16 మే, 2010

అనుక్షణికం (మూడో భాగం )


నువ్వేమన్నా (ఏకవచనం లోకి మారి పోయి చాలా కాలం అయ్యింది )ఋష్య శ్రున్గున్ని అనుకుంటున్నావా? పొద్దున్నే కాఫీ కప్పు నా చేతిలో పెట్టి రెండు చేతులు గుమ్మం పైన పెట్టి అభిసారిక లా అడుగుతుంటే నవ్వొచ్చింది .పాపం రాత్రి తన అహం దెబ్బ తిని వుంటుంది ,అంత అందమైన ఆమె ముందు కొస్తే , మందు కొట్టి కూడా చలించకుండా త్రునికరించడం తో .
అబ్బే ఋష్య శృంగున్నో?ఇంద్రున్నో అప్పటి కాల మాన పరిస్తితుల బట్టి వుంటుంది .అప్పుడు అలా అయ్యిందని ఎప్పుడు అలానే అవుతుందని గారంటీ ఇవ్వలేను .బట్ ఎప్పుడు అలా అవ్వాలనే కోరుకుంటాను అంటూ తనని మరింత అయోమయం లో పడేసాను .
ఇంతకీ ఇప్పుడు నన్ను ఉండమంటావ ?వేల్లమన్తవా? అంటూ అదే అభిసారిక భంగిమ లో అడిగింది .
నేను తన దగ్గర గా వెళ్లి గుమ్మం మీద నుంచి ఆమె చేతులు దింపే ప్రయత్నాన్ని తప్పు గా అర్ధం చేసుకుని నన్ను హత్తుకుని అలాగే నిల బడి పొతే ఏంచెయ్యాలో పాలు పోక మెల్లిగా ఆమె చెవిలో నేడు పోయి రేపు రా అన్నా .
దానినే ఆమె అంగీకారం గా తీసుకుని అయితే రేపటికోసం ఎదురు చూస్తూ ఉంటా అంటూ వడి వడి గా వెళ్లి పోయింది .
ఆఫీసు పనిలో బిజీ గా వుంటే సెల్ మోగింది ,ఏదో తెలియని ల్యాండ్ లైన్ నెంబర్ . ఎత్త లేదు , మళ్ళి మోగుతోంది విసుగ్గా హలో అన్నా .ఏంటి సార్ అంత విసుగు ?సుధని గుమ్మం మీద కవ్గిలించుకున్నప్పుడు లేదేం యి విసుగు , ఎవరిదో ఆడ గొంతుకు .
ఎయి ఎవరు నువ్వు ? సుధ ఎవరు ?పిచ్చి పిచ్చి గా ఉందా ?
భయపడకండి నేనేమిtv9 ఏంకర్ కాదు ఇదేమి స్త్రింగ్ ఆపరేషన్ కూడా కాదు .ఆమె భర్త కి మీరు గుమ్మం మీద చేసిన సరస సల్లాపాలు తెలిస్తే ?
గొంతు ఎండి పోతోంది , ఇందాకటి మేకపోతు గాంభీర్యం స్తానే అభ్యర్ధన తో కూడిన స్వరం నువ్వెవరు ?నీకేం కావాలి ?
భయపడకండి సార్ నా చిన్న చిన్న కోరికలు మీరు తీరుస్తున్నంత కాలం మీకేమి నష్టం లేదు .
ప్రస్తుతానికి సాయంత్రం ఆఫీసు నుంచి వేల్తునప్పుడు ఫలానా బంగారం షాప్ లో చాల కాలం నుంచి నేనెంతో ముచ్చట పడి ఆర్డర్
చేయించుకున్న నగ సిద్దం గా వుందని ఫోన్ చేసారు మీరు వెళ్లి బిల్ పి చేసి మీ దగ్గర పెట్టు కొండి నేనెల డెలివరీ చెయ్యాలో చెపుతాను
నాకు కోపం నషాళానికి అంటింది గెట్ లాస్ యు బ్లడీ బిట్చ్, నీలాంటి వాళ్ళని చాల మంది నే చుసా , నా తలలో వెంట్రుక కూడా పీక లేరు , వాళ్ళ ఆయనకి కాక పొతే రంకుమోగుడికి చెప్పుకో నా కేంటి భయం అంటూ కోపం గా ఫోన్ పెట్టేసాను
పెట్టేసాక మనసు అల్ల కల్లోలం గా అయిపొయింది అసలే సుధ తో ఎమోషనల్ టెన్షన్ అనుకుంటుంటే
మద్యలో ఈమె ఎవరో బ్లాక్మైలింగ్ వూళ్ళో ఆడవాళ్ళకి తీరిక ఎక్కువలా వుంది డబ్బు పరపతి ఉన్నవాడిని
బుట్టలో వేసుకోవడమే పరమావధి లా పెట్టుకున్నారు .అదే మా వూళ్ళో అయితే కంప్యూటర్ మీద పడి
బ్లాగుల్లో తోచింది రాసుకుంటూ నచ్చని వాణ్ణి కెలుకుతూ కాలక్షేపం చేసేస్తారు అనుకుంటూ పని మీద ద్రుష్టి పెట్టి యి విషయం మర్చి పోయా , వొక గంట పోయాక మా ప్యూను కవర్ వొకటి తెచ్చి ఎవరో చిన్న అబ్బాయి ఇమ్మానాడని ఇచ్చి పోయాడు . పర్సనల్ అని రాసి వుండడం తో ఆత్రం గా ఇప్పి చూసా అంతే అంత సి రూం లోను చమటలు పట్టాయి ,నా కళ్ళు నమ్మ లేక పోతున్నాయి .ఇదెలా సాద్యం ? ఇంతలో మళ్లీ నా సెల్ మోగింది
నిన్దాకటి ల్యాండ్ లైన్ నంబరే ఎత్తగానే మీ వెంట్రుక నేను పీక లేక పోవచ్చు గాని ఫొటోస్ ని
టి వి నైను ఆఫీసు కి పంపితే మాజీ గవర్నెర్ తివారి ని ఆదర్శం గా చేసుకున్న ప్రబుత్వాధికారి అంటూ రోజంతా మీ ఇద్దరి ఫొటోస్ వివిధ భంగిమల్లో చూపించడం ఖాయం , చూసారు గా మీ ఇద్దరు గుమ్మం మీద వాటేసుకున్న చిత్రాలు .సో మీరు సాయంత్రం డెలివరీ తీసుకున్నారని నిర్ధారించుకున్నాక టి వి వాళ్ళకి ఫొటోస్ పంపే నిర్ణయం మార్చుకుంటా అంటూ నాకు మళ్లీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. నెంబర్ అడ్రెస్స్ చూస్తే కాయాన్ బాక్స్ బీ ఎస్ యెన్ ఎల్ వాళ్ళది .ఇంక చేసేది ఏమి లేక సాయంత్రం ఆమె చెప్పిన షాప్ కి వెళ్లి నిందాకా ఫోన్ లో ఆమె చెప్పిన బిల్ నెంబర్ ఇచ్చి దాని కి బిల్లు ఎతైందని అడిగితె అక్షరాల నలభైరెండు వేలు ప్రపంచం లో అత్యంత ఖరీదైన కౌగిలి ఇదేనేమో . కిమ్మనకుండా డెబిట్ కార్డు తీసి ఇచ్ఛా .క్షణాల్లో నలభైరెండు వేలు డెబిట్ అయినట్టు గా నా సెల్ లో సంక్షిప్త సమాచారం వచ్చింది .నేను ఉండ బట్టలేక బిల్లు లో కరెక్ట్ అడ్రెస్స్ రాసార కొంచెం చెప్పండి అన్నా .దానికి షాప్ యజమాని గుంభనం గా నవ్వుతూ మాడం మా రెగ్యులర్ కస్టమర్ సార్ ఆమె కోడ్ నెంబర్ చెప్పి పంపిన వ్యక్తీ దగ్గర డబ్బు తీసుకుని నగ ఇవ్వడమే మా బాద్యత అంతకు మించి వేరే వివరాలు మాకు కూడా తెలీదు అన్నాడు .
అంటే నాలాంటి బకరాలు చాల మండే ఉన్నారన్న మాట యివిడ గారి దగ్గర''బకరా బంగారం షాప్ ''అని బోర్డు పెట్టుకుంటే సరి పోయేది యి వెదవ అనుకుంటూ ప్యాకింగ్ తీసుకుని ఇంటి కొచ్చా .సాయంత్రం నుంచి సుధ ఆపకుండా కొడుతోంది నా సెల్ కి నాకు చిరాకేసి సైలెంట్ మోడ్ లో పెట్టేసి కూర్చున్నా .ఇంటికి రాగానే నీతో అర్జెంటు గా మాట్లాడాలి లోపాలకి రా అంటూ వాళ్ళింటికి తీసుకు పోయి ఎవరో ఆమె తన సెల్ కి ఫోన్ చేసి మీ పై ఇంటి ఆయన తో నీ భాగోతం ఫొటోస్ తీసానని , ఆయన సాయంత్రం తెచ్చే నగని బాలత్రిపుర సుందరి గుడిలో ధ్వజ స్తంభం కింద కవర్ లో పొద్దున్నే అయిదున్నరకి పెట్టి పోక పొతే ఫొటోస్ దుబాయి పంపుతానని చెప్పిందని భోరుమంది .తన సంసారాన్ని నిల బెట్ట దానికి నేను ఎలాగైనా ఆవిడ అడిగిన నగని తెచ్చి ఇస్తే జీవితాంతం రుణ పడి ఉంటానని గోల .
అసలు దొంగ ముండ ఎవరో నంబర్ నుంచి వివరాలు తెలుసుకు చ్చావు గట్టిగానే అరిచా .
ప్రయత్నం చేసానండి , తెలీలేదు . నాకైతే మా వదిన మీదే అనుమానం , ఎప్పుడు మా ఇంటికొచ్చినా కొత్తవి ఏం కొన్నావు అంటూ వొకటే ఆరా , మీ అయన వూళ్ళో లేక పోయినా ఎవరో వొక మగ తోడూ పైన వున్నారులే పాపం అంటూ వెటకారం ,అయినా యి కష్టాలన్నీ మీకు నా వల్లే నే చచ్చి పొతే మీకు ఏ బాధ వుండదు అంది .
నా గుండెల్లో రాయి పడింది అమ్మో తల్లి ఆ పని మాత్రం చెయ్యకు ఇప్పటికే సగం ములిగా నువ్వు చస్తే పూర్తీ గా ములుగుతా ముందు ఈ నగ గుడికి తీసుకెళ్ళి దాని మొహాన్న కొట్టి అదెవరో కని పెట్టె ప్రయత్నం చెయ్యి . అంతే కాదు కొన్నాళ్ళు మెడ పైకి కూదా రాకు ,ఇక నుంచి నీకు నాకు మద్య నిశ్శబ్దం అంటూ నగ ఆమె చేతిలో పెట్టి మెడ మీదకి పోయా ,అనవసరం గా యి ఉచ్చులో ఇరుక్కున్నా చేసింది లేదు సచ్చింది లేదు గాని దూల మాత్రం తీరింది డబ్బు రూపేణా , ఇది ఇంతటి తో ఆగుతుందని నమ్మకం లేదు అయిన ఇంక రెండు నెలల్లో ట్రన్స్ఫెర్ ఎలాగు వచ్చేస్తుంది అంతవరకూ కాలు జారకుండా వుంటే చ్చాలు ఆ పైన కాలర్ ఎగరేసుకుని పోవచ్చు అనుకంటూ చాల కాలం తర్వాత ఇంటికి ఫోన్ చేసి భార్య పిల్లలతో ఆప్యాయం గా మాట్లాడా ఇంకోన్నాల్లల్లో వాళ్ళ ముందు ఉంటానని ఇన్నాళ్ళు చాల మిస్ అయ్యానని చెప్పా ,ఇన్నేళ్ళ వైవాహిక జీవితం లో అన్ని తను కొనుక్కోవడమే గాని నేను భర్త గా తనకి ఎప్పుడు కొన్నది లేదు . అలాంటిది వొక ముక్కు మొహం తెలీని బజారు ఆడదానికి నగ కొని పంపే దావుర్భాగ్యం పట్టింది కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి . పైన ఆకాశం లో జాబిల్లి నక్షత్రాలు వోదారుస్తునట్టు గా అని పిస్తోంది .బట్ట ముళ్ళ కంచే మీద పడింది చిరగ కుండా తీసేసుకుని మా వూరు వెళ్లి పోవాలి అనుకుంటూ నిద్రలో జారుకున్న రేపటి ప్రమాదానికి సిద్ద పడుతూ .

5 కామెంట్‌లు:

Raghav చెప్పారు...

నా ఊహ ప్రకారం ఆ ఇంటి ఓనరే ఈ బ్లాక్ మైల్ చేస్తొంది??

Unknown చెప్పారు...

అలా అనుకునే మన హీరో కుడా బ్రమ పడతాడు
ముందున్నాయి ఊహించని మలుపులు రాఘవ్

Padmarpita చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Padmarpita చెప్పారు...

మలుపులతో కధని భలే మెలికలు తిప్పుతున్నారుగా:)

శ్రీనివాస్ చెప్పారు...

"ప్రపంచం లో అత్యంత ఖరీదైన కౌగిలి ఇదేనేమో"

ఈ విషయం వీలైనంత త్వరగా పిచ్చమ్మ కి చేరవేయాలి