21 అక్టో, 2008

కూడలి లో కాకా హోటల్

నిషిగంధ గారి బ్లాగ్ చూసి ప్రేరణ పొంది నేను కూడలి లో పాతిక రోజుల క్రితం ఒక కాకా హోటల్ పెట్టు కున్న.ఈ కూడలి లో ఒక పక్క నిషిగంధ, సుజాత , కొత్తపాళి ఇంక ఎందరో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ పెట్టుకుంటే అక్కడకి రోజు ఎంతొ మంది వచ్చి విందారగించి పోతున్నారు.కనీసం విన్దారగించాక కిళ్లీ కోసమన్నారాక పోతారా అని వాళ్ళ హోటల్ లో నా paradise పాన్ లాంటి అభిప్రాయాలూ వదిలి వెళ్తున్నా.ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా నా బ్లాగ్ దారి ఆటో ఇటో ఎటో వైపు.ఎవరన్నా రచయితా కి తన రచనల్ని చదివి సుచనలిచ్చేపాఠకులు దొరికితే ప్రసవ వేదన మర్చి పోయి బిడ్డను హత్తుకునే తల్లిలా మారి పోతాడు. అటువంటి పాఠకుల కోసం నిలువెల్ల కనులై ఈ రవి వేచేనులే.ఈ నాటి ఈ గరిబు కాకా పోడు నవాబు .అప్పుడు కాకా హోటల్ స్థానం లో నేను ఫివె స్టార్ హోటల్ పెట్టుకుంటా.ఆ రోజు వస్తుందంటావా గోపాలం శంకరాభరణం శంకర శాస్త్రి డైలాగ్ గుర్తు వస్తోంది.ఏమో ఏ కూడలి లో నో జల్లెడలోనో నా కాకా హోటల్ చూసి రుచి చూసి మళ్ళి మళ్ళి రాక పోతారా నా కాకా హోటల్ బాబాయి హోటల్ అంట ఫేమస్ కాక పోతుందా?

27 వ్యాఖ్యలు:

జ్యోతి చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
ravigaru చెప్పారు...

జ్యోతి గారు మిమ్మల్ని మా కాకా హోటల్ కి తీసుకొచ్చిన వాళ్ళు బిల్లు ఇచ్చే టైం కి washbasin కి పారిపోఇనా గాని వాళ్ళ చేతిలో మాత్రమే బిల్లు పెట్టడం మా ప్రత్యేకత.

MURALI చెప్పారు...

స్పెషల్ చాయ్ బజ్జీ పెట్టండి. రోజూ వచ్చేస్తాం.

Teja చెప్పారు...

ఇంతల వ్రాస్తే రాక చస్తామా....
చంపేసారు గురువు గారు .

అజ్ఞాత చెప్పారు...

మీ కాకా హోటల్ లో ఇరానీ చాయ్, వేడి వేడి సమోసాలు, బజ్జీలు, బోండాలు దొరుకుతాయా? దొరికితే రోజూ వస్తా.

ravigaru చెప్పారు...

జ్యోతి ,మురళి.తేజా,ప్రసాద్ కి దో చాయి దో empty లా

మున్నీ చెప్పారు...

రవిగారు, మీ కాకా హోటెల్ గురించి ఇప్పుడే తెలిసిందండి. మీ టపలన్ని బాగున్నాయి. ఇలా తరచు రావాటానికి స్పెషల్స్ పెడుతు వుండాలండి.

కొత్త పాళీ చెప్పారు...

మంచి అల్లం రోష్టు పెసరట్లు వడ్దించండి. కాకా హోటలు దానికదే ఫైవ్ ష్టారై కూచుంటుంది :)

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

అదే చేత్తో ఆ పెసరట్టుకి కాసింత ఉప్మా కూడా చేర్చారంటే ఇక మీ కాకా హోటల్ సూపర్ హిట్టే....

చైతన్య చెప్పారు...

ఒక మసాల దోసె పార్శెల్


హోటల్ హిట్ మరి...

కత్తి మహేష్ కుమార్ చెప్పారు...

ఇప్పుడే మీ హోటల్ కి టిఫిన్ చెయ్యడానికొచ్చాను. అయినా "కాకా హోటల్" అనేది హిందీ expression "బాబాయ్ హోటల్" మన తెలుగు వ్యక్తీకరణ...చూసుకోవాలిమరి!

బోర్డుపెట్టి టైటిల్కార్డుమాత్రం వేసావ్..ఇకపై ఏంవడ్డిస్తావో చూద్దాం.

aradhana చెప్పారు...

మీ కాకా హోటల్ "మాకా హోటలే" కావలి మరి అనుకునేలా వుండబోతోందనుకుంట

netizen నెటిజన్ చెప్పారు...

చంద్రయానం స్పెషల్ ఏమిటి?

ravigaru చెప్పారు...

మున్ని గారికి స్పెషల్ బిరియాని, కొత్తపాళీ గార్కి అల్లం పెసర,venusrikanth గార్కి పెసరట్టుప్మా, చైతన్య కి మసాలదోస,కట్టిమహేష్కుమార్ గార్కి బాబాయి హోటల్ ఇడ్లీ , నెటిజెన్ కి జాబిల్లి వెన్నెల పార్సెల్.

sujata చెప్పారు...

auna..? e sujata garu? Rendu special chai - memu iddaru sujata lu unnam.

ఉమాశంకర్ చెప్పారు...

రవిగారు (గారు??),

మీరు రాస్తూ ఉండండి మంచి మంచి టాపిక్స్ మీద, మేము చదువుతూ ఉంటాము.

బహుశా మీరు బ్లాగరు లో ఉండే ఎడిటర్ నే వాడతారనుకుంటా రాయడానికి.దానికి బదులు లేఖిని లాంటివి వాడండి. అచ్చు తప్పులు లేకుండా సులభంగా రాయొచ్చు. www.lekhini.org

(సరదాగా) ఈ గారు "ఆ" గారేనా? లేక మీ ఇంటి పేరా?

krishna rao jallipalli చెప్పారు...

ఎవరేంటి?? నేను కత్తి రామదాస్ ని.. ఆ మాత్రం తెలియదా?? ఏందీ... నిన్నటి మమూలేది... ఈ రోజుదీ కూడా కలిపియ్యి. ఏందీ ఇంకా బోణి అవ్వ లేదా... 16 మంది వచ్చారు కదా (కామెంట్స్).. జల్ది ఇయ్యి... గల్ల పెట్టి తియ్యి....

ravigaru చెప్పారు...

సుజాత గార్లకి one బై two చాయి.ఉమశంకేర్ మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.రాయాలనే వున్నది విని మెచ్చి సమయం ఇచ్చి అభిప్రాయాన్ని తెలిపే బ్లాగేర్ వుంటే.బ్లాగేర్ లో వున్నా ఎడిటర్ సౌకర్యం నాకు లేఖిని లో అలవరలేదు.ఇంక రవి కి గారు ఎలా తగిలిందంటే మొదట్లో యాహూ id కి ట్రై చేస్తునప్పుడు గజానికో రవి వుండి ఏ id కొట్టినా నాట్ available అని వస్తే ,దిస్సి ఈ రవిగారికే id దొరకక పోవుటయ అని గారు తగిలిస్తే బుద్దిగా ఆమోదించింది. అదన్న మాట సంగతి.

ravigaru చెప్పారు...

అన్నా కత్తి రమ్దసన్న గిప్పుడే దందా షురు అయిందే గసలె మనది కాకా హోటల్ ఐ పాయె ఏ customer భి టిప్ గిట్ట వదుల్తాలేదే.గింతకు ముందే ఆ పోలీస్ తమ్మి వచ్చి పుకట్ లా బిరియాని తిని పాయె.నువ్వు భి జరా నిన్న బిరియాని తిని పో.నా హోటల్ భి గ కొత్తపాళి అన్న లెక్క మస్తు పబ్లిక్ కి తెలిసినాక మామూలు షురు చేద్దాం ,జరా సోచయించు.

సుజాత చెప్పారు...

మాంచి మిర్చి బజీ (ఆంధ్రా స్టైల్లో ఉండాలి సుమా..హైదరాబాదు స్టైల్లో మిర్చి సగం కాలిన శవం లా బయటికి తొంగిచూస్తూ ఉండకూడదు మరి)..రెడీ చెయ్యండి.

ravigaru చెప్పారు...

సుజాత గారు మళ్ళి జీవితం లో మిర్చి బజ్జి ని ఎవరు నోట్లో పెట్టుకోకుండా పోల్చారు కాదండి హైదరాబాద్ మిర్చిని.మీ కోరిక మేర మిర్చిని కోసి ఉల్లిపాయలు కూరి పల్లీలు వేసి ఉప్పు కారం దట్టించి నిమ్మకాయ పిండి వేడి వేడి గ మీకోసం సిద్దం స్వీకరించండి.

బొల్లోజు బాబా చెప్పారు...

ఓపినింగ్ అదుర్స్. గో అహెడ్.
ఎదురుచూస్తుంటా

బొల్లోజు బాబా

అజ్ఞాత చెప్పారు...

mari naaku poori kaavaali
rojooo kaavalammmmaaaaaa

arpita చెప్పారు...

Ravigaru mee kaaka hotel 5star hotel level ki adiginappudu nannu cashierga pettukondi sir.... ado udatha sahayamu chestanu.....wish u all the best.

ravigaru చెప్పారు...

lacchimi roju puli kula tinte cholestrol perigipotundamma.arpita mi udata bhakty sayam tisukunte nenu samudram lo mulugu tanemo?

satyanarayana sarma చెప్పారు...

రవి గారు మీ కాకా హొటల్ బాగా పైకి రావాలంటే కొన్ని సూచనలు..
ఉదయాన్నే వేడి వేడి ఇడ్లీలు,కొబ్బరి ఆల్లం చట్నీలు,అల్లం పచ్చి మిర్చి ఉల్లిపాయలు దట్టించిన మంచి నేతి పెసరట్టు,జీడి పప్పు ఉప్మా,వేడి వేడి గారెలు,ఊతప్పం.
మధ్యాన్నంపూట మంచి తెలుగు భొజనం.
సాయంత్రానికి మంచి గుంటూరు మిరపకాయ బజ్జీలు,పునుగులు,అదిరిపొయె అల్లం టీ.
రాత్రికి హైదరాబాదు బిరియాని తో వంటలు ఏర్పాటు చెయ్యండి.స్టార్ హొటళ్ళకు మించిన సందడే సందడి.

రాఘవ చెప్పారు...

"సగం కాలిన శవం " అహా ఓహో ఎమిటన్నారు మహా ప్రభో sorry మహా రాణీ..నా జీవితం లో బజ్జి పైన ఇంత కంటే మంచి పద ప్రయోగం వినలేను భగవాన్..