26 అక్టో, 2008

దీపావళి కి డబ్బు తగలెయ్యడం అవసరమా?

దీపావళి ఒక్కరోజు వెలిగించే డబ్బు తో కాశి లో ఉన్నా వాళ్ళందరికీ సంవస్తరం మొత్తం ఉచితం గ విందు భోజనం పెట్తోచుట.అంటే కాశి లోనేనా వేరే వుల్లో పెట్ట లేమా అంటే కాశి లో జటరగ్ని అన్నపూర్ణ వల్ల నార్మల్ గ వుంటుందని దాన్ని ప్రామాణికం గ తీసు కోవడం జరిగింది. ఇంతకీ అసలు పాయింట్ కి వస్తే మనం చినప్పతి నుంచి ఏ కోణం లో దేన్నైనా చూస్తా మో అదే అలవాటు అవుతుంది.మా నాన్నగారు దీపావళి కి ముందే మీరు టపాసులు కొనుక్కుంతనంటే ఇచ్చేదనికన్న ఆ డబ్బులు దాచుకుంతనంటే రెట్టింపు ఇస్తా ననేవారు.ఒక్క రోజు temptation ని తట్టుకుంటే మీ చేతి లో బోల్డు డబ్బు దాంతో మీరు మంచి వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్పేవారు.నేను అప్పట్లో స్థిత ప్రజునున్ని కాబట్టి ఆ రాత్రి నిభాయించు కోవడం తో తెల్లారి నా దగ్గర బోల్డు డబ్బు వుండేది. తమ్ముడు , చెల్లి టపాసుల రూపం లో తగలేసుకోవడం తో బిక్కం మొహం వేసుకుని దీపావళి తర్వాత రోజు నుంచి నా చుట్టూ తిరిగే వారు, అన్నా ఏదన్నా కొని పెట్టారా అని. ఆ ఆననందమే వేరు, దిబ్బు దిబ్బు దీపావళి మల్లి వచ్చే నాగుల చవితి అని దివితిని నెల మీద కొట్టి తీపి తిని దేవుడి ముందు ప్రమిదలు అమ్మ వెలిగిస్తూ ఉంటే అరుగు మీద పెట్టడం.అదే అలవాటు మా పిల్లలకి చెయ్యడం తో ఈ దీపావళి కి మా అబ్బాయి కి టపాసుల బదులు సోనీ ప్లే స్టేషన్ (7000)కొన్నా కిలం వదిలినా ఫలం దక్కిందని సంతో శిస్తుంటే వాళ్ళ మమ్మీ ఆఫీసు నుంచి వస్తు 5000 టపాసులు తెచ్చేసిన్డి దీపావళి రోజు calculations వుండకూడదని .లోకో భిన్న రుచి అంటే ఇదేనేమో. పిల్లల కళ్ళలో ఆనందానికి వెల కట్టలేం అంటుంటే ఆ ఆనందం నా సోనీ వల్ల? తను తెచ్చిన క్రాకెర్స్ వల్ల?

5 వ్యాఖ్యలు:

krishna rao jallipalli చెప్పారు...

దీపావళికి డబ్బు తగలేయ్యడమో, దాచుకోవదమో.. ఇక ప్రతి దానికి ఇలా అనుకొంటే మనము ఏమి చేయలేము, అనుభవించలేము, బతకలేము. జీవతం లో కొన్ని తప్పవు, మరి కొన్నిటిని తప్పించు కోలేము. అలా అనుకుంటే - ఉంటానికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావాలా?? ఎ సి లు కావాలా, కార్లు కావాలా, అవన్నీ కొనకుండా ఉంటే ఆ డబ్బులు మిగులుతాయి కదా... అవి లేకుండా బతకలేమా?? ఈ ప్రశ్నలకి, జవాబులకి అంతు లేదు, ఉండదు. కర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి - దాచు కోవాల్సి వచ్చినప్పుడు దాచు కోవాలి. నొప్పిస్తే క్షంతవ్యుడను.

అబ్రకదబ్ర చెప్పారు...

రవిగారు గారు,

>> "పిల్లల కళ్ళలో ఆనందానికి వెల కట్టలేం అంటుంటే ఆ కల నా సోనీ వల్ల? తను తెచ్చిన క్రాకెర్స్ వల్ల"

రెండింటివల్లా. మీరు ఇలాగే ఆలోచిస్తుంటే మీ పిల్లలకి ప్రతి పండక్కీ డబుల్ ధమాకా ఖాయం :-)

నాగప్రసాద్ చెప్పారు...

రవి గారూ, దీపావళి కి డబ్బు తగలెయ్యడం అవసరమా అన్నారు. మీరు ఖర్చు పెట్టే డబ్బు ఎక్కడికి పోతోందని ఒక్కసారి ఆలోచించండి.

దీపావళికి మనం ఖర్చు చేసే డబ్బు మీద ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడివున్నాయి. ఒక్క విషయం తెలుసుకోండి, ఈ ప్రపంచంలో డబ్బు నాశనమవ్వదు. ఒకరినుంచి మరొకరికి బదిలీ అవుతుంటుందంతే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వినియోగదారులే (customers). ఎవ్వరూ డబ్బుని తమ దగ్గర దాచుకోలేరు.

ఇక మీరు మేడలు, కార్లు, విమానాలు ఇలా ఏది కొన్నా కూడా, మీరు ఖర్చు చేసే ప్రతి పైసా ఎవరికో ఒకరికి వుపయోగపడుతుంది. అంతే కాని డబ్బుని వృధా చేసినట్లు కాదు. ఇక్కడ వృధా అనేది ఆయా వ్యక్తుల స్తోమత మీద ఆధారపడివుంటుంది.

మీరు కూడ దీపావళికి డబ్బులు తగలెయ్యడం అవసరమా అనే బదులు క్రాకెర్స్ ధరల గురించి వ్రాసింటే బాగుండేది.

మీ పిల్లల అనందం విషయానికొస్తే, వాళ్ళు ఆనందం పొందింది ఖచ్చితంగా క్రాకెర్స్ వల్లనే . ఎందుకంటే వారి వయసు పిల్లలు అందరూ టపాసులు పేలుస్తూ ఎంజాయ్ చేస్తుంటే, మీ పిల్లలు మాత్రం వూరికనే ఎలా వుండగలరు. పండుగ అయిపోయిన తర్వాతనే సోనీ ని ఎంజాయ్ చెయ్యగలరు.

bhavani చెప్పారు...

నాక్కూడా దీపావళి అంటే అంత ఆసక్తి ఉండదు.
టపాసులు కాల్చాలని అనిపించదు. బలవంతంగా
కాల్చినా సరదాగా కూడా అనిపించదు.
డబ్బుల గురించి కాదు గాని అంత శబ్ధం వస్తే
చిరాకుగా అనిపిస్తుంది.

ravigaru చెప్పారు...

కృష్ణారావు గారికి, అబ్రకదబ్ర గారికి , నాగప్రసాద్ గారికి ,భవాని గారికి ధన్యవాదాలు మీ అభిప్రాయాలూ తెలియ బరిచినందుకు.నాగప్రసాద్ గారి అభిప్రాయం thought provoking గ వుంది . అయితే దాన్లో ఇంకో కోణం కూడా వుంది. చాలమంది బతుకుతున్నారు కదా అని మందు తాగడాన్ని ప్రోత్ష హించగలమా?అలాగే డబ్బు ఇంకో చోటకే కదా పోయేది అని హైదరాబాద్ ఎస్కార్ట్ సర్వీసెస్ ని ప్రోత్సహించాలెం కదా?ఒక ac లేదా ఇల్లు లేదా ఇంకో వస్తువు మనం చాల కాలం అనుభవించడానికి అవకాశం వుంది. టపాసులు అలా కాదు కదా .పైగా చాల ప్రమాదాలతో కూడుకున్న కున్న కుటీర పరిశ్రమ.అయిన మీరు దీపావళి ఖర్చు కి ఇంకో కోణం ఆవిష్క రించారు ధన్యవాదాలు.