మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
27 ఫిబ్ర, 2010
ఇలా అయితే ఎలా?
గత మూడు రోజులు గా గోవా లో official మీటింగ్స్ వుండడం తో వెళ్ళడం జరిగింది .గోవా లో మీటింగ్స్ పెట్టేదే బీరు ,బీచు కోసం కాబట్టి సాయంత్రం ఎయిర్ పోర్ట్ వెనకాలే వున్నా బోలంగోట్ బీచ్ కి వెళ్ళా .అక్కడ ఇసక లోనే టేబుల్ వేసేసి మందు మాకు సరఫరా చేసేస్తున్నారు .మేము వెళ్ళే టప్పటికి అక్కడంతా స్టూడెంట్స్ (ఆడ , మగ )చేత బీరు గ్లాసు ,నోట సిగరెట్టూ పీక ,వొంటి మీద తడిసిపోయిన చిన్న గుడ్డ ముక్క .వాళ్ళు వొక చోట నిలకడ గా కూర్చో వటం లేదు. ఇసకలో వోకల్ల భుజాల మీద వోకల్లు చేతులు వేసుకుంటూ దూరం గా ఇసకలో మేట వేసిన పడవ వెనక్కి పోయి వస్తున్నారు . వెళ్లి నప్పుడు వున్న combination వచేటప్పుడు వుండడం లేదు .యిలాగంటలు గంటలు గడిచి పోతున్నా ఎవరు వెళ్ళడం లేదు అక్కడి నుంచి (నాతొ సహా అది వేరే విషయం ) .నా పక్క టేబుల్ దగ్గర వొక భర్త , భార్య వాళ్ళ ఇద్దరు పిల్లలు కూర్చున్నారు .భర్త మొదటి బీరు మొదలెట్టే టప్పటికి అక్కడ తడిసిన అమ్మాయిల్ని వొర చూపులు చుస్తునవాడు కాస్త రెండో బీర్ కొట్ట గానే ,వాళ్ళ ఆవిడా ఏదో అడుగు తున్నా గాని చ చ అవతలకి పో అంటూ ఆ కాలేజీ పిల్లలు పడవ వెనకకి వెళ్ళే దాక చూస్తూ , వాళ్ళు వచ్చేదాకా టెన్షన్ పడి పోతూ బీర్లు ఏర్లు అయి ప్రవహింప చేస్తున్నాడు .ఇక్కడ యి స్టూడెంట్స్ పరిస్తితి అంతే పోటీలు పడి మరి తాగేస్తున్నారు . అందులో వొక అమ్మాయి అబ్బాయి అవుటయి పోయి కుర్చీ లోంచి ఇసకలోకి జారి పోయి అలాగే పడుకున్నారు .అప్పటికే సమయం రాత్రి పదిన్నర ,ఇప్పుడు ఆ స్టూడెంట్స్ పడవ దాక కూడా వెళ్ళడం మానుకుని వొక రాధా ఇద్దరు కృష్ణులు సినిమా అక్కడే చూపిస్తున్నారు .ఇదంతా పక్క టేబుల్ బీర్భల్ తో పాటు వాళ్ళ ఆవిడా కుడా చూస్తోంది .అంతే బీర్బల్ లో ఆవేశం పొంగు కొచ్చి స్టూడెంట్స్ మద్య లోకి వెళ్లి ఏంటి యి పబ్లిక్ న్యూ సెన్స్ ?నేనిప్పుడే కాప్స్ ని పిలుస్తా అంటూ రెచ్చి పోతున్నాడు . అంత వరకు తుళ్ళుతూ కేరింతల లో ములిగి పోయిన స్టూడెంట్స్ కాస్త నీరు గారి పోయారు .వాళ్ళంతా కూడా దేశం లోనే తల మానికం గా చెప్పుకునే బిట్స్ (పిలాని) గోవా స్టూడెంట్స్ ట .అంటా హాస్టల్ లో వుండి చదువు కుంటున్న వారె . వార్డెన్ తో బజార్ కి వెళ్తున్నామని చెప్పి ఇలా బీచ్ కి దొబ్బు కొచ్చారు . అంతా పదకొండు లోపు వెళ్లి పోయి వార్డెన్ రాత్రి అట్టేన్దేన్స్ తీసుకునే టైం కి వెళ్లి పోవాలి . యి లోపు బీర్భల్ రెచ్చి పోతున్నాడు .ఇంక నేను రంగం లోకి దిగ వలసిన సమయం ఆసన్న మయిందని నిర్ణయించేసుకుని ఆయన్ని సముదాయించి ,స్టూడెంట్స్ తో వొకటే అన్నా'' మీ మందు మీకు విందు చెయ్యాలి గాని , వేరే వాడికి విందు చెయ్య కూడదని '' తప్పు అయిపోయింది సార్ ఇప్పటికే ఇద్దరు అవుటయి పోయి , హాస్టల్ కి లేట్ అయిపోయి టెన్షన్ పడుతుంటే యి గొడవ వొకటి మద్యలో అని బాధ పడుతూ వాల్లిదర్నీ మోసుకుంటూ టాక్సీ లు చేసుకుని వెళ్లి పోయారు .
యి మొత్తం ఎపిసోడ్ లో నే గమనించినది ఏంటంటే అంత వరకు తల్లి దండ్రుల క్రమ శిక్షణ లో బుద్ది గా చదువుకుని బిట్స్ లో సీటు సంపాయించిన యి మేధావులు , వొక్క సారి స్వేఛ్చ లభించడం తో బుడ్లు పట్టుకుని ఇసకల్లో పొర్లు తున్నారు .యిదే పద్దతి విట్స్ (వెల్లూరు) లో కూడా వుందని తెలిసింది .మెరిట్ లో సీట్ సంపాయించుకున్న తమ పిల్లల భవిస్యత్తు కు యింక ఏ ధోకా లేదని వాళ్ళు అడిగినంత డబ్బు పంపుతూ బ్రమలో కాలం గడుపుతున్న తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు కాలేజీ నుంచి బయటకు వచ్చే టైం కి మత్తు కి బానిసలుగా ,వెన్నెముక కోల్పోయిన యువత గా బయటకొస్తే ఎలా?కాలం తెచ్చిన మార్పు లో మేధావి తనం తో బాటు విచ్చల విడి తనం కూడా పెన వేసుకుని వుండి పోయిందని సరి పెట్టు కోవాలేమో?
19 ఫిబ్ర, 2010
సగమే నెగ్గిన లీడర్
నిన్న లీడర్ ప్రేమిఎర్ షో కి వెళ్ళడం జరిగింది .శేకర్ కమ్ముల తన ప్రేమ పందాన్ని పక్కన పెట్టి సందేశాత్మకం గా వెళినట్టు గా కని పిస్తోంది .మొదటి సగం బాగా ఎక్కడా బోర్ కొట్ట కుండా తీస్తే రెండో సగం నిడివి ఎక్కువవ్వడం , సందేశాలు ఎక్కువ సరుకు తక్కువ అనట్టు గా తయారయ్యింది . సినిమా కాన్సెప్ట్ అవినీతి ని నిర్మూలించడానికి సి .ఏం అవడానికి హీరో అవినీతి పద్దతి లోనే డబ్బులు ఏం ఎల్ ఏ లకి పంచి సి ఏం అవడం అతని కజిన్ మళ్ళి డబ్బులు పంచి తను సి ఏం అవుదామనుకోడం ఆఖర్న అవినీతి డబ్బును ఏ సి బి దాడుల ద్వార బయటకు తీసి లక్ష కోట్లు దాక పోగు చేసి పీపుల్స్ ఫండ్ తాయారు చేసి ప్రజలకి ఏదన్నా చేద్దామనుకునే టైం కి రాజ కీయ సంక్షోబం వచ్చి ఎలెక్షన్ కి వెళితే హీరో విజయం సాధించడం తో కధ ముగుస్తుంది .దేశం లో బ్లాక్ మనీ చాల ములుగు తోంది దాన్ని బయటకు తీసి ప్రజలకి ఖర్చు పెడితే దేశం బాగు పడుతుందన్నది స్టొరీ లైన్ .మద్యలో తన పదవి కాపాడు కోవడం కోసం ఎక్కువ మంది ఏం ఎల్ ఏ ల సపోర్ట్ వున్నా వొక వర్గ నాయకుడి కూతుర్ని ప్రేమ లో పడేసి (ఇది మోసమే గా) తన పదవి నిలబెట్టుకుంటాడు .యిలా కధంతా పదవిని నిలబెట్టు కోడానికి వేసే ఎత్తులు , కారం చెడు దహన సంఘటన , ఎవరి సత్తా బట్టి వాళ్ళకి వృత్తులు నిర్ణయించడం జరిగిందని , అందులో పుట్టిన వాడు వేరే వృత్తులు పదవులు చేస్తా అంటే కుదరదని పెద్దాయన (కోట) చేత చెప్పించడం వివాదానికి ఆస్కారం వుంది .ఇందులో ఐటెం సాంగ్(?)లో ప్రముఖ ఏంకర్ ఉదయ భాను నర్తించి చీరలలో కాకుండా వలువలు తగ్గిస్తే తను ఎలాఉంటానో చూపింది .కామెడి ఎక్కడా లేదు కనీసం చిరు మంద హాసానికి కుడా .స్పీకర్ స్తానం లో వ్యక్తీ కూర్చోండి ప్లీజ్ సిడవును అనప్పుడు మాత్రం కొద్ది మంది నవ్వారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి ని గుర్తు తెచ్చు కుని .అయితే రాణ దగ్గుపాటి నటన మాత్రం బావుంది ఎక్కడా కొత్త వాడన్న బెరుకు కన బడ లేదు .వాచకం విగ్రహం వెనక దన్నువున్నా కారణం గా పది కాలాలు సిని జగత్తు లో వెలగచ్చు . అయితే డాన్స్ లు చూసే అవకాశం యీ సినిమాలో రాలేదు . ఎక్కడ స్టెప్స్ లేవు .ఓవర్ అల్ గా కాలక్షేపం బటాని గా మిగిలి పోతుంది అది వేరే సినిమాలు లేక పోవడం బట్టి .
14 ఫిబ్ర, 2010
మరిచిపోలేని మరోచరిత్ర
ఎప్పటి కి మరచి పోలేని మధురమైన చిత్రం మరోచరిత్ర.అందులో కమలహాసన్ వోలికించిన హావ భావాలూ , బాలచందర్ ఆ సినిమా తీసిన విధానం ,ప్రేమికులు తమ ప్రేమను నిరూపించు కోవడం కోసం వొక సంవత్సరం పాటు కలుసు కోకూడదు , మాట్లాడు కోకూడదు అన్న నిభందన.బాలు ''యి పరీక్షా కి నేనొప్పుకోను , యి వూళ్ళో పాలవాడు , పేపర్ వాడు తో సహా అందరు నిన్ను చూడొచ్చుడామిట్నేన్నేందుకు చూడ కుండావన్ ఇయర్ వుండాలి '' అంటే ''యి వొక్క సంవత్సరం మన జీవితం లో లేదనుకుందాం బాలు,మిగిలిన జీవితం అంతామనదే గా '' అంటూ స్వప్న లాలించి వోప్పించడం .ట్రైన్ లో హైదరాబాద్ వెళ్తూ వొక్క గంటె చూడకుండా వుండడం నా వాళ్ళ కాదనుకుంటూ బాలు కదులుతున్న ట్రైన్ లోంచి దుకేయ్యడం , ఆ వేడి లో స్వప్న వాళ్ళింటికి వెళ్లి మేడ మీద వున్నతన రూం కి పైపు పట్టుకుని పాకుకుంటూ వెళితే స్వప్న వద్దు బాలు వెళ్లి పో మనం ఎలాగన్నా నెగ్గాలి ,మనది ఆకర్షణ కాదు ప్రేమే అని నిరూపించాలంటే నువ్వు యి క్షణమే వెళ్లి పో అంటూ కటువు గా చెపితే బాలు తన బాధని టేప్ లో రికార్డు చేసి మేడ మీదకి విసిరేసి వెళ్లి పోవడం ,ఎప్పుడు ఆ మాటలు వింటూ తన బాధని మరిచి పోయే స్వప్న కి తెలీకుండా ఆమె తల్లి ఆ టేప్ ని మంటలో పడెయ్యడం ,యి వెదవని ఏ కలరా అన్నా వచ్చి తీసుకు పోయినా బావుణ్ణు అంటూ ఆమె తల్లి శాపనార్ధాలు పెట్టినప్పుడే పేపర్ లో హైదరాబాద్ లో కలరా పలువురు మృతి అన్న హెడ్డింగ్ చూసి ఆమె
నల్ల యిరికియా అని పేపర్ లో ఆడ్ వేస్తె దానికి సమాధానం గా నల్ల యిరికేన్ అని బాలు సమాధానం గా ఆడ్ ఇవ్వడం
బాలు ఫోటో ని గ్యాస్ మీద తగలేట్టేస్తే , ఆ నుసి ని స్వప్న కాఫీ లో కలుపుకుని తాగేసి , నా జ్ఞాపకాలని మాత్రం ఎప్పటికి చేరపలేవ్ చూస్తావా అంటూ సముద్ర తీరం లోకి వెళ్లి జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ వచ్చే పాట'' పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు '', బొటనికాల్ టూర్ లో అనుకోకుండా వొకే హోటల్ లో పక్క పక్క రూమ్స్ లో దిగిన స్వప్న ని చూసి తన బాధని వ్యక్తం చేస్తూ ఏ తీగ పువ్వునో ఏకొమ్మ తెనేనో విషాదం లో పాడడం , ఆమె అతనిని కలుసుకోవాలన్న కోరికను చంపుకోవడం కోసం ముళ్ళ శంఖం తో అర చేతిని రక్తం వచ్చేలా గుచ్చు కోవడం ,బాలు ఆవేశం గా ఆమె రూం కి వచ్చి తలుపు కొడుతూ వుంటే స్వప్న బావ ఆమె బ్రా మడత పెడుతూ మీరెవరు అని అడిగితె స్వప్నకి కాబోయే భర్త ని అని సమాధానం చెప్పడం తో అది నిజమో కాదో కనుక్కుందుకు కాలేజీ బస్సు ని కార్ తో వెంబడించి బస్సు లో స్వప్న లేక పోవడం తో వెనుదిరుగు తునప్పుడు అమ్మాయిలు మీరేవరండి అంటే ఐ యామె అ బ్లాడి ఫూల్ అనడం , ఆ వేడి లో విడో అయిన మాధవికి దగ్గరవడం ,బాలు రూం కి వస్తు అతన్ని రెచ్చ గొట్టే పాప , అయినా నిగ్రహం కోల్పోని బాలు ,మాధవి నిజం తెలుసుకుని అతనికి రేపటి తో వాళ్ళ పెద్దలు పెట్టిన గడువు పూర్తయ్యిందని చెప్పి రైల్ టికెట్ కొని పంపడం ,వాళ్ళ అన్న కి విషయం తెలిసి కిరాయి గుండాలని చంపడానికి ఏర్పాటు చేసి ,మళ్ళి చెల్లెలి ద్వార బాలు తప్పులేదని తెలుసుకుని దాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నం అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కాబట్టి విఫలం అవడం ,ఇంకా పతాక సన్నీ వేశం లో ఫోటో గ్రాఫర్ స్వప్న ని రేప్ చెయ్యడం ,బాలు నీకోసం నేనేమి దాచ లేక పోయా యి ప్రాణాలు తప్ప అంటే ,కలిసి జీవించలేక పోయినా మరణం లో అన్న కలిసి పోదాం అంటూ సముద్రం లోకి దుకేస్తుంటే ,అఆ సంవత్సరం మొత్తం ప్రతి రోజు బాలు స్వప్న కోసం రాసుకున్న ఉత్తరాలు గాలిలోకి యెగిరి పోతూ ,వాళ్ళ తో పాటు పైకి పోతునట్టు గా వుండడం వాళ్ళు మరణించడం తో బరువెక్కిన గుండెతో కళ్ళు చమరిస్తుంటే ప్రేక్షకుడు బయటకు రావడం .
ఇంత పెద్ద కధ ని దిల్ రాజు వరుణ్ సందేశ్ తో కొత్త హీరోయిన్ ని పెట్టి తీయడంనా ఉద్దేశం లో ఆత్మా హత్య సదృశ్యమే. అందులో ప్రతీ సన్నీ వేషం అప్పటి కాల మాన పరిస్తితులకి అనుకూలం గా వుంటాయి . ఇప్పుడు సెల్ ఫోన్స్, చాట్ లింగో వచ్చేసిన యి నాటి కాలం లో భాష తెలియని ప్రేమికులు ,కలుసుకోకుండా వుండడం , ఫ్రెండ్ షిప్ అండ్ ఫర్గెట్ అన్న నేటి యువత విధానం లో అది పాత చింత కాయ పచ్చడేమో ?ఇంకా అందులో పాటలు సాహిత్య పరం గా ,సంగీత పరం గా ఆణి ముత్యాలు .ఉదాహరణకి
విధి చేయు వింతలన్నీ మతి లేని చేత లేనని
విరహాన వేగి పోయే విలపించే కధలు ఎన్నో
ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచి పోవగా నిదుర పోయెను ఊర్మిళ
అనురాగమే నిజమని మనసోకటే దాని రుజువని
తుది జయము ప్రేమదేనని బలి అయినవి బతుకులెన్నో .
అప్పట్లో ఆ విశాదాంతాన్ని జీర్ణించుకోలేని కొంతమంది ప్రేక్షకులు బాలచందర్ ని కధ సుఖాంతం చేసి మళ్ళి రిలీజ్ చెయ్య మంటే అయన స్పందిస్తూ సుఖాంతమైతే అది మరోచరిత్ర ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నించేవారు .ప్రేమకి భాష అడ్డుకాదని యి సినిమాలోనే నిరూపించడం కాకుండా బయట కూడా నిరూపించ బడిన సినిమా యిది హిందీ లో కుడా హిట్ అవడం ద్వారా.యి సినిమాలో ఫోతోగ్రాఫేర్ స్వప్నకి వొక సెక్సీ అమ్మాయి ఫోటో చూపించి ఎలా వుందంటే? మీ అమ్మదా? అని అడిగి కట్ చేస్తే వాడు అదే ఫోటో కి స్వప్న తలని మొర్ఫింగ్ చేసి మళ్ళి సారి వచినప్పుడు చూపిస్తే ఆమె చెంప పగల కొట్టడం తో పగ బట్టి రేప్ చేస్తాడు .యిలా కధ లో ప్రతి సన్నీ వేశం కధ గమనానికి తోడ్పడుతూ వుంటుంది .రాజుని చుసిన కన్నులతో మొగుణ్ణి చూడడం కష్టమే . మరోచరిత్రని మరిపించే లా తియ్యడం అసంభవం .అల్ ది బెస్ట్ దిల్ రాజ్ టీం . లెట్స్ వెయిట్ అండ్ వాచ్ .
ఆని ని
12 ఫిబ్ర, 2010
కాగడా నేనా?
అది రెండు వేల ఎనిమదవ సంవత్సరం ఆ రోజు నాకింకా గుర్తు
బుక్స్ exibition లో బ్లాగర్స్ ఆంతా కలిసి ఆనందం గా గడిపిన వేళ
నేను వెంటనే ఇంటికి వచ్చి అదే ఆనందం లో''బ్లాగర్స్ దిగి వచ్చిన వేళ ''
అన్న పోస్ట్ రాస్తూ పొరపాటున ఆవిడ సున్నుండల మీద రాసిన ఆ క్షణం
ఎడమ కన్ను అదిరిన క్షణం ,తీతువు పిట్ట కూసిన క్షణం ,
గోడ మీద బల్లి నా కేసి జాలిగా చూసిన క్షణం ,నేను పట్టించు కొని ఆ క్షణం .
అంతే మర్నాటి నుంచి ఆ వెధవ కి , వాడి బ్లాగు కి పాడి కడతా ,
మీరు కుడా నా వెనక క్యు కట్టండి అని ప్రమాదా వనం సభ్యులని ఆదేశించి
నా మీద బురద చల్లడం మొదలెట్టిన ఆ క్షణం ,
యెంతో మంది బ్లాగ్ లోకపు నిరంకుసత్వాన్ని
మౌనం గా భరిస్తూ ఏమి రాసినా వహ్వా వహ్వా అంటూ
కంప్యూటర్ ముసెసాక పొగిలి పొగిలి ఏడ్చి
యి బాధల నుంచి విముక్తి చేసి స్వేచ్చగా గా భావ ప్రకటన చేసుకుని
రాసుకునే లా చేసే అద్బుతం ఏదన్నా జరగక పోతుందా అని ఎదురు చూసిన ఆ క్షణం
వొకటి కాదు రెండు బ్లాగులు వచ్చాయి . అవే కాగడా(kaagadaa .blogspot .కం),ధూమ్ మాచారె
మొదట్లో ఆ రెండు నన్ను రెచ్చ గొట్టి నిరంకుశత్వం మీద దాడి చేసేలా ప్రేరేపించినా
త్వరలోనే తమ ఉనికిని బ్లాగ్లోకం లో చాటాయి .అయితే అప్పట్లో కాగడా శర్మ వ్రాసిన
రాతలలో ని బూతు ని సాకు గా చూపి తామే ఆ బ్లాగ్ ని తొలగింప చేసామని కొంత మంది చెప్పుకుంటే ,
కాగడా నే వచ్చిన పని అయిపోయిందని అవతారం చాలించాడని కొందరు చెప్పుకున్నారు .చాలా మంది
చంకలు కొట్టు కున్నారు .ధూమ్ కుడా మౌనం వహించడం తో బ్లాక్ లోగులు తమ చెప్పు చేతల లోకి వచ్చేశారని
ఇంకా అంతా అదుర్సు అదుర్సు అంటూ కొత్త గా బ్లాగ్లోకం లోకి అడుగు పెట్టిన సబ్యుల చేత కూడా స్టెప్స్ వేయించారు .
మళ్ళి ఇంతలో సుడిగాలి లా , మంచు తూఫాను లా ,కాగడ రంగ ప్రవేశం చెయ్యడం , ఎక్కడా కూడా బూతు పద ప్రయోగం లేకుండా తన మానన తను పేరడీలు రాసుకుంటూ ,ఎంతో మంది ప్రమాదా వనం సబ్యుల అభిమానాన్ని చుర గొంటూ ముందుకు సాగి పోతుంటే , మళ్ళి యి కాగడా పీడా ఎలా వదిలించు కోవాల అని కొన్ని విదేశి శక్తులు కుమ్ముక్కై
దానికి విరుద్దం గా వేరే బ్లాగ్ మొదలు పెట్టి అందులో బూతు కామెంట్స్ రాయించి , దాన్ని బూచి గా చూపించి యి రెండు బ్లాగుల్ని తీసేయ్యాలి వాడికి ''తలంటాలి '' అంటూ ఉద్యమాలు లేవ దీయడమే కాకుండా మద్యలో కాగడా వీళ్ళలో వొకరు అంటూ నన్ను , మలక్ ని మాత్రమె కాకుండా పాపం తన మానన కవితలు రాసుకుంటూ అజాత శత్రువు గా వుండే పద్మార్పిత ని కూడా లాగడం . ఇదంతా చూస్తూ వుంటే తన వంది మాగతులు తప్ప ఇంకా ఎవరన్న కాగాడానే అనేస్తా , కబాడ్డార్ అంటూ అదే కాగడా ని వాడుకుని తన శత్రు వర్గం లో వాళ్లకి కామెంట్ పెడితే అంతే సంగతులు అన్న సందేశాలని పంపడం.
సరే ఇంకా అసలు విషయానికి వస్తే ఇంతకూ ముందే నేను చెప్పా నేను కాగడా కాదు మొర్రో అని .ఇప్పుడు కూడా అదే చెబుతున్నా , అయినా జ్యోతులు వెలిగించ డానికి కాగడా కావాలేమో గాని సూర్య కాంతికి కాగడా అవసరమా? అయితే నేను బ్లాగ్ లోకం లో ఎటాక్ కి గురి అయినప్పుడు నన్ను సపోర్ట్ చేసిన చాలా మంది బ్లాగ్ మిత్రుల లో కాగడా కూడా చేరి పోయాడు వొక అజ్ఞాత లా .ఎవర్ని నొప్పించకుండా సరదా గా నవ్వుకోడానికి రాసే పేరడీల వరకూ నేను కాగడా అభిమాని నే . నాకు అర్ధం కాని విషయం ఏంటంటే కాగడా ఎవరు అని ఆలోచించే మనకి బ్లాగ్ లోకం లో మిగతా వాళ్ళు అంతా ఎలా వుంటారో ?యేంచేస్తారో తెలుసా?మరి చలికాలం , పొయ్యేకాలం అంటూ టైటిల్ లోనే పేరడీ ని కలిగి వున్న వారెవరు?ఏంటో మళ్ళి నేను ''అతడెవరు'' అనో ''ఆమె ఎవరు'' అనో అపరాధ పరిశోధనల మీద పోస్ట్స్ రాసుకుంటూ శేష జీవితం గడిపెయ్యలేమో చూస్తుంటే .
p .s ; ఆంధ్ర తెలంగాణా లాంటి బ్లాగ్ లోకపు యి సమస్య లో చంద్ర బాబు లాగ మౌనం గా ఉండ లేక ,
అందునా కాగడ ఎవరు లో నా పేరు కుడా లాగ బట్టి నిశబ్దాన్ని చేదిస్తూ , కాగడా పుట్టు పురోత్రాలని
జనాలకి గుర్తు చెయ్యడం కోసమే యి పోస్ట్ తప్ప రావణ కాష్టం లా నిప్పు ని కాలనివ్వడం నా ఉద్దేశం
కాదని విజ్ఞులు గమనించ ప్రార్ధన .
7 ఫిబ్ర, 2010
మొత్తానికి చచ్చింది
ఇంతకు ముందు'' నడక లో నా అనుభూతులు '' రాసినప్పుడు పొద్దునే నడక అయిపోగానే మా పెరట్లో పందికొక్కు చేసే బొక్కలు పుడ్చుకోవడం నా దిన చర్యలో వొక బాగం అయిపొయిందిఅని రాసుకున్నా గుర్తు వుండే వుంటుంది . అది యెంత వరకు అంటే ఎప్పుడన్నా అది బద్దకించి డ్యూటీ ఎక్కక పొతే నేనే తవ్వి మళ్ళి పూడ్చే అంత. అయితే యి మద్య దాని ఆగడాలు మరీ మీరి పోయాయి .ఏదన్నా మొక్క పువ్వు పూస్తే దాని వెళ్ళు కోరికేస్తోన్డి దాంతో మా పెరట్లో పూల మొక్కలు నీళ్ళు తాగేసి నోరుమూసుకు కుర్చుంటున్నాయి పూలు పుయ్యాకుండా . అయితే మనీ ప్లాంట్ మాత్రం గోడంతా పాకుతూ అందం గా తయారవుతోంది .యి మనీ ప్లాంట్ వెనక పెద్ద కధే వుంది .మా అత్తా గారు పోయిన కొత్తలో మా మావగారు మా ఇంటికి వస్తూ ఆవిడ నాటిన ఆ మొక్కని తన తో పాటు తెచ్చుకుని మా ఇంట్లో నాటారు .దాని పక్కనే ఇంకో ముద్ద మందారం మొక్కని కుడా నాటారు. జాగర్త గాచూసుకునే వారు .పదిహేను నెలల కింద అయన చనిపోయారు .ఎప్పుడు ఆ రెండు మొక్కల్ని ముట్టుకోని ఆ పందికొక్కు మొన్న ఆ మనీ ప్లాంట్ శాకల్ని కొన్నిటిని కొరికి వెయ్యడం తో కొంత బాగం ఎండి పోవడం మొదలయ్యింది .ఆ రెండు మొక్కల్ని వాళ్ళ అమ్మ నాన్న గుర్తులు గా చూసుకునే తను ఇది చూసి తట్టుకోలేక వెంటనే నెట్ లో పందికొక్కు ని చంపే మందులు అమ్మే దుకాణాలు హైదరాబాద్ లో ఎక్కడున్నాయో చూస్తే పాత గాంధీ హాస్పిటల్ సందులో వొక దుకాణం కనబడితే వెంటనే వెళ్లి తెచ్చుకుంది. వాళ్ళు బ్రెడ్ కిరాసే జామ్ లాంటిది ఇచ్చారు దాన్ని బ్రెడ్ కి రాసి బోరియలు పెట్టె ప్లేస్ దగ్గర పెడితే తిని చచ్చిపోతుందని చెప్పాడు.నిన్న రాత్రి నాలుగు ప్లేసెస్ లో పెట్టింది . పొద్దున్నే సివిల్స్ రిజల్ట్స్ లా లేచి చూస్తే బ్రెడ్ మాత్రం కనబడలేదు .కొంచెం సేపటకి చత్త బుట్ట దగ్గర చచ్చిన దుక్క లాంటి పందికొక్కు కనిపించింది .ఆమె ఆనందానికి అవధులు లేవు ఆ రెండు మొక్కలకి ఆకు ఆకు తడుపుతూ నీళ్ళు పోసుకుంది .నేను ఆ చెత్త బుట్ట పెట్టె చోట నాలుగు వేలు ఖర్చు చేసి మొత్తం flooring చేయించా అంతకు ముందు రోజే .ఏమన్నా కొన్ని అనుభందాలకి విలువ కట్టలేం. ఆమె కి ఆ మొక్కలకి , నాకు ఆ పంది కొక్కుకి .రేపటి నుంచి అలవాటు పడిన చెయ్యి కి తిమ్మిరి ఎక్కు తుందేమో?
2 ఫిబ్ర, 2010
మనసు ప్రభావం
మనిషి ఆరోగ్యం మీద మనసు ప్రభావం చాల వుంటుంది.మన ఆలోచనే మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని యి మద్యన జరిగిన కొన్ని సంఘటనల వల్ల విదితమైంది .కూతురు హత్య కి గురైందని విన్న వైష్ణవి తండ్రి ఆ బాధ తో గుండె పోటుకి గురై మరణిచడం .అంటే మనసు వ్యాకులత చెందితే రక్త ప్రసరనలలో వచ్చే మార్పులు , బాధ వల్ల దాన్ని ఆదిగ మించడానికి శరీరం ఉత్పత్తి చేసే ఎంజ్య్మేస్ శరీర ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి .సంతోషమే సగం బలం అంటే అప్పట్లో పెద్ద గా పట్టించు కోలేదు గాని ఇప్పుడు అర్ధం అవుతోంది దాని అర్ధం . మనం సంతోషం గా వుంటూ నవ్వుతు తుల్లు తు మనసుని ఆహ్లాద కరం గా వుంచుకునప్పుడు ఏ అనారోగ్యం దరి చేరదు .అదే బాధల్లో వునప్పుడు మనసులో ఆనందం మటుమాయమై ఎక్కడలేని రోగాలు వస్తాయి .ట్రాఫ్ఫిక్ లో చిక్కుకుని ఆఫీసు కి లేట్ అవుతోందని బి పి పెంచుకునే కంటే ,అదే ట్రాఫ్ఫిక్ లో ఎఫ్ ఏం radio లో పాట తో శ్రుతి కలిపి మనసుని రంజింప చేసుకుంటే డ్రైవింగ్ కూడా ఆహ్లాద కరం గా వుంటుంది.మొన్నటికి మొన్న'' అతనెవరు '' లోని ఆమె ఆ కధ ని తీసేసే వరకు తెగ వ్యాకులత చెంది మనసు పాడు చేసుకుని ,ఆరోగ్యం పాడు చేసుకుని అయ్యో యీమే ఎమై పోతుందో అన్నంత లా అనిపించి , తీసేసాక మళ్ళి నార్మసి కి వచ్చి ఆనందం గా వుండడం తో ఆరోగ్యం మళ్ళి వచ్చింది .
పూర్వ కాలం లో ఋషులు కంద మూలాలు తింటూ ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటూ మనసుని ప్రశాంతం గా ఉంచు కోవడం తో ఆరోగ్యం గా వుండి వందేళ్ళు బతికే వారేమో .మన మనసు మన మాట వినే వరకు ఆరోగ్యానికి ధోకా లేదు ,''ఆమె'' మాటో లేదా అతని మాటో వినడం మొదలెట్టినప్పుడే ప్రమాదం .కళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళ క పొతే ఆరోగ్యం బద్రమే లేక పొతే జీవితాలు చిద్రమే .రెండో పెళ్లి కి సిద్ద పడక పొతే ఆ వైష్ణవి తండ్రి బతికి వుండే వాడేమో ?అసలు ప్రతి మనిషికి నలభై దాట గానే వేరే ఆలోచనలు పోయి అద్యాత్మికత వైపుమనసు వెళ్ళే లా భగ వంతుడు సృష్టి ని మార్పు చేస్తే యి నేరాలు ఘోరాలు పూర్తీ గా పోతాయేమో?లేదా నలభై లోపే పొడుచుకు చచ్చి పోతారో?ఎత వాత నా కని పిస్తోంది మనసు లోనే మర్మం వుందని .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)