సుధ అలాచేస్తుందని అనుకోలేదు .తెలిసిన దగ్గరనుంచి మనసు కకా వికలం అయిపొయింది .ప్రాణ స్నేహితుడని పరిచయం చేస్తే వెంకట్ కూడా చివరికి నా పరోక్షం లో ఆమె యింటికి వెళ్లి , ఛి ఛి తలచుకుంటేనే చాలా కోపం గా , కసి గా వుంది .చ అసలు తప్పంతా నాది ఏదో ఆఫీసు పని మీద వెంకట్ హైదరాబాద్ పొద్దున్నే వచ్చి మధ్యాన్నం వెళ్ళిపోతానంటే , నేనే అనవసరం గా నా ఫాక్టరీ కి వస్తే అక్కడినుంచి సుధా వాళ్ళింటికి వెళ్లి లంచ్ చేద్దాం అన్నా .తీరా తను ఫోన్ చేసిన టైం కి ఫ్యాక్టరీ తనిఖి కి అధికారులు వస్తున్నారంటే వీలు పడక యింకో సారి వెళదామని చెప్పేసా . తీరిక చిక్కాక సుధ కి ఫోన్ చేస్తుంటే ఎత్త లేదు . ఎన్ని సార్లు చేసినా స్పందన లేదు .అలా ఎప్పుడు జరగదు ,నా కాల్ కోసమే వేచి వుండే దానిలా ఎప్పుడు వొకటి రెండు రింగ్స్ లోపే ఎత్తేస్తుంది . అలాంటిది ?భర్త పిల్లలు వెళ్ళిపోగానే యింట్లో పనులు చేసుకుంటూ నాకు తీరిక దొరికినప్పుడు సెల్ చేస్తే మనస్పూర్తిగా ప్రేమ పూర్వకం గా మాట్లాడేది .కొంప తీసి తనకేమి కాలేదు గదా .మనసు ఏదో కీడు ని సంకిస్తోన్డి . ఆ కీడెదో నాకే అని ఆ క్షణం లో నాకు తెలిలేదు .
పాపం వెంకట్ కి సుధ వాళ్ళింట్లో లంచ్ ప్రోమిస్స్ చేశా , ఫాక్టరీ లో పని వల్ల కనీసం కలవడం కూడా పడ లేదు అనుకుంటూ తన సెల్ కి ఫోన్ చేశా ఆశ్చర్యం రింగ్ పోతున్నా మీరు మాట్లాడ దాల్చిన కస్టమర్ ప్రస్తుతం స్పందించడం లేదు అనే వస్తోంది .అవును మరి వేరే చోట స్పందిస్తున్నప్పుడు యిక్కడ ఎందుకు స్పందిస్తాడు .మనసు పరి పరి విధాల పోతోంది .కొంప తీసి నేను లేకుండా వాడు సుధ వాళ్ళింటికి భోజనం వంక తో పోలేదు కదా ?. ఆ ఆలోచన వచ్చిన మరు క్షణం వాళ్ళ యిద్దరి సెల్ల్స్ కి నా సెల్ల్స్ ద్వారా ఆపకుండా కొట్టడం మొదలెట్టా .వొక వేళ నే అనుకున్నదే జరిగితే యింట్లో యింత సేపు సెల్ల్స్ మోగుతున్నా తీయ్యక పొతే ఏ పక్కింటి పిన్ని గారో వచ్చి తలుపు కొట్టి వీళ్ళు హద్దులు దాట బోతే అవరోధం కల్పించక పోతుందా అన్న చిన్న ఆశ .
చివరికి సుధ ఎత్తింది ''హలో ఏంటబ్బా నువ్వు రాలేదు పాపం వెంకట్ వొక్కడే స్వీట్స్ పట్టుకుని వచ్చాడు ,'' అంతే నా గుండె పగిలింది ఏం చెపుతోందో కూడా అర్ధం కావటం లేదు . నా కు పరిస్తితి అర్ధం అయ్యింది .వెంకట్ సంగతి నాకు బాగా తెలుసు మంచి వాడే కాని రెచ్చ గొట్టే పరిస్తితుల్ని ఎదుర్కొని మరి పునితుడిలా వచ్చే అంత మంచివాడు మాత్రం కాదు . సుధ కూడా స్వత హాగ మంచిదే గాని ఆ మంచి తనం మగాడు ముందు అడుగు వేసే వరకే అంతే ఆ తర్వాత అతనికే అంకితం అయిపోయేంత మంచి తనం . నా లో వుండే ఆ చొరవ ఆమె లోని ఈ మంచి తనమే గా రెండేళ్ళ క్రితం మమ్మల్ని దగ్గరికి చేర్చింది .అయితే మేము తప్పు చేసేసామని గాని చెయ్యలేదని గాని చెప్పలేని అయోమయ స్తితి లో ఉన్నామని మాత్రం చెప్పగలను . ఈ అయోమయపు అద్వాన్న స్తితికి కారణం ఆమె ప్రేమ మూర్తో లేక కామ మూర్తో తెలుసుకునే వరకు ముందుకి పోకూడ దన్న నా నిర్ణయమే గావచ్చు .
రెండేళ్ళ క్రితం అర్జెంటు గా ఆడిట్ ఎకౌంటు లో మా చార్టెడ్ ఎక్కవంటంట్ సంతకం అవసరం పడి వాళ్ళింటికి వెళ్ళా .ఆదివారం కావడం తో అతన్ని యిబ్బంది పెట్టడం యిష్టం లేక .కాఫీ కప్పుతో అతని భార్య గా సుధ అక్కడే నాకు పరిచయం .మనిషి ని చూడగానే నే అందగత్తె అని తీర్మానించక పోయిన చక్కటి శరీర సౌష్టవం తో ఆకర్శ నీయం గా వుండే చురుకైన పిల్ల అని మాత్రం చెప్పక తప్పదు .ఆమె ని పరిచయం చేసిన రెండు నిమిషాలకే మా ఆడిటర్ కి సెల్ రావడం తో సార వన్ మినిట్ అంటూ మెట్లెక్కి పైకి వెళ్ళాడు . ఆ గదిలో మేం యిద్దరమే నా యిబ్బంది గమనించి ఆమె మాటలు కలిపింది . ''యీయన ఎప్పుడు యింతే నండి యింట్లో వున్నా లేనట్టే ఎప్పుడు ఆ సెల్ కి అంకితం ,ఏమి వండాలో కూడా నేను సెల్ లోనే అడుగుతా'' అంటూ పక పకా నవ్వింది .
ఆమె చొరవ , మాట్లాడే విధానం చూసి ముచ్చటేసి ''అంతే నండి అంతా సెల్ బతుకులు అయి పోయాయి , అందుకే మా ఆడిటర్ గారు సెల్ లో కూడా దొరకరన్న మాట , ఈ సారి మీ నంబర్ తీసి కూడా పెట్టుకోవాలి కనీసం మీ ద్వారా అన్న వారి తో మాట్లాడం సులభం'' అన్నా మాట కలుపుతూ ,.
ఈ సారి దాక ఎందుకండి యిప్పుడే తీసుకోండి అంటూ తనే చొరవగా నా చేతిలోంచి నా సెల్ తీసుకుని రింగ్ చేసి సేవ్ చేసుకోండి సుధ అని చెప్పి మరి యిచ్చింది .అప్పుడు రెండు సార్లు కూడా వేళ్ళు తగలడం యాదృచ్చికమే అనుకున్నా . .మా ఆడిటర్ రావడానికి అరగంట పైనే అయ్యిందని అతను వచ్చి చెప్పేదాకా నాకు తెలీనే లేదు .ఈ అరగంట లో యిద్దరి లోను చొరవ ఎక్కువే కాబట్టి చాలా విషియాలు మాట్లాడు కుంటూనే కళ్ళతో మరెన్నో విషియాలు చెప్పుకున్నాం .
మీరు నవ్వితే చాలా బావున్నారు అనేంత చొరవ అరగంటలో వస్తుందా అంటే అప్పటి కాల మాన పరిస్తుతల బట్టి ఉంటాయని చెప్పక తప్పదు .
''నేను నవ్వక పోయినా కూడా బానే ఉంటా వనే వాళ్ళు కూడా వున్నా రండోయి '' అంది తను నవ్వుతూ .
''అంటే వాళ్ళు మీ మోము మీద ద్రుష్టి పెట్టలేదని అర్ధం'' నోరు జారానని నాలుక కర్చుకున్నా ఎలా స్పందిస్తుందో అని భయ పడుతూ .
''పోనీ లెండి కనీసం మీరన్న మోము మీద మాత్రమె ద్రుష్టి పెట్టారు'' అంది
నే స్పందించే లోపే మా ఆడిటర్ ''సారీ అండి మిమల్ని వెయిట్ చేయించాల్సి వచ్చింది , సుధా సార్ కి కాఫీ ఇచ్చావా? ''అని అడిగాడు .
''కాఫీ తో పాటు మీరొచ్చే దాకా కంపెనీ కూడా యిచ్చా'' అంది . ఆమె తెగువ గల మగువ అనుకోవాలో ?లేక భార్య భర్త మద్య వున్న అవగాహనా అనుకోవాలో తెలిలేదు ఆ క్షణం లో .
నేను కార్ లో వస్తోంటేనే మెస్సేజ్ పంపింది ''థాంక్స్ ఫర్ యువర్ కంప్లిమేంట్ ''అని .అమ్మో నేర జానే మనం తగ్గ కూడదని నేను కూడా ''సుధ చేతి కాఫీ కి కరిగానా రెండో సారి అడగడం మరిచానా ?'' అని పంపా .
''మీ ఆతిద్యం కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే వుంటాయి '' తన స్పందన
''మీ తలపులతో ఆ తలుపు త్వరలోనే ఎప్పుడో కొడతాను '' నా సమాధానం .
''సేఫ్టి ఫస్ట్ స్పీడ్ నెక్స్ట్'' అని తను యిలా మొదలైన మా పరిచయం రోజు కి కనీసం గంట అన్నా మాట్లాడుకునే స్తితి కి వెళ్లి పోయింది . వొక రోజు తనే భోజనానికి పిలిచింది వాళ్ళ ఆయన వూళ్ళో లేని రోజు . నేను తట పటా ఇస్తూనే వెళ్ళా .
తను చీరలో చాలా అద్బుతం గా వుంది . కొసరి కొసరి దగ్గర గా వుండి మరి వడ్డించింది .
'' మీ హబ్బి చాలా అదృష్ట వంతుడు చక్కటి విందు భోజనం రోజు అన్నా ''
''ఆస్వాదించి అభినందించే వాళ్ళకి భోజనం పెట్టడం నాకు ఆనందం అంది ''. దానిలోని విస్తృత అర్ధం ఈ రెండేళ్లలో యిప్పటికి అర్ధం అయ్యింది .ఆ రోజు భోజనం అయిపోగానే వెంటనే రాలేక పోవడానికి ఆమె సాన్నిహిత్యం లో చేతులు ప్రేమ పూర్వకం గా పట్టుకుని తన గతం లో పెళ్ళయ్యాక యింకో వ్యక్తీ తో జరిగిన ప్రేమ కధ , అతను దాన్ని కామకధ గా మార్చిన వైనం , దాంతో తను యిప్పటికి గిల్ట్ ఫీల్ అవుతూ ,. తను ఏదో చెబుతుంటే నా చేతులు అపబ్రమ్సం చెంద బోతుంటే
అసలు ''ఈ ప్లేటోనిక్ లవ్ మీద మీ అభిప్రాయం ఏవిటి ?మగాళ్ళు శరీరాన్ని కాక మనసుని ప్రేమించ లేరా ?ఆడ మగ మద్య ఎలాంటి సంభందమైన గమ్యం చివరికి సెక్స్ కి మాత్రమె దారి తీస్తుందనే మా అయన వాదన తప్పు అని నిరూపించా లేనా ?''సూటి గా బాణం లాదూసుకొచ్చిన ఆ ప్రశ్న కి శరీరం లో నా భాగాలు మళ్ళి నా స్వాధీనం లోకి వచ్చాయి చేతులు కట్టుకుని వివేకానందుడి లా పెట్టుకుని'' చూడు సుధా యిప్పుడు యిక్కడ మనిద్దరం మాత్రమె వున్నాం .క్షణికావేశం లో తప్పు చేస్తే వచ్చే ఆ సుఖం కన్నా ఇలాంటి విపత్కర పరిస్తితులలో కూడా తప్పు చెయ్య కుండా మీ గుమ్మం బయట అడుగు పెట్టినప్పుడు వచ్చే ఆనందం మిన్న నా లెక్క లో అదే ప్లాటానిక్ లవ్'' అన్నా
అంతే ఆమె కళ్ళల్లో ఆనంద భాష్పాలు వెంటనే నన్ను గట్టి గా హాగ్ చేసుకుని నా అన్వేషణకి ఆఖరి మజిలి నువ్వే అంటూ అలా వుండి పోయింది .
డైలాగు అయితే వివేకానందుడి రేంజ్ లో కొట్టినా అప్పటి ఆ భంగిమలో మళ్ళి నాలో రాక్షసుడు విజ్రుమ్బించి నా లో యింకో కోణం కనబడ కుండా యింక వుంటానురా థాంక్స్ ఫర్ ఎవెర్య్ థింగ్ అని నుదుట మీద బుగ్గ పెట్టుకుని బయటకు వచ్చేసా . అది మొదలు ఆమె లో నా మీదా మరింత ఆరాధన భావం కలిగి తన జీవితం లో జరిగిన అన్ని సంఘటనలు , జీవితం లో ప్రవేశించిన మగాళ్ళు అందులో పరిధిని దాటిన వాళ్ళు దాటని వాళ్ళు యిలా మొత్తం చెప్పేసింది .రోజులు గడుస్తున్న కొద్ది ఆమె మీద కూడా నాకు ప్రేమ పెరిగి పోయి అది కాస్త పోసేస్సివే నెస్ గా మారి పోయింది .అదుగో అప్పుడు పుట్టిన వొక వేదవాలోచనే ఈ వెంకట్ గాన్నిపరిచయం చెయ్యాలనుకోవడం . నా ఆలోచన ఏంటంటే ఈమె ప్లేటోనిక్ లవ్ కేవలం నాతోనేనా ?