మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
30 మార్చి, 2010
టీవీ ప్రభావమే ఎక్కువ
మొన్న శనివారం సాయంత్రం ఏడుగంటలకి జీ తెలుగు లో నేను కూడా నటించిన''village లో వినాయకుడు ''ప్రసారం అయ్యింది .ఇప్పటికే అందరికి తెలుసు అన్న ఉద్దేశం తో నేను ఎవరికి చెప్పలేదు .ఇంక సినిమా అయిపోయిన దగ్గరనుంచి సెల్ మోగుతూనే వుంది .సినిమాల్లో ఎప్పుడు నటించానని . అవకాశం ఎలా వచ్చిందని వగైరా.ఇంక సోమ వారం ఆఫీసు కి వెళ్ళిన దగ్గర నుంచి వేరే విభాగాల నుంచి కూడా స్టాఫ్ వచ్చి మీరు చాలా నాచురల్ గా చేసారు సార్ , మీలో వొక గొప్ప నటుడు దాగున్నాడు అంటుంటే అది పొగడ్తో , వ్యంగ్యమో తేల్చుకోలేక వొక వెర్రి నవ్వు నవ్వి అంతా మీ అభిమానం అంటూ తప్పించు కున్నా .సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇంత మంది అభినందించలేదు .యి అభినందనల వెల్లువ కి అసలు కారణం అది టీవీ లో అదికూడా శనివారం సాయంత్రం రావడమే అని అనుభవ పూర్వకం గా తెలుసు కున్నా .
విదేశాల నుంచి కూడా ఎప్పుడో విడి పోయిన మిత్రులు కూడా గుర్తు చేసుకుని మరి మాట్లాడడం , రాజోలు లో కిందటి వేసవి ఎండలలో పడ్డ కష్టాన్ని మరిపించింది .ఏమన్నా కీర్తి కోసం పడే కష్టం కన్నా అది వచ్చినప్పుడు పొందే ఆనందం మిన్న .అమ్మో భరద్వాజ్ యి కీర్తి మన rediff నాటి కీర్తి మాత్రం కాదని గమనించ గలరు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్‌లు:
> సినిమాల్లో ఎప్పుడు నటించానని . అవకాశం ఎలా వచ్చిందని వగైరా
ఆ ఫోటో మీదేనా?
ఆ ఫోటో లో వున్నది రావు గోపాలరావు గారి అబ్బాయి రావు రమేష్ ,
నేను కుడా మార్గ దర్శి లో జాయిన్ అయ్యాను వొక చిన్న వేషం వేసుకున్నా
పానీ పూరి గారు .
Dont worry, Sreenivas is gonna write about your Rediff Keerti hehe ..
By the way I'll be watching this movie soon.
శుభాకాంక్షలు
నేను మొన్నే ఈ సినిమా చూసాను...మీరు డాక్టర్ గారేనా??ఆ సినిమాలో..అడాగాలనిపించింది కాని.. ఇన్నాళ్ళకు అడిగితే బాగోదేమో అనిపించింది.. మీ పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు.. ఇంకా మరొక విషయం..మీ అతనెవరు సీరియల్ చాలా బాగా రాసారు.. కాని మద్య మద్యలో హాస్యం పేరిట సీరియస్ గా ఉన్న కధ కాస్తా డీలా పడేలా చేసారు ..( నా అభిప్రాయం మాత్రమే ఇది..మనసు నొప్పిస్తే క్షమించ గలరు ) శైలి మాత్రం అద్బుతం..మీరు చక్కని కధలు , సీరియల్స్ మొదలు పెడితే వ్రాయగలరు అనిపిస్తుంది రాయగలరు..
నేస్తం గారు మీరనుకున్నది నిజమే నేను డాక్టర్ గా వేసిన ఎక్టార్ నే .
ఇంకా మీరిచ్చిన ప్రేరణ తో కధలు రాసేస్తా కాసుకోండి నా నెక్స్ట్ పోస్ట్
కచ్చితం గా మీరిచ్చిన స్పూర్తి తో రాసే కధే
కామెంట్‌ను పోస్ట్ చేయండి