26 మార్చి, 2009

ఈనాడు మీద కుట్ర ?


నిన్నటి నుంచి పేపర్ వాడు ఈనాడు బదులు గా సాక్షి వేసి పోతున్నాడు. చిన్నప్పటి నుంచి ఈనాడు చదవడం అలవాటై పోయి పొద్దున్నే ఆ ప్రింట్ తప్ప వేరే పేపర్ అస్సలు చదవ బుద్ది కానంత గా addict అయి పోయాను . అందు కే పొద్దున్నే పనులన్నీ ఆపుకుని పేపర్ బాయ్ ని పట్టుకుని సాక్షి ఎవడు వెయ్యమన్నాడు అని తిట్టే లోపు వాడు చెప్పిన సమాచారం నాకి ఆశ్చర్యాన్ని కలగ చేసింది. అది ఏంటంటే ఈనాడు agents కి కమీషన్ పెంచక పోవడం తో agents అంతా మూకుమ్మడి గా ఈనాడు పంపిణి ఆపేసి పాఠకులకి పేపర్ చేరకుండా చూడడమే కాకుండా దాని బదులు గా సాక్షి పేపర్ వేసి పోతున్నారు.ఆంధ్ర జ్యోతి వేయొచ్చు కదా అని అడిగితె లేదు సారూ సాక్షే వెయ్యాలని మా యజమాని చెప్పారని అన్నాడు.నిన్న టికి సాక్షి వచ్చి ఒక సంవత్సరం అవడం అదే రోజు ఈనాడు పంపిణి agents ఆపెయ్యడం యద్రుచ్చికమా?ఎలెక్షన్ జరిగే ముఖ్యమైన సమయం లో పాఠకులకి పేపర్ అందచేయ్య కుండా అడ్డుకోవడం , బలవంతం గా సాక్షి పంపిణి చేసి కాంగ్రెస్ పార్టీ కి లబ్ది కూర్చడం అనే ఒకే దెబ్బకి రెండు పిట్టల లా వేసిన ఈ ప్రణాళిక వెనక ఎవరి హస్తం వుందో కనుక్కోవడం పెద్ద కష్టమా?నాలాంటి వీరాభిమానులు walking కి వెళ్లి నప్పుడు ఈనాడు కొనుక్కుని మరి చదువుతారు. కానీ అందరు అంతలా ఇంసిస్ట్ చెయ్యరు కదా , కొన్ని రోజులు ఈనాడు ఆపగలిగిన లాభమే అన్నా ఆలోచన లా వుంది.ఇన్నాళ్ళు రాని ఈ కమీషన్ సమస్య హ తా ట్టు గా పేపర్ సేల్స్ ఎక్కువగా వుండే ఈ ఎన్నికల సమయం లోనే ఎందుకు వచ్చింది? చూస్తుంటే ఇదేదో ఈనాడు మీద కుట్రలాగే అని పిస్తోంది?అసలే మార్గదర్శి వ్యవహారం లో తలకి బొప్పి కట్టి ఏదో విధం గా జీవితాన్ని నేట్టుకోస్తుంటే మళ్ళి ఈ agents గోల create చేసి గుక్క తిప్పుకోనికుండా డొక్కలు విరగ గోడ దామనే కుయుక్తులే కనబడుతున్నాయి.

2 కామెంట్‌లు:

vasu చెప్పారు...

పేపర్ కమీషన్ పెంచి పేపర్ వేయు వాళ్ళను బాగు పరిచండి. అప్పుడు వాళ్ళె వేస్తారు.

Anil Dasari చెప్పారు...

ఎక్కువ కమీషన్ల కోసం సమ్మె చెయ్యటం వరకూ బాగానే ఉంది. అప్పుడు ఈనాడు వెయ్యటం మానేయాలి. వేరే పేపర్ వెయ్యటం ఏమిటి? అంటే ఏజెంట్లు కమీషన్ కోసం ఏ రోజు ఏ పేపరేస్తే ఆ రోజుకదే చదువుకోవాలా? ఏడిచినట్లుంది. ఇక్కడ సమస్య ఈనాడా, జ్యోతా, సాక్షా అన్నది కాదు. కొనుగోలుదారుడికి విలువలేకపోవటం అసలు సమస్య.