14 ఫిబ్ర, 2010

మరిచిపోలేని మరోచరిత్ర


ఎప్పటి కి మరచి పోలేని మధురమైన చిత్రం మరోచరిత్ర.అందులో కమలహాసన్ వోలికించిన హావ భావాలూ , బాలచందర్ ఆ సినిమా తీసిన విధానం ,ప్రేమికులు తమ ప్రేమను నిరూపించు కోవడం కోసం వొక సంవత్సరం పాటు కలుసు కోకూడదు , మాట్లాడు కోకూడదు అన్న నిభందన.బాలు ''యి పరీక్షా కి నేనొప్పుకోను , యి వూళ్ళో పాలవాడు , పేపర్ వాడు తో సహా అందరు నిన్ను చూడొచ్చుడామిట్నేన్నేందుకు చూడ కుండావన్ ఇయర్ వుండాలి '' అంటే ''యి వొక్క సంవత్సరం మన జీవితం లో లేదనుకుందాం బాలు,మిగిలిన జీవితం అంతామనదే గా '' అంటూ స్వప్న లాలించి వోప్పించడం .ట్రైన్ లో హైదరాబాద్ వెళ్తూ వొక్క గంటె చూడకుండా వుండడం నా వాళ్ళ కాదనుకుంటూ బాలు కదులుతున్న ట్రైన్ లోంచి దుకేయ్యడం , ఆ వేడి లో స్వప్న వాళ్ళింటికి వెళ్లి మేడ మీద వున్నతన రూం కి పైపు పట్టుకుని పాకుకుంటూ వెళితే స్వప్న వద్దు బాలు వెళ్లి పో మనం ఎలాగన్నా నెగ్గాలి ,మనది ఆకర్షణ కాదు ప్రేమే అని నిరూపించాలంటే నువ్వు యి క్షణమే వెళ్లి పో అంటూ కటువు గా చెపితే బాలు తన బాధని టేప్ లో రికార్డు చేసి మేడ మీదకి విసిరేసి వెళ్లి పోవడం ,ఎప్పుడు ఆ మాటలు వింటూ తన బాధని మరిచి పోయే స్వప్న కి తెలీకుండా ఆమె తల్లి ఆ టేప్ ని మంటలో పడెయ్యడం ,యి వెదవని ఏ కలరా అన్నా వచ్చి తీసుకు పోయినా బావుణ్ణు అంటూ ఆమె తల్లి శాపనార్ధాలు పెట్టినప్పుడే పేపర్ లో హైదరాబాద్ లో కలరా పలువురు మృతి అన్న హెడ్డింగ్ చూసి ఆమె
నల్ల యిరికియా అని పేపర్ లో ఆడ్ వేస్తె దానికి సమాధానం గా నల్ల యిరికేన్ అని బాలు సమాధానం గా ఆడ్ ఇవ్వడం
బాలు ఫోటో ని గ్యాస్ మీద తగలేట్టేస్తే , ఆ నుసి ని స్వప్న కాఫీ లో కలుపుకుని తాగేసి , నా జ్ఞాపకాలని మాత్రం ఎప్పటికి చేరపలేవ్ చూస్తావా అంటూ సముద్ర తీరం లోకి వెళ్లి జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ వచ్చే పాట'' పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు '', బొటనికాల్ టూర్ లో అనుకోకుండా వొకే హోటల్ లో పక్క పక్క రూమ్స్ లో దిగిన స్వప్న ని చూసి తన బాధని వ్యక్తం చేస్తూ ఏ తీగ పువ్వునో ఏకొమ్మ తెనేనో విషాదం లో పాడడం , ఆమె అతనిని కలుసుకోవాలన్న కోరికను చంపుకోవడం కోసం ముళ్ళ శంఖం తో అర చేతిని రక్తం వచ్చేలా గుచ్చు కోవడం ,బాలు ఆవేశం గా ఆమె రూం కి వచ్చి తలుపు కొడుతూ వుంటే స్వప్న బావ ఆమె బ్రా మడత పెడుతూ మీరెవరు అని అడిగితె స్వప్నకి కాబోయే భర్త ని అని సమాధానం చెప్పడం తో అది నిజమో కాదో కనుక్కుందుకు కాలేజీ బస్సు ని కార్ తో వెంబడించి బస్సు లో స్వప్న లేక పోవడం తో వెనుదిరుగు తునప్పుడు అమ్మాయిలు మీరేవరండి అంటే ఐ యామె అ బ్లాడి ఫూల్ అనడం , ఆ వేడి లో విడో అయిన మాధవికి దగ్గరవడం ,బాలు రూం కి వస్తు అతన్ని రెచ్చ గొట్టే పాప , అయినా నిగ్రహం కోల్పోని బాలు ,మాధవి నిజం తెలుసుకుని అతనికి రేపటి తో వాళ్ళ పెద్దలు పెట్టిన గడువు పూర్తయ్యిందని చెప్పి రైల్ టికెట్ కొని పంపడం ,వాళ్ళ అన్న కి విషయం తెలిసి కిరాయి గుండాలని చంపడానికి ఏర్పాటు చేసి ,మళ్ళి చెల్లెలి ద్వార బాలు తప్పులేదని తెలుసుకుని దాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నం అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కాబట్టి విఫలం అవడం ,ఇంకా పతాక సన్నీ వేశం లో ఫోటో గ్రాఫర్ స్వప్న ని రేప్ చెయ్యడం ,బాలు నీకోసం నేనేమి దాచ లేక పోయా యి ప్రాణాలు తప్ప అంటే ,కలిసి జీవించలేక పోయినా మరణం లో అన్న కలిసి పోదాం అంటూ సముద్రం లోకి దుకేస్తుంటే ,ఆ సంవత్సరం మొత్తం ప్రతి రోజు బాలు స్వప్న కోసం రాసుకున్న ఉత్తరాలు గాలిలోకి యెగిరి పోతూ ,వాళ్ళ తో పాటు పైకి పోతునట్టు గా వుండడం వాళ్ళు మరణించడం తో బరువెక్కిన గుండెతో కళ్ళు చమరిస్తుంటే ప్రేక్షకుడు బయటకు రావడం .
ఇంత పెద్ద కధ ని దిల్ రాజు వరుణ్ సందేశ్ తో కొత్త హీరోయిన్ ని పెట్టి తీయడంనా ఉద్దేశం లో ఆత్మా హత్య సదృశ్యమే. అందులో ప్రతీ సన్నీ వేషం అప్పటి కాల మాన పరిస్తితులకి అనుకూలం గా వుంటాయి . ఇప్పుడు సెల్ ఫోన్స్, చాట్ లింగో వచ్చేసిన యి నాటి కాలం లో భాష తెలియని ప్రేమికులు ,కలుసుకోకుండా వుండడం , ఫ్రెండ్ షిప్ అండ్ ఫర్గెట్ అన్న నేటి యువత విధానం లో అది పాత చింత కాయ పచ్చడేమో ?ఇంకా అందులో పాటలు సాహిత్య పరం గా ,సంగీత పరం గా ఆణి ముత్యాలు .ఉదాహరణకి
విధి చేయు వింతలన్నీ మతి లేని చేత లేనని
విరహాన వేగి పోయే విలపించే కధలు ఎన్నో
ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచి పోవగా నిదుర పోయెను ఊర్మిళ
అనురాగమే నిజమని మనసోకటే దాని రుజువని
తుది జయము ప్రేమదేనని బలి అయినవి బతుకులెన్నో .
అప్పట్లో ఆ విశాదాంతాన్ని జీర్ణించుకోలేని కొంతమంది ప్రేక్షకులు బాలచందర్ ని కధ సుఖాంతం చేసి మళ్ళి రిలీజ్ చెయ్య మంటే అయన స్పందిస్తూ సుఖాంతమైతే అది మరోచరిత్ర ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నించేవారు .ప్రేమకి భాష అడ్డుకాదని యి సినిమాలోనే నిరూపించడం కాకుండా బయట కూడా నిరూపించ బడిన సినిమా యిది హిందీ లో కుడా హిట్ అవడం ద్వారా.యి సినిమాలో ఫోతోగ్రాఫేర్ స్వప్నకి వొక సెక్సీ అమ్మాయి ఫోటో చూపించి ఎలా వుందంటే? మీ అమ్మదా? అని అడిగి కట్ చేస్తే వాడు అదే ఫోటో కి స్వప్న తలని మొర్ఫింగ్ చేసి మళ్ళి సారి వచినప్పుడు చూపిస్తే ఆమె చెంప పగల కొట్టడం తో పగ బట్టి రేప్ చేస్తాడు .యిలా కధ లో ప్రతి సన్నీ వేశం కధ గమనానికి తోడ్పడుతూ వుంటుంది .రాజుని చుసిన కన్నులతో మొగుణ్ణి చూడడం కష్టమే . మరోచరిత్రని మరిపించే లా తియ్యడం అసంభవం .అల్ ది బెస్ట్ దిల్ రాజ్ టీం . లెట్స్ వెయిట్ అండ్ వాచ్ .


ఆని ని

14 కామెంట్‌లు:

Phani Yalamanchili చెప్పారు...

అబ్బ ....!! భలే గా కలిసింది ... ఈ రోజు లాప్ టాప్ లో పాటలు వెతుకుతుంటే ..... " భలే భలే మగాడివోయ్ ....... " పాట కనపడింది .... ఇంకా అదే నా ringtone గా పెట్టుకున్నా... ఇంతలోనే మీ పోస్ట్ వచ్చింది .... బాగా రాసారు ....

సుజాత వేల్పూరి చెప్పారు...

అవునండీ, ఈ సినిమాని నిజంగానే మర్చిపోలేం ఎప్పటికీ! మీరు మొదట్లో రాసిన వాళ్ళ ఇద్దరి డైలాగ్స్ కూడా!

ప్రేమ అంటే ఎంత గాఢంగా ఉండాలో, ఎంత నిజాయితీగా ఉండాలో నిజంగా చూపించిన సినిమా!

విషాదాంతం కాబట్టే ఇంత హిట్ అయిందేమో అనిపిస్తుంది.

కొత్తగా మరో చరిత్ర హోర్డింగ్స్ చూస్తుంటే భయంగానే ఉంది మరి!

KumarN చెప్పారు...

హ్మ్మ్..వావ్ చాలా రాసారే. నేనీ సినిమా చూడలేదు. ఎప్పుడో టి వి లో కొన్ని బిట్స్ అండ్ పీసేస్ చూసినట్లుగా గుర్తు, కాని ఇందులో పాటలు నాకిష్టం. దీంట్లోనేనా 'భ్రమలో లేచిన తొలి జాములకి కోటి దండాలూ అన్న చరణం ఉండేది? నాకెంతిష్టమో అది!.

Malakpet Rowdy చెప్పారు...

ఈ సినిమా చాలా చిన్నప్పుడూ చూశా. అసలే మనకి సెంటిమెంటల్ లవ్ స్టోరీలంటే పడదు, పైగా సగం అర్ధం అయ్యీ కాని వయసు - బోరు కొట్టింది. కానీ వాళ్ళు ఎలివేటర్లో పాడే పాట మాత్రం గుర్తుంది .. రాయడానికి ట్రై చేస్తా ..


కలసి ఉంటే కలదు సుఖము
కలసివచ్చిన అదృష్టము

మొనగాళ్ళకి మొనగాడు
దసరాబుల్లోడు
ప్రేం నగర్
సోగ్గాడు
పూలరంగడు
పక్కింటి అమ్మాయి
గడుసమ్మాయి
అమెరికా అమ్మాయీ
రోజులు మారాయి


మంచివాడూ
మామకు తగ్గ అల్లుడు
చిక్కడూ దొరకడు
కదలడు వదలడు
వాడే వీడూ
ఈడూ జోడూ
తోడూ నీడా
నాడూ నేడూ

ప్రేమించీ చూడూ
పెళ్ళీ చేసి చూడు



.. ఇంతే గుర్తుంది .. కరెక్టే వ్రాశానా?

సుజాత వేల్పూరి చెప్పారు...

@ Malakpet Rowdy,
నయం, ఇంతటితో సరిపెట్టారు! అన్ని బ్లాగుల పేర్లు కలిపి ఈ పాటకు పేరడీ రాశారు కాదు.(అయిడియా ఇచ్చానా)

Unknown చెప్పారు...

ఫణీ ధన్యవాదాలు .
సుజాత గారు యి రొజుల్లొ అన్త నిజాయతి తొ కూడిన ప్రెమ అనుమానమె .
కుమార్ యి సినిమా తప్పకున్డా చుడాన్డి.
సమయమ్ కుదిరిన సన్డ్య వెళళకు ,
నిన్ను నన్ను కన్న వాళ్ళకు
మనకై వెచియున్న మున్దు నాళ్ళకు
కొటి దన్డాలు
మనసును హత్తు కునె సాహిత్యమ్

Unknown చెప్పారు...

మన్చిదయ్యిన్ది మలక్ మీకు అర్దమ్ కాక పొవడమ్ లెక పొతె మీరు హెచ్. సి .యు లొన్చి బయట పడే సమయానికి యెన్నొ మరొచరిత్రలు స్రుస్టిన్చి వున్దె వాళ్ళు.పెరడి పాటలు మాత్రమ్ బాగానె గుర్తు వున్టాయి. అదెన్టొ? సుజాత గారి సలహా అలొచిన్చ దగినదె .

Malakpet Rowdy చెప్పారు...

Sujata

Wow thats a good idea!

Malakpet Rowdy చెప్పారు...

LOlz Ravigaru

HCU lo appatike chaalaa unnaai

Malakpet Rowdy చెప్పారు...

మరో సీను గుర్తొచ్చింది. కమల్ హాసన్ ని విశాఖ నించి హైదరాబాద్ కి గోదావరీ ఎక్స్ ప్రెస్ లో పంపిస్తారు కదా. కానీ ఆ రైలుకి ఉండేది స్టీం ఇంజన్ (గోదావరి కి ఎప్పుడూ స్టీం ఇంజన్ లేదు) - That was one big "?" I had in my mind

Unknown చెప్పారు...

అదె సీన్ లొ కమల్హసన్ రైలు వెళుతున్నమార్గానికి అభిమిఖమ్ గా దూకి బట్టలు దులుపుకుని బాగ్ భుజానికి వెసుకుని నడుచు కున్టూ వెల్లిపొతాడు.మాములు గా అయితె కదులుతున్న రైల్ లొన్చి అభిముఖమ్ గా దిగితెనె కిన్ద పడి యెముకలు విరగడమ్ ఖాయమ్ .

ప్రేరణ... చెప్పారు...

నాకు తెలిసినంతవరకు మరోచరిత్ర ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం.

పరిమళం చెప్పారు...

రాజుని చూసిన కన్నులతో మొగుణ్ణి చూడడం కష్టమే . మరోచరిత్రని మరిపించే లా తియ్యడం అసంభవం!ఇది
నిజం రవిగారూ! ఎన్నిసార్లు చూసినా క్లైమాక్స్ లో కన్నీళ్ళని ఆపుకోలేను .

venkatesh eemani చెప్పారు...

marocharitra coosi ceputunnaanu ee cinimaa ni neetga teeshaaru. no volgarity at all. Dailogues by umarji anuradha gaaru are simply superb. very sesible comedy. Especially America Durga and krishnamachari wife satires are sensitive and sweet. All the dialogues are clean no double meanings at all. Healthy romantic comedy. Excellent colourful camera work. Must watch movie for the youth. yes boss