22 నవం, 2009

పొరుగింటి పుల్లకూర


నిన్ననే 2012 సినిమా చూసా. మూడు రోజుల్లోనే వెయ్యి కోట్లు పైగా వసూల్ చేసిందంటే ఆశ్చర్యం వేసింది .భూకంపం వస్తుంటే కార్ దుసుకుంటూ పోతూ వుంటుంది .ఆ కార్ వున్న ప్రాంతం తప్ప మిగత చోట్ల భూమి చీలి పోతూ వుంటుంది .రోడ్ రెండు గా చీలి పోయి అఘాధం లా వస్తే హీరో కార్ ని జుంప్ చేసి అవతల పక్కకి తీసుకు పోతాడు .ఇంక చిన్న విమానం లో పారి పోయే సన్నీ వేసాల్లో లాజిక్ అన్న పదం ఉండనే వుండదు . ఇలాంటి హెలికాఫ్టర్ లో రైల్ ని చేజ్ చేస్తోనో , విలన్ గ్యాంగ్ హీరో ని చేజ్ చేస్తోనో , బాలకృష్ణ , చిరంజీవి ల సినిమాల్లో వస్తే తెలుగు ప్రేక్షకులు వెర్రి వెదవల్ల కన బడుతున్నారు ,చెవిలో పువ్వులు పెట్టుకుని చూడాలి ఇలాంటి తెలుగు సినిమాలు అనుకుంటూ reject చేస్తాం .
అదే విదేశీయులు కోట్లు కుమ్మరించి ఇదే సన్నివేశాన్ని తెరకెక్కిస్తే నోరు వెల్ల బెట్టి చూస్తాం .వొక పక్క తమ్మారెడ్డి భరద్వాజ లాంటి దర్శకులు తెలుగు లో దమ్మున్న మగాళ్ళు లేరు అని statements ఇచేస్తారు .దశావతారం లో కమల్ థీమ్ కి దీనికి తేడ నాకు పెద్దగా కని పించలేదు .ఎటొచ్చి యీ సినిమా విడుదల కి ముందు గానే నిజంగా యుగాంతం జరగ బోతోందా అంటు టీవీ లలో చర్చలు ,sms లు అంటు పిచ్చ హైప్ ఇచ్చివీలై నన్ని ప్రింట్స్ తో రిలీజ్ చేసుకుని డబ్బంతా మొదటి వారం లోనే రాబట్టు కోవడం యీ మద్య మొదలైన కొత్తట్రిక్ .యీ మద్య మీరు గమనిస్తే విడుదల కి ముందే ఏదో వొక కాంట్రవర్సి రగులుస్తూ , ఆ సినిమాకి విపరీతమైన ప్రచారం కల్పిస్తూ ,మాగ్జిమం ప్రింట్స్ తో విడుదల చేస్తే చాలు మొదటి వారం లో నే పైసా వసూల్. దియేటర్ లోకి జనాల్ని రప్పించడానికి ఇదో కొత్త పద్దతి .సినిమా బావుంటే ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది లేదంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి మొదటి వారం లో నే వచేస్తాయి .మగధీర నుంచి రేపు రాబోయే ఆర్య 2 దాక ఇలా వివాదాల లోకి లాగడమే .
ఇంకో జోక్ ఏంటంటే ఇన్ని కోట్లు పబ్లిసిటీ కి ఖర్చు పెట్టి 2012 ని విడుదల చేస్తే అదే సమయానికి హైదరాబాద్ లో 2010 అని ఇంకో సినిమా విడుదల చేస్తే చాల మంది confuse అయ్యి దానికి వెళ్లి బకరా అయిన వాళ్ళు వున్నారు . అసలు యీ సినిమాకి వెళ్ళడమే పెద్ద బకరా .యీ సినిమా చూడడమే పెద్ద స్టేటస్ సింబల్ గా తయారయ్యింది పిల్లలలో , దాంతో పెద్దలు కూడా తయారు .వొక్క ముక్కలో చెప్పాలంటే ఇది పొరుగింటి పుల్ల కూర . తెలుగు లో లాగే అక్కడక్కడ తండ్రి కూతురు సెంటిమెంట్ , విడిపోయిన ప్రియుడి సెంటిమెంట్ లాంటివి కూడా దట్టించారు .
అనట్టు ఇప్పుడే తెలిసిన వార్త నిజంగానే కలియుగం 2090 లో అంతం కాబోతోంది .అయితే ఇది రాసిన నాకు గాని చదివే మీకు గాని దాని వాళ్ళ జరిగే నష్టం సున్నా .ఎందుకో ప్రత్యేకం గా నేను చెప్పాలా?

8 వ్యాఖ్యలు:

సుజాత చెప్పారు...

1999లోనే ప్రళయం వచ్చేస్తుందని వేదవ్యాస రాసేసి నవ్వులపాలు కాలేదూ? అలాంటిదే ఇది కూడా! మనుషుల్ని భయభ్రాంతుల్ని చేయడం కూడా ఒక సరదా, వ్యాపకం, వృత్తి అయిపోయింది.

అయినా ఇవన్నీ మనం మాత్రం నమ్ముతామా, కాసేపు నవ్వుకుంటాం అంతేగా! ఈ సినిమా పిచ్చకామెడీ అని మలక్ పెట్ రౌడీ రాసేసినట్లున్నారుగా!

ప్రళయం వచ్చేటట్లైతే ఎప్పుడో ఒకప్పుడు రానూ వస్తుంది, చూడనూ చూస్తాం....మనం ఉంటే! అప్పుడెలాగూ టెన్షన్ తప్పదు. ఇప్పటినుంచే ప్రిపరేషన్ ఎందుకో ఈ సినిమాలు తీసేవాళ్లు.

Badri చెప్పారు...

ఆ మధ్య విజయేంద్రవర్మ తరువాత నేను చూసిన అద్భుతమైన కామెడి సినిమాలు బ్లూ, 2012. ఇంతగా నేను ఏ కామెడి సినిమాలకి థియెటర్ లో నవ్వలేదంటె నమ్మండి.

పరిమళం చెప్పారు...

రవిగారు , సరిగ్గా ఈ సినిమా చూసేటప్పుడు నాఫ్రెండ్ తో ఏమని వాదించానో మీరవే రాశారు .మీ పోస్ట్ చూపించాను కూడా ...
అన్నట్టు రవిగారూ ...ఆ తాజా వార్త నిజమేనాండీ .....ఆవిడెవరో 130 వ పుట్టినరోజు జరుపుకుందట ! నేను ఆ రికార్డు బ్రేక్ చేద్దామనుకున్నా...అదే నిజమైతే నా ఆశ అడియాశేనా ....వా ....:(

రవిగారు చెప్పారు...

సుజాత గారు మీ భయమే మా పెట్టుబడి అని రాంగోపాల్ వర్మ యెంత ఇంట ట్రై జేసినా నవ్వుల పాలే అయ్యాడు అదే ఏ జపాన్ లోనో డబ్ చేసి వదిలుంటే విజయం సాధించే వాడేమో జపాన్ వాళ్ళకి ఇది పొరుగింటి పుల్లకురే గా.నిందాకా నే చూసా మల్కాజ్గిరి లో యి సినిమాకి కొట్టుకుంటున్నారు . అది హౌసేఫుల్ అవడం తో పక్కనే వున్న బెండు అప్పారావు , village లో వినాయకుడు కూడా హౌస్ ఫుల్ అవడం ట్రాజడి లో కామెడి .
బద్రి యి సినిమాని కామెడి అంటే వప్పుకుంటా గాని బాలయ్య బాబు తన సినిమా కామెడి అంటే కంటి చూపు తో చంపేస్తా అంటాడేమో?
పరిమళం గారు మీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి చెప్పిందే రాసా.మీరేం బాధ పడకండి మీరు యుగాంతం చూస్తారు పాపి చిరాయువని-) .

మరువం ఉష చెప్పారు...

Same opinion expressed among the crowd here that I deal with more or less. Sujata said it very right.

అజ్ఞాత చెప్పారు...

సుజాతా, ప్రిపరేషన్ అని ఎందుకనుకుంటున్నారు!
జీవితం అంటే ఏమిటి? మనిషి ఇప్పుడు చేస్తున్నదేమిటి? నిజంగా జీవిస్తున్నాడా? మనిషి జీవితం సగం గత చింతనలతోనూ భవిష్యత్తు పట్ల ఆందోళనతోనూ ఆశతోనూ గడిచి పోతోంది.
జీవించే ప్రతి క్షణం నిన్న, రేపు.
వర్తమానం అంటూ లేని రోజులొచ్చాయి.
మనిషిగతం, గాయాలు, సక్సెస్లు, డబ్బు ఇదే జీవితమంటే అన్నట్టు తయారయ్యింది.
మనిషి సుఖజీవనం కోసం అడవి వదిలి నాగరీకుడయ్యాడు. ఏదీ సుఖం? నగరాన్ని అడవికంటే ప్రమాదభరితం చేసుకున్నాడు. ఈ పరుగుల జీవితంలో ఇక జీవితం ముగిసిపోతోంది అన్న మాట విన్న ప్రతి మనిశీ ఆలోచనలో పడదా?
స్వార్ధంకోసం భూమిని కలుషుతం చేస్తున్న, ఎదుటి వ్యక్తిని దోచి కూడబెట్టాలనుకున్న ప్రతి జీవి తామూ తమ సంతతి ఇక ఉండబోరు ఆ రోజొకటి ఉంది ఎందుకిది అనే వైరాగ్యంలో పడితే.
ఎప్పుడో చావు తప్పదని తెలిసినా తాము మాత్రం దానికి అతీతులలం అన్నట్టు స్విస్సు బ్యాంకుల్లో దాచుకునే వాళ్ళకి,
హాయిగా బ్రతికి బతుకు నివ్వకుండా తమ వారినీ సాధించి తామూ ఏడిచే వాళ్ళకీ,
అప్పుడప్పుడూ ఇలాంటి భయాలు ఉండాలి.

సుజాత చెప్పారు...

అజ్ఞాత,

మీరు చెప్పింది నాకేమీ బోధపళ్ళేదు. భయం అనేది ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఉండనే ఉంటుంది. జీవితం ఎప్పుడో ఒకప్పుడు అంతం అవుతుందని తెలుసు అందరికీ! దాన్ని అడ్డం పెట్టుకుని ఈ యుగాంతం లాంటి సినిమాలు తీసే వాళ్ళని ఏమనాలి? వేదవ్యాస ఎంత నవ్వులపాలయ్యాడో ఎవరికి తెలీదు. యుగాంతం అనేది ఒకేసారి జరగదు. సునామీలు, వరదలు ఇలా ఒక్కొక్కటిగా ప్రకృతి వైపరీత్యాల వల్ల జన క్షయం జరుగుతుందెమో కానీ! ఒకవేళ జరిగితే మాత్రం ఎవరాపగలరు? దానికి మనం సిద్ధంగా ఉన్నా లేకపోయినా అది ఆగదు కదా! ఇలా భయాలు సృష్టించేవారికీ ఈ సంగతి తెలుసు.

వ్యాపార దృష్టి తప్ప మరేం కాదు.

ఇకపోతే స్విస్ బాంకుల్లో డబ్బు దాచుకునే వారు వీటికి భయపడతారా చెప్పండి? "బతికినన్నాళ్ళూ అనుభవించే చద్దాం" అనే దృక్పథం! ఒకవేళ భయపడినా వారి భయాన్నీ ఎన్ కాష్ చేసుకోడానికి ఉన్నారుగా బాబాలూ, అమ్మలూ!

అన్నీ చూడ్డమే మన పని!

Nav చెప్పారు...

meeru cheppinadantlo nijam undi. Manchi openings kosam cinema vallu chala feats chestaru. Cinema baguntee chustaru anna vishayam telisinadee.. kaani bagunna cinema anthe yenti anedee savval.. meeku nachedi naaku nachadu naku nachedi meeku nachadu... So, yee producer ina cinema bagundali dabbulu ravalanee teestaru.. yavaruu cinema chettaga undali..flop avvali ani teeyaru... akkada major ga play chese factor yentantee jananiki nachutunda leda anedi... andukosamee producers safe game play cheyataniki try chestaru.. cinema talk bitiki rakamunde ravalsinantha rappinchataniki ilanti hypes ni chestaru...

Inka 2012 cinemaki vasthe... adi jarugutundi ani director yakkada cheppaledu... tanaku tochindi teesadu anthe... aa cinema ki story line chaala weak ga undi... adi nenu oppukuntanu.. kaani andulo unna graphics quality chaala bagundi... chinna pillaliki graphics tappa story peddaga avasaram ledu... nijam cheppalante graphics kosam chusevallaki aa cinema kannula pandaga... mana deggira leni antha high quality graphics unnappudu aa cinemani aadarinchatam lo tappuledu..
mana intlo pullakoora lenappudu...porugintlodi ina aanandinchatam lo tappemundandiii??