మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
15 నవం, 2008
తెలుసుకోవలసిన సమాచారం (కానీ ఇష్టం ఉండదు)
మొన్న దీపావళి వెళ్ళిన మర్నాడు హటాత్తుగా మా మావగారు కాలం చేసారు.ఉదయం 11 గంటలకి పొతే సాయంత్రం లోపల దహన సంస్కారాలు జరిపిస్తే మంచిదన్నారు.కానీ ఎక్కడ మొదలెట్టాలి ఎలా మొదలెట్టాలి,దుఖం లో వున్న భార్యని ఒక పక్క వోదారుస్తూ ?ఆ సందర్భంగా నాకు అర్ధం అయ్యిందేంటంటే ఇప్పుడు అంతా టైలర్ made arrangements .మనం ఎవరో ఒక పురోహితుడికి ఫోన్ చేస్తే వాళ్ళే అన్ని సామానులతో సహా గంట లో వచ్చేస్తారు.ఈ లోపల ఇంటిదగ్గర డాక్టర్ to డెత్ సర్టిఫికేట్,( ఒక వేళ హాస్పిటల్ లో పొఇ వుంటే వాళ్ళే ఇస్తారు),తీసుకుని bansilalpet కి వెళ్లి అది చూపించి 2000 దాక కడితే వాళ్ళే చితి ఏర్పాటు చేసి ,అరగంట ముందు వాన్ పంపిస్తారు ఇంటికి.ఈ లోపల ఒక గంట కార్యక్రమం వుంటుంది అది పూర్తి కాగానే ఇంక అంతిమ యాత్ర.ఆ తర్వాత రోజు ఉదయాన్నే వెళ్లి ఆస్తిక సంచయనం వుంటుంది అవి కూడా కొంత రుసుము తీసుకుని రెండు నెలల దాక అక్కడే lockers లో భద్ర పరుస్తారు.ఈ రెండు రోజుల కార్యక్రమానికి పురోహితుడు నాలుగు నుంచి అయిదు వేలు తీసుకుంటాడు(వస్తువులన్నీ అతనే తెచ్చుకుంటాడు).ఇక అ తర్వాత వైకుంఠ సమారాధన వరకు అన్ని కార్యక్రమాలకి దస దానాలతో సహా 16 వేలనుంచి 21 వేళ దాక తీసుకుంటారు.ఆ తర్వాత కుల సంప్రదాయాల్ని అనుసరించి నెల నెల మాసికలు అవి పెడితే 1600(మొత్తం బ్రహ్మలు భోజనాల to సహా)సంవస్తారికల కి మూడు రోజుల ప్యాకేజీ 17ooo.మొత్తం అంతా కలిపి 60000 దాక అవుతుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళు వున్న వాళ్ళు కనీసం ఒక 50000 అన్నా పక్కన పెట్టుకుని వుంటే చనిపోకుండానే వారి ఆత్మా సంతోషిస్తున్డి.ఫైనల్ గ చెప్పేదేమంటే అటువంటి విపత్కర పరిస్తితులలో సంయమనం కోల్పోకుండా dial for his final journey అని ఒక ఫోన్ కొట్టి డబ్బులు సిద్దం గ పెట్టుకుంటే మానవ జన్మ ఎత్తిన ఆ జీవికి సద్గతులకు మనం సాయం చేసినట్టే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్‌లు:
రవిగారు మీరు రాసిన వాటిలో దీనికే ఏ కామెంట్స్ రానిది.ఎందుకంటె విషయం అలాంటిది మరి.కాని నాకు దీనిపై కొంత రాయాలనిపించింది. ఇతర మతాలతో పోలిస్తె మనలో అందులోను బ్రాహ్మణులలో ఛాదస్తంతో దీనికి కనీసం లక్ష తగలేసేవారున్నారు. డబ్బు లేక అప్పు చేసి మరీ ఖర్చు చేసి తరువాత తీర్చడానికి నానా బాఢలు పదుతున్న వాళ్ళూ ఉన్నారు. ఈ మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పోథే చూచాను.వాళ్ళు గుజరాతి మార్వాదిలు. తంతు చాలా క్లుప్తంగా ముగించారు. అనవసర ఆర్భాటాల జోలికి పోకుండా. కాని అన్నీ చేసారు. మన ముందు తరంలో కూతుళ్ళ పెళ్ళీళ్ళు చేయడానికి అప్పులు చెసి ఆత్మహత్యలు చేసుకున్న వారున్నారు. పండుగలు పబ్బాలకు తిండికి బట్టలకు పెట్టు పోతలకు ఎకరాలు అమ్మి తరువాత చితికి పోయిన కుటుంబాలు పల్లెలలో అనేకం. ముందు చూపు లేకుండా అనవసర ఖర్చులకు డబ్బు తగలేస్తే తరువాత అమెరికా గతి పట్టక తప్పదు. షొడశోపచార పూజలలో అన్నింటి బదులు అక్షతాన్ సమర్పయామి అని సరిపుచ్చే జనం గతించిన జీవి గతుకుల బాటలో నడవకుండా మంచి గతిని పొందడానికి అన్వసర తంతులకు లక్షలు తగలేసేకంటె వారి పేరుతో నిజంగా తిండి చదువు లేక బాధపడెవారికోసం ఏదన్నా శాశ్వతంగా ఉపయోగపడే పని చేస్తే ఎంతో మంచిది. పోయినవారి ఆత్మ కూడా తప్పక ఉత్తమ గతిని పొందుతుంది. నా ఉద్దేశం కర్మకాండలు పనికిరావని కాదు. దీని పేరుతో అనవసర తలకు మించిన ఖర్చులు తప్పు అని మాత్రమే.సహచర బ్లాగర్లు అవునంటారని ఆశిస్తూ---
నిజం సత్యనారాయణ శర్మ గారు(మీరు యడవల్లి ??)మీరన్న అలాంటి సంఘటనలు నాకు బాగా తెలిసిన వారి ఇళ్ళలో చాలా చూసాను.నేను మా అమ్మ చనిపోయిన రెండో సంవత్సరానికి ఒక అంధబాలుల పాఠశాల విధ్యార్ధులు,సిబ్బందికి ఒక పూట భోజనాలు ఏర్పాటు చేసా,వడ్డించా,
ఇకపొతే,మీరన్న చాదస్తం పాతకాలం వాళ్ళలో ఉంటాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు,కానీ ఈ మధ్య సాంప్రదాయం పేరుతో బాగా చదువుతున్న వారిలో పేరుకు పొతున్న మూర్ఖత్వాన్ని గూర్చి మీలాంటి పెద్దలేమంటారో...
http://www.vizagdaily.co.cc/
సత్యనారాయణ గారు, బాగా చెప్పారు. ఇప్పుడు ఇది అన్ని కులాలకు పాకుతుంది కూడ. మొన్నీ మధ్య మా దగ్గరి చుట్టాలలో ఒకర్ పోతె (శూద్ర కులమే) పోయిన రెండవ రోజు చిన్న దినం అని చాలా గొప్పగా చేసారు. ఆ తరువాత 5 వ రోజు, గోత్రికులకు మాత్రమే అని ఇంకో దినం (చాల రకాల మంసాహారాల తో) చేసారు. ఆ తరువాత 11 వ రోజు పెద్దదినం ఎటూ ఉన్నదే? ఈ మొత్తాలకు దాదాపు లక్ష రూపాయల పైనే ఖర్చు. వాళ్ల ఆస్తి మొత్తం విలువ 5 లక్షల కంటే ఉండదు. ఎందుకు ఇంత ఆర్భాటం అంటే, ఉర్లో పరువు అనో, పలానా వాళ్లు చేసారు, మనమూ చేయాలనో!
మీరు అన్నట్లు ఈ ఆర్భాటాలకు పోయే వాళ్లు ఏ కులం అయిన అప్పులు పాలు అవ్వడమే, దీని బదులు ఆ డబ్బులను అనాధ శరణాలయానికి ఇవ్వడం "రాజెంద్ర గారు" చేసినట్లు ఎంతో మంచి పని.
సత్యనారాయణ గారు,
చాలా బాగా చెప్పారు.
రాజేంద్ర గారు , నిజమా!
అయితే నన్ను మీ అభిమానుల్లో చేర్చుకోండి! సహాయం చేసే వాళ్లకు నేను వీర ఫాన్ ని!
శర్మ గారు మీ కామెంట్ ఆలోచన రేకేత్తిచే విధం గా వుంది. అయితే పిల్లి మెడలో గంట కట్టే సాహసం ఎవరు చేస్తారు?ఇలా సాంప్రదాయాల పేరు తో డబ్బు ఖర్చు పెట్టె కంటే ఏ అనాధ సరనాలయనికో ఇద్దాం అంటే తండ్రి పోయి దుఃఖం లో వున్న భార్య మా నాన్న కాబట్టి అలా అన్నారు మీ నాన్న పొఇనప్పుదు ఇంతకంటే ఎక్కువే తగలేసరు అనొచ్చు.లేదా ఈ సారికి ఇలా కానిచ్చి మీ వాళ్ళు పొఇనప్పుదు అనాధ శరనలయలకి అలాగే ఇద్దురు గాని లెండి అనొచ్చు.పక్కనున్న జిమ్ కి పోవడానికి పెట్రోల్ తగలేసి కారు లో పోతారు గాని మా నాన్నకి అది పోయాక ఖర్చు చెయ్యడానికి సవాలక్ష వంకలు అంటు జిర్రున చిదోచ్చు..అంచేత ఖర్చు లో ఖర్చు బిరియాని అని సాంప్రదాయాలకి విరుద్ధం గా పోలేము ఇదొక విష వలయం .
రాజెంద్రగారు,క్రిష్ణగారు,సుజాతగారు ధన్యవాదములు. రాజెంద్రగారు ఊహించినట్లు నేను యడవల్లి కాదు.రూపెనగుంట్ల. రవిగారు మీరన్నది పచ్చి నిజం. మాటలు అనుకోవడానికి బాగుంటాయి గాని ఆచరణలోకొచ్చెటప్పటికి విషవలయమే.కాని ఎవరో ఒకరు ఎక్కదో ఒకచోట మొదలు పెట్టాలిగా రాజేంద్రగారు అభినందనీయులే నాకు తోచినదెమిటంటే ప్రస్తుతానికి ఆచారాలు దుబారా లేకుండా పాటిస్తూనే సేవాకార్యక్రమాలు కూడా చేస్తూ ఫోవడమే మంచిది. అప్పుడు ఎవరికీ బాధ ఉండదు.ఆచారాలు ఏమి ఫలితాన్నిస్తాయో దేవునికెరుక. కాని సాటి మనిషికి సేవ మనకే ఎంతో ఆనందాన్నిస్తుంది.సాయం పొందిన మనిషి కళ్ళలో కనిపించే క్రుతజ్ఞతా భావం ముందు ఈ సారం లేని ఆచారాలు గాలికి కొట్టుకుని పోతాయి. మీరేమంటారు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి