29 మే, 2010

అనుక్షణికం (ఐదో బాగం )

http://moinansari.files.wordpress.com/2008/07/partners-in-crime-taking-a-break-from-the-killing-orgy-a-sadhu-offers-tea-to-a-policeman-in-ahmedabad-on-saturday-march-02-2002-e28094-reuters-photo.jpg

జీపు
వేగంగా పోలీసు స్టేషన్ వైపు దూసుకు పోతోంది .నా మెదడు మొద్దు బారి పోయింది .అసలు ఆమె ఎవరో నేను హత్య చేసానండం ఏంటో ?, వొక వైపు భార్య పిల్లలతో ఆనందం గా గడప బోతున్నా మా వూరు ట్రన్స్ఫెర్ అవడం ద్వారా అని సంతోషం లో నే వుంటే అనుకోని యి ఉపద్రవం విధి వైపరీత్యం కాక మరేంటి .''ఎనిమిషానికి ఏమి జరుగునో ఎవరుహించెదరు'' దూరం గా వినిపిస్తున్న పాట .
ఏం గురువు గారు మర్డర్ వోకటేనా? రాత్రంతా పాప తో కసా బిసా కూడానా ?జర్దా చేత్తో నలుపుకుంటూ వెకిలిగా చూస్తూ అడుగు తున్నాడు ఇన్స్పెక్టర్ .నేను ఉన్నతాధికారి గా జిల్లాలో క్యాంపు కి వెళితే గెస్ట్ హౌస్ బయట కాపలా గా వుండే ఇన్స్పెక్టర్ కి మర్డర్ కేసు లో ముద్దాయి అంటే యెంత లోకువో .
చూడు మిస్టర్ నాకు హత్య కి ఏమి సంబంధం లేదు నేనింకా మీ ఎస్ పీ స్తాయి అధికారినని గుర్తుంచుకో అన్నా .
అబ్బ చా సారూ మన ఎస్పి రాంక్అంటారా పక్కా గా ఛార్జ్ షీట్ రాసి యిరవై నాలుగు గంటలు పోలీసు కస్టడి లో వుంటే ప్రబుత్వ ఉద్యోగి అయినా సస్పెండ్ అవుతాడని సారు కు తెలీదు పాపం .అంటున్నాడు పక్కన పోలిసుల కేసి చూస్తూ .
నిజమే వాడు చెప్పింది .నేనే యి హత్య చేసానండానికి బలమైన సాక్ష్యం ఉంటేనే మీరు నన్ను అర్రెస్ట్ చెయ్యాలి .గొంతులో నిన్దాకటి దర్పం లేకుండా అన్నా .
అవన్నీ ఎఫ్ అయి ఆర్ లో రాస్తాం లే ముందు స్టేషన్ లో కుడి కాలు పెట్టు అంటూ లోపలి కి తోసాడు .చచ్చే అంత అవమానం గా అనిపించింది . జీవితం లో ఎంతో మందికి సాయం చేశా అటువంటింది నాకేమిటి యి శిక్ష అనుకుంటుండగా రైటర్ కి ఇన్స్పెక్టర్ చెప్పుకుంటూ పోతున్నాడు .రైల్లో వొక ఆడ శవం సుమారు పాతికేళ్ళు ,ముద్దాయి తో కలిసి ప్రయాణం చేస్తుండగా పీక నులమ బడి చంపబడిన స్తితి లో వుండగా ఆమె బాగ్ లో వున్న సెల్ లో ఆఖరి కాల్ ముద్దాయికి చెయ్యబడి వున్నది కూపే లో విరిద్దరే ప్రయనిన్చిరి . యీమే వివరాలు.పేరు తరణి , వయసు పాతిక .రైటర్ రాసుకుంటూ పోతున్నాడు .
తరణి , తరణి ఎక్కడో వినట్టు వుంది పేరు ?ఎక్కడా ఆలోచిస్తుంటే గుర్తు కొచ్చింది సుధ కజిన్ , వాళ్ళ ఇంటికి వచ్చేది అని ఇద్దరు చాల క్లోజ్ అని చెప్పింది . అయ్యో అమ్మాయా? మరి అదేంటి రాత్రి అలా వయ్యారాలు పోతూ లక్ష తక్కువయ్యింది ఆపరేషన్ కి అంటూ అలా మాట్లాడింది ,సుధ కి తెలుసో లేదో ఇమే మర్డర్ అయ్యిందని అయినా ఏంటో యి పెంట గోల నా మెడకి చుట్టుకుంది అనుకుంటుంటే సారూ మీరు సెల్ లోకి వెళ్ళండి ఇంక అంటూ కానిస్టేబుల్ లోపలకి దారి చూపుతున్నాడు , అదేంటి నన్ను ప్రశ్నించి వదిలేస్తా అన్నారు గా అంటుంటే మీరు ఇప్పుడు ముద్దాయి మిమ్మల్ని కోర్ట్ లో ప్రవేశ పెట్టాక న్యాయమూర్తి మిమ్మల్ని రిమాన్డులో కి పంపుతారు అప్పటి నుంచి మీకు బైల్ వచ్చేదాకా రిమాండు ఖైది నే , అంటూ లోపలకి తోసి కటక టాలు వేసేసాడు .అయితే వొక అయిదు వేలు మా సారూ కి కొడితే మీకు గుండె నొప్పి తెప్పిస్తాడు తద్వారా మీరు స్టార్ ఆసుపత్రి లో సి రూం లో దర్జా గా ఉండొచ్చు అంటూ చెవిలో చెప్పి వెళ్లి పోయాడు .నా జీవితం లో చిన్న చితక బహుమతులు తప్ప డబ్బు రూపేణా లంచం తీసుకోలేదు అటువంటిది నేను ఇవ్వడమా? సత్యమే వజయతే ఏమైతే అది కాని అనుకుంటూ చతికిల బడ్డా లోపల .
యింతలో చింపిరి జుట్టు బవిరి గడ్డం తో వున్న సాధువుని కూడా సెల్ లోకి తీసుకు వచ్చి పడేసారు . నా కేసి చూసి తెలుసున్న వాడి లా పలకరింపు గా నవ్వితే నే విసుగ్గా మొహం తిప్పేసుకున్నా .
ఏంటి బంగారం సుదకి విరుగుడు ఇచ్చి పంపాను గా వేయించు కోలేదెం ?అంటూ అడిగాడు .
వొక్క క్షణం బాంబు పడినట్టు అయ్యింది ఎయి ఎవరు నువ్వు ?సుధ నీకెలా తెలుసు ?
నాకన్ని తెలుసు భూత భవిష్యత్ వర్తమానాలు కూడా .గుళ్ళో తను అడిగినప్పుడు అన్ని చెప్పా నీ రాజ యోగం , జైలు యోగం వాటి గురించి నీకు చెప్పే వుంటుంది గా ?
వొక్క సారి గా సాధువు మీద గురి కుదిరింది . ఆపద లో వున్నవాడు గడ్డి పోచనైనా పట్టుకుని వడ్డుకు చేరుకోవాలని ఎలా ఆత్రం పడతాడో అలాగే యి పిచ్చి వాడె నాకేదన్నా తరుణో పాయం చెపు తాడేమో ? అని అడుగు దామనుకుంటూ అసలు మీరెందుకు అర్రెస్ట్ చెయ్య బడ్డారు అని అడిగా .
అంతా పైవాడి లీల మనిద్దరం ఇక్కడ కలవాలని రాసుండడం తో అదే రైల్లో ప్రయాణిస్తున్న నన్ను గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మూటా తో కలిపి జీపులో తీసుకొస్తుంటే మూటా సబ్యులు ఇన్స్పెక్టర్ కి డబ్బులిచ్చి వెళ్ళిపోయారు కేసు కోసం నన్ను లాకొచ్చి ఇక్కడ పడేసారు అని చెప్పుకొచ్చాడు .
స్వామి నేను హత్య చెయ్యలేదు నాకసలు ఆమె ఎవరో కూడా తెలిదు ఏడుస్తూ చెప్పుకున్నా .
నా కంతా తెలుసు .నువ్వేమి కలత చెందకు త్వరలో చిక్కు ముడి వీడుతుంది అసలు హంతకులు పట్టు బడతారు .అంటుంటే నే అయన మాటలకిఅడ్డు తగిలి స్వామి మరి మీసంగతో అంటూ అడిగా ?హేళన గా అడిగానా? అనిపించింది .
పిచ్చి వాడా ఇంకొంత సేపటిలో డిజి వచ్చి విడి పిస్తాడు చూస్తూ వుండు అంటున్నాడు .
బయట పోలీసులు అంతా హడ విడి గా వున్నారు , తలలు పట్టుకు కూర్చున్నారు విషయం ఏంటంటే డి జి గారి టీన్ ఏజ్ అమ్మాయి కనబడటం లేదు విషయం బయటకు పొక్క కుండా వెతకాలని బాస్ ఆజ్న . రోజు కాలేజీ కి లోకల్ ట్రైన్ లో వెళ్ళే అమ్మాయి రోజు ఎప్పటి లాగే కాలేజీ కి వెళ్ళింది గాని తర్వాత ఏమయ్యిందో తెలీదు .ఎక్కడినుంచో ఫోన్ చేసి తను తన ప్రేమికుడితో వున్నానని తన కోసం వెతకొద్దని చెప్పి పెట్టేసిందట . ఇంక అప్పటి నుంచి హడావిడి మొదలయ్యింది .అయిదు నిమిషాలకి వొకసారి పొలిసు బాస్ ఫోనులు ఇంకో అరగంట లో ఆచూకి కని పెట్ట పొతే నక్సలైటు ఏరియా కి బదిలీ చేస్తానని .
ఇంతలో యోగి బిగ్గర గా మీ జి గారి అమ్మాయి ఎక్కడుందో నాకు తెలుసు ఆయన వస్తే ఆయనకే చెవి లో చెపుతా అంటూ అరిచాడు .వెంటనే వాళ్ళ ఇన్స్పెక్టర్ బూతులు తిడుతూ లాఠి పట్టుకుని మీదకొచ్చాడు వాళ్ళ డి ఎస్ పి అతన్ని వారించి వుండు ముందు వాణ్ణి చెప్పని అది నిజమైతే మనకి ప్రమోషన్ , తప్పైతే వాడికి యెన్ కౌంటర్ అంటూ దగ్గరికి వచ్చారు .
నేను కేవలం మీ బాస్ కి మాత్రమె చెపుతాను పైన మీ ఇష్టం అంటే వేరే దారి లేక వాళ్ళు ఆయనకి విషయం చేర వేసారు . పది నిమిషాల్లో ఆయన స్టేషన్ కి వస్తే యోగి చెవిలో ఏదో చెప్పాడు , అయన వెంటనే వెళ్లి పోయి గంటలో ఆనందం గా స్టేషన్ కి వచ్చి స్వీట్స్ పంచి కూతురు దొరికిన ఆనందం లో యోగిని విడిపించి తనతో తీసుకు పోయాడు , యోగి వెళ్తూ వెళ్తూ రాజ యోగం కూడా ఉందిలే నాయన అధైర్య పడకు అంటూ నవ్వుతు వెళ్లి పోయాడు .అతను వెళ్ళిన పది నిమిషాలకే ఇన్స్పెక్టర్ వచ్చి సార్ మీకు ఆరోగ్య పరమైన ఇబ్బందులు వునట్టు అయితే హాస్పిటల్ లో జేర డానికి జి గారు అనుమతిన్చ్చారు కేర్ లో అడ్మిట్ కండి బావుంటుంది అక్కడ అంటూ జీప్ లో తీసుకు పోతున్నారు కేర్ వైపు .
యి యోగి జి కి చెప్ప బట్టే యి సౌలభ్యం అని అర్ధం అవుతోంది అయితే జి కూతురు లేచి పోయింది ఎవరి తో ?మళ్ళి ఇంటికి రావడానికి బలమైన కారణాలు ఏవిటో మాత్రం అప్పుడు నాకు అర్ధం కాలేదు . చిక్కు ముడి విడి పోయి నేను నిరప రాదినని విడుదల చేసిన రోజున అసలు హంతకులు దాని వెనక వున్న కధ తెలిసి అవాక్కవడం నా వంతైంది . వారం రోజులు మాత్రం నేను ఇబ్బంది లేకుండా కుటుంబ సబ్యుల పర్య వేక్షణ లో కేర్ లో కేరేఫ్రీ గా వున్నా .తరణి హత్య వెనక వున్న కారణాలు , వెనక వున్న దుబాయి సూత్రధారులు ,మద్యలో నన్ను యిరికించిన పాత్ర దారులు , జి కూతురు ప్రేమ వ్యవహారానికి దీనికి ఏమిటి సంభంధం తెలుసు కోవాలంటే ఇంకో వారం ఆగాలి మరి .

6 కామెంట్‌లు:

నేస్తం చెప్పారు...

బాగున్నాయి ట్విస్ట్ లు..కొన్ని కొన్ని చోట్ల శ్రద్ద పెట్టడం లేదు శైలి లో..బాగుంది ..బాగా రాస్తున్నారు ...మీరు సినిమాలకు ట్రై చేయచ్చు ..ఇంకొక్క విషయం కధకు అవసరం అయినా సరే కొన్ని వ్యంగ్యపు డైలాగులపై శ్రుతిమించకుండా చూడండి.. ఎంతైనా బ్లాగులు కదా... :)

Unknown చెప్పారు...

నేస్తం నాలో నిద్ర పోతున్న రచయితని తట్టి లేపి
కధ రాయమని ప్రోత్సహించింది మీరే ,
మీ కిచ్చిన మాట మీదే రాస్తున్నా
మీ సూచనలు ఆచరణీయం అభినంద నీయం .

Padmarpita చెప్పారు...

రవిగారు కధని ఇలా ఎంతకాలం సాగిస్తారండి:):)

అజ్ఞాత చెప్పారు...

కధ మొదలుపెట్టేంత వరకే మన చేతులో ఉంటుంది. తరువాత కధ కంచికే అని మీకు తెలీదా పద్మార్పితగారు

శ్రీనివాస్ చెప్పారు...

రవి గారు వచ్చేవారం ముగిస్టారా లేక ఇంకా సాగతీస్తారా

Unknown చెప్పారు...

శ్రీనివాస్ తిరుపతి అక్కడనుంచి కోడై కెనాల్ వెళ్ళడం తో
ఇంకా కదా కి ముగింపు చెప్పలేక పొతున్నా
కొన్ని వాస్తవిక సంఘటనలు కూడా ముడి వడి వుండడం తో
హంతకుడు ఎవరో చెప్పడం కష్టమైనా
మంత్రసాని తనం వప్పుకున్నాక ఏమొచ్చినా తప్పదు కదా కానీండి