9 మార్చి, 2010

నిషిగంధ గారు థాంక్స్ చిన్న పదమే

అప్పట్లో chimatamusic లో పాథోస్ సాంగ్స్ వింటూ శ్రీని గార్ని మనసులో అభినందిస్తూ ఉండడమే నా నెట్ సర్ఫింగ్ ముక్యోద్దేసం .
ఏది ఏమైనా ప్రేమ వస్తూ తెచ్చే సంతోషం కంటే వెళ్తూ ఇచ్చే విషాదానికే బరువెక్కువ అని పిస్తుంది
పాథోస్ సాంగ్స్ ఉపోద్ఘాతం లో ఆఖర్న చదివిన ఆ సెంటెన్స్ చూసాక అక్షరాలూ మసగ బారాయి కళ్ళలో నీళ్ళు చిప్పిలి . వొక్క మాటలో అంత గొప్ప భావోద్వేగాన్ని నిమ్పగలిగిన ఆ మాటల ఇంద్ర జాలికులు ఎవరా అని చూస్తే ఆఖర్న నాకు కని పించిన పేరు నిషిగంధ .నా మనసులో భావాలకి ప్రతి రూపం ఆమె రాసిన అక్షరాలు .వొకే భావాలూ అంత దగ్గరిగా ఇంకొకరి దగ్గర కూడా ఉంటాయని నేను గ్రహించిన క్షణం అది .కిందకి వస్తే నిషిగంధ బ్లాగ్ అని బానర్ కని పిస్తే క్లిక్ చేశా .అంతవరకూ బ్లాగ్స్ గురించి వినడమే గాని చూసిన మొదటి బ్లాగ్ నిషిగంధ గారి దే .కాలేజీ అబ్బాయి అమ్మాయి ఆఖరి రోజు గుడి కి వెళ్లి వానకి తడిసిన మెట్ల మీద నడుస్తూ ఆమె తన మనసులో మాట చెబుదామనుకుని చెప్పలేక పోవడం గురించి ఆమె రాసిన చిన్న కధ ప్రతి వాళ్ళ జీవితం లో ఎప్పుడో అప్పుడు తారస పడిన కధే .చెప్పే విధానం లో వున్న వైవిద్యం బ్లాగర్స్ ని కట్టి పడేస్తుంది . ఆమె రచనలని విశ్లేసించడం యి టపా ఉద్దేశం కాదు కాబట్టి అసలు యి టపా రాయడం వెనక దాగి వున్నా భయం తో కూడిన భావాన్ని ఇక్కడ వ్యక్త పరుస్తున్నా .
'వొక చిన్నమాట మీతో చెప్పాలని --నిషిగంధ అని హారం /కూడలి లో చూడగానే ఎన్నాలో వేచిన హృదయం -అనుకుంటూ అడుగు పెట్ట గానే అర్ధం అయ్యింది తను బ్లాగర్స్ కి తను యి మద్య ఎక్కువగా రాయక పోవడానికి ఇస్తున్న సంజాయిషీ తో పాటు తనని అభిమానిస్తూ ప్రోత్స హిస్తున్న పాఠకులకి ధన్య వాదాలు తెలియబరిచే ప్రక్రియ లో బాగం గా రాసుకున్న పోస్ట్ అని తెలియ గానే టెన్షన్ మొదలయ్యింది .మెల్లిగా కాఫీ , టీ లేదా మీకిష్టమైన పానీయం తెచ్చుకుని అని రాసారు చిన్న సవరణ కంప్యూటర్ ముందు , కుటుంబ సబ్యులు ఇంట్లో వుండగా అలా ఇష్టమైన పానీయాలు సేవించ గలిగే స్వేచ్చా వాయువులు ఇండియా లోని కుటుంబ వ్యవస్తలో ఇంకా వ్యాపించక పోబట్టే ఇంకా అది గట్టి గా వుంది కాన కాఫీ మాత్రమే తెచ్చుకుని మీరు తల్చుకున్న అభిమానుల లిస్టు చదవడం కోసం మొదటి పేజి క్లిక్ చెయ్య గానే మొదటి గా కనబడిన అక్షరాలు పేరు తర్వాత గారు అని అంటే నా కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చేసి ఇంకేమి చదవ లేక పోయా అంత మంది అభిమానుల్లో ముందు గా తున్డమునేక దంతము అనుకుంటూ సూర్య నమస్కారం పెట్టుకున్టున్నరేమో అనుకుంటూ కలల లోంచి వాస్తవానికి వచ్చే టైం కి మొదటి పేజి అయిపోయింది ,దుర్భిణి వేసి గాలించిన ఆ గారు తప్ప రవి ని గాంచలేక పోయిన కవిని అయి పోతిని .ఇంకా రెండో పేజి చూసే సాహసం చెయ్యలేదు వెంటనే ఎందుకంటె వుహ ఇచ్చిన ఆనందం వాస్తవం ఇవ్వలేక పోవచ్చు .నేనెవరి స్పూర్తి తో నైతే బ్లాగ్ స్టార్ట్ చేసానని గర్వం గా చెప్పు కుంటానో తనే నా ఉనికిని గుర్తించక పోయి నప్పుడు బ్లాగ్ లోకం లో మన్నుటయా ?మరణించుటయా?అని మదన పడుతూ మళ్ళి తీగకు పందిరి కావలె గాని తెలుసా నీవే పందిరని అని పాడుకుంటూ ఊరడించు కున్నా. తన బ్లాగ్ లో పెట్టుకున్న నీడనిచ్చే ఆ చెట్టుకు ఎన్నో ఆకులు ఆమె కి నీడనిస్తుంటే ప్రతీ ఆకూ నన్ను గుర్తు పెట్టుకుందో లేదో అనుకుంటే ఎలా ?మానస వీణ మధుర సంగీతానికి దోహద పడే ప్రతీ తీగా నన్ను గుర్తు పెట్టుకో అంటే ఎలా?యిలా సాగి పోతున్న నా ఆలోచనలకి కళ్ళెం వేస్తూ గుండె దిటవు చేసుకుని రెండో పేజి కి వెళ్ళా .మనకి పరిచయం వున్న పేర్లు ఎర్లై ప్రవహిస్తున్నాయి .పాళీలు .అర్ధాన్గులు , అక్కయ్యలు .భావకులు మళ్ళి వారికి ధన్య వాదాలు , మనసులో మాటలు యిలా సాగి పోతున్నాయి చివరకి తుక్కాసి గ్యాంగ్ మొదలయ్యింది (వెనక వచ్చిన గ్యాంగ్ ను తుక్కాసి గ్యాంగ్ అందురు)ఎవరి పేరు చెపితే మగాళ్ళు కూడా అర్దరాత్రి స్వేచ్చా గా తిరగాలేరో వారి పేరు పక్కన నా పేరు కని పించింది పోనీ ఇటు పక్కన చూసుకుని సేద దీరు దామని చూసి కెవ్వున కేక ,యిది యాద్రుచ్చికమ?లేక బుగ్గ గిల్లి జోల పాడుటయ?పేరున్నదని సంతోషించినంత సేపు పట్టలేదు నా ఆనందం .మీరెప్పుడు అంతే వొక కంట ఆనందం వేరొక కంట విషాదం పంచుతారు మీ రచనలలో .వసంత కోకిల లా అయిపోయిన మీ పోస్త్ద్ నిత్య వసంతం లా మళ్ళి రావాలని ఆశ .ఇంతకీ నా చిన్న మాట నేనింకా చెప్పనే లేదు .పోనిలే మొత్తానికి పేరుంది అని ఎక్కడో మొదటి పేజి లో లేదే అన్న బాధని అదిమి పెట్టుకుంటే అమ్మవారు పులిగోరు రూపం లో ప్రత్యక్షమై మొదటి కామెంట్ లోనే నా పేరు వుంచడం అంతా నిత్యానంద స్వామి వారి లీల కాక మరేవిటి?
థాంక్స్ అన్నది నిజానికి చిన్న పదమే గాని గుండెల్లో నింపుకున్న అభిమానాన్ని ఫీల్ అయ్యేలా చేస్తుంది . అందుకే నన్ను గుర్తు పెట్టుకున్నందుకు, మాటల కందని భావాలూ మంచి మనసును చెబుతాయి ,అందుకే యిది మాట రాని మౌనం మీ రచనల మీద యేన లేని అభిమానం మళ్ళి అందుకోండి వేగం , మానస వీణ లో మరో కొత్త రాగం .
ఇంత పెద్ద భావాన్ని మీ కామెంట్స్ పేజి లో దిమ్పలేక ఇక్కడే రాసుకున్నా అంతే అంతే .మీరన్నట్టు భావం పెల్లుబుకి రాయలనప్పుడే రాయ గలుగుతాం అంతే గాని టైం కంప్యూటర్ ఖాలీ గా వున్నాయని రాస్తే వచ్చేవి ...... యి విషయం లో నేను యింత కంటే ఏమి చెప్పలేను సెలవు నమస్కారం .

6 వ్యాఖ్యలు:

శరత్ 'కాలమ్' చెప్పారు...

Nice!

నిషిగంధ చెప్పారు...

:-) రవిగారు... టీచర్ చాక్లెట్ నాకు ముందివ్వలేదు అని మారాం చేస్తున్న స్టూడెంట్ లా అనిపిస్తున్నారు..

మీ పేరు ఎవరి పక్కన ఉందో మీరు చూసుకుంటున్నారు కానీ నాకు అందరూ అభిమాన పాఠకులే అన్న సంగతి మర్చిపోతే ఎలా చెప్పండి.. ఒకవేళ నేనలా preferences చూపించినా 'అలా చేయడం తప్పమ్మాయ్ ' అని చెవులు మెలేయాల్సిన పెద్దవారు మీరు!

Thanks so much for this post! :-)

Malakpet Rowdy చెప్పారు...

LOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOL ...


నేనెందుకు నవ్వానో రవిగారికీ నిషిగారికీ తప్ప మిగతావారికి అర్ధం కాకపోవచ్చు ... Dont bother too much about it :))

అజ్ఞాత చెప్పారు...

మలకన్నా,నాక్కూడా బాగానే అర్థం అయింది. నేను కూడా LOOOOOOOOOOOL:)))

రవిగారు చెప్పారు...

నిశి అమ్మయీ నిన్ను చిన్న పిల్ల గా చెప్పుకొవడమ్ కొసమ్ నాకు లెనీ పెద్దరికన్ని అపాదిన్చడమ్ మాత్రమ్ యెమి భావొలెదుస్మి
మలక్ యెమన్న సుక్శ్మ గ్రాహి హి హి హి

అజ్ఞాత చెప్పారు...

మలక్ ..
మరి రవిగారు ఎందుకేడుస్తున్నారు? ( పాప ఎందుకేడుస్తోంది? .. వుడ్వర్డ్స్ పట్టమని చెప్పు )

నాకూ ఏమీ అర్థం కాలేదు !

శంకర్ గారు :))))))) ;)