19 నవం, 2008

మృష్టాన్న భోజనం /ముష్టి భోజనం

మన ఇంట్లో కడుపు నిండా తిని బ్రేవే మని త్రెంచ గలిగితే అదే మృష్టాన్న భోజనమని నేను ,ఇంట్లోనే కాకుండా ఎక్కడ తృప్తి గ తిన్నా అదే మృష్టాన్న భోజనమని మా ఫ్రెండ్ వాదన.ఆకలి తీర్చుకోవడం కోసం గడ్డి పచ్చడి తిని అదే విందు భోజనం అనుకోవడం ఎంతవరకు సమంజసం?అసలు బయట చిరు తిళ్ళు తినడం అవసరమా?పొరిగింటి పుల్లకూర రుచి అని ఇంట్లో వున్నా విందు భోజనం నచ్చదు గాని పక్కింట్లో పుల్లకూర మీదే ద్రుష్టి,ఇలా సాగి పోతున్న నా వాదనకి అడ్డుకట్ట వేస్తూ మా ఫ్రెండ్ బాస్ కడుపు కాలి ఆకలి వేస్తునప్పుడు ముష్టి భోజనం కూడా పరమాన్నం లానే అని పిస్తుంది, అలాగే ఆకలి తీరడం కోసం ముష్టి ఎత్తిన తప్పులేదు అంటు మా వాడు వాదిస్తున్నాడు.అందుకనేనా puutakullamma కాలం నుంచి ఫివె స్టార్ హోటల్స్ దాక బయట భోజనం డిమాండ్ తగ్గలేదు .ఇదంతా ఎప్పటి నుంచి వింటున్నాడో ఏమో ఆ పెద్దాయన మద్యలో కల్పించుకుని మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా బయట తిండే బెస్ట్ అనుకుంటే అప్పుడు తెలుస్తుంది అంటు వీసా వీసా వెళ్ళిపోయాడు.అవాక్కవడం మా వంతయ్యింది .ఎందుకంటె మా వాడు భోజన ప్రియుడు తిండి చూస్తే నోరు కట్టుకోలేదు వాడికున్న షుగర్ ప్రాబ్లం దృష్ట్యా మేము ఇంటి భోజనం బయట భోజనం గురించి మాట్లాడుకుంటుంటే అ పెద్దమనిషి వేరేలా అర్ధం తీసుకుని మాకు క్లాస్సు పీకి చక్క పోయాడు.ఒకే విషయాన్నీ రెండు కోణాల్లో చూస్తే యెంత తేడ?ఇక్కడ నేను రాసింది కేవలం తిండి గురించి గానే భావించి నేటిజేన్స్ చదువు కో గలరు వేరే అర్ధం స్పురించిన యద్ భావం తద్ భవతి. చిత్త గించ గలరు.

5 వ్యాఖ్యలు:

మున్నీ చెప్పారు...

మధ్యలో ఆ పెద్ద మనిషి వచ్చే వరకు నేను కూడా మీరు భోజనం గురించే మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను. ఇంక మీ వాదన విషయంకి వస్తే నేను మీ పక్షమే అన్డోయి. ఇంటి భోజనమే మృష్టాన్న భోజనం.

కొత్త పాళీ చెప్పారు...

బాగుంది .. పిట్టపోరు పిట్టపోరు .. సామెత తెలుసుగా :)
అదలా ఉంచండి గానీ, మృష్టాన్నం అంటే అర్ధం తియ్యని తినే పదార్ధం అని.
మీరు కాస్త పబ్లిష్ బొత్తం నొక్కే ముందు అచ్చుతప్పులు ఒకటికి రెండుసార్లు గమనించాలి.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

కాలే కడుపుకి మండే బూడిద అంటారు..
ఏ భొజనమయినా కడుపారా తినగానే చక్కగా త్రేనుపు రావడమన్నమాట(అంటే ఎక్నాలెడ్జ్ మెంట్ )ఆ తర్వాత కాళ్ళూ,కళ్ళూ రెండూ ముసుగు తన్నేస్తాయి..
ఇంక మృష్ఠాన్న భోజనం అయితే..100ఎక్నాలెడ్జ్ మెంట్ లు అనుకొందాము.

satyanarayana sarma చెప్పారు...

మ్రుష్టాన్న భోజనం అంటే ప్రతిపదార్ధం ఏదైనా, వాడుకలో మాత్రం మంచి భోజనం అనే కదా.మరి ముష్టి భోజనం సరేసరి.అసలు ఆకలి అనేది ఉంటె కదా భోజనం రుచి తెలియడానికి.అది లేనప్పుడు ఏ భోజనమైనా ఒకటే.ఆకలి తీవ్రంగా ఉన్నపుదు ముష్టి భోజనం కూడా అప్పటికి బాగానే ఉంటుంది.తరువాత అరక్కపోతే బాధలు తప్పవు. అది వేరే సంగతి.ఆకలి లేనప్పుడు మంచి భోజనం కూడా అరుచిగానే ఉంటుంది.అమెరికాలో ఎక్కువై పారేస్తున్నా ఆఫ్రికాలో ఆకలితో చచ్చిపోతున్నా అంతా ఆకలి మహిమ.ఇక రవిగారి పెద్దమనిషి ఇది వింటే ఆకలి పుట్టడానికి వయగ్రా వేసుకోమంటాదేమో.ఖర్మ.ఏం చేస్తాం.ఎవరి ద్రుష్టి వారిది.వేదాంతం చెప్పినట్టు ద్రుష్టిని బట్టి స్రుష్టి కనపడుతుంది మరి.

ravigaru చెప్పారు...

మున్ని అ పెద్దమనిషి వచ్చినా గాని మేము భోజనం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము.కొత్తపాళి గారు మృష్టాన్న భోజనం అన్నది వాడుక పదం కదా అని వాడా అయిన భావ ప్రాధాన్యమే గాని భాష ప్రాదాన్యం కాదు గా.శ్రీనివాస్ గారు మీ ఎకనోలేడ్గేమేంట్ కి నెనరులు.శర్మ గారు చాల చక్క గా చెప్పారు.అ పెద్దమనిషి భావం లో పాడాలంటే ఆకలేస్తే వయాగ్రా ఇస్తా ఆ పైన పక్కింటి భోజనం పెడతా అని పాడుకోవాలేమో.