27 నవం, 2009

ఆర్య 2 అంతంత మాత్రమే


నిన్న ఆర్య 2 ప్రిమియర్ షో కి వెళ్ళడం జరిగింది . నా కైతే సినిమా నిరాశ పరిచింది .ఆర్య లో ఉన్నంత గ్రిప్ యి సినిమాలో లేదు . కధ టూకీగా ఇద్దరు అనాధలు స్నేహితులు . వాళ్ళలో వొకన్ని గొప్పింటి వాడు దత్తత తీసుకుందామని వస్తే ఆర్య త్యాగం చేసి స్నేహితుడికి ఆ అవకాశం ఇప్పిస్తాడు .ఆ అవకాశం పొందిన అజయ్ , అర్యని ఎప్పుడు శత్రువు లాగే భావిస్తాడు .పెద్ద అయ్యాక అజయ్ కంపని లోనే జాయిన్ అయ్యి ఇద్దరు వొకే అమ్మాయిని ప్రేమించడం , వోకల్ల మీద వోకల్లు కుయుక్తులు పన్నుకుని ఆమె ప్రేమని పొందడానికి ప్రయత్నించడం ., వొక సందర్భం లో ఆర్య రాయల సీమ factionist అయిన హీరోయిన్ తండ్రి దగ్గరకి వెళ్లి , ప్రత్యేకమైన పరిస్తితుల్లో ఆమెని పెళ్లి చేసుకుని కుడా స్నేహితుడి కి ఆమెని అప్పగించి సాక్రిఫైస్ చెయ్యడానికి సిద్ద పడి , మళ్ళి కుయుక్తి పన్ని అజయ్ మీద ద్వేష భావం ఏర్పరచి హీరోయిన్ ని తన దాన్ని గా చేసుకోవడం .
ఏంటో డైరెక్టర్ తికమక కి గురి అయ్యి ప్రేక్షకుల్ని కూడా దానికి గురి చేసాడేమో అని పించింది . కాసేపు హీరో ని సైకో గా చూపిస్తూ మళ్ళి కాసేపు మంచి వాడి గా చూపిస్తూ , climax లో కూడా తనని చంపడానికి అజయ్ ప్రయత్నించినట్టు హీరోయిన్ అనుకునేలా చెయ్యడం హీరో పాత్రని ఎలివేట్ చెయ్యదు .డాన్సులు చాల కష్ట పడి చేసాడు అల్లు అర్జున్ .రింగా రింగా పాట కాంట్రవర్సీ ని చేరపడనికేమో సినిమాలోలిరిక్ కొంత మార్చారు .గుత్తి తీసేసి కంచే అని పెట్టారు . బ్రహ్మానందం ని యి మద్య ఊరికే పెట్టుకుంటున్నారు గాని హాస్యం పండించడానికి మంచి పాత్రని ఇవ్వటం లేదు . యి సినిమాలో కూడా అంతె .నవదీప్ , అర్జున్ ఇద్దరు విలన్ లాగే బిహావ్ చేస్తారు . ఇంక బొమ్మ గుడ్డ కప్పిన కార్ నడపడం అది హీరోయిన్ ని ఏదన్నా అన్నవాడి వెంట పడడం అస్సలు పండలేదు . వోకో సారి విసుగ్గా అని పిస్తుంది ఇంకా అవదేంటి అని .ఓవర్ అల్ గా ఆర్య 2 అంతంత మాత్రమే .యూత్ దయ తలిస్తే గట్టేక్కొచ్చు .

12 కామెంట్‌లు:

Kathi Mahesh Kumar చెప్పారు...

నాకూ అంతే నాకూ అంతే

అజ్ఞాత చెప్పారు...

shradda das kadaa movie lo undi... shradda aarya picture post chesaaru meeru.

సుజాత వేల్పూరి చెప్పారు...

థాంక్సండీ, మూడి టిక్కెట్ల డబ్బులు కాపాడారు.

అనిర్విన్ చెప్పారు...

అయ్యో!! ఇదేదో బాగుంటుందనుకుంటే... థాంక్సండీ నాకు 4 టిక్కెట్ల డబ్బులు కాపాడారు.

Unknown చెప్పారు...

మహేష్ గారు మీరు అక్కడ కని పించారని రాయాలనుకుని మర్చి పోయా . మీ కత్తి లాంటి రివ్యూ కోసం నవతరంగం ఎదురు చూస్తోంది .
అజ్ఞాత నిజమే శ్రద్ధ దాస్ మీద సరిగా శ్రద్ధ పెట్టక పోవడం తో ఆ తప్పు జరిగింది .సుజాత గారు మీరెలాగు అడ్వాన్సు బుకింగ్ చేసుకుని ఎవరో చుట్టాలు వచ్చారని ఆఖరి నిమిషం లో మీ పక్కింటి వాళ్ళకి ఇచ్చేస్తారు గా . అయిన అనిర్విస్ మీరిద్దరూ ఇలా డబ్బులు మిగిలాయి అంటూ ప్రచారం చేస్తే రేపు నాకు ఎవరు ప్రీ వ్యూ కి రమ్మని ఆహ్వానం పంపరేమో వా వా వా (అంటే ఏడుపు గా భావించ గలరుఅంతే గాని ఖవాలి వా వా కాదు )

కత పవన్ చెప్పారు...

రవి గారు సినిమా చాలా డిఫరంట్ గా ఉంది కదండి..
అల్లుఅర్జున్ బాగా చేసాడు కుడా..
ఏందువల్ల మీకు నచ్చలేదు :))

sreenika చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sreenika చెప్పారు...

నాకూ నాలుగు టిక్కట్ల డబ్బుని మిగిల్చారు.

అజ్ఞాత చెప్పారు...

instead of sukumar , ravikumar must have directed it.

hit ayyaedi...

మరువం ఉష చెప్పారు...

హమ్మయ్యా, ఒక ఇబ్బంది తప్పించారు.

పరిమళం చెప్పారు...

నాక్కూడా అంతే.....

Madarapu చెప్పారు...

నేను ఈ మధ్యనే ఈ సినిమా చూసాను... ఆర్య అంత కాకపోయినా... చాలా బాగానే తీసారు. పాటలు, హాస్యం కూడా ఉన్నాయి కదా.. ఆ సైకో పాత్ర ఛాయలున్నాయి కానీ..బానే ఉంది.
మీకెందుకు నచ్చలేదో...?