13 డిసెం, 2009

ఎదురు చూపు


ఉరుకుల పరుగుల సాగి పోయే నా జీవితం లోకి
ఎవరో రావాలి యి హృదయం కరిగించాలి
యి తీగను సవరించాలి అని పాడుకుంటూ గడిపేస్తుంటే
గ్రీష్మం లో చినుకులా , వసంత కోయిల లా వచ్చావు
నీ సంక్షిప్త సందేశాలతో మబ్బు పట్టిన మనసుకి
కొత్త కాంతి ని నింపావు .
నా సెల్ ఎప్పుడు కుయ్యి అన్నా నీ సందేశమే అనుకున్నా
స్పందించి నా సంతోషాన్ని పంచుకునే లోపే
భాద్యతలు వేళ్ళని ఫైల్ మీదకే గాని
సెల్ మీదకి పోనియ్యలేదు ,నా స్పందన నీకు తెలియనివ్వ లేదు
నేను నీ భావాలకి బానిసని ,అని చెప్పుకోలేక పోయిన ప్రేమ పిపాసిని
నా నుంచి స్పందన కరవై నీవు మూగ పోయావు , మెల్లిగా పక్కకి వెళ్లి పోయావు .
నా సెల్ కుయ్యి మన్న ప్రతిసారి నువ్వే అనుకున్నా, చూసే సమయాన్ని ఇవ్వలేక
నువ్వు వెళ్ళిన సంగతి తెలియకున్నా .నువ్వు వున్నావనే అనుకున్నా .
మొన్న నే అలసి పోయిన నా మనసుకు లేపనం నీ సందేశాలే కనుక చూస్తే
అందులో అన్ని వ్యాపార సందేశాలే కాని నాకు కావలసిన గ్రీష్మం లో చినుకు కనబడ లేదే?
తప్పు తెలుసుకుని వెంటనే నీకు సందేశం పంపితే,ఇక మోడు చిగురించదని
గూడు చేదిరిందని , సందేహాల మద్య సందేశాలకి తావు లేదని శరాఘాతం లా తగిలిన నీ సందేశం .
బతుకు సమరం లో బండి లాగే బాటసారి కి ప్రేమ వ్యక్తం చేసే సమయం ఏది?
తుమ్మెద పలకరించ లేదని పూవు మకరందం మానుతుందా ?
సూర్య కిరణం తాకలేదని కలువ పువ్వు వాడుతుందా?
సమయం ఇవ్వలేదని ప్రియ నేస్తం సందేశాలని ఆపుతుందా?
రేపటి నీ సంక్షిప్త సందేశం కోసం నా సెల్లు నా కళ్లు రెండు ఎదురు చూస్తూనే వుంటాయి .
కుయ్యి మని వింటే బాధని దూరం చేసేస్తాయి .
మళ్ళి జీవితం లోకి వసంతం వస్తుందని ,
సందేశాల పల్లకి నీ మోసుకుంటూ తెస్తుందని
ఏ సందేహం లేకుండా ఎదురు చూసే
నీ ప్రియ నేస్తం ఎదురు చూపు .

8 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

రవిగారు మీరు కిందటి జన్మలో మగధీరా?గుర్రం మీద ఎక్కితేను---)

శ్రీనివాస్ చెప్పారు...

కాగడా కూడా తుమ్మెద వెళ్ళిపోతే పువ్వెందుకు వాడి పోవ్వాలి అని రాసారు

మీరు కూడా తుమ్మెద పలకరించ లేదని పూవు మకరందం మానుతుందాఅని రాసారు

యాద్రుచ్చికమా? లేక ............

రవిగారు చెప్పారు...

అవును షేర్ఖాన్ , బ్లాగుల్లో ప్రియంవదని వెతుక్కుంటున్నాను . నువ్వు మాత్రం యి జన్మలో అలా అజ్ఞాతం గా మిగి లి పోయావ్?
బాబు శ్రీనివాస్ ఆరిపోయిన మంటని మళ్ళి ఆంధ్ర తెలంగాణా లెవెల్లో రాజేస్తూ కాగడా మీరేనా అనడం తగునా?తుమ్మెద వచ్చిన వెంటనే ఎవరి కైనా పువ్వు , మకరందం గోచరించడం సహజం .అది గాక బ్లాగులు చదివి చదివి భావాలూ మిక్స్ అవడం సహజమేమో . అయినా ఇక నుంచి నేను రాసాక కాగడా బ్లాగ్ కుడా చదివి సిమిలర్ గా వుంటేతీసేస్తాలే .యందు కొచ్చిన గొడవ

రవిగారు చెప్పారు...

అయినా ఇది ఎవర్ని ఉద్దేశించి రాసానో ఆమె అర్ధం చేసుకుని సందేశం పంపిస్తే రాసిన దానికి సార్ధకత వచ్చినట్టే .

శ్రీనివాస్ చెప్పారు...

రవి గారు కెలకడం మన జన్మ హక్కు ... అందుకే కెలకడం అయినది .... ఐన నేను ఉండగా మంట ఆరడమా నెవర్

రవిగారు చెప్పారు...

ఏంటో వెన్నెల కోసం రాస్తే వేడి సెగ తగిలే లా వుంది

జయ చెప్పారు...

ఏవిటో...అదృష్టం ఒక్కసారే తలుపుతడుతుందట...నిర్లక్ష్యం మంచిది కాదు...ఆడది అవమానాన్ని తట్టుకోలేదు. నిజం కదూ... Anyway, I wish you all the best.

పరిమళం చెప్పారు...

ప్చ్ ......:(