25 నవం, 2009

ఎవరి కోసం ఎవరు ?


యి రోజు ఆఫీసు లో స్టాఫ్ చాల లేట్ గా పదకొండు దాటాక వచ్చారు నిన్న election డ్యూటీ కి వెళ్ళిన వాళ్ళంతా .అందులో ఎక్కువ మంది ఆడవాళ్లే .కారణం తెలుసున్నా గాని అధికార రీత్యా ఎందుకు ఆలస్యం అయ్యింది అని అడిగా (muster మాత్రం ఇంకా క్లోజ్ చెయ్యలేదు ) ఎప్పుడు సౌమ్యం గా హుందాగా వుండే ఆ అమ్మాయి లో ఆవేశం కట్టలు తెంచుకుంది .సర్ ఎన్నికల డ్యూటీ ని మాత్రం ఇక నుంచి ఆడవాళ్ళకి వెయ్యకండి (నిజానికి నా ప్రమేయం లేకుండా కింద వాళ్ళే పంపేసారు ,ఎన్నికల సంఘం నుంచి అవే పేర్లు డ్యూటీ వేస్తూ వచ్చేసాయి ) నిన్న పొద్దున్న అయిదు గంటలకి వెళ్ళిన వాళ్ళం evm లు స్టేడియం లో అంద జేసి ఇంటికి జేరే సరికి అర్దరాత్రి దాటి పోయింది .పొద్దున్న మా వారు ప్యాక్ చేసి ఇచ్చిన సాండ్ విట్చ్ తోనే రోజంతా గడప వలసి వచ్చింది .టోలి చౌకి పోలింగ్ కేంద్రం లో నే వొక్క దాన్నే ఆడ ఆమెని .తినడానికి తిండి లేదు , తాగడానికి నీళ్ళు లేవు , బాత్రూం కి వెళదామంటే ఆ సౌకర్యం కూడా లేదు .పోనీ డబ్బులు ఇచ్చి బయట కొనుక్కున్దామంటే అన్ని బంద్ .విధులు నిర్వహించే మేము కాసేపు ఆపేసి వొకరి తర్వాత వోకరన్న పోయి అరటి పళ్ళు కొనుక్కుని వద్దామనుకున్నా బురఖాలు వేసుకుని ఆడవాళ్ళ పెద్ద que లు అక్కడ agents మా ఆడవాళ్ళ వేలు మగ వాళ్ళు పట్టుకోకూడదు మీరే చుక్క పెట్టాలని కదల నివ్వ లేదని చెప్పింది .సెల్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టించారు మేము ఎలా ఉన్నామో అని మా కుటుంబ సబ్యుల ఆదుర్దా రాత్రి వరకు అంటూ కళ్ళలో నీళ్ళు పెట్టుకుని చెప్పింది .
కనీస వసతులు కూడా కల్పించ లేదు రాష్ట్ర ప్రబుత్వం .అర్దరాత్రి స్టేడియం నుంచి ఆడవాళ్ళూ తమ ఇళ్ళకి ఏ ట్రాన్స్పోర్ట్ provide చెయ్యక పొతే ఎలా వెళతారు? రెండు బ్రెడ్ ముక్కలతో ఉదయం నుంచి అర్దరాత్రి దాక బాత్ రూం కి కూడా పోకుండా , కుటుంబ సబ్యుల తో కుడా కాంటాక్ట్ లో లేకుండా , ఇంటికి తిరిగి రావడానికి ట్రాన్స్పోర్ట్ లేకుండా ప్రజా ప్రతినిధుల్ని ఎన్నుకునే కార్య క్రమం లో భాగస్వాములు అయిపోవాలి .
ఎన్నికల agent గా వున్న వాళ్ళకి పార్టీ లు వోక్కోకరికి అయిదు నుంచి పది వేలు ఇచ్చారట . వాళ్ళు వంతుల వారి గా డ్యూటీ లు చేసి చక్కగా తిని వచ్చేవారు .వోకో అభ్యర్ది 50 లక్షలకి తక్కువ ఖర్చు పెట్టలేదు .ఇంత ఖర్చు పెట్టి రేపు చేతులు ముడుచుకు కుర్చోడు కదా.అంటే రేపటి ఆయన సుఖం కోసం , కొన్ని వందల మంది ఉద్యోగులు యి రోజు కష్ట పడాలి . రేపు అదే ప్రజా ప్రతినిధి మీటింగ్స్ లో అధికార్లని బండ బూతులు తిడుతున్నా భరించాలి .ఇక్కడంతా ఎవరి కోసం ఎవరు పని చేస్తున్నారో అర్ధం కాదు .
మిగత స్టాఫ్ కూడా అదే టైం కి వచ్చి వాళ్ళు పడ్డ బాధలు చెప్పుకున్నారు .ఇంతకీ మా ఆఫీసు లో అలా బాధ పడ్డ ఆమె వొక సిట్టింగ్ సీనియర్ ఏం ఎల్ ఏ కోడలు .ఆమె దుఖం ఆపుకోలేక సర్ నెక్స్ట్ టైం మీరు మమ్మల్ని యి డ్యూటీ నుంచి తప్పించక పొతే మా మావగారు కేంద్ర మంత్రి నుంచి సిఫారసు చేయిస్తా నన్నారు అనేసింది .నిజమే సరైన సదుపాయాలు వున్నాయని నిర్దారించు కున్నాకే యి సారి మా స్టాఫ్ ని రిలీవ్ చెయ్యాలని నిర్ణ ఇంచుకున్నా .

6 వ్యాఖ్యలు:

భావన చెప్పారు...

నిజమే కదా.. నేను లెక్చరర్ గా చేస్తున్నప్పుడు ఎక్కడో కైకలూరు దగ్గర వేసేరు పల్లెటూరి లో.. అక్కడ కు పర్వాలేదు కాని వెళ్ళటం వెనక్కి రావటం, అవి అన్ని వాళ్ళకు హాండ్ ఓవర్ చేయటమ్ కోసమ్ అర్ధ రాత్రి వరకు ఆ హడావుడిలో, ఎలా వెనక్కి వెళ్ళాలా ఆ హేండ్ ఓవర్ చేసిన ప్లేస్ నుంచి అదొక టెన్షన్.. అదేమంటే తోటి లెక్చరర్స్ హేళన గా మొహం పెట్టి అన్నిటి లో సమానమంటారు గా మీ ఆడ వాళ్ళు ఇలా ఏదైనా కష్టం వస్తే బలే కన్వీనియంట్ గా గుర్తు చేసుకుంటారు ఆడ వాళ్ళం అని అని వెటకారపు మాటలు.

జయ చెప్పారు...

రవి గారు, ఎలెక్షన్స్ ఏమో కాని, పోలింగ్ ఆఫీసర్స్ పడే బాధను కూడా ప్రభుత్వం ఒకసారి గమనిస్తే బాగుండు. ఇప్పుడు నాకు ఈ డ్యూటీ లేదు కాని, నేను కూడా ఒక సారి చేశాను. ఆ బాధ అనుభవిస్తేనే అర్ధమవుతుంది. ఖర్చే తప్ప ప్రజలకు ఒరిగేది ఏమిలేదు.

పరిమళం చెప్పారు...

చాలా బాధాకరమైన విషయం !పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే ....మీకు వీలయితే మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది .

పవన్ చెప్పారు...

అవును ఏవరు పని చేసే వారి గురించి అలోచించరు.ప్రభుత్వం మరియు ప్రజలు కుడా

రవిగారు చెప్పారు...

వారి బాధ అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు .
నిన్న రాని స్టాఫ్ కుడా అవే సమస్యలు ఎకరవ్ పెట్టారు .
ఇంకా వోటర్ లిస్టు లో పేరు లం కొడకు తల్లి పేరు ఇంకో పరమ బూతు
అసదుద్దీన్ ఒవైసీ గారు కర్ర పట్టుకుని మోటర్ సైకిల్ మీద మిగత పార్టీ ల వాళ్ళని
తరుము తుంటే పోలీసు లు సెల్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని సినిమా చూసి నట్టు చూసారు పాత బస్తి లో .
ప్రజాసామ్యం వొక మొకరి.

మరువం ఉష చెప్పారు...

మునుపెప్పుడో తెలిసిన ఒకరు [టీచర్] స్పాట్ వాలూషన్ కి వెళ్ళినపుడు, మరొకరు ఎన్నికల డ్యూటీకి వెళ్ళినప్పటి సంగతులు చెప్తే గుర్తుగా వ్రాసుకున్నాను. అప్పట్లో కథలు వ్రాయాలని ఆసక్తి. పనిమంతులు, పనిదొంగలు ఇద్దరికీ పనేనేమో.. ఏదో ఒకరకంగా..