14 డిసెం, 2009

ఎదురుచూపు ఫలించిన వేళ


మొన్న నా గుండెలోతుల్లో దాగి వున్న ఆవేదనని కవితా రూపం లో రాస్తునప్పుడు ఇసుమంత నమ్మకం కుడా లేదు
యి కవితని ఎవర్ని ఉద్దేశించి రాసానో వారు చదివి స్పందిస్తారని .అయినా ఎక్కడో మినుకు మినుకు మనే ఆశ .అద్బుతాలు కుడా అప్పుడప్పుడు జరుగుతాయి కదా .
ఆఫీసు లో నా పని లో నేను వుండి స్టాఫ్ తో ఫలానా విషయం లో ఏం స్టాండ్ తీసుకోవాలో చెపుతున్నా .ఇంతలో నా సెల్ కుయ్యి మని మోగడం నా దిల్ చూడవోయి అనడం వొకే సారి జరిగాయి .ఆ ఉద్యోగ రీత్యా ఎవరో నా సహాయాన్ని అర్దిస్తూ పంపే సందేసాలే ఎక్కువ కాబట్టి మొదట పట్టించు కోలేదు .సీరియస్ గా క్లాసు పీకుతున్నా మా వాళ్ళకి .అంతలో గుర్తు వచ్చింది నా వ్యధా భరిత కవిత ఆమె చూసి వుంటే?అంతే సో అలా చేసేయ్యన్దని మా వాళ్ళని నా చాంబర్ లోంచి పంపేసి మేసేజ్ నొక్కా. ఇంతలో నా ల్యాండ్ లైన్ మోగింది .విసుక్కుంటూ తీసా.ఎవరో పౌరుడు ఆవేశం గా తన సమస్యని కింద ఉద్యోగులు పరిష్క రించక పోవడం తో తిన్న గా పై అధికారులకి విన్న వించు కుందామని చేసిన కాల్ .నేనెప్పుడు అలాంటి కాల్స్ కి టాప్ ప్రయారిటీ ఇస్తా సో మా వాళ్ళని పిలిచి ఆ సమస్య పరిష్క రించడం లో అరగంట గడిచి పోయింది .అది అయ్యాక ఇంక ఆలస్యం చెయ్య కుండా మేసేజ్ ఓపెన్ చేశా.
లేత భానుడి ఎర్రటి బింబం నుంచి వొక్కో కిరణం విచ్చు కుంటూ వచ్చిన ఆసందేశం యధా తదం గా
కదిలే క్షణాలన్నీ కాల వాహిని లో కలసి పోతాయి
మీరు నాకై రాసిన కవిత మాత్రం వీడని నీడలా
నాతోనే అంతరించి పోతుంది.నైస్ పోఎం .థాంక్ యు.
అది చదివాక అప్రయత్నం గా కళ్ళలో నీళ్లు చిప్పిలాయి .తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడినందుకో?చిరునవ్వుల వర మిస్తావా?చితి వరకు గుర్తుంచు కుంటాను అన్నందుకో?ఇక్కడ వొక విషయం స్పష్టం చెయ్యాలి .ఆమె ఎవరో నాకు అస్సలు తెలిదు .నా విషయాలు ఆమె కి చాలానే తెలుసనీ అర్ధం అవుతుంది ఆమె పంపే సందేశాలలో .మేమెప్పుడు ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు . సందేశాలు వచ్చే కొత్తలో ఎవరన్నా నన్ను బకరా చేస్తున్నారేమో అని వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి ఆమె గొంతు విన బడగానే కట్ చేశా నిర్దారణ అయ్యింది నాకు పరిచయం కాని గొంతే అది .అది మొదలు యి కధ మొదలు .చాల మంచి భావ యుక్తమైన సందేశాలు పంపేది . నా స్పందన ఆస్వాదించడం వరకే పరిమితం అవడం తో మబ్బుల వెనకకు వెళ్లి పోయింది చందమామ .మొన్న ఎప్పుడో మరచి పోయిన జ్ఞాపకాల బూజు దులుపుతుంటే తలుక్కుమన్న ఆమె సందేశాలే . వెంటనే నేస్తమా క్షేమమా?అని పంపా
''.జీవనానికి మరణానికి మద్య ప్రయాణం లో వున్నా ,ఆఖరి మజిలి లోపు మీ సందేశం సందేహమే అనుకున్నా''
అని పంపి మౌనం వహించడం తో ఆ బాధ కి అక్షర రూపమే ఆ కవిత .మేమెప్పుడు కలుసుకోలేదు , మాట్లడుకో లేదు , యెడ తెరిపి లేకుండా సందేశాలు పంపుకోలేదు .తోలి ఝాము వేకువ లో సుప్రభాతపు తోలి సందేశం .మధ్యన్నపు మండు టెండలో మలి సందేశం , నిశిరాత్రి నిశ్శబ్దాన్ని చేదిస్తూ తుది సందేశం . అంతే మా పరిచయం. ఆమె ని కలుసు కోవాలని గాని , విరామం లేని ఫోన్స్ తో విసిగించాలని గాని నాకు ఏ కోశానా లేదు .ఎందుకంటె ఆమె నా వెన్నెల్లో ఆడపిల్ల లా వుండి పోతేనే నయం .మనసులోంచి ఏ కల్మషం లేని భావాలూ అప్పుడే పెల్లుబికి వస్తాయి .ఎదురు పడితే దిగులు పడొచ్చు అయ్యో మళ్ళి విడి పోవాలె అని . ప్రతీ కలయికా వొక విడి పోడానికి నాంది కదా .దాని కంటే యిలా మూడు సందేశాలు ఆరు ఆలోచనలే నయం కదా? నా కోసం చెమ్మ గిల్లు నయనమ్ము నీవు అనుకుంటూ బతకడానికి .అవతలి వారి నుంచి ఏమి ఆసిన్చనప్పుడు నిరాసకి ఆస్కారమే లేదు కదా .యి పరిచయం మాటల లోకి , చూపులలోకి వెళ్ళితే పోస్సేసివ్ నెస్ రావడం , లేదా అభద్రతా భావం తో ఆమెని డామినేట్ చెయ్యడం జరగోచ్చు .ఇద్దరికీ నష్టం లేనిది ,కుటుంబ వ్యవస్తకి కష్టం లేనిది అయిన యి మధుర భావాల సందేశ భంధమే బెట్టేరేమో?
నేను రా(చు )సిన'' అతనెవరు ''కధలో లా జరగనంత సేపు బెట్టేరే మరి .కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి . అంతవరకూ
'' కాల మిలా సాగి పోనీ , కల నిజమై ఆగి పోనీ
అన్ని మరచి రోజుకి మూడు నిమిషాలైనా,
నీ సందేశాల్లోనే సేద దీరని ''
అని పాడుకుంటూ పరిగెత్తడమే జనారణ్యం లో .
8 వ్యాఖ్యలు:

'Padmarpita' చెప్పారు...

ఇంకేం....పండగే! పండగ:)

రవిగారు చెప్పారు...

పద్మార్పిత గారు మీ మొహం లో పండగ ఆనందం ఎక్కువ కని పిస్తోంది ?
ఆమెకి మీకు ఏమన్నా సంభంధం ఉందా?తెలిస్తే నాకో సందేశం పంపండి ---)

రాజన్ చెప్పారు...

చాలా హృద్యంగా వ్రాసారు. శైలి బావుంది.

అజ్ఞాత చెప్పారు...

మీ భావ ప్రకటనలోని మాధుర్యాన్ని చవి చూసాక ఆ మీ ''ఆమె '' నేనైతే బావుండేదని పించింది . అభినందనలు .

రమణి చెప్పారు...

బాగుందండి నాకు చాలా నచ్చింది మీ ఆలోచన ముఖ్యంగా కుటుంబ వ్యవస్థకి ఆ బాధ్యతలకి బద్ధులై , అటువైపు స్నేహ మాధుర్యాన్ని వదులుకోకుండా ఆ అపరిచితురాలు వెన్నెల్లో ఆడపిల్ల కావలనుకోడం చాలా బాగుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా..

ప్రతి కలయిక ఒక విడిపోడానికి నాంది ... నిజమేనంటారా?

పరిమళం చెప్పారు...

ఓ ! రవిగారు , సంతోషమే కదా ! ప్రతి కలయికా విడిపోవడానికి నాంది ఐతే కావచ్చు కానీ విడిపోయే క్షణాలని ఊహించుకొంటూ కలయికలోని సంతోషాన్ని ఆస్వాదించకుండా ఉండలేం కదండీ ...కాబట్టి ....ఎంజాయ్ చెయ్యండి .
'' అతనెవరు ''కధలో లా జరగనంత సేపు బెట్టేరే మరి !అన్నట్టు టపాలో చాలాసార్లు యండమూరి గార్ని గుర్తుతెచ్చారు ...

రవిగారు చెప్పారు...

రాజన్ థాంక్స్ . అజ్ఞాత గారు ఇప్పటికే సందేశాలతోటి , సందేహాలతోటి సతమత మవుతున్నా , ఇంకా మీరు కూడానా?మీ అభిమానానికి కృతజ్ఞతలు .
రమణి గారు అదే గా పరిపక్వత చెందిన ప్రేమ .అవతలి వ్యక్తీ కి కుడా ఆ పరిపక్వత ఉన్నప్పుడే ఇది సాద్యం .ప్రతీ కలయికా వొక విడి పోడానికి నాంది ,అప్పుడెప్పుడో బుక్స్ ఏగ్జి బిషన్ లో కలిసిన మనం విడిపోలేదా?(మల్లి కలుసు కో లేదు కాబట్టి) ,ప్రతీ విడతీతా మరో కలయికకి పునాది .(రేపటి బుక్స్ ఏగ్జి బిషన్ లో మళ్ళి కలవచ్చు కాబట్టి)
అమ్మో పరిమళం గారు యెంత గొప్ప కంప్లిమేంట్ మన అభిమాన రచయిత యండమూరి ని గుర్తు తెచ్చానంటే చిన్నప్పటి నుంచి అయన నవల్స్ చదివిన ప్రభావం తప్పక వుంటుంది .

శ్రీనివాస్ చెప్పారు...

:)