20 డిసెం, 2008

బ్లాగర్స్ దిగి వచ్చిన వేళ

అనుకున్న ప్రకారం నెక్లస్ రోడ్ లో జరుగుతున్న పుస్తక ప్రదర్శన లో సాయంత్రం 6 గంటలకి మిగతా బ్లాగ్ మిత్రులు కలుస్తారన్న ఉద్దేశం తో వెళ్ళా . నే వెళ్ళేటప్పటికే దుర్వాసుల గారు, తాడేపల్లి,శ్రీధర్,వివేన్ ఇతర మిత్రులు స్టేజి మీద ప్రదర్శనకి సిద్దమవుతూ కని పించారు.ఒక పది కుర్చీలు మాత్రమే వున్నాయి స్టేజి కి ముందు.వచ్చిన బ్లాగేర్స్ ముందు గా ఈ తెలుగు స్టాల్ కి వెళ్ళడం చేత అందరికి ఈ తెలుగు రిబ్బోన్ badge పెట్టడం జరిగింది. అందువల్ల బ్లాగర్స్ ఎవరో కని పెట్టడం సులభం అయ్యి వారిని పరిచయం చేసుకోవడం సులభమయ్యిన్డి. అలా అక్కడ కొత్త గా పరిచయమయిన బ్లాగర్స్ రమణి, వాళ్ళ అక్క వేద, నేను లక్ష్మి, పూర్ణిమ. వీళ్ళు కాక మిగతా బ్లాగేర్స్ అరుణ , జ్యోతి, కత్తి,అనిల్ ,కశ్యప్ .కుర్చీలు ఎక్కువ లేకనో ,ఆ సమయం లో జనం పల్చగా వుండడం చేతనో ఆశించినంత మంది తిలకించ లేదేమో అని పించింది. ప్రెస్ బానే వచ్చారు. మరి coverage సంగతి రేపే తెలుస్తుంది.కానీ కంప్యూటర్ లో తెలుగు వాడె విధానం బ్లాగ్స్ ఎలా సృష్టించాలి వంటి విషయాలు డిస్ప్లే చేస్తూ చూపడం జరిగింది.ఆశించినంత స్పందన లేక పాయినా కంప్యూటర్ లో తెలుగు వాడకం దిశగా కొన్ని అడుగులు పడ్డాయని చేపోచ్చు. స్టాల్ దగ్గర కూడా జనాలుఈనాడు tv9 కి మద్యన sandwich అయి నలిగిన మన స్టాల్ ని ఒక సారి తల పంకించి ముందుకు సాగి పోతున్నారు.నది దూసుకు పోతున్న నావను ఆపండి రేవు బావురు మంటోందని నావకు చెప్పండి అంటు ముత్యాల ముగ్గు లో నిదురించే తోటలోకి పాట గట్టి గా పాడాలని పించింది.కానీ స్టాల్ అంతా బ్లాగేర్స్ తో నిండి సందడి గా అనిపించింది. పూర్ణిమ , తాడేపల్లి గారు తమ కెమెరాల్లో భందించిన ఆ మధుర క్షణాల్ని మనకోసం బ్లాగ్ లో పెడతారని , అది చూసి మరింత మంది బ్లాగేర్స్ కలుస్తారని తమ తెలుగు రచనలతో వెలుగులు నింపుతారని ఆశిస్తూ పదండి ముందుకు పదండి తోసుకు.

9 కామెంట్‌లు:

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Shiva Bandaru చెప్పారు...

బహు బాగు :). నేను రాలేకపోయినందుకు బాదగా ఉంది :(

అజ్ఞాత చెప్పారు...

అయినా దూరపు వూరుల్లో వారికి ముందుగా పిలుపులు వెళ్ళాలి కాదాండీ? పిలిస్తేనే రాలేనివాళ్ళం, పిలవకపోతే తలవను కూడా తలవం. పురాణాలు చదివిన పెద్దలు మీలో పెద్దగా వున్నట్లు లేరు. బంగారం కాకున్నా చవగ్గా దొరికే 1 గ్రాము గోల్డుతో మా అందరి రూపులక్కడవుంచితే ఎవరో ఒక వాల్మికీని పట్టి కాకుల్లానో, మా లేకుకివచ్చిపోతుండే బాతుల్లానో ఎగిరొచ్చి మా మా బంగరు బొమ్మల్లో దూరుండేవాళ్ళం కాదా?
Thanks for sharing this update, will watch for more.

Unknown చెప్పారు...

ఉష గారు మీరు చెప్పినట్టే బంగారము తోడనో, వెండి తోడనో, వీలు కానీ పక్షములో మట్టి తోడనో రాని బ్లాగర్స్ ప్రతిమలు తయారు చేసి ''ఎవరు నీవు నీ రూపమేది ఏమని పిలిచేది నిన్నేమని పిలిచేది ''అని పాడుకోవాలేమో.అ తర్వాత ఎవరి ప్రతిమల్ని వాళ్ళకి courier లో ఎలాగు పంపమంటారు. అది వేరే విషయం.

Unknown చెప్పారు...

hata vidhi nenevari vyakyalu tolaginchaledu?modati coment rasindy yevaro?vare tolaginchu kunnaro mari verevaraina tolagincharo?yento anta ayomayam ga vundy.

నిషిగంధ చెప్పారు...

అయితే మీరు కూడా ఆ అదృష్టవంతుల లిస్ట్ లో ఉన్నారన్నమాట! ఏ చేస్తాం లేండి, టైమ్ మీది :-)

పద్మనాభం దూర్వాసుల చెప్పారు...

నిజానికి ఈ పొస్టుపై వ్యాఖ్యానించాలని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే దీనివలన కొంత అసంతృప్తి పుట్టుకొచ్చింది. కాని అదృష్టమో లేక దురదృష్టమో గాని నేను మొదటినుండీ ఈ కార్యక్రమంతో కొంత సంబంధం పెట్టుకొన్నాను. e-తెలుగు కి ఇంత మంచి అవకాశం వచ్చినందుకు సంతోషించాను."రవిగారు" మీరు ఎంత ఆశించారో నాకు తెలియదు. ఏదో సినిమాకి వచ్చినంతమంది రావాలనుకుంటే నేను చెప్పలేను కాని, ఒక్కొక్క సారి మానేజ్ చెయ్యలేనంత మంది కూడా ఉంటున్నారు. ఇక వచ్చిన వాళ్ళ ఉత్సుకత అంటారా, అది మాకు తెలుసు. వాళ్ళు నింపిన ఫారాలకు తెలుసు.
మీరు మీ అభిప్రాయాలను వ్యక్తీకరించడం, అదీ మీ బ్లాగులో మీ హక్కు. అయితే తోటి బ్లాగరుగా ( ముఖ్యంగా తెలుగు భాషాభిమానిగా)పరిస్తితిని వివరించడం తప్పు కాదనుకుంటాను. మీరు వ్రాసిన కొన్ని వాక్యాలు నిజానికి సత్యదూరాలు. రెండు స్టాల్సు మధ్య ఇరుక్కోవడం వలన జనం మన స్టాలులో పలచ బడ్డారనడం సరికాదు. ఎంతో ఉత్సాహాన్ని కలిగించి మన కార్యక్రమాలకు మనకు ఏంతో దోహదం చేసిన చేస్తున్న ఈ కార్యక్రమంపై మీరు చేసిన కొన్ని వ్యాఖ్యలు నీళ్ళుగార్చేటట్టున్నయని అనుకోవటంలో తప్పులేదోమో. లేనివి ఊహించుకొని గొప్పలు చెప్పుకుంటే మంచిది కాదు కాని నిజాలను నమ్ముకొని ఇంకా మరింత కృషి చేయ్యటానికి పూనుకోవటం మంచిదే కదా.మీరు చేసిన (పూర్తిగా సరికాని)వ్యాఖ్యలకే మన కార్యక్రమంలో పాలుపంచుకోలేని మన తోటి తెలుగు అభిమానులు ( మీ వ్యాఖ్యపై అభిప్రాయాలను బట్టి)ఇంత సంటోషించారంటే పూర్తి నిజాలను విన్నా, చూసినా ఎంతగా ఆనందిస్తారో.
ఈ వాగ్వాదాలు మనకి మంచిని చెయ్యవు. మన కార్యక్రమాలకు అడ్డూకట్టలు వేస్తాయి.మీరు ఒకరి కామెంటునే తొలగించారంటే అప్పుడే ఇది ఎక్కడకు వెళ్ళిందో అర్ధం అవుతుంది.మీరు మన స్టాలుకి వస్తానన్నారు. మంచిది. ఇక్కడతో దీనికి తెర దించుదాం. కలసి నడుద్దాం.

Unknown చెప్పారు...

పద్మనాభం గారు, రవి గారు ఈ పోస్ట్ కి మొదటగా నేను ఇచ్చిన కామెంట్ ఈ క్రింద ఉన్న ఒక్క స్మైలీ.

:)

అదీ ఎందుకు ఇచ్చాను అంటే ప్రదర్శన జరిగిన రోజు (శనివారం) నేను 10.20 సమయానికి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి కూడలి తెరిచి చూస్తే ఈ పోస్ట్ కన్పించింది. రవిగారు చాలా వేగంగా ఉన్నారే అని ఒక్క నవ్వు నవ్వాను స్మైలీతో. కానీ రవి గారి పోస్ట్ లోని నిరుత్సాహకరమైన భావాలను పట్టించుకోలేదు. ఈ స్టాల్ విషయమై మొదటి నుండి చాలా ఎక్కువ గమనించే అవకాశం, తీరుబడి నాకు లభించాయి ఈసారి. ప్రతీ చిన్న విషయం వివరంగా గమనించిన వ్యక్తిగా రవిగారి అభిప్రాయం నాకు రుచించలేదు మరుసటి రోజు తీరికగా చదివేటప్పుడు. అప్పుడు నా స్మైలీ రవిగారిని సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అన్న సందేహం వచ్చి కావాలనే దాన్ని తొలగించాను. ఆయన ఉన్న కొద్దిపాటి పరిశీలనలో ఆయన అభిప్రాయాలు ఆయనవి, నా పరిశీలనలో నేను ప్రదర్శనకు సంబంధించి మనసులో నిక్షిప్తం చేసుకున్న అనుభవాలను అక్షరబద్ధం చేద్దామని వాటిని ఏరోజుకారోజు ఎటూ రాస్తూ వస్తున్నాను. సో ఇబ్బందే లేదు. కామెంట్ మాత్రం నేనే స్వయంగా తొలగించుకున్నాను.

Unknown చెప్పారు...

పద్మనాభం గారు ముందుగ నా వ్యాఖ్యల వల్ల ఎవరిదైనా మనసు చివుక్కు మని ఉంటే మన్నించండి.నేను కేవలం అక్కడ ఉన్న రెండు గంటల్లో నేను గమనించింది రాసానే గాని అది యెంత మాత్రం ప్రామాణికం కాదు.ఆ రోజు ఇంటికి రాగానే చాల మంది బ్లాగేర్స్ ఉత్సాహం గా పాలు పంచుకున్నరనే విషయాన్నీ వేగిరం తెలియ బరుద్దామన్న ఆత్రం లో రాసిందే గాని స్టాల్ కి స్పందన ఆశించిన స్తాయిలో లేదన్నడానికి ఏ మాత్రం ప్రాదాన్యం లేదు ఎందుకంటె అది కేవలం రెండు గంటల్లో గమనించిన స్పందన మాత్రమే. అసలు విషయమైన బ్లాగేర్స్ ఉత్సహంగా పాల్గొనడం మరుగున పడి స్పందన కి ప్రాముఖ్యం ఎక్కువైంది.కామెడీ అఫ్ ఎర్రొర్స్ అంటే ఇదే నేమో. అలాగే నేను ఏ బ్లాగేర్ వ్యాఖ్యలు తొలగించలేదు అయనప్పటికీ మీరు ఇది బ్లాగేర్స్ వ్యాఖ్యలు తొలగించే వరకు వెళ్లిందని అనుకున్నారు. దాని కింద శ్రీధర్ గారి వివరణ గమనించండి ఆయనే తొలగించు కున్నారని రాసారు.ఏమైనప్పటికి ఇది మృష్టాన్న భోజనం లో రాయి ల భావిస్తూ ఎ వివాదానికి తేరా దించు తున్నా. తప్పకుండ రేపు వచ్చి నా వంతూ కృషి చేస్తానై హామీ ఇస్తూ......