15 అక్టో, 2008

గుండె పోటు గుమ్మడి

పాత సినిమాల్లో గుమ్మడి కనిపిస్తే గుండె పోటు ఖాయం.అమ్మ నేనిక ఎంతొ సేపు బతకనమ్మ అంటు గుండె పట్టుకుని అరగంట సేపు డై లాగులు చెప్పి కానీ పోయేవారు కాదు.ఒక టైం లో గుమ్మడి శుభం టైటిల్ దాక వున్నా సినిమా ఒక్కటి కూడా వుండేది కాదు.. గుండె పోటుకు పర్యాయ పదం గుమ్మడి ఐ పోయారు.అప్పట్లో నవ్వుకోడానికి అది బానే వుండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఎపుడో అప్పుడు గుండె పట్టుకుని బబొఇ అంటు హాస్పిటల్ కి పరిగెత్తే వారే.. కాలం తెచ్చిన మార్పు ఏంటంటే అప్పట్లో గుండె పట్టుకుని అప్పగింతలు చేసుకుంటే ఇప్పుడు గుండెల్లో ఖలుక్కు మంటే అప్పు చేసి మరి కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించు కుంటున్నారు.ఒక విధం గ అది మంచిదే ఆయినా అవసరం వున్నా లేక పాయిన కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు బైపాస్ చేసేద్దాం అంటు గుండె కి కోటలు పెట్టేస్తున్నారు. ఒకసారి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాక బ్లాక్ వున్నాయి బైపాస్ చెయ్యాలి ఇంక మీ ఇష్టం అన్నాక ఎవరు గుండె దిటవు చేసుకుని చేయించు కోకుండా బయట కోస్తారు?ఇక అప్పటి నుంచి బతకడం కోసం నడవడం అని పొద్దున్న సాయంత్రం గుందేలవాసి పోయేలా నడకే నడక.అందుకని గుండెల్లో కలుక్కు మనగానే హాస్పిటల్ కి వెళ్ళడం అక్కడ వాళ్ళు angio చేద్దమనడం చేసాక పెదవి విరవడం గుండె కొయ్యడం .అలా అని గుమ్మడి లా జీవితాంతం గుండె పట్టుకుని బతకలేం గ.ఈ ప్రశ్న కి బదులేది?ఈ గుండె కి రక్షనేది?

7 వ్యాఖ్యలు:

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

"పాత సినిమాల్లో గుమ్మడి కనిపిస్తే గుండె పోటు ఖాయం"... మేముకూడా ఎప్పుడూ అనుకునేవాళ్ళం :)

బొల్లోజు బాబా చెప్పారు...

life is like that. what can we do?
bollOjubaba

సుజాత చెప్పారు...

మరేం చేద్దాం చెప్పండి? లైఫ్ స్టైల్ మారి పోయింది. వైద్యుల స్టైల్ అంతకంటే ముందే మారిపోయింది. చిన్న జ్వరానికి ఎకో టెస్ట్ కూడా చేసి పారేస్తున్నారు. అలా అని నొప్పి వస్తే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 'కాసేపాగి చూద్దాం ' అని ఊరుకోలేం కదా, డాక్టర్ దగ్గరికి పరుగెత్తి పోవాల్సిందే! అక్కడ మళ్ళీ మొదలు....ఇదొక vicious circle!

ravigaru చెప్పారు...

చంద్ర గారు బాబా గారు సుజాత గారు thx చదివి మీ అబిప్రాయాలు తెలియ జేసినందుకు.డాక్టర్స్ తమ గూడు మేడ కోసం మన గుండెలు కోయ్యాల్అ?స్తేంట్ తో పోయే దానికి కూడా బైపాస్ అనడం 75 yrs వాళ్ళకి కూడా చేసేద్దమండి ఏమి కాదు అనడం. ఇవన్ని కూడా మా హాస్పిటల్ లో రోజుకు 3 బైపాస్ లు చేస్తాం అని ప్రచారానికే తప్ప రోగులు తమ గుండెలమీద చెయ్య వేసి నిశ్చింత గ పడుకోడానికి మాత్రం కాదు.ఏంటో సర్వేంద్రియానం గుండె ప్రధానం అయిపోయింది ఈ రోజుల్లో.చిరంజీవి వింటే గుండె దానం చెయ్యండి అంటారేమో కొంపతీసి

అజ్ఞాత చెప్పారు...

ఇంక ఇంతే. ఏం చెయ్యలేం.
మరో ప్రత్యమ్నయమే లేదు కదా

నిషిగంధ చెప్పారు...

'గుండెపోటు గుమ్మడి!' మేము సరిగ్గా ఇలానే అనుకునేవాళ్ళం :-)
ఈరోజుల్లో డాక్టర్ల సంగతి చెప్పక్కర్లేదు! అవయవాలని అవలీలగా మార్చేస్తున్నారు, పనిలో పనిగా తీసేస్తున్నారు కూడా!!
If you don't mind, please remove the word verification in comments.

ravigaru చెప్పారు...

E P గారు గుండె దిటవు చేసుజుని గుండె కోసం ఏదో వొకటి చెయ్యక తప్పదు.నిశిగారు మీరిచ్చిన స్పూర్తి తో ఏదో కూడలి లో ఒక బడ్డి కొట్టు పెట్టుకున్న నన్ను పెద్ద మాల్ ఓనరు అయిన మీరు వెరిఫికేషన్ తీసెయ్యండి అంటు రాస్తే కాసేపు జుట్టు పీక్కుని ఆ తర్వాత అపరాధ పరిశోధన చేసి సొంతం గా కని పెట్టి తీసేసా.మొదటి సారి సైకిల్ తొక్కిన అనుభూతి కలిగింది. మీ అమూల్యమైన సూచనలు ఇలాగె ఇస్తుంటే నేను త్వరలోనే విమానం నడిపెస్తా..మీకు నెనరులు(అంటే ఏంటో తెలిదు మీరంతా వాడుతున్నారు కదా అని వాడేస బహుశా ధన్యవాదలనుకుంట)?