7 ఫిబ్ర, 2010

మొత్తానికి చచ్చింది


ఇంతకు ముందు'' నడక లో నా అనుభూతులు '' రాసినప్పుడు పొద్దునే నడక అయిపోగానే మా పెరట్లో పందికొక్కు చేసే బొక్కలు పుడ్చుకోవడం నా దిన చర్యలో వొక బాగం అయిపొయిందిఅని రాసుకున్నా గుర్తు వుండే వుంటుంది . అది యెంత వరకు అంటే ఎప్పుడన్నా అది బద్దకించి డ్యూటీ ఎక్కక పొతే నేనే తవ్వి మళ్ళి పూడ్చే అంత. అయితే యి మద్య దాని ఆగడాలు మరీ మీరి పోయాయి .ఏదన్నా మొక్క పువ్వు పూస్తే దాని వెళ్ళు కోరికేస్తోన్డి దాంతో మా పెరట్లో పూల మొక్కలు నీళ్ళు తాగేసి నోరుమూసుకు కుర్చుంటున్నాయి పూలు పుయ్యాకుండా . అయితే మనీ ప్లాంట్ మాత్రం గోడంతా పాకుతూ అందం గా తయారవుతోంది .యి మనీ ప్లాంట్ వెనక పెద్ద కధే వుంది .మా అత్తా గారు పోయిన కొత్తలో మా మావగారు మా ఇంటికి వస్తూ ఆవిడ నాటిన ఆ మొక్కని తన తో పాటు తెచ్చుకుని మా ఇంట్లో నాటారు .దాని పక్కనే ఇంకో ముద్ద మందారం మొక్కని కుడా నాటారు. జాగర్త గాచూసుకునే వారు .పదిహేను నెలల కింద అయన చనిపోయారు .ఎప్పుడు ఆ రెండు మొక్కల్ని ముట్టుకోని ఆ పందికొక్కు మొన్న ఆ మనీ ప్లాంట్ శాకల్ని కొన్నిటిని కొరికి వెయ్యడం తో కొంత బాగం ఎండి పోవడం మొదలయ్యింది .ఆ రెండు మొక్కల్ని వాళ్ళ అమ్మ నాన్న గుర్తులు గా చూసుకునే తను ఇది చూసి తట్టుకోలేక వెంటనే నెట్ లో పందికొక్కు ని చంపే మందులు అమ్మే దుకాణాలు హైదరాబాద్ లో ఎక్కడున్నాయో చూస్తే పాత గాంధీ హాస్పిటల్ సందులో వొక దుకాణం కనబడితే వెంటనే వెళ్లి తెచ్చుకుంది. వాళ్ళు బ్రెడ్ కిరాసే జామ్ లాంటిది ఇచ్చారు దాన్ని బ్రెడ్ కి రాసి బోరియలు పెట్టె ప్లేస్ దగ్గర పెడితే తిని చచ్చిపోతుందని చెప్పాడు.నిన్న రాత్రి నాలుగు ప్లేసెస్ లో పెట్టింది . పొద్దున్నే సివిల్స్ రిజల్ట్స్ లా లేచి చూస్తే బ్రెడ్ మాత్రం కనబడలేదు .కొంచెం సేపటకి చత్త బుట్ట దగ్గర చచ్చిన దుక్క లాంటి పందికొక్కు కనిపించింది .ఆమె ఆనందానికి అవధులు లేవు ఆ రెండు మొక్కలకి ఆకు ఆకు తడుపుతూ నీళ్ళు పోసుకుంది .నేను ఆ చెత్త బుట్ట పెట్టె చోట నాలుగు వేలు ఖర్చు చేసి మొత్తం flooring చేయించా అంతకు ముందు రోజే .ఏమన్నా కొన్ని అనుభందాలకి విలువ కట్టలేం. ఆమె కి ఆ మొక్కలకి , నాకు ఆ పంది కొక్కుకి .రేపటి నుంచి అలవాటు పడిన చెయ్యి కి తిమ్మిరి ఎక్కు తుందేమో?

8 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

ఏమైనా చచ్చిన పందికొక్కు భలే ముద్దుగుందండి!
అలవాటైన చేయి ఎక్కడ పెడతారో బొక్కలు...పాపం మీ ఆవిడ:)

అజ్ఞాత చెప్పారు...

ayyo papam appude noorellu nidaayaa? kaneesam jaketla pandaga daaka unte bagundedi. pssch!!!Appude jaket chimpesukundaa? ravi garu annattu jaketla pandagaku vastunnaraa? Banjara Hills lo March 8th. OK???

Unknown చెప్పారు...

పద్మర్పిత గారు వొక్క పన్దికొక్కు చస్తె వన్ద పన్ది కొక్కులు
నా చెతి నిన్దాపని కలిపిస్తయి .
బాబు /పాప అజ్నాత పన్ది కొక్కు కి జాకెట్ హుక్కు కి
యెమన్న సమ్భన్ధమ్ వున్దా?

సుజాత వేల్పూరి చెప్పారు...

ష్! అబ్బ, మొత్తానికి చచ్చిందా! కథ సుఖాంతం అయిపోయిందా!

ఇంతకీ చచ్చింది అదేనో లేక వాళ్లింటికొచ్చిన చుట్టమో చూడండి!

అది సరే, ఈ ఫొటో ఎక్కడ పట్టారూ? గూగుల్ లో ఏమని సెర్చ్ చేసి ఉంటారబ్బా, దీన్ని పట్టుకునేందుకు!

Unknown చెప్పారు...

సుజాత గారు నాకు అదే సందేహం వచ్చింది
అందుకే పొద్దున్నే లేచిన వెంటనే పెరటి లోకి వెళ్లి
చూస్తే చిన్న బొరియ కని పించింది అది ఎలక చేసిందో లేక
యి పంది కొక్కు వేలి విడిచిన మేన మామదో రేపటి దాక ఆగితే గాని తెలీదు.?
ఇంక గూగుల్ యెంత ఎదిగి పోయిందంటే'' సుజాత గారి ఇంట్లో పార్టీ ఫొటోస్ ''
అని కొడితే మీ ఇంటి లో అప్పుడు జరిగిన పార్టీ ఫొటోస్ కూడా వస్తాయి
యి సారి ట్రై చెయ్యండి.

పరిమళం చెప్పారు...

పాపం ఎంత పనిజరిగింది ? మీ పందికొక్కు కు నా నివాళులు ! మీకు నా ప్రగాఢ సానుభూతి :)
మీ శ్రీమతి సాధించిన విజయానికి అభినందనలు ఏమైనా సత్యభామ అంశ ఉండే ఉంటుందామెకు మొత్తానికి దుష్ట సంహారం కావించి మొక్కలను రక్షించుకున్నారు .

అజ్ఞాత చెప్పారు...

వీవెన్+జ్యోతి=కూడలి
భరారే+మరువం=హారం
మరువానికి పేరడీ
అయింది కాగడాకు ట్రాజెడీ
భరారేకు చెసింది ఫోను
కంచే మెసింది చేను
కొట్టారు కాగడా కంట్లోకారం
తగునా ఈ ఘోరం

అజ్ఞాత చెప్పారు...

ఎంత వారలైనా కంత దాసులే..ఆ.. ఆ.. ఆ...