7 డిసెం, 2008

అన్వేషణ అశ్రు నయనాలతో,

నేను నిన్ను విజయవంతం గా మర్చి పోయా అనే అనుకున్నా,నా జీవితం లో నువ్వొక మర్చిపోయిన తీపి జ్ఞాపకం గానే భావించ.నా చదువయిపోయాక , నా ఉద్యోగం ,నా పెళ్లి ,నా జీవితం అంటు పరుగెడుతూ నా జీవితపు తోలి సంధ్యలో కాంతులీడిన నీ ప్రేమ పుష్పాన్ని నిర్ధాక్షిణ్యం గా నా పాదాల కింద నలిపేసి ముందుకు సాగిపోయా.నా అంతరాత్మ నన్ను ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఇన్నాళ్ళు నన్ను నేనే బిజీ అంటు మభ్య పెట్టుకున్న.మొన్న ఆఫీసు పని మిద ముంబై వెళ్లి తాజ్ లో వునప్పుడు ఉగ్రవాదుల దాడికి భయపడి రూమ్ తలుపులు లాక్ చేసుకుని మంచం కింద దూరి , జీవితపు చరమంకపు క్షణాల్లో నాకు ఉహ తెలిసిన దగ్గర నుంచి ఇంతవరకు జరిగిన సంఘటనల్ని నేమరేసుకున్తునప్పుడు, అది గో అప్పుడు తెలిసింది నా లోపల లావాలా నీ జ్ఞాపకాలు పెల్లుబికినప్పుడు తెలిసింది,నువ్వు నాలో నిక్షిప్తమై పోయావని.కాలేజీ రోజుల్లో తెలిసి తెలియని వయసులో ప్రేమ , దోమ అంటు నీ వెంట పడినప్పుడు,లవ్ లెటర్ పేరు తో కొవ్వు లెటర్స్ రాసినప్పుడు,నా డబ్బు మదం తో నేను ''ఎప్పుడు ఆ వెలిసి పోఇన బట్టలేన ?''అంటు అందరిముందు రెండు చుదిదార్లు నీ అహం దెబ్బతీస్తూ ఇచ్చినా నువ్వు సున్నితం గా నవ్వుతు తిరస్కరించినప్పుడు,నా జీవిత లక్ష్యాలని నిర్దేశించి ఇది సాధించి వచ్చిన రోజు నీ లవ్ లెటర్స్, చుదిదార్లు తీసుకుంటానని నాకు మార్గ నిర్దేశం చేసినప్పుడు,నువ్వు నాలో హిమాలయ పర్వతం లాగా ఎదిగి పోయావు.సివిల్స్ లో విజయం సాధించి నే రాసుకున్న loveletters నీ , నే నీకోసం కొన్న బట్టల్ని తీసుకుని నీ ముంగిట valalani కలలు గన్నా,ఆ బడా పరిశ్రామక వేత్త మా ఇంటి కొచ్చేదాకా.''మా అమ్మాయిని కోడలి గా స్వీకరించే బాద్యత మీది, మీ వాడిని సివిల్స్ ఇంటర్వ్యూ లో పాస్ చేయించే బాద్యత నాది ''నాన్న తో అంటున్న అయన మాటలకి నాన్న తప్పకుండ బావగారు ,నేను వాణ్ణి చిన్నప్పటి నుంచి తల్లి లేక పోఇన మళ్ళి పెళ్లి చేసుకోకుండా కంటి కి రెప్పల పెంచుకున్నా , నేను జీవితం లో మొట్ట మొదటి సారి కోరే ఈ కోర్కెని వాడు కాదనగాలాడ? అంటే ఈ తండ్రి బతికుండా గలడా?అంతే నా ప్రేమ సమాధి ఐ పోయింది.అప్పటి నుంచి ఇన్నేళ్ళు నిన్ను నేను శాశ్వతం గా మర్చి పోయాననే అనుకున్నా.నీ మనసు యవనిక మీద నేను చేసింది ఉగ్రవాది దాడి కదా?ఎన్ని అవమానాలు చేశాను, యెంత అధికారం నీ మీద ప్రదర్శించాను?ఎక్కడున్నావు నేస్తం?ఈ ఉగ్రవాదుల తుటాలకి నేను బలి అయి పోయే లోపు నేను నీ మనసుకి చేసిన గాయాన్ని నా కన్నిలతో తుడిచేసి, నీ పాదాల మీద పడి క్షమాప్పన వేడుకుని , నీ వొడిలో వొదిగి పోయి, ఆఖరి శ్వాస విడవ గలిగే అద్రుష్టం ఈ జన్మ కి వుంటుందా?ఒక పక్క granide పేలిన శబ్దాలు, తూటాల పేలుళ్లు, ఇవేవీ నా లో ఏ భయాన్ని కలిగించటం లేదు కానీ నేను చని పోయే లోపు ఒక్కసారి నా కన్నిలతో నీ పాదాల్ని కడిగి మనసు బరువుని దించుకుని హాయ్ గా వేల్లిపోని.భగవంతుడు ఒక్క అవకాశం నాకిచ్చి ఇప్పుడు బతక నిస్తే నా మొదటి ప్రయత్నం నీ కోసమే నా అన్వేషణ. ఈ విశాల ప్రపంచం లో నువ్వు నా జ్ఞాపకాలతో ఎక్కడో పదిలంగా నే వుంటావు.ఇంతలొ నా రూమ్ కొడుతున్న శబ్దం. ఎవరు ఉగ్రవాదుల?ఒకటే నిర్ణయం తీసుకున్న నిన్ను మళ్ళి కలుసుకునే యోగం వుంటే నే బ్రతుకుంట, ఆ అర్హత లేక పొతే ఈ క్షణమే మరణిస్తా అనుకుంటూ తలుపు తీసా. ఎదురు గా nsg కమోన్దోస్, pl కం సర్ అంటు ఎస్కార్ట్ chesi మళ్ళి జన జీవన స్రవంతి లో పడేసారు.నే చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశాన్ని ఇంకోసారి భగవంతుడు నా కిచినట్టు గా భావిస్తూ నా అన్వేషనని అశ్రు నయనాలతో మొదలెడుతున్నా.

6 వ్యాఖ్యలు:

...Padmarpita... చెప్పారు...

బాగుందండి....మీ అన్వేషణ ఫలించి మీ ప్రియనేస్తం మిమ్మల్ని కలసినప్పుడు ఆశ్రునయనాలతో కాదు ఆనందఢోలికలతో ఊయలలూగాలని ఆశ్శిస్తున్నాను.

satyanarayana sarma చెప్పారు...

రవిగారు మీ అశ్రువులను అలాగే వుండనివ్వండి.ఏ ఆనందమూ శాశ్వతం కాదు.బాధ ఒక్కటే శాశ్వతం.మరపురాని బాధ కన్నా మధురమే లేదు.మీ కలలరాణిని కలుసుకోకపోవడమే మంచిది.వాస్తవం కన్నా ఊహే మధురమనేది పచ్చి వాస్తవం.

నిషిగంధ చెప్పారు...

రవిగారు, చదివాక మనసు స్థబ్దంగా అయిపోయిందండీ! చాలా బాగా రాశారు!! జీవితం ఇంకాసేపట్లో ముగియబోతుందనుకుంటే మొట్టమొదటగా గుర్తొచ్చే వ్యక్తే మనకి అత్యంత ప్రియమైన వ్యక్తి!

ravigaru చెప్పారు...

నిషిగంధ గారు ఎవరి ప్రేరణతో ఈ బ్లాగ్ మొదలెట్టానో.,ఎవర్ని ఆదర్శం గా తీసుకుని రచనలు మొదలెట్టానో,వారె వచ్చి స్తబ్దుగా అయి పోయా చదివి అంటే అంత కంటే ప్రేరణ ఏం కావాలి?ధన్యవాదాలు లాంటి చిన్నపదం నాలో పొంగిన భావాన్ని ఏ మాత్రం తెలియ పరచదు .నాకధ లో భావాన్ని అర్ధం చేసుకోవాలంటే తమ జీవితం లో కూడా అంత అనుభూతులు మిగిల్చిన ఆత్మీయులు ఉండి తీరాలి.ప్రతి వాళ్ళ జీవితం లో వాళ్ళు వుండి వుంటారు కానీ కాలగమనం లో మసక బారి పోతారు. మనం ప్రశాంతం గా ఒంటరి గా వునప్పుడు పలకరించి పోతూ ఉంటారు ఇంక ఆఖరి క్షణం లో అయితే ఇంక చెప్పనక్కర లెద్దు.పద్మర్పిత గారి ప్రోత్సాహం తో అన్వేషణ కోన సాగించాలో?లేక శర్మ గారి సూచనతో ఉహల్లో నే వుండి పోవడమో?కాలమే నిర్ణయించాలి.

నిషిగంధ చెప్పారు...

రవిగారూ, నేనైతే మన హృదయాలపై ముద్ర వేసిన ఇలాంటి వ్యక్తులను తిరిగి కలవడం అనేది డెస్టినీ మీదే వదిలేస్తాను.. ఒకవేళ వారిని మాళ్ళీ కలుసుకోవాలని ఆశగా అన్వేషించి, ఉనికిని కనిపెట్టి, ఉద్వేగంగా 'నేను ' అంటూ సమీపించగానే ఆ వ్యక్తి జస్ట్ 'ఓహో అలాగా' అని తలూపేస్తే!? వాళ్ళని జీవితం ఎలా మార్చివేసిందో చెప్పలేము.. అందుకే ఆనాటి జ్ఞాపకాలతోనే సంతృప్తి చెందడం మంచిదనిపిస్తుంది..

btw, మీరు 'ఆదర్శం' అదీ ఇదీ అని పెద్ద మాటలు వాడేస్తున్నారు.. వద్దండీ ప్లీజ్.. నాకంత దృశ్యము లేదు :-)

అజ్ఞాత చెప్పారు...

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ- తెలుగు తెలుగు బ్లాగుల గురించి ప్రచారం చెయ్యడానికి మనకు అనుమతి దొరికింది.
సమయం : శనివారం సాయంత్రం 6- 7
వేదిక :పీపుల్స్ ప్లాజా, నెక్లేస్ రోడ్.
దయచేసి, వీలు చేసుకుని హాజరవుతారని ఆశిస్తున్నాం.