26 డిసెం, 2009

మనసులో మాట


నా మనసులో యి క్షణం కలిగిన భావాలకి ఆమె కోరిక మీద ఇస్తున్న అక్షర రూపం .
గత రెండు మూడు రోజులు గా ఏదో మిస్ అయిన భావన .ఎందుకో చిరాకు .విశ్లేసిస్తే రోజు ఎడిక్ట్ అయి చేస్తున్న బ్లాగ్ వీక్షణం తో సహా అన్ని చేస్తున్నా అయినా? అంతలో గుర్తు కొచ్చింది తన నుంచి సందేశాలు వచ్చి మూడు రోజులు అయి పోయిందని .అంటే వున్న ఎడిక్టంస్ చాలక యి సందేశానికి కుడా నే బానిస నయి పోయానని అర్ధం అయ్యింది .నా మనసులో మాట అర్ధం చేసుకునట్టు గా అదే టైం కి తన నుంచి వచ్చింది సందేశం .
హృదయాన్ని తాకాలంటే హృదయన్తరాలలోంచి మాట్లాడాలి
అంటే సందేశాలు మాని మాట్లడమన?అది వప్పందాన్ని వుల్లంగించడమే కదా ?
దానికి ప్రతి గా నేనుచూడాలని వుంది ,సందేశాలు తగ్గి పోవడం చేత అని పంపా .
బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం ఉండడమే గుడ్ కారక్టర్ అని వచ్చింది .
వుడికిద్దామని అందంగా ఉండని వాళ్ళంతా చెప్పే మొదటి మాట ఇదే అన్నా .
నేను చాల అందం గా వుంటాననే అన్నారు ఇంతవరకు చుసిన వాళ్ళు అటునుంచి సమాధానం .
అయితే వొకే వొక్క సారి చూసేసి అది నిజమో కాదో సెర్టిఫై చేసి మళ్ళి షెల్ల్ లోకి వెళ్లి పోతా అంటే
వెన్నెల్లో ఆడపిల్ల లాగే వుండి పోనీ మళ్ళి నువ్వు చూసి వెళ్లి పోయాక నాకేదో కొత్త రోగం(కాన్సెర్ ) వచ్చి నే పోవడం ఎందుకు అప్పుడే ?తన సమా దానం
పోనీ నీ పాత రోగాలు ఎవున్నాయో చెప్పు?
వొక సంవత్సరం క్రితం వచ్చిన'' సందేశాల తోలి స్నేహం '' అని నీతోనే మొదలయ్యి నాతోనే ముగిసి పోవాలనే వింత జబ్బు బుల్లెట్ లా దూసుకొచ్చిన తన జవాబు .
యిసంక్షిప్త సందేశాల కన్నా హృదయం లోంచి లావాలా పొంగుకొస్తున్నభావాల్ని తెలియ బరచా లంటే కలవడం ఇద్దరకి నిషిద్దం కాబట్టి కనీసం మెయిల్ ఐడి అన్నా ఇమ్మన్నా.
దానికి తను చెప్పిన పరిష్కారం నీ మనసులో భావాలకి అక్షర రూపం నీ డైరీ అయిన నీ బ్లాగ్ లో పెట్టొచ్చు గా అని .
అప్పుడని పించింది అసలు ప్రతీ వారు బ్లాగ్ ని తన మనసులో మాట రాసుకునే డైరీ లాగే మొదలెడతారు.మెల్లిగా కామెంట్స్ రావడం , ప్రశంసల , విమర్శల విష వలయం లో కూరుకు పోయి రాయాలనుకున్నది రాయలేక ముసుగు వేసుకుని అంత రాత్మని మబ్య పెడుతూ ,అసలు బ్లాగ్ ఎందుకు మొదలెట్టామో మరచి పోయి సమ కాలిన సమస్యల మీద ,మతాల మీద కులాల మీద , కాంట్రవర్సీ సబ్జక్ట్స్ మీద పోస్టింగ్స్ రాసుకుని ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసుకుని , ఏ ఏ దేశాల నుంచి యెంత మంది వచ్చి పోతున్నారో లెక్కలు వేసుకుని , ఎంటిదంతా?
కీర్తి శేషులు డ్రామా లో అనుకుంటా యి చప్పట్లకే తిండి తిప్పలు మానేసి అహర్నిశలు కృషి చేసి వొక నటుడు తన జీవితాన్ని నటనకు ధార పోసేది అంటాడు ముఖ్య పాత్ర ధారి . . అలాగా యి కామెంట్ల ప్రశంసల కోసమే ఎంతో మంది బ్లాగర్లు తిండి తిప్పలు మాని కంప్యూటర్ కి తమ జీవితాన్ని ధార పోసేది .నాకు తెలిసి వొకే వొక అమ్మాయి తన మనసులో భావాన్ని , ఆ రోజు తనకు తారస పడిన వ్యక్తుల అంతర్ ముఖాల్ని ఏ మాత్రం దాపరికం లేకుండా రాసేది . ఆమె బ్లాగ్ లో వొకసారి రాత్రి నేను నా ఫ్రెండ్ నడుచుకుని రోడ్ మీద వెళుతుంటే ఎవడో వెదవ లం కొడుకు వచ్చి నా ఫ్రెండ్ గుండెల మీద వత్తేసి పారి పోయాడు అని రాస్తే దానికి కామెంట్ గా నీది వత్తలేదని బాధ పడుతున్నావా అంటూ కామెంట్ రావడం తో అప్పటినుంచి ఆమె కామెంట్ డిస అబెల్ చేసేసి తన మానన తను రాసుకుంటూ బ్లాగ్ అంటే తన పర్సనల్ డైరీ అని నిరుపించిన్డి(యి మద్య రాస్తోందో లేదో తెలిదు)
ఇంతకీ తను నా మనసులో మాట రాయమంటే ఎప్పటి నుంచో నా మనసులో వుండి పోయిన మాటలు బయటకు వచ్చేస్తున్నాయి.ఇంక విషయానికొస్తే ఆమె ని అలా వెన్నెల్లో ఆడపిల్ల లా ఉంచేసి యి సందేశాలతో సంతోషం గా ఉండడమా?లేక వొకే వొక్క సారి చూసేసి ఆ పైన chimatamusic పాథోస్ లో నా కిష్టమైన యి కింది పాటని వింటూ కళ్ళలో నీళ్ళు పెల్లుబుకు తుండగా ఆస్వాదిస్తూ ఉండడమా?సంతోషమా?సంవేదనా?
రానిక నీకోసం సఖి రాదిక వసంత మాసం
రాలిన సుమాలు ఏరుకుని
జాలిగా గుండెలు దాచుకుని
ఏ దూరపు సీమను చేరుకొని
వాకిటి లో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు
ప్రతి గాలి సడికి తడ బడకు పద ద్వనులని పొర బడకు
కోయిల పోయెలే గూడు గుబులై పోయెలే
పగలంతా నా మదిలో మమతలు సెగలై లోలో రగులునులే
నిద్ర రాని నిసి నైనా నాకీ నిష్టుర వేదన తప్పదులే పోనిలే ఇంతేలే
గూడు గుబులై పోయేనులే .

14 డిసెం, 2009

ఎదురుచూపు ఫలించిన వేళ


మొన్న నా గుండెలోతుల్లో దాగి వున్న ఆవేదనని కవితా రూపం లో రాస్తునప్పుడు ఇసుమంత నమ్మకం కుడా లేదు
యి కవితని ఎవర్ని ఉద్దేశించి రాసానో వారు చదివి స్పందిస్తారని .అయినా ఎక్కడో మినుకు మినుకు మనే ఆశ .అద్బుతాలు కుడా అప్పుడప్పుడు జరుగుతాయి కదా .
ఆఫీసు లో నా పని లో నేను వుండి స్టాఫ్ తో ఫలానా విషయం లో ఏం స్టాండ్ తీసుకోవాలో చెపుతున్నా .ఇంతలో నా సెల్ కుయ్యి మని మోగడం నా దిల్ చూడవోయి అనడం వొకే సారి జరిగాయి .ఆ ఉద్యోగ రీత్యా ఎవరో నా సహాయాన్ని అర్దిస్తూ పంపే సందేసాలే ఎక్కువ కాబట్టి మొదట పట్టించు కోలేదు .సీరియస్ గా క్లాసు పీకుతున్నా మా వాళ్ళకి .అంతలో గుర్తు వచ్చింది నా వ్యధా భరిత కవిత ఆమె చూసి వుంటే?అంతే సో అలా చేసేయ్యన్దని మా వాళ్ళని నా చాంబర్ లోంచి పంపేసి మేసేజ్ నొక్కా. ఇంతలో నా ల్యాండ్ లైన్ మోగింది .విసుక్కుంటూ తీసా.ఎవరో పౌరుడు ఆవేశం గా తన సమస్యని కింద ఉద్యోగులు పరిష్క రించక పోవడం తో తిన్న గా పై అధికారులకి విన్న వించు కుందామని చేసిన కాల్ .నేనెప్పుడు అలాంటి కాల్స్ కి టాప్ ప్రయారిటీ ఇస్తా సో మా వాళ్ళని పిలిచి ఆ సమస్య పరిష్క రించడం లో అరగంట గడిచి పోయింది .అది అయ్యాక ఇంక ఆలస్యం చెయ్య కుండా మేసేజ్ ఓపెన్ చేశా.
లేత భానుడి ఎర్రటి బింబం నుంచి వొక్కో కిరణం విచ్చు కుంటూ వచ్చిన ఆసందేశం యధా తదం గా
కదిలే క్షణాలన్నీ కాల వాహిని లో కలసి పోతాయి
మీరు నాకై రాసిన కవిత మాత్రం వీడని నీడలా
నాతోనే అంతరించి పోతుంది.నైస్ పోఎం .థాంక్ యు.
అది చదివాక అప్రయత్నం గా కళ్ళలో నీళ్లు చిప్పిలాయి .తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడినందుకో?చిరునవ్వుల వర మిస్తావా?చితి వరకు గుర్తుంచు కుంటాను అన్నందుకో?ఇక్కడ వొక విషయం స్పష్టం చెయ్యాలి .ఆమె ఎవరో నాకు అస్సలు తెలిదు .నా విషయాలు ఆమె కి చాలానే తెలుసనీ అర్ధం అవుతుంది ఆమె పంపే సందేశాలలో .మేమెప్పుడు ఫోన్ లో కూడా మాట్లాడుకోలేదు . సందేశాలు వచ్చే కొత్తలో ఎవరన్నా నన్ను బకరా చేస్తున్నారేమో అని వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి ఆమె గొంతు విన బడగానే కట్ చేశా నిర్దారణ అయ్యింది నాకు పరిచయం కాని గొంతే అది .అది మొదలు యి కధ మొదలు .చాల మంచి భావ యుక్తమైన సందేశాలు పంపేది . నా స్పందన ఆస్వాదించడం వరకే పరిమితం అవడం తో మబ్బుల వెనకకు వెళ్లి పోయింది చందమామ .మొన్న ఎప్పుడో మరచి పోయిన జ్ఞాపకాల బూజు దులుపుతుంటే తలుక్కుమన్న ఆమె సందేశాలే . వెంటనే నేస్తమా క్షేమమా?అని పంపా
''.జీవనానికి మరణానికి మద్య ప్రయాణం లో వున్నా ,ఆఖరి మజిలి లోపు మీ సందేశం సందేహమే అనుకున్నా''
అని పంపి మౌనం వహించడం తో ఆ బాధ కి అక్షర రూపమే ఆ కవిత .మేమెప్పుడు కలుసుకోలేదు , మాట్లడుకో లేదు , యెడ తెరిపి లేకుండా సందేశాలు పంపుకోలేదు .తోలి ఝాము వేకువ లో సుప్రభాతపు తోలి సందేశం .మధ్యన్నపు మండు టెండలో మలి సందేశం , నిశిరాత్రి నిశ్శబ్దాన్ని చేదిస్తూ తుది సందేశం . అంతే మా పరిచయం. ఆమె ని కలుసు కోవాలని గాని , విరామం లేని ఫోన్స్ తో విసిగించాలని గాని నాకు ఏ కోశానా లేదు .ఎందుకంటె ఆమె నా వెన్నెల్లో ఆడపిల్ల లా వుండి పోతేనే నయం .మనసులోంచి ఏ కల్మషం లేని భావాలూ అప్పుడే పెల్లుబికి వస్తాయి .ఎదురు పడితే దిగులు పడొచ్చు అయ్యో మళ్ళి విడి పోవాలె అని . ప్రతీ కలయికా వొక విడి పోడానికి నాంది కదా .దాని కంటే యిలా మూడు సందేశాలు ఆరు ఆలోచనలే నయం కదా? నా కోసం చెమ్మ గిల్లు నయనమ్ము నీవు అనుకుంటూ బతకడానికి .అవతలి వారి నుంచి ఏమి ఆసిన్చనప్పుడు నిరాసకి ఆస్కారమే లేదు కదా .యి పరిచయం మాటల లోకి , చూపులలోకి వెళ్ళితే పోస్సేసివ్ నెస్ రావడం , లేదా అభద్రతా భావం తో ఆమెని డామినేట్ చెయ్యడం జరగోచ్చు .ఇద్దరికీ నష్టం లేనిది ,కుటుంబ వ్యవస్తకి కష్టం లేనిది అయిన యి మధుర భావాల సందేశ భంధమే బెట్టేరేమో?
నేను రా(చు )సిన'' అతనెవరు ''కధలో లా జరగనంత సేపు బెట్టేరే మరి .కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలి . అంతవరకూ
'' కాల మిలా సాగి పోనీ , కల నిజమై ఆగి పోనీ
అన్ని మరచి రోజుకి మూడు నిమిషాలైనా,
నీ సందేశాల్లోనే సేద దీరని ''
అని పాడుకుంటూ పరిగెత్తడమే జనారణ్యం లో .




13 డిసెం, 2009

ఎదురు చూపు


ఉరుకుల పరుగుల సాగి పోయే నా జీవితం లోకి
ఎవరో రావాలి యి హృదయం కరిగించాలి
యి తీగను సవరించాలి అని పాడుకుంటూ గడిపేస్తుంటే
గ్రీష్మం లో చినుకులా , వసంత కోయిల లా వచ్చావు
నీ సంక్షిప్త సందేశాలతో మబ్బు పట్టిన మనసుకి
కొత్త కాంతి ని నింపావు .
నా సెల్ ఎప్పుడు కుయ్యి అన్నా నీ సందేశమే అనుకున్నా
స్పందించి నా సంతోషాన్ని పంచుకునే లోపే
భాద్యతలు వేళ్ళని ఫైల్ మీదకే గాని
సెల్ మీదకి పోనియ్యలేదు ,నా స్పందన నీకు తెలియనివ్వ లేదు
నేను నీ భావాలకి బానిసని ,అని చెప్పుకోలేక పోయిన ప్రేమ పిపాసిని
నా నుంచి స్పందన కరవై నీవు మూగ పోయావు , మెల్లిగా పక్కకి వెళ్లి పోయావు .
నా సెల్ కుయ్యి మన్న ప్రతిసారి నువ్వే అనుకున్నా, చూసే సమయాన్ని ఇవ్వలేక
నువ్వు వెళ్ళిన సంగతి తెలియకున్నా .నువ్వు వున్నావనే అనుకున్నా .
మొన్న నే అలసి పోయిన నా మనసుకు లేపనం నీ సందేశాలే కనుక చూస్తే
అందులో అన్ని వ్యాపార సందేశాలే కాని నాకు కావలసిన గ్రీష్మం లో చినుకు కనబడ లేదే?
తప్పు తెలుసుకుని వెంటనే నీకు సందేశం పంపితే,ఇక మోడు చిగురించదని
గూడు చేదిరిందని , సందేహాల మద్య సందేశాలకి తావు లేదని శరాఘాతం లా తగిలిన నీ సందేశం .
బతుకు సమరం లో బండి లాగే బాటసారి కి ప్రేమ వ్యక్తం చేసే సమయం ఏది?
తుమ్మెద పలకరించ లేదని పూవు మకరందం మానుతుందా ?
సూర్య కిరణం తాకలేదని కలువ పువ్వు వాడుతుందా?
సమయం ఇవ్వలేదని ప్రియ నేస్తం సందేశాలని ఆపుతుందా?
రేపటి నీ సంక్షిప్త సందేశం కోసం నా సెల్లు నా కళ్లు రెండు ఎదురు చూస్తూనే వుంటాయి .
కుయ్యి మని వింటే బాధని దూరం చేసేస్తాయి .
మళ్ళి జీవితం లోకి వసంతం వస్తుందని ,
సందేశాల పల్లకి నీ మోసుకుంటూ తెస్తుందని
ఏ సందేహం లేకుండా ఎదురు చూసే
నీ ప్రియ నేస్తం ఎదురు చూపు .