నామ కరణం  చెయ్యడం యెంత ఉదాత్తమైన సన్నీ వేషం . అలాగే కామం మనిషిని మరణానికి గురి చేస్తుందన డానికి నిదర్శనం గా శంకారాభరణం బలాత్కార సన్నీ వేషాన్ని వుదహరిచ లేదనే అనుకుంటున్నా . ప్రేమతో కూడిన కామం గమ్యానికి అడ్డం వచ్చినా తప్పులేదని బాహుబలి నిరూపించాడు అంటూ ప్రవచిన్చలేమో ?అమ్మో మళ్ళి ఈ విషయం'' అన్నపూర్ణ సుంకర వీడియో ''(తెలుగు సినిమాల మీద) లాగ వివాదాస్పదం  కాదు గదా ?
అయినా చాగంటి వారి అభిమాని గా శంకరాభరణం శంకర శాస్త్రి  గారిభాషలో  '' తాళం తప్పుతోందయ '' అనడం లో తప్పు లేదు గా?


18 వ్యాఖ్యలు:

Zilebi చెప్పారు...


ఇందులో శ్లేష ఏమన్నా ఉందా చెప్మా ? "యెంత ఉదాత్తమైన "సన్నీ" వేషం " :)

చాగంటి వారికీ గంటి పడిందా ! ఏమి ఈ కలియుగ మహాత్మ్యం :)

జిలేబి

Haribabu Suranenii చెప్పారు...

కలికాలం!
హరి పట్టపురాణి శ్రీరమ కటాక్షం కోసం?

Siva Rama Prasad N చెప్పారు...

నేను ఆ ప్రవచానానికి మూడు రోజులూ వెళ్లి విన్నాను. చాలా ఉదాత్తమైన ప్రవచనం అది. మీరు పూర్తిగా వింటే కాని తెలియదు. శంకరాభరణం మామూలు 3 fights, 6 songs, separate comedy tracks లాంటి మసాల సినిమా కాదు. చాగంటి వారే చెప్పారు, నాకు శంకరాభరణం మీద సప్తాహం కాని, మాసం కానీ ప్రవచనాలు చెప్పాలని ఉందని. ఆ సినిమా తెలుగు సినిమా కావటం, తెలుగు వారికీ గర్వకారణం.
చాగంటి వారు దగ్గరుండి విశ్వనాధ్ గారికి సన్మానం జరిపించారు.

ravi garu చెప్పారు...

శ్లేష ని కనిపెట్టినా, యెంత వారలయినా కాంతా దాసులే అని ఊరుకోవాలి గాని బయట పెట్టుట తగునా జిలేబి గారు .
హరిబబుగారు మొన్నఆలోచనా తరంగాలు లో శర్మ గారు రాసారు ఈ సమయం(గురుమౌడ్యామి ) లో గురువులు కూడా వక్రం గా ఆలోచిస్తారని .
అందుకని కలికాలం అనడం కంటే కొంతకాలం అనాలేమో?
ప్రసాద్ గారు ముప్పైరోజులు శంకరాభరణం మీద ప్రవచనం చెప్పాలంటే రేప్ సీన్ దగ్గర ఏం చెబుతారు?
''విశ్వనాద్ గారు చూపించింది రేప్ కాదు . శివ విష్ణువుల సంవాదం . గద్ద విష్ణువు వాహనం . పాముశివుడి ఆభరణం . మీరు యిక్కడే జాగర్త గా పట్టుకోవాలి .
గద్ద పాముని(వేలాడుతూ కని పించే బొమ్మలు) పట్టుకుంటూ వుంటే ఆమెని అతను ఆక్రమిస్తాడు . ఆమె ఆ తర్వాత అతణ్ణి వధిస్తుంది . యిద్దరు తమ భాద్యతలని నేర వేర్చేసుకుంటారు . అతను తృప్తి గా కన్ను ముస్తాడు . ఇక్కడ నేను సభా మర్యాద పాటిస్తూ యింతకు మించి చెప్పలేను . మీరే '' అంతకు మించి '' వుహించు
కొండి . ''
యిలాగే గా సాగి పోవాలి ఎన్నాళ్ళు చెప్పినా ?భాగవత రామాయణాల్ని ప్రవచిస్తే భక్తీ శ్రద్దలతో వింటారు గాని . తులసి , మంజు భార్గవి ఉదర సోపసనాలు పడుతూ నాట్యం చేసాక ప్రవచనం అంటే ఏం బావుంటుంది?ఆ మాట చాగంటి వారే సెలవిచ్చారు . నన్నోదిలేస్తే వీరిరువురి నాట్యం చూస్తూ ఆస్వాదిస్తానని .
నా ఉద్దేశం ఇప్పటికే గోదావరి పుష్కరాల కి సంభందించిన ప్రవచనాలతో వివాదం లో ఇరుక్కున్నారు . మళ్లి ఈ కొత్త తలనేప్పులు అవసరమా?అని .

Siva Rama Prasad N చెప్పారు...

మీకు రేప్ సీన్ తప్ప ఇంకేమీ కనబడకబోతే ఎలా? మంచి చెడు రెండు కలిస్తేనే కావ్యం, పురాణం, సినిమా ఏదైనా! చెడు చూపకుండా మంచిని ఎలా ఎలివేట్ చేస్తారు? రావణుడు లేకపోతే రామాయణం ఉంటుందా? ఇది తలనొప్పి అని అనుకుంటే చాగంటి వారు ఎందుకు పూనుకుంటారు? ఆ సినిమా లోని మంచిని, దర్శకత్వ (కథకుడి) ప్రతిభని (మసాల సినిమా కాదు) పొగిడితే తప్పేముంది? పైగా ఆయన అందులోని గురు శిష్య బంధాన్ని, మన కళల/సంస్కృతీ వైభవాన్ని చెప్పారు.
మూడు రోజులూ మొత్తం హాల్ నిండిపోయింది.

ravi garu చెప్పారు...

పోనిలెండి ఆయన ముచ్చట ఎందుకు కాదనాలి . ఈ సినిమాతో ఆపేస్తే అదే పదివేలు .
అయినా నా వ్యాకులత ఆయన ప్రవచనాలు పక్కదారి పడుతున్నాయేమో అని.
లేదా కాదేది ప్రవచనానికి అనర్హం అని సద్దుకు పోవాలో ?

Dileep.M చెప్పారు...

వాల్మీకీ వ్యాసుల కాలంలోనే ఆగిపోతే ఎలా?
ఒకసారి సచిన్ గురించి కూడా చెప్పారు.ఆయన భారతం చెబితే ద్రౌపతీ.. ఎలా చెబుతారో? అని అనలేదు సంతోషం.

అజ్ఞాత చెప్పారు...

నెత్తి మీద అణా పెడితే చారణా విలువచేయని ప్రతీ మ్లేచ్చుడూ చాగంటి గారిని తిట్టే వాడే

అజ్ఞాత చెప్పారు...


అజ్ఞాత వాక్యాన్ని సరిదిద్ది :)

"నెత్తి మీద చార్ అణా పెడితే అణా కూడా విలువచేయని ప్రతొక్కడూ చాగంటి గారిని తిట్టే వాడే""

Dileep.M చెప్పారు...

I don't agree with అజ్ఞాత .
Anyone can have their own opinion especially on those who are in public life.

అజ్ఞాత చెప్పారు...

మూసుకోవయ్యా దిలీప్! చాగంటి రాజకీయనాయకుడు కాదు. పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడని కామెంట్ చేయటానికి. ఒకతి తెలుసుకో ఆయన వలన చానల్స్ బతికి బట్టకడుతున్నాయి. ఈ చానల్స్ వలన ఆయనకేమి ఒరిగేది లేదు. రేపు ఆయన స్వంతంగా ఒక చానల్ ప్రారంభింస్తే, చాలా తెలుగు ఛానల్స్ మూతపడుతాయి. మా కాలనిలొ ఉన్న 500 కుతుంబాలలో ఎక్కువగా చూసేది భక్తి టివి, యస్.వి.బి.సి. చానల్స్ లో వచ్చే ప్రవచనాలే. ఈ రోజుల్లొ టివి లో వచ్చే న్యుస్ అసత్యాలు,అరచు కోవటాలు,ఒకరిని ఇంకొకరు తిట్టుకోవటం చూసి చూసి ప్రజలకి విరక్తి వచ్చేసింది.

మొన్న పుష్కరాల లో జరిగిన సంఘటన, చంద్రబాబు చేసిన తప్పు ఐతే పచ్చ మీడీయా మేధావులు చాగంటి ఖాతాలో వేయాలని ప్రయత్నించారు. ప్రచారం చేశారు.సాక్షి పేపర్లో వాస్తవాలు అన్ని రావటంతో ప్రజలు ఆ ప్రచారాన్ని నమ్మలేదు.

చాగంటి మాట్లాడితే వేల,లక్షల మంది ప్రజలు అటు సభలో , ఇటు ఇంట్లో టివిలో మూడు గంటల సేపు అలానే వింట్టుంటారు. తెలుగు మీడీయాలో ఏ వార్తలు చదివే వారు, ఇంటర్వ్యులు చేసేవారు, ఒక గంట అనర్గళంగా మాట్లాడి ప్రజలను ఆకట్టుకొమ్మను చూద్దాము.

TV9 రవిప్రకాష్, వేమురి రాధకృష్ణ, కొమ్మినేని, టివి9,సాక్షి టివి యాంకర్లు కట్టకట్టి ఒక త్రాసులో వేసి ఇంకొక వైపు ఒక చాగంటిగారిని వేస్తే ఆయనే తూగుతాడు. వీళ్లకి ఆయనకున్న ఫాలోయింగ్ చూసి ఈర్ష ఉన్నట్లుంది.

Dileep.M చెప్పారు...

అజ్ఞాత గారు మీ సంస్కారానికి ఓ నమస్కారం..!!

అజ్ఞాత చెప్పారు...

థాంక్స్. నా సంస్కారం గుర్తించినందుకు.

పండితులను ఎమైనా ఒక మాట అనె ముందు అలోచించాలి. ఒక చవట ఎదో రశాడే పో, ఓ అంట్టు లగ్గెత్తుకొచ్చి ఇంకొక నాలుగు మాటలు అనటం ఫాషన్ అయి పోయింది.
మెదడు మోకాలు లోఉండేవారికి గౌరవించటం నా పద్దతి కాదు.

Dileep.M చెప్పారు...

ఆ పండితులనుండి మీరు నేర్చుకున్న సంస్కారానికి మరో నమస్కారం..!!

అజ్ఞాత చెప్పారు...

ఆ పండితులనుండి మీరు నేర్చుకున్న సంస్కారానికి మరో నమస్కారం..!!

సంస్కారం అనేది నీకు ఉంటే ఆయన గురించి అలా మాట్లాడవు. ఆయన ఎమైనా వేల కోట్ళ స్కాములు చేశాడా? నోటికొచ్చినట్లు మాట్లడటానికి. మీలాంటి వారు పండితులను, హిందూ గురువుల పై నోటికొచ్చినట్లు వాగడం. ఎవరైనా అభ్యంతరం చెపితే సెక్యులర్ ముసుగేసుకొని,వాడిని ఒక మతవాదిగా చిత్రికరిస్తూ వాదన చేయటం. ఈ ఎత్తుగడలు సోషల్ మీడీయాలో చాలా చూశాం.

నాలాగా ఎవరైనా టిట్ ఫర్ టాట్ సమాధానం చెపితే, పండితులనుండి మీరు నేర్చుకొన్న సంస్కారానికి నమస్కారం అంట్టు మళ్ళీ వ్యంగ్యంగా మాట్లాడుతారు. చెపుతున్న ఇనుకో పండితుల మీద, హిందు గురువుల మీద అనవసరంగా వాగితే, ఊరుకొనేది లేదు.

Haribabu Suranenii చెప్పారు...

చాగంటి వారు వ్యాఖ్యానించిన "శంకరాభరణం" మంచి సినిమాయే కదా,కాదా!
ఒక మంచి సినిమా గురించి మంచిగా చెప్పడం కూడా దిగజారుడు అని అనాలా?

యెప్పుడూ ఒకే మూసలో కాకుండా కొంచెం విభిన్నంగా ఉండాలనుకోవటం కూడా పాపమేనా?
అక్కడ చెప్పకూడని విషయాలు యేమైనా చెప్పాడా,అనే అదీ లేదు?!

మరెందుకు రవిగారు సన్నీ లియోన్ పేరుతో శ్లేషలు చూపించారు?

అజ్ఞాత చెప్పారు...

మన బ్రహ్మశ్రీ చాగంటి వారు మొన్నామధ్య పుట్టినరోజు శాస్త్రప్రకారం జరుపుకోవడమెలాగో కూడా సెలవిచ్చారు. అందులో ముఖ్యమైన నియమం పుట్టినరోజు రాత్రి బ్రహ్మచర్యం పాటించడం. కేవలం సినిమాలకే ఇంత ఆక్షేపణా, కాదేదీ ప్రవచానానికనర్హం మన గురువు గారికి... స్త్రీ పురుషుల సంభోగ నియంత్రణ సహా. గురువుగారి జ్ఞానబోధనా పరిధి రోజు రోజుకూ ఇలాగే విస్తరిస్తూ పోతే సమరంగారి లాంటి వారి వ్యాపారం గోవిందో గోవింద.

సర్వేజనా సుఖినోభవంతు!

ravi garu చెప్పారు...

సద్విమర్షని సహృదయం తో స్వీకరించే
సంస్కారం చాగంటి వారికీ ఉందనే నమ్మకం తో వారి అభిమానిగా
రాసాను .
లోకేస్వరుడికి తప్ప లోకానికి భయపడనురా మాధవా
.
.