23 డిసెం, 2011

కంచికి చేరని కధ

        
ఆమెతోటి మాటుంది కధ రాసిన తర్వాత జరిగిన పరిణామాలు  మనసుల్ని  కలిచి వేసాయి . అది కేవలం  ఉక్రోషం తో , తొందర పాటు తనం తో రాసిన కధ . అందులో కొన్ని నిజ జీవితం లో పరిచయం వున్న వ్యక్తులే గాని నడిపించిన కధనం వల్ల  అందరి ఇళ్ళల్లో మనస్పర్ధలు వచ్చాయి .నాలో కలిగిన చిన్న అనుమానం ఆ కధని రాయడానికి ప్రేరేపించింది . దాని తర్వాత జరిగిన పరిణామాలలో యిద్దరి మంచి స్నేహితుల మనసు గాయ పడి  పూడ్చలేని నష్టం వాటిల్లింది . ఇకనుంచి మనస్పూర్తిగా నవ్వుతూ మాట్లాడుకునే అవకాశం కోల్పోయింది ..అందు వల్ల ఆ స్నేహితులిద్దరకి  ఈ బ్లాగ్ ముఖం గా క్షమాప్పణలు  వేడుకుంటున్నాను .ఈ కధ రాసాక గిల్ట్  ఫీల్ అయ్యి తరచూ గా వెళ్ళే వాళ్ళింటికి వెళ్ళలేక పోయా . అయినా మనసు దిటవు చేసుకుని ఈ రోజు సాయంత్రం వెళ్ళినప్పుడు ఆ మహా మనిషి  ఏమిజరగనట్టే  నన్నురిసీవ్ చేసుకుని మాట్లాడిన తీరు నా ఆలోచన ద్రుక్పదాన్నే మార్చేసింది .అంత గొప్ప సంస్కారి ముందు నా కుసంస్కారం చిన్న బోయింది , ఆయనకీ ఈ బ్లాగ్ ముఖం గా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా ' అతను ఈ కధ చదివి .యింకేప్పుడు యిటువంటి పరిస్తితి రానిచ్చుకోకు అంటూ నా మాజీ మిత్రురాలికి చెప్పిన తీరు తెలుసుకుని కళ్ళు చెమ్మ గిల్లాయి . మాజీ ఎందుకంటె ఇదివరకటి స్నేహ సౌరభాలు విరాజిల్లే అవకాశాలు మృగ్యం . వాళ్ళింటికి వెళ్లి నప్పుడు ఆమె ముభావం గా  మాట్లాడిన తీరు ,తన మానాన తన పని చేసుకుంటూ నా ఉనికిని పెద్ద గా గుర్తించినప్పుడే అర్ధం అయ్యింది ఆమె హృదయం యెంత గాయ పడిందో .మన్నించండి నేస్తం ఆ స్నేహం  యిప్పుడొక గతం . గతం లోని స్నేహమాధుర్యాన్ని వర్తమానం లో నెమరు  వేసుకుంటూ భవిష్యత్తులో భందం గట్టి పడుతుందని ఆశిస్తా.
   యిక నా స్నిహితుని యింట్లో మనస్పర్దాలకి కారణమయ్యి  ఉన్నతమైన అతని వ్యక్తిత్వానికి  మచ్చతెచ్చిన నా కధనానికి  క్షన్తవ్యుడని. ఏవి నిరుడు కురిసిన హిమసముహాలు ? .కొన్నాలకి మళ్లీ మాములు గా  మాట్లడుకో గలిగినా పంటిలో రాయి లాగ , కంట్లో నలుసు లాగ యిది అప్పుడప్పుడు భాదిస్తూనే వుంటుంది .
 అయితే యింత  అనర్ధలకి కారణమయిన ఈ కధని  తీసేయ్యలనుకున్నా గాని తీసేసి  మరిన్ని అనుమానాలకి ఆస్కారం యిచ్చే కన్నా , అనుక్షణం నా తప్పుని ఎత్తి చూపే నన్ను సరిదిద్దే అద్దం లా ఉంటుందని వున్చేస్తున్నా అందుకే యిది కంచికి చేరని కధ .