31 అక్టో, 2008

ఇలా ఉండి ఉంటే?

పొద్దున్నే traffic లో మెల్లిగా కదులుతోంది నా కార్ ఇంతలొ సిగ్నల్ గ్రీన్ పడడం తో ఊపు అందుకుంది. నా ముందు RTCబస్ దాని ముందు ఓ స్కూటరిస్ట్, రెడ్ పడడం తో స్చూటేరిస్ట్ తన బండి sincere గా ఆపేసాడు కానీ బస్ డ్రైవర్ దాట్టేద్దమన్న తాపత్రయం లో scooterist ని డీ కొట్టేసాడు. బస్ చక్రాలు అతని తల మీదనుంచి వెళ్లి పోయి రోడ్ అంతా రక్తమయం. నా కళ్ళముందే జరిగిన ఈ సంఘటన నుంచి తేరుకునే లోపు ఇంకో అద్బుతం జరిగింది.రక్తపు మడుగు లోంచి ఆ వ్యక్తీ మాములు గా లేచి దుమ్ము దులుపుకుని RTCడ్రైవర్ తో ఏంటయ్యా సిగ్నల్ పడినప్పుడు చూసుకుని ఆపొచ్చు గా ఎందుకంత తొందర అంటే సారీ బాబు తప్పయి పోయింది అంటున్నాడు డ్రైవర్.నా కళ్ళని నేనే నమ్మలేక పోతున్న.ఇంకొంచెం దూరం వెళ్ళానో లేదో ఒక వ్యక్తిని ఎవరో గుండాల లా వున్నారు కత్తులు పట్టుకుని తరుముతూ గుండెల్లో పొడిచేసి తాపి గా నడుచు కుంటూ వెళ్లి పోయారు. రక్తపు మడుగులో పడి పోఇన ఆ వ్యక్తీ కూడా తాపి గా లేచి ప్యాంటు షర్టు దులుపుకుని వెళ్లి పోయాడు.నేను వెంటనే tv9 వాళ్ళకి ఫోనే చేశా విషయం చెపుదామని వాళ్ళు మీరు మా స్క్రోల్లింగ్ చూడటం లేదా తిరుమల గర్భ గుడి లోంచి మాటలు వినిపిస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి మానవులేవ్వరు కూడా 80 ఏళ్ళు వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో చావరని వరమిచ్చేసారు అన్తే కాదు ప్రపంచం లో నేర ప్రవుర్తిని ప్రరదోలడానికి ఇక నుంచి ఆడ మగ ఎవరికైనా సెక్స్ కొరికలు కేవలం 25 నుంచి ముప్పయ్ ఏళ్ళ మధ్యలోనే అదికూడా కేవలం భార్య భర్తా మద్య మాత్రమే కలిగేలా వరం ?(శాపం) ఇచ్చేసారు అని ఫోనే పెట్టేసాడు.ఆఫీసు కి వెళ్ళానో లేదో మా బాస్ రూమ్ లోంచి మంద్రం గా గాయత్రీ మంత్రం వినిపిస్తోంది. అదేంటి ఎప్పుడు పోర్నో సైట్స్ బ్రౌస్ చేస్తూ వుండే బాస్ ఆలోచిస్తూ అడుగు పెట్టగానే pl కం ఇన్ రండి కూర్చోండి అంటు ఇంటర్కం లో తన స్తేనో గాయత్రీ ని పిలిచి ఒక్కసారి రాగలరా అంటు మర్యాదగా పిలిచాడు. అసలు మా బాస్ ఆడవాళ్ళని ఎప్పుడు వెటకారం గా పిలవడమే గానిఅందులో తన స్తేనో ని ఏంటి రాత్రి అంటు పిలిచేవాడు ఆమె excuseme సర్ అంటే ఐ mean ఏంటి గాయత్రీ అనబొఇ అంటు వెకిలిగా మాటల్డే ఆయనే ఈయన? గాయత్రీ లోపలికి రాగానే అమ్మ గాయత్రీ ఇకనుంచి నా ఛాంబర్ తలుపులు ఓపెన్ చేసే పెట్టండి ఆడ అయిన మగ అయిన ఇక నుంచి నాకు సమానమే ఎవరైనా ఎప్పుడైనా రావొచ్చు secrecy ఏమి అవసరం లేదు ఆఫీసు టైం అయిపోగానే వెంటనే వెళ్లి పోవచ్చు ఇక నుంచి నో లేట్ నైట్ dictations.స్వామి ఏంటి నీ లీల నిజమేనా ఇక అందరు 80 దాక గుండె జబ్బులు కాన్సర్ లు షుగర్ లు bp లు ఏమి లేకుండా ఇంతలొ బాస్ రూమ్ లో టీవీ లో హైదరాబాద్ నాంపల్లి లో బొంబ్లాస్ట్ ఆ దృశ్యాలు లైవ్ లో coverage చేస్తూ మా ప్రతినిధి జాకీర్ ఓవర్ to జాకీర్.ఇక్కడ దృశ్యాలు భయంకరం గా వున్నాయి నా వెనకనే విడిపోయిన శరీర భాగాలు ఎక్కడ పడితే అక్కడ అంటు చెప్పుకు పోతున్నాడు అతని వెనక జనం అవయవ భాగాలు మళ్ళి అతుక్కు పాయి ఎవరి మానాన్న వాళ్ళు వెళ్లి పోతున్నారు, నాకు నోట మాట రాలేదు అంటే స్వామి ,రోగాలే కాకా కత్తులు బాంబులు కూడా ఏవి చెయ్యలేవన్న మాట.ప్రపంచం తీరు తెన్నులే మరిపోఇన క్షణం .స్వామి కల్కిఅవతారం ఎత్తేలోపు ప్రపంచం నాశనం అయిపోతుందని ఈ నిర్ణయం తిసుకున్నాడ?. ఇంకెక్కడా పేపర్ లో మానభంగాలు ,murder లు ఆటన్కవాదుల విద్వాంసాలు, అంటు భూతద్దం పెట్టి వెతికినా కనబడవ్. టీవీ లో క్రైమ్ టైం షో లు ఉండవ్. అంటే స్వామి మనిషి సోమరి పోతుల ఉండకుండా పనిచెయ్యడం కోసం ఆకలి దప్పికలు నొప్పి బాధ అలాగే వుంచి లైఫ్ కి guarentee ఇచ్చాడు , అలాగే సమాజం లో ఆడవాళ్ళ బద్రత కోసం సెక్స్ నీ restrict చేసి పడేసాడు. గోవింద నీ లీలలు అమోఘం అద్బుతం .గోవింద ,గోవింద ,రవి ,రవి ,ఇదేంటి గోవింద శబ్దం లో రవి మల్లి రవి రవి ఒక్కసారి వొళ్ళంతా కుదిపిన భావన ఏంటి ఆఫీసు కి టైం అవుతుంటే ఈ మొద్దు నిద్ర మాశ్రీమతి పిలుపు, అంటే ఇంతసేపు నేను చూసింది కల?అయ్యో ప్రపంచం ఇలా వుండి వుంటే?

9 వ్యాఖ్యలు:

రాధిక చెప్పారు...

wow...good idea

మున్నీ చెప్పారు...

చాలా బాగుంది మీ "కొత్త బంగారు లోకం".

arpita చెప్పారు...

Ela vundi vunte kaadu.....
Ela vundalani korukundam.....
Kale intha bagunte.....
Vastavam inkentha baguntundo kadaa!

ravigaru చెప్పారు...

mottam bloger lokam lo e kotta bangaru lokam kosam yeduru chusedi radhika ,munni, arpita, ravi matramena?hatavidhi.

నిషిగంధ చెప్పారు...

రవిగారూ, మీ కొత్త బంగారు లోకం బావుందండీ.. కానీ ఫ్రీగా తిరగడానికి అచ్చు తప్పులు అడ్డు పడుతున్నాయి :))

ravigaru చెప్పారు...

నిషిగంధ గారు మీరు కూడా నా కొత్తబంగారు లోకం లోకి అడుగు పెట్టినందుకు ధన్యవాదాలు. మీరు అనట్టు అచ్చు తప్పులు విందు భిజనం లో పంటి కింద రాళ్ళు. వాటిని yeresa . ఇక ముందు సోనమసూరి బియ్యం తోనే వంట వండ దానికి ప్రయత్నిస్తా.

బొల్లోజు బాబా చెప్పారు...

చిత్రమైన ఆలోచన. భలేగా ఉంది ఆలోచన.


లైటర్ వీన్ లో :
అమ్మో అలా జరిగితే ఇంకేమన్నా ఉందా. ఎన్ని పరిశ్రమలు మూతపడిపోతాయి
ఉదా: హాస్పటల్స్,
ఇన్సూరెన్స్ కంపనీలు
మందుల కంపనీలు
సేఫ్టీ టెస్టింగ్ కంపనీలు, పోడక్ట్లు,
ప్రపంచ ప్రాచీన వృత్తి ఆధారిత కంపనీలు
ప్రేమ పేరిట జరిగే లక్షలాది కోట్ల వ్యాపారం ఉదా; సాహిత్యం, సినిమాలు, గ్రీటింగ్ కార్డులు
దేముళ్లు, దేవాదాయ శాఖ ఆదాయం, భక్తి ఆధారిత వ్యాపారం
అన్నింటికన్నా ముఖ్యమైనది జీవితంలో మజా. పోతుంది.

సరదాగా
బొల్లోజు బాబా

సుజాత చెప్పారు...

భలే కలలు వస్తున్నాయి రవి గారు మీకు!

satyanarayana sarma చెప్పారు...

లోకం లోని బాధలను లోతుగా చూసిన వాళ్ళకు ఇటువంటి కలలు రావడం సహజం.రవిగారు,నిజం చెప్పనా,ప్రస్తుతం కూడా ప్రపంచమంతా ఒక ప్లాన్ ప్రకారమే నదుస్తోంది.కర్మ గతి గహనం అంటుంది గీత.రాహుల్ సాంక్రుత్యాయన్ రాసిన మధుర స్వప్నం చదవండి.మీకు నచ్చుతుంది.