18 డిసెం, 2011

ఆమె తోటి మాటుంది (చివరి బాగం )



కారు సుధా వాళ్ళ యింటి వైపు దూసుకు పోతోంది .ఎందుకన్నా మంచిదని తను వుందో లేదో తెలుసుకోవడానికి సెల్ కి చేశా , ఎత్త గానే ''మీ యింటి కోస్తున్నా చివరి సారి మాట్లాడ డానికి'' అన్నా .తను కంగారు గా ''వద్దు యిప్పు డో ద్దు మా కజిన్ హరిణి వచ్చింది '' అంది .మీ కజినే కాదు మీ అయన వున్నా సరే నేను ఆఖరి సారి వచ్చి వెళ్లి పోవలసిందే అంటూ ఫోనే పెట్టేసి వాళ్ళింటికి చేరు కున్నా.
.బెల్ కొట్ట గానే మొఖం లో నవ్వు పులుముకుని'' రండి రండి ఆయన మీ దగ్గరకే బయలు దేరారు లేట్ అయ్యిందని '' అంటూ కళ్ళతో వెళ్లి పో అనటు గా సైగ చేస్తోంది . లోపల డైనింగ్ టేబుల్ దగ్గర హరిణి కూర్చుంది . నన్ను చూస్తూనే హలో సార్ అంటూ చేతులు కలిపింది .
యిక్కడ హరిణి గురించి చెప్పుకోవాలి . ప్రపంచం లో అతి తొందర గా డబ్బు సంపయిన్చేయ్యాలి ''ఎలా'' అన్నా సరే అన్న దృక్పదం ..పాతికేళ్ళు వచ్చి డిగ్రీ పాస్ అయినా ఎక్కడ స్తిరమైన వుద్యోగం చెయ్యదు .పని చేసే చోట బాస్ ని బుట్ట లో పడేసి హోటల్స్ లో , మాల్ల్స్ లో డబ్బులు ఖర్చు  పెట్టించి యిద్దరి మోజూ  తీరాక అతను ఆఫీసు లో పని గురించి అడగ గానే బయటకు వచ్చేస్తుంది .అసలు సుధ ని చెడ గొట్టింది హరిణే అని నా ప్రగాఢ విశ్వాసం .తను ఎవరెవరి తో ఎలా ఎంజాయ్ చేసింది పూస  గుచ్చినట్టు చెప్పేది .అదేంటే అది తప్పుకదా ?పెళ్ళికి ముందే ఇలాంటి వేషాలు ? అని సుధ అడిగితె అంటే
''పెళ్ళయ్యాక వేస్తె తప్పు లేదనే గా ?చూడక్కా ఆకలి వేసినప్పుడు తిండి తినడం యెంత సహజమో ,కోరిక కలిగినప్పుడు తీర్చు కోవడం కూడా అంతే .అయితే అది యింటి తిండా ?బయటి తిండా ?అన్నది మన ఆకలి బట్టి వుంటుంది .''
ఈ మాటలేసుధ  బాగా వంట బట్టించు కునట్టు గాఅనిపిస్తుంది .
  హరిణి హలో అంటూ చేతులు కలప గానే అంతకు ముందు ఫోన్ లో సుధ మూలుగులు విని నే పడ్డ వేదన గుర్తుకు వచ్చింది . అంతే తనకి కూడా అదే బాధ కలిగిద్దామన్న ఉద్దేశం తో ఆమె చెయ్యి వదలకుండా దగ్గరగా వెళ్లి హాగ్ చేసుకుని భలే స్లిమ్ గా తయారయ్యవే ?ముద్దోస్తున్నావ్ .అని వోరకంట సుధ ని గమనిస్తున్నా కళ్ళల్లో ఏదన్నా బాధ కని పిస్తుందేమో అని ..అటువంటి ఛాయలు కూడా ఎక్కడా లేవు. పై పెచ్చు అదేమీ పట్టించుకోనట్టు గా కాఫీ తాగుతారా ?అని అడిగింది .నేను ఖంగు తిన్నా .వెంటనే హరిణి ని వదిలి సుధ జబ్బ పట్టుకుని
''ఎందుకు చేసావా పని ?'' అని కోపం గా ప్రస్నిన్చా . ఆమె ఏ మాత్రం తొట్రుపాటు పడకుండా
ఏ పని ?అని అడిగింది . ఎదురుగా హరిణి లేకపోతె పచ్చి బాషలో చెప్పి చెంప పగల గొట్టి వుండే వాణ్ణి . వొక పక్క దుక్కం కోపం కలగలిపి వస్తుంటే ఆమె ని దగ్గర గా లాక్కుని'' అలా చెయ్య కుండా ఉండవలసింది .పోనీ ఇకనుంచి భవిష్యత్తులో ఆలా జరగదని మీ పిల్లల మీద వొట్టేసి చెప్పు'' . అన్నా .
అదేంటి అది నేనెలా చెప్పగలను?నేనేమన్నా కావాలని చేసానా ?అప్పటి  పరిస్తితుల బట్టి అలా జరిగి పోతుంది . చూడు హరిణి యీయన, లావయి పోతానని డాక్టర్స్ స్వీట్స్ తినోద్దంటే మధ్యాన్నం రెండు స్వీట్స్ కడుపు నిండా తింటే ఎందుకు చేసావా పని యింకేప్పుడు చేయ్యకని యెంత ఫీల్ అవుతున్నారో ?అయినా  మా ఆయనే ఫీల్ కారు మద్యలో మీరేంటి ?అంటూ కవర్ చెయ్యడానికి ప్రయత్నిస్తోంది .
''అసలు నువ్వు యిలా తయారవడానికి కారణం మీ అయన నిన్ను అసలు పట్టించుకోక పోవడమే దాంతో నీకు
ఆకలి వేసినప్పుడల్లా ఏది పడితే అది తినేస్తున్నావ్ . నీ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాక మా ఆరోగ్యం కూడా పాడు చేస్తావ్వ్ అందుకే ఈ బాధ ''  మా యిద్దరికే అర్ధం అవుతుందనే బ్రమలో నా సమాధానం .
అప్పటికే హరిణి నేను ఆమె ని జబ్బ పట్టుకోవడం ఏక వచన ప్రయోగం , అదికాక ఇలాంటి విషయాలలో మా కంటే రెండాకులు ఎక్కువే చదివింది కాబట్టి మొత్తం విషయం అర్ధం చేసుకునట్టే అనిపించింది
.తనే టాపిక్ మారుస్తూ సార్  వి ఆర్ వో పోస్టులు పడ్డాయి కదా నాకు బాగా పరిచయం వున్నా వొక అయ్యేయస్ ఆఫీసర్ నీకు తప్పకుండా ఆ పోస్ట్ వచ్చేలా చుస్తానంటున్నాడు అలా వీలవుతుందా అని అడిగింది .
చూడు వొక ఆడది కనిపిస్తే ఆమెని వాడుకోవడానికి ప్రతి మగాడు లక్ష తొంబై అబద్దాలు చెపుతాడు పని అయ్యే దాక . ఆ తర్వాత ఏ బార్ లోనో ఫ్రెండ్స్ తో మందు కొడుతునప్పుడు అబ్బా గురు  అది యిచ్చింది గురు స్వర్గం అంటూ అప్పుడు జరిగింది మొత్తం మందులోకి చికెన్ లా చెపుతూ ఉంటాడు ..ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఎర్రి పినుగా  ఎవర్రా అంటె ఏదో ఆశించి అతనితో శ్వాసించి మూలుగులు మూలిగే ముదితే అన్నాసుధ కేసి చూస్తూ .హరిణి మా యిద్దరి కేసి మార్చి మార్చి చూస్తోంది ఏ టాపిక్ లోకి త్తెసికేల్లినా మళ్లీ   అక్కడికే వస్తున్నామని .నాకు అర్జెంటు గా సుధ తో ఏకాంతం కావాలి.నన్ను  ప్లేటోనిక్ లవ్ అంటూ బకరాచేసినందుకు నాలుగు దులిపేసి వీలయితే కొరికేసి వెళ్లి పోవాలని వుంది . పానకం లో పుడకలా ఈ హరిణి మద్యలో అడ్డం వచ్చింది . యింక నేను తట్టుకో లేక హరిణి మేమిద్దరం కొంచెం పర్సనల్ గా మాట్లడుకోవలసిన టాపిక్ వుంది కొంచెం నువ్వు?అన్నా
ఓకే ఓకే అంటూ చెప్పులేసుకుని సెల్ తీసుకుని గుమ్మం బయటకు వెళ్ళ బోతుంటే వద్దు హరిణి  ఏమి అవసరం లేదు నువ్వికడే వుండు అంది .పర్లేదక్క అంటూ తను వెళ్లి పోయింది (. అని ఆ క్షణం లో నేనను కున్నా)  . కానీ తలుపు పక్కనే వుందని ఆ ఆవేశం లో నే గమనించ లేదు .
ఆమె వెళ్లిందో లేదో నా లో ఆవేశం కట్టలు తెంచుకుంది ''.నన్నెందుకు మోసం చేసావ్ ?మీరిద్దరూ కలిసి రండి అని వెంకట్ తో  చెప్పలేవా  ?నా ద్వారా తనా లేక అతని ద్వారా  నేనా ?నన్నే ప్రేమించావనుకున్నాగాని నన్నుకూడా ప్రేమించావని అనుకోలేదు ?నీదగ్గరికి మగాడు వచ్చే దాకానే నీ నిగ్రహం , ఆ తర్వాత వాడి తెగువ చొరవ బట్టి నీ శీలం ఆదార పడి వుంటుంది .నేనేనా మద్యలో వెర్రి వెదవని ? నేనింకా  ఏదో అనే లోపే
ఆమె కూడా ఆవేశం తో అవును నా యిష్టం . నీకు నచ్చక పొతే ఫో .అయినా ఆ వెంకట్ గాడు వచ్చి మీద బడితే నాదే తప్పు అనట్టు మాట్లాడుతున్నావ్ . వెంకట్ ఏమి ఖర్మ నా జీవితం లో చాలా మందే వున్నారు . అయినా నీ ఉక్రోషం ఆవేశం అంతా ఆ వెంకట్ గాడు కానిచ్చాడు నీకు  దక్కలేదే అనేగా రా రా యిప్పుడే కావాలా ?యిక్కడే కావాలా ?నువ్వు కూడా బీర్ కొడుతూ నీ స్నేహితులతో చెప్పు కో అంటూ మంచం మీదా వెల్లకిలా పడుకుంది . నేను స్తానువులా నిలబడి పోయాను . రెండు నిమిషాల్లో ఆమె లో దుక్కం తన్నుకుని వచ్చింది .పొగిలి పొగిలి ఏడుస్తోంది . నా కే జాలని పించింది .తనవీపు రాస్తూ వుర్కో సారీ యింకేప్పుడు నీ పర్సనల్ విషయాలు ఎత్తనులే వుర్కో . అయినా నిజం గా ప్రేమిస్తే నీ సంతోషానికి అడ్డురాకూడదు .అయినా జనాలకి సూక్తి ముక్తావళి చెపితే వినే రోజులు పోయాయి అని మనసులో అనుకుంటూ నన్ను క్షమించు అంటూ ఆమె చేతులు పట్టుకున్నా . . ఆమె కూడా నా గుండెల్లో వొదిగి పోయింది . ప్రశాంత త  నెలకొంది . కాని అది తుఫాన్  ముందు ప్రశాంత త  అని అప్పుడు తేలి లేదు
 యింతలో కాలింగ్ బెల్ మోగింది . యిద్దరం ఉల్లిక్కి పడి విడి పోయి బెడ్రూం లోంచి హాల్ లోకి వచ్చాం .
ఎదురుగా మా ఆడిటర్ , పక్కనే హరిణి .నాకు చెమటలు పట్టాయి . కాళ్ళు వణుకు తున్నాయి . ఛి యింత బతుకు బతికి యిప్పుడు యితని కంట్లో చులకన అయిపోయానే అదికూడా ఏమి లేకుండానే .గొంతు పోడిబారుతుంటే గొంతు పెగుల్చుకుని మీ ఇల్లు చాలా బావుందండి యిప్పుడే సుధ గారు చూపించారు మంచి అభిరుచి మీది అన్నా .
అతని మొఖం లో ఎక్కడా ప్రతిస్పందన లేదు .కూర్చోండి సార్ మీతో మాట్లాడాలి అంటూ కుర్చీ చూపించి తలుపు వేసేసాడు . ఆ గదిలో హరిణి , సుధ నేను తనే వున్నాం .నాకు పరిస్తితి అర్ధం అయిపోయింది .హరిణి అసలే కిలాడీ వాళ్ళ బావ కి సెల్ లో విషయాలన్నీ చేర వేసేసి వుంటుంది .
''సార్ అక్రమ సంభందాన్ని క్రమ సంభంధం చెయ్యాలంటే ఏం చెయ్యాలి ?''బుల్లెట్ లా దుసుకోచ్చినా ఆ ప్రశ్నకి నేను సుధ మొఖ మొఖాలు చుసుకున్తున్నాం .యిద్దరి నుదుటి మీద చెమట స్పష్టం గా తెలుస్తోంది . చెప్పండి సార్ .
           అక్రమామో సక్రమమో అవతలి వాళ్ళు చూసే కోణం లో ఉంటుందేమో ?అన్నా ధైర్యం తెచ్చుకుని ఎలాగు మా యిద్దరి మద్య అదేమీ లేదు గా అన్నా ధైర్యం తో .
అదేంటి సార్ నేను సుధ వూరు వెళ్ళినప్పుడు హరిణి చెయ్యి పట్టుకున్నా ,కొంత సేపటికి తెలివి వచ్చి ఊరుకున్నా ?ఆ అక్రమ సంభందాన్ని సక్రమం చెయ్యాలంటే నా భార్య కూడా వేరే వాళ్ళ చెయ్య పట్టుకోవాలిగా సార్ ?వొక వేళ పట్టుకున్నా ఆమెని అడిగే హక్కు నే కోల్పోయాగా ?అందుకని నేను ఆమె ఎవరి తో మాట్లాడుతోంది ?ఎవరి చెయ్య పట్టుకుంది లాంటివి పట్టించు కొను .తను ఆరోగ్యం గా వుంటే నా కాదే చాలు అంటూ బాత్రూం లోకి స్నానానికి వెళ్లి పోయాడు .హరిణి టీవి ఆన్ చేసింది .  టీవి  లో మెంటల్ కృష్ణ సినిమా రావడం యాదృచ్చికమేమో .నేను వస్తానండి అంటూ బయటకొచ్చి కార్ లో కూర్చున్నా .మనసంతా గజిబిజి  గా ఉంది .ఏది సత్యం ఏదసత్యం వో మహాత్మా ?అసలు తప్పెవరిది ?రెచ్చ గొట్టే తనదా ?రెచ్చిపోయే జనాలదా ?కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నా .
 యిన్ని యిన్ని అందాలు నా నేరమా
జాలేసి చూపిస్తే నిస్టురమా
నీ కున్న జన శక్తి  సామాన్యమా ?
నిన్ను చూసాక మతి చెడితే విడ్డురమా ?
వోణి వేసుకున్న  పూల తీగ వూగు తుంటే భల్లే భల్లే
బోణి చేసుకున్న తేనే టీగ  తూగుతుంటే భల్లే భల్లే
ఎహే చాంద్ క తుకడా ఏదో చేయ్యవేంటి పోరాడా 
నీకు ఆశ వుంటే చెయ్యి వెయ్యి చెప్పకుండా
యిట్టే అందుతుంది చంద్రవంక తప్పకుండా
ఎఫ్ఏం లో పాట వినిపిస్తోంది .
ఏంటోటు బీ ఆర్ నాట్టు  బీ లా ఆలోచించకుండా పూర్తీ గా అటు వైపో లేదా యిటు వైపో వుంటే ఈ భాధలు వుండ వేమొ అని పిస్తోంది . తలకాయ నొప్పి గా వుంది హోటల్ పక్కన కార్ ఆపి కాఫీ తాగుదామని లోపలి వెళ్ళా . ఆర్డర్ చేసి కూర్చుంటే పక్కన వున్నతను అతని స్నేహితుడి తో అంటున్నాడు
''కాఫీ తాగుదామని వచ్చిన వాడు కాఫీ తాగి పోవాలి అంతే గానిహోటల్ అంతా నాది అనుకుంటే ఎలా ?యింతకు ముందు ఈ సీటులో వేరే వాడు వున్నాడు యిప్పుడు నేను నా తర్వాత ఇంకొకడు యిక్కడ కాఫీ  స్తిరం గాని కస్టమర్స్ కాదు''
 నాకు తలనొప్పి తగ్గి పోయింది నా ప్రశ్నకి సమాధానం దొరికింది .యింకా ఆమెతో మాటుంది . నాకు మాత్రం కాదు . యిక్కడ మాటలు అవే మనుషులు మారతారు .కార్ దుమ్ము లేపుకుంటూ గమ్యం వైపు సాగి పోతోంది .















1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మిత్రమా నీ కధ చదివిన మా శ్రీమతి
పుట్టింటికి వెళ్లి పోయినది .మా యింట్లో
కలతలు రేగినవి .చివరి భాగం చదివిన మీ ఆడిటర్ గారు
సుధని మా యింట్లో దింపేసి తను సన్యాసుల్లో కలిసిపోతానని
సెలవిచ్చారు . కాన సుధ కి భరణం గా నీ వాటా సగం
వచ్చే నెల నుంచి టంచన్ గా నా చిరునామా కి పంప ప్రార్ధన .
యిట్లు నీ మిత్రుడు
వెంకట్ .