29 నవం, 2008

ఎల్లుండి కి గుర్తు ఉంటారా?

ఈ ఆవేశం రేపు ఉంటుందా?ఈ దేశభక్తి ఎల్లుండికి పదిలమా?ఉగ్రవాదుల తుటాలకి నేలకొరిగిన అమరవీరులకి అశ్రుతర్పణం వదలడం లో sms ,లైవ్ షో లో ఫోన్ కాల్స్, కాసేపు చెమర్చిన అశ్రు నయనాలు?ఆ తర్వాత ఎవరి జీవితం వాళ్ళది.ఇంకో తీవ్రవాద చర్య జరిగేదాకా ముంబై లో నార్త్ ఇండియన్ నఖరాలు చేస్తే కాలు తీస్తా అంటాడు ఒక థాకరే.హైదరాబాద్ లో ఉగ్రవాదుల పేరిట అమాయకులైన ముస్లిం యువకుల్ని వేధిస్తే చంపేస్తా అంటాడు ఇంకో ఒవైసీ వెరసి ఎవడి రాజకీయాలు వాళ్ళవి.పార్లమెంట్ మీద దాడి చేసి సుప్రీం కోర్ట్ ఊరి శిక్ష విదించిన తీవ్రవాది కి ఊరి తీసే దమ్ము మనకి లేనప్పుడు బాగ్ నిండా granides తీసుకుని ak 56 చేతబూని వాడి బెడ్ రూమ్ లోకి వెళ్ళినట్టు గ స్టార్ హోటల్ లోకి కూడా వెళ్ళగలడు.రాజ్ ధాకరే ముంబై లో ఆ రాత్రి సుఖం గ నిద్రపోడానికి దక్షిణ ప్రాంతపు ఉన్నికృష్ణన్ , ఉత్తర ప్రాంతపు సింగ్ తాము శాస్వత నిద్ర లోకి వెళ్ళిపోవలసి వచ్చింది.ఇప్పుడు ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు వాడు విచారణలో నాకు కించిత్తు కూడా బాధలేదు పి పెచ్చు గర్వం గ వుండన్నాడట, రేపు కోర్ట్ విచారణలు మూడేళ్ళు సాగి వాడికి ఉరిశిక్ష పడినా ,వాడికి క్షమా బిక్ష కోరడానికి అన్ని రాజకీయ పార్టీ లు రెడీ, మైనారిటీ వోట్లు పోతాయేమో అని భయం.మరి ఇప్పుడు అసువులు బాసిన ఆ ప్రభుత్వ వుద్యోగుల కుటుంబ పరిస్తితి?అందుకే నా సూచన ఏంటంటే ఇలా విద్రోహుల ఉన్మాద చర్యకి విధి నిర్వహణ లో అసువులు బాసిన ప్రతి ఉద్యోగికి వాళ్ళు సర్వీసు లో ఉంటే ఎలా జీతం ప్రమోషన్స్ ఇతర సదుపాయాలు ఇస్తారో అవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి ఆతను రిటైర్ అయ్యే దాక కొనసాగించాలి. అంటే భౌతికం గ ఆ వ్యక్తి ఆ కుటుంబానికి లేక పోయిన ఆర్దికంగా తోడూ గా వునట్టే. పార్లమెంటు లో చట్టం తీసుకొచ్చి ఇంతకూ ముందు ఇలాగే అసువులు బాసిన అందరు ఉద్యోగులకి వర్తించేలా చెయ్యడమే వాళ్ళకిచ్చే నిజమైన నివాళి . అంతే గాని రెండు రోజుల తర్వాత వీళ్ళ పేర్లు చెప్పమంటే ఎంతమందు గుర్తు పెట్టుకుని చెపుతారు? ఆలోచించండి,మన స్టేట్ లో పాత బస్తి లో కరెంటు బిల్లు, వాటర్ బిల్లు వాసులు చేసే దమ్ము ఉద్యోగులకి లేదు. ఇంక ఉగ్రవాదం మీద పోరు కూడాను. కనీసం ఈ ఉగ్రవాద చర్యని mim పార్టీ ఖండించను కూడా లేదు.ముంబై లో కాబట్టి ఉగ్రవాదులు చచ్చారు గాని అదే హైదరాబాద్ లో అయితే ఈ పాటికి pia విమానం లో kudha haffiz అంటు చల్లగా వెళ్లి పోయేవారు.

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మరి ఇప్పుడు అసువులు బాసిన ఆ ప్రభుత్వ వుద్యోగుల కుటుంబ పరిస్తితి?అందుకే నా సూచన ఏంటంటే ఇలా విద్రోహుల ఉన్మాద చర్యకి విధి నిర్వహణ లో అసువులు బాసిన ప్రతి ఉద్యోగికి వాళ్ళు సర్వీసు లో ఉంటే ఎలా జీతం ప్రమోషన్స్ ఇతర సదుపాయాలు ఇస్తారో అవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి ఆతను రిటైర్ అయ్యే దాక కొనసాగించాలి.



This is rule is already in practice, so need not worry about this . but


అంతే గాని రెండు రోజుల తర్వాత వీళ్ళ పేర్లు చెప్పమంటే ఎంతమందు గుర్తు పెట్టుకుని చెపుతారు?

we need to think about this....

Unknown చెప్పారు...

mr anonymous if i am not wrong ,the last drawn salary of the deceased is being given as family pension instead of the usual 1/3rd.his name is not being considered for any notional promotion which other wise he would have been eligible.the shelter taken by admn is the dead man can not be promoted. that is the reality.the kith and kin of the marytor are not going to question all this after all poinollandaru manchollu vunnollu poinolla tipy gurtulu.

అజ్ఞాత చెప్పారు...

The full salary will paid in case of dead in attacks like Naxallites or terrorist ! This is in already in pracice in both state and central govts.