20 ఫిబ్ర, 2011

చిమట మ్యూజిక్ ఫంక్షన్ అదరహో

ఈ రోజు సాయంత్రం నిజం గా మరువలేని రోజు .నాకిష్టమైన పాటలు www.chimatamusic.comనుండి ఆస్వాదించే నేను ఈ రోజు ప్రత్యక్షం గా అందులోని పాటల్ని ప్రముఖ గాయని గాయకులూ ఆహుతుల సమక్షం లో పాడుతుంటే ,ఆ ఆహుతుల్లో మహామహులైన జానకి ,ఎస్ పీ బి ,లావుబలసరస్వతి ,శోభానాయుడు ,తనికెళ్ళ భరణి ,సి నారాయణరెడ్డి ,వంటి పెద్దల వెనకాలే కూర్చుని ఆస్వాదించడం మరిచి పోలేని అనుభూతి .ఝుమ్మంది నాదం కార్యక్రమం సరిగ్గా సాయంత్రం అయిదు గంటల యిరవై నిమిషాలకి మిత్ర గారు పాడిన ఘనా ఘన సుందర తో మొదలయ్యింది .అప్పటికే ముందు రోలు అన్ని నిండి పోయాయి .కార్యక్రమం మొదలైన కొద్ది సేపటికే హాలంతా నిండి పోయి మేడ పైన కూడా జనాలు కూర్చున్నారు .యింత గొప్ప కార్యక్రమానికి ఆద్యుడైన చిమట శ్రీని ఎవరా అని నాలాంటి వారిలో ఉత్కంట .అయితే ఆయన మరీ వినమ్రత వల్ల కార్యక్రమం డైరెక్ట్ గా పాటల తో మొదలై పోయింది .కనీసం ఈ కార్యక్రమ నిర్వాహకులు వీరే అని సభా ముఖం గా పరిచయం చేస్తే నాలాంటి మౌన ఆరాధకులకి తెలిసేది యిన్నాళ్ళు మన మనసులో తన సైటు ద్వార మనసులు రంజింప చేస్తున మహోన్నత వ్యక్తీ ఇతనే అని .అయితే నేను పట్టు వదలని విక్రమార్కుడిలా అక్కడి వాళ్ళని గమనిస్తూ వీళ్ళల్లో ఎవరై ఉంటారా అని వుహిస్తున్నా . వొక వ్యక్తీ హడా విడి గా వచ్చిన
వి ఐ పీ లని స్వాగతిస్తూ కని పించారు .అతనేనేమో అనుకుంటే ఆయన సంగం అకాడమి అద్యక్షుడు అని తెలిసింది .యిక వుండ బట్టలేక ఎదురు గా కూర్చున్న వ్యక్తీ ని అడిగితె ఆయన బాలు గారి కి దగ్గర గా కూర్చున్న వ్యక్తీ ని చూపించారు .అక్కడ ఆయన అతిధులతో ముచ్చటిస్తూ బిజి గా వుండడం తో పరిచయ కార్య క్రమాన్ని వాయిదా వేసుకుని వాష్ రూం కి వెళ్ళా .ప్రపంచం లో ఎవరు యింత వరకు పరిచయం చేసుకొని అత్యద్బుతమైన వేదిక మీద మా యిద్దరి పరిచయం పక్క పక్కనే నిలబడి ప్రకృతి పిలుపు తో మమేకం చెందుతుంటే జరిగింది . అనుకోకుండా ఆయన వాష్ రూం లో కనబడితే మాట కలిపా ఆయన చాలా బిజి గా వుండడం తో మాట్లాడుతూనే పని కానిస్తుంటే నేను కూడా ఆ సమయాన్ని సద్వినియోగ పరుస్తూ ఆయనని అభినందిస్తూ నా విసిటింగ్ కార్డు జేబులో పెట్టా .డౌన్ టు ఎర్త్ మనిషి .
యింక కార్యక్రమానికి వస్తే మొత్తం యిరవై ఫుల్ పాటలు పదిహేను పల్లవులు వెరసి ముపై అయిదు మూడు గంటలు మూడు నిమిషాల లాగ గడిచి పోయాయి .తనివి తీరలేదే నా మనసు నిండా లేదే అంటూ అక్కడ పాడిన పాటనే అంతా మళ్ళి మళ్ళి పాడు కోవలసి వచ్చింది . ఏ దివిలో విరిసిన పారిజాతమో ,నిన్నటి దాక శిలనైనా ,మా వూళ్ళో వొక పడుచుంది ,కుశలమా నీకు కుశలమేనా ,చినుకులా రాలి , మబ్బే మసకేసింది లే ,యింకా ఎన్నో అద్బుతమైన పాటలు .బాలు గారు , జానకి గారు ప్రతీ పాటని ఆస్వాదిస్తూ తప్పట్లు కొట్టడం వాళ్ళ గొప్ప మనసుకి తార్కాణం . వాళిద్దరూ ఎంతో లీనమై పాటలు వింటూ అలనాటి జ్ఞాపకాలని వొకరి తో వొకరు పంచు కోవడం కూడా నేను గమనించాను .తనికెళ్ళ భరణి గారి శివ స్తోత్రం శాభాసురా శంకరా చాలా బాగా రాసి పాడారని ఆయన్ని ఎదురు గా అభిననదించడం గొప్ప అదృష్టం గా భావిస్తున్నా .అయితే శ్రీని గారు తన సైటు లో తనికెళ్ళ గారి శివ స్తోత్రం పెడతారని ఆశిస్తున్నా .గాయని విజయ లక్ష్మి భక్తీ పాట పాడుతునప్పుడు కూడా ఎల్ ఆర్ యిశ్వరి పాటకి వూగి నట్టు ఊగడం ఆవిడ నైజం అని సరి పెట్టు కోవాలేమో .
శోభ నాయుడు గారు పాటల మద్యలో అయిదు నిమిషాలు మాట్లాడుతూ శ్రీనివాసరావుగారి యింటికి అమెరికా లో వెళ్లి నప్పుడు ఆణువణువూ వాళ్ళింట్లో పాటలు వినిపిస్తూనే ఉంటాయని , వొక సారి కాలిఫోర్నియా లో కార్యక్రమ నిర్వాహకులు చేసిన నిర్వాకం వాళ్ళ మూడు రోజులు డబ్బు తిండి తిప్పలు లేకుండా వున్నా పరిస్తితులలో తన యింటికి ఆహ్వానించి కావలిసిన సాయం చేసారని కొని ఆడారు . అంతే కాదు ఎస్ పి బాలు గారు యింత గొప్ప అభిమాని ని పొందడం ఆయన చేసుకున్న అదృష్టం అన్నారు .
శ్రీని గారు ఈ కార్య క్రమానికి స్నేహితులను కూడా తీసుకు రమ్మనడం తో నో , ఎలాగు కారు లో వొక్క డమే పోతున్నాము కదా అని యింకో బ్లాగు మిత్రురాల్ని వస్తారా అంటే ఆమె సకుటుంబ పరి వారం గా వచ్చారు , అక్కడ తన ఊరైన పిడుగురాళ్ళ దగ్గర శాంతినగర్ వాసుల్ని కని ఉబ్బి తబ్బిబ్బు అయి పోయారు . అయితే వాళ్ళ అబ్బాయికి ఈ పాత పాటలు నచ్చక వెళ్ళిన అరగంటకే పోదాంపోదాం అనడం తో నా గుండె ఘుభేల్ మంది .ఆ నస కాస్తా పాటలు అయి పోయి పుస్తకావిష్కరణ సమయానికి పరా కష్ట కి చేరు కోవడం తో గతి లేని పరిస్తుతలలో తిరుగు ముఖం పట్టవలసి వచ్చింది . అందు చేత వక్తలు శ్రీని గారి గురించి , ఆ పుస్తకం లోని ఆ పాత మధురాల సంగీత దర్శకుల గురించి ఏం చెప్పారో వినే భాగ్యం మాత్రం దక్కలేదు .మొత్తానికి యిది వొక మరుపు రాని మధురమైన గొప్ప అనుభూతి అన్ని విధాల .

11 కామెంట్‌లు:

Tejaswi చెప్పారు...

నేను కూడా వచ్చానండి ఫంక్షన్ కి. చక్కగా నిర్వహించారు. నేను బాలుగారు మాట్లాడినదాకా ఉండి వచ్చేశాను.

అజ్ఞాత చెప్పారు...

బాగుందండి. బాగా ఎంజాయ్ చేసారని తెలుస్తూంది.

నిషిగంధ చెప్పారు...

ఈ కార్యక్రమం గురించి ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా అని ఎదురుచూస్తున్నానండి.. అక్కడి నించి వచ్చీ రాగానే మీరు టపాయించినందుకు బోల్డన్ని ధన్యవాదాలు.. ఈ కార్యక్రమం కోసం శ్రీని గారు గత నాలుగైదు నెలలుగా చాలా శ్రమపడ్డారు! ఆ శ్రమకి ఫలితం మీమాటల్లో వింటుంటే చాలా సంతోషంగా ఉంది.. :-)

Unknown చెప్పారు...

అయితే శ్రీనిగారిని బాత్రూంలోకూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదన్నమాట. వచ్చినవాళ్లకి గిప్టులు తగ్గాయి ఎలాగా అని ఆయన ఆలోచిస్తూ లఘుశంక తీర్చుకుంటుంటే అప్పుడే మీ పరిచయ కార్యక్రమం. అదిరింది సార్. ఒకచేత్తో మీ విజిటింగ్ కార్డు ఆయన జేబులో పెట్టిన మీ నేర్పు అద్బుతం. పాపం కార్యక్రమ నిర్వాహకుల్ని చూస్తే జాలేస్తుంది. అందరూ కలిసి పాటలు ఎంచక్కా వినేసి పుస్తకాలు అమ్మే టైముకి టాటా చెప్పి దొబ్బుకొచ్చేసారన్నమాట. ఇండియన్సా మజాకా. పోగ్రామ్ ఎలాగూ ఫ్రీనే. పుస్తకం కూడా ఫ్రీగా ఇస్తే తీసుకునేవాళ్లంగా. చిమటావారు ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో.

సుజాత వేల్పూరి చెప్పారు...

గాయని విజయ లక్ష్మి భక్తీ పాట పాడుతునప్పుడు కూడా ఎల్ ఆర్ యిశ్వరి పాటకి వూగి నట్టు ఊగడం ఆవిడ నైజం అని సరి పెట్టు కోవాలేమో .......

చప్పట్లు!:-))

నేను ఎంతగానో ఈ కార్యక్రమానికి వద్దామని అనుకున్నాను గానీ అనివార్య కారణాల వల్ల చివరి నిముషంలో రద్దు చేసుకోవలసి వచ్చింది. రాలేకపోయాను. టీవీలో కూడా కవరేజ్ ఏమీ ఇచ్చినట్లు లేదు. పేపర్లో కూడా చూశాను. ఏమీ లేదు. బహుశా నాంపల్లి జోన్ ఎడిషన్ లో ఇచ్చారేమో!

మొత్తానికి మీ ద్వారా విషయాలు తెలిసాయి, థాంక్సులు

అజ్ఞాత చెప్పారు...

రిలీస్ చేసిన బుక్కు సేల్స్ మాత్రం ముదరహో ముదరహ

Unknown చెప్పారు...

నిషిగంధ గారు నేను బ్లాగు మొదలు పెట్టిన కొత్తల్లో చెప్పినట్టే
నెట్ అంటే చిమట మ్యూజిక్ పాటలు వినడమే అనట్టు గా వుండే నాకు
పాథోస్ కి మీరు రాసిన ముందు మాట చదివి అక్కడే వున్న మీ బ్లాగ్ లింక్ ద్వారా
మీ బ్లాగ్ లోకి రావడం తో నాకు బ్లాగ్ ప్రపంచం తో సంభంధం ఏర్పడింది .
శ్రీని గారి తో ముచ్చటించిన ఆ రెండు క్షణాల్లో మీ పేరు కూడా దోల్లిన్చినా ఆయన కి సింక్
అయినట్టు కనబడలేదు ఆయన వున్న ఆ హడా విడి లో .
వారి శ్రీమతి ఆయనకున్న పాటల అభిమానాన్ని తెలివిగా ఉపయోగించుకుని వోకో సారి సరైన వంటకాలు
చెయ్యనప్పుడు భోజనం కి రాగానే పాత పాటల పర్ణశాల లో ఆయనకీ యిష్టమైన పాటల్ని పెట్టగానే ఆయన
పదార్ధాల గురించి కూడా పట్టించు కోకుండా లీనమై పోయి మజ్జిగ తో చేతులు కడిగేసుకున్న వైనాలని కూడా వ్యాఖ్యాత
మురళీకృష్ణ ఉటంకించారు .శోభానాయుడు ఈ హాలంతా యింతగా నిండి పోవడం నాకు తెలిసి యిదే మొదటి సారని గుర్తు చేసుకున్నారు .
సుజాత గారు మీరు తప్పకుండా వస్తారనుకున్నా ఆ ప్రోగ్రాం కి, అయినా లంక మేత గోదారి ఈత అని మీ ఊళ్ళోంచి ట్రాఫ్ఫిక్ పద్మ వ్యుహ్యాన్ని చేదించుకుని వచ్చేటప్పటికి శ్రీని గారు అమెరికా కూడా వెళ్లి పోయి వుంటారు .
రాజేష్ గారు చేతులు జోడించి తప్పట్లు కొట్టిన వాళ్ళే కాకుండా జేబులో చేతులు పెట్టి పుస్తక ఆవిష్కరణకి ముందే కొన్న వాళ్ళు కూడా కని పించారు .సభ కి ముందే నిష్క్ర మించిరావడం వల్ల నాకు బాలు గారి సంతకం తో పుస్తకాన్ని పదిల పరుచుకున్దామన్న ఆశ తీర లేదు .

Unknown చెప్పారు...

'మొత్తానికి యిది వొక మరుపు రాని మధురమైన గొప్ప అనుభూతి అన్ని విధాల'

హౌస్ ఫుల్లూ కలెక్షన్ నిల్లు అన్నట్టు, మిగిలిపోయిన పుస్తకాల బండిల్స్ చూసుకుని చిమటా శీని గారికి దురద గుండాకు ఒళ్ళంతా పూసుకున్న మధురానుభూతి మిగిలింది.

Malakpet Rowdy చెప్పారు...

Ravigaru

A quick question not related to thae post. Can you tell me the exact date on which Godavari express got flagged off first time?

ChimataMusic చెప్పారు...

Ravi gaaru,
Thank you very much for your kind review. Pl. stay in touch. My email id is chimata.music@gmail.com

Nishi gaaru,
Thanks for sending me this link.

Rajesh gaaru,
You are 100% right in the book sales. oka 100 books dAkA pOyAyi. avi kUDA balavantAna maa friends, relatives "anTagaTTam" valla pOyAyi.

KGB చెప్పారు...

సైట్ లోనికి ఎలా వెళ్లాలి