5 నవం, 2009

విలేజ్ లో వినాయకుడు లో నేను


ఇంతకూ ముందు నా పోస్ట్స్ లో షూటింగ్ అనుభవాలు రాసాను .ఏదో సరదాగా వేసాను కాబట్టి డబ్బింగ్ చెప్పేసాక ఆ విషయం మర్చి పోయా కుడా .నిన్న సడన్ గా యూనిట్ వాళ్ళు ఫోన్ చేసి అమీర్ పేట బిగ్ సినిమా లో ప్రివ్యూ వుంది రమ్మంటే వెళ్ళా .మొత్తం కుటుంబ సమేతంగా .(మా పిల్లలు కూడా వేసారు కాబట్టి) .సినిమా చూసాక సంతోషం వేసింది నెల్లాళ్ళు రాజోలు లో మండు టెన్డల లో కష్ట పడి నందుకు సత్ఫలితమే వచ్చింది .నేను నటించన మూడు సన్నివేశాలు కూడా ప్రేక్షకులు బానే రిసివు చేసుకున్నారు .అంతకు ముందు జోష్ సినిమాలో ప్రకాష్ రాజ్ పక్కన సూట్ వేసుకుని కూర్చున్నా , మొదటి సారి డైలాగులు చెప్పింది యి సినిమాలోనే .మా అబ్బాయి చేసిన సన్నీ వేశాలకి కూడా నవ్వులు రువ్వాయి .రేపు శనివారం ఫస్ట్ షో కి అందులో నటించిన నటీ నటులతో దేవి దియేటర్ లో ప్రేక్షకుల మద్య లో కుర్చుని చూడాలని ప్లాన్ చేసాము . ఇంతకీ నా పాత్ర ఏమై వుంటుంది అబ్బా ?ఆశ , దోస , అప్పడం , వడ అంత ఈజీ గా చెప్పేస్తే ఇంట్రెస్ట్ ఏమి వుంటుంది ?చూసి మీరే కని పెట్టండి .యి సినిమాని తప్పకుండా కుటుంబ సమేతం గా వెళ్లి చిరు నవ్వు తో చూడొచ్చని హామీ ఇస్తున్నా .

11 కామెంట్‌లు:

Malakpet Rowdy చెప్పారు...

Mail me the video clippings please

సుజాత వేల్పూరి చెప్పారు...

ఓ అవునా! అయితే చూసి కనిపెట్టేస్తాము లెండి! వీకెండ్ కి టికెట్స్ బుక్ చేస్తాం!

మీకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువే కాబట్టి నవ్వులకు గ్యారంటీ ఉందన్నమాటే!మీ హామీ ని నమ్ముతున్నాం

పరిమళం చెప్పారు...

congrats!

మాలా కుమార్ చెప్పారు...

అభినందనలు

Unknown చెప్పారు...

మలక్ అది మీ దేశం లో కూడా రిలీజ్ అయ్యిందని విన్నా .సుజాత గారు మీరు కనిపెడితే అందులో గొప్ప లేదు మీరు ఆల్రెడీ చూసేసారు కాబట్టి .ఇక సెన్స్ అఫ్ హుమౌర్ మీ తర్వాతే ఎవరన్నా .పరిమళం గారు యి సినిమా మీ వూర్లో కూడా విడుదల అయ్యేవుంటుంది గా?మాలా కుమార్ గారు మీ ఇంటికి దగ్గర్లోనే వుంది యి సినిమా హైదరాబాద్ లో . సో మీరంతా ఆ సినిమా చూసాక కుండ బద్దలు కొట్టినట్టు నిర్మొహమాటం గా మీ అభి ప్రాయం తెలుప గలరు .

నిషిగంధ చెప్పారు...

అభినందనలు :-)

Padmarpita చెప్పారు...

రవిగారు మిమ్మల్ని గుర్తుపట్టేసానుగా...
బాగుంది మీనటన....అభినందనలండి!!

Unknown చెప్పారు...

పద్మార్పిత గారు మీరు సినిమా చూసినందుకు ,నన్ను గుర్తు పట్టినందుకు , ఎవరికి చెప్పనందుకు ,నన్ను అభినందిన్చినందుకు ధన్యవాదాలు

uma blog చెప్పారు...

intakee em cinemaa adi. cheppandi chusestaanu.

Unknown చెప్పారు...

ఉమ గారు రామాయణం అంతా విని వింటే భారతమే వినాలి అనట్టు గా వుంది .మీరెంత కన్నడ దేశం లో వుంటే మాత్రం?మీ బెంగుళూరు లో కూడా రిలీజ్ యిన '' విల్లెజ్ లో వినాయకుడు'' ఆ సినిమా . చూసాక ఇంతకీ మీరు ఆ సినిమాలో ఉన్నారా అని మాత్రం అడగ కండి ,

మరువం ఉష చెప్పారు...

సరేనండి. చూసాకా చెప్తాను. మరోసారి అభినందనలు.