30 డిసెం, 2011

ఆర్ట్ ఆఫ్ లవింగ్

 

నేను అప్పుడే యింటికి వస్తేల్యాండ్ లైన్ ఫోన్ మోగుతోంది .ఎత్త గానే
'' హలో సార్ ఆర్ట్ అఫ్ లవింగ్ గురించి నేను మీతో రెండు నిమిషాలు మాట్లా డోచ్చా? ''అవతలి నుంచి వొక అమ్మాయి .సరే అమ్మాయి అందులో లవింగ్ అంటోందని
చెప్పండి అన్నా
.మీరేక్కడుంటారు సార్ ?
అదేంటి డైరెక్ట్ గా యింటికి వచ్చి నేర్పిస్తారా ?
కాదు సార్ మీరెక్కడ వుంటారో చెపితే మీకు దగ్గరలో మా కేంద్రం యేకడ వుందో చెపుదామని
ఈమె తెలుగు కు తెగులు పుట్టి  ఆంగ్లానికి అంగాలు కదిలి లివింగ్ కి లవింగ్ అంటోందా  కావాలనా ?
 ------------------------------------------------------------------------------------------
పొద్దున్నే మిత్రుడు ఫోన్ లో చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి . తనుకూడా ఆర్ట్ అఫ్ లివింగ్ లో చేరి
దాన్ని ఆర్ట్ అఫ్ లవ్వింగ్  కి అన్వయించి తన ప్రియురాలి మీద ప్రయోగించాడు .రెండు ఉచ్వాస నిచ్వాస లకి సంభందించిన వె గా అని అతని  అభి ప్రాయం . ప్రియురాలి యింటికి వరిశంకర్ గారి సిడి  తీసుకుని వెళ్లి ప్లే చేస్తూ
ముందు గా సోఓఓఒ          హంమ్మ్మ్మమ్మ్మ్మం  సోఓఓఓఒ         హమ్మ్మ్మమ్మ్మ్మమ్మం  అంటూ మొదలెట్టి సోహం సోహం సోహం సోహం సోహం అంటూ స్పీడ్ పెంచి  ఆఖరికి సోం సోం సోం అంటూ ఇంకా వరిశంకర్ గారు పతాక స్తాయిలో సోహం సోహం అంటూ స్పీడ్ పెంచక ముందే సొమ్మసిల్లి పడిపోయడుట . ప్రియురాలు అబ్బ నువ్వు చాలా  గ్రేట్ అబ్బ అంటూ మొఖం మీద నీళ్ళు చల్లి చీర కొంగు తో చమటలు తుడిచాక సెలవు తీసుకుని యింత గొప్ప సుఖం యిచ్చిన నీ ఋణం ఎలా తీర్చుకోను అంటూ చేతులు కళ్ళకి అద్దుకుని తన ఊరికి వెళ్లి పోయాడు .
    రెండు రోజుల తర్వాత  ఆతను ఫోన్ లో మాట్లాడుతుంటే పొడి దగ్గు వస్తోంది ? ఏంటి ఆరోగ్యం బాలేదా ?అని అడిగా . అదేంటో మీ వూరు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి పొడి దగ్గు అప్పుడప్పుడు జ్వరం , వొకటే దాహం , నీరసం గా కుడా ఉంటోంది అదేంటోఅన్నాడు .
నా గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి . బాబు ఎందుకన్నా  మంచిది  వొకసారి మీ ఊళ్ళోనే ఉన్న డాక్టర్ అమరం గార్ని కలువు అన్నా .
అమ్మో అదేనంటావా ?ఆరోజు ఆమె  గ్రేట్ అబ్బా అనప్పుడే అనుమానించా సీడి లో పతాక స్తాయి కి రాకుండా వొదిగి పోయినా కుడా..అమ్మో యిప్పుడే పోతా అంటూ ఫోన్ పెట్టేసాడు .
ఆ తర్వాత  రెండు రోజుల దాకా అందు బాటు లో లేడు . నాకు వొకటే టెన్షన్ ఎలా వుందో అతని రిపోర్ట్ అని .నాకు టెన్షన్ ఎందుకంటె అతనంత పరిచయం కాక పోయినా కొద్దో గొప్పో నాకు కూడా ఆమె తెలుసు కాబట్టి .
రెండు రోజుల తర్వాత అతని నుంచి ఫోన్ .ఎత్తడం తోటే
''నాయనా రిపోర్ట్ వొకే నా చెప్పి చావు యిక్కడ వొకటే టెన్షన్ ''
ఎంచేప్పమంటావ్ నాయనా?
కలము చేత బట్టి కావ్యాలు రచియించా 
హలము చేత బట్టి పొలము దున్నా 
కలము హలము కన్నా 
లాల జలమే హలా హలము 
అంటూ  బేర్ మన్నాడు .
ఇతను  శృంగార సమయము లో రక్షణ పద్దతులు పాటించినప్పటికీ 
ప్రియురాలు తమకము తో చేసిన ఘాడాతి చుమ్బానము , నాలికా పరిశ్వంగము  వల్ల యితని రక్షణ కాస్త బక్షణ అయ్యెను 
''.ఛి ఛి నిరోద్ వాడండి  ఎయిడ్స్ నివారించండి అని ప్రభుత్వం తప్పుడు ప్రకనలు యిస్తోంది .కార్ల కి వునట్టు ఎయిర్ బాగ్స్ మూతి కి కూడా వుండే ఏర్పాటు వుండాలి . ప్రియురాలు తమకం తో మూతికి ముప్పావు దూరం రాగానే ఆ ఎయిర్ బాగ్స్ తెరుచుకుని మన మూతి కి కూడా రక్షణ కల్పించాలి .అప్పుడే ఈ మహమ్మారి బారిన పడ కుండా ఉండొచ్చు .అయినా ఆమె అమాయకు రాలు అనుకున్నా గాని మాయకు రాలు అని యిప్పుడే గా తెలిసింది .'' తన ధోరణి లో చెప్పుకుంటూ పోతున్నాడు .
బాబు యింతకీ నీకు వునట్టా లేనట్టా ? 
డాక్టర్ అమరం గారు ఆ విషయం యిద్దమిద్దం గా చెప్పలేక పోతున్నారు . అసలు అప్పుడు ఏమి జరిగింది అని అడిగితె నీకు చెప్పినట్టే పూస గుచ్చి నట్టు అంతా చెప్పేసా  అయన కూడా సోహం సోహం అంటూ ఉచ్వాస నిచ్వసాలు పెంచి ఆమెని కూడా తీసుకొస్తే పరీక్షించి చెపుతా అన్నారు . అక్కడకి నేను వాళ్ల భర్త వోప్పుకోరేమో డాక్టర్ అంటే  మీరెంచేస్తారో నాకు తెలిదు ఆమె ని మీ సీడి తో సహా తీసుకొస్తేనే చెప్పగలను అన్నారు అంటూ మా వాడు నీళ్ళు  నములు తున్నాడు .
 ----------------------------------------------------------
సార్ యింతకీ మీరు వస్తున్నారా లేదా ? ఫోన్ లో గొంతు విని ఆలోచనల నుంచి బయటకొచ్చా .
మీరు వేరే వురి కొచ్చి డెమో యియ్యడానికి యెంత తీసుకుంటారు  ?అడిగా.
డొనషన్ గా  పదివేలకి తగ్గ కుండా ఎంతన్నా యివొచ్చు సార్
సరేనండి వొక గంటలో చెపుతా అని మా వాడి కి ఫోన్ చేశా .
నాయనా నీ ప్రియురాల్ని స్తానం లో యింకొక ఆమెని వోప్పించా ఆమె సి డి తో సహా
డెమో యివడానికి (కేవలం ఆర్ట్ ఆఫ్ లివింగ్ )మాత్రమె సుమా అని చెప్పా మా వాడు యెగిరి గంతేశాడు . రెండు రోజులకే మా ప్లాన్ అమలు పరిచాం . అది జరిగిన రెండు నెలలకే అమరం గారు అమర్ హై అంటూ టీవీ  లో వస్తుంటే చూసి నోరు వెల్ల బెట్టడం నా వంతయ్యింది . మా వాడు మాత్రం ఆరోగ్యం గానే  వున్నాడు . ప్రియు రాలి సంగతి తెలిదు , ఎందుకంటె మేమిద్దరం ఈ మద్య నిశబ్దాన్ని చేదించటం లెదు కనక .










2 కామెంట్‌లు:

Disp Name చెప్పారు...

రవి గారు,

రవి గాంచని చోటంతా మీరు 'కాంచు' తున్నారు.

రాబోవు కాలములో వచ్చు కొత్త ఆశ్రమం పేరు

ఆర్ట్ ఆఫ్ 'లవి'మగ్!

నూతన శుభాకాంక్షలు

చీర్స్
జిలేబి.

Unknown చెప్పారు...

జిలేబి గారు అదేంటో ఈ రవి కాంచ కూడ దనుకున్నవి కూడా
కాంచ వలసి వస్తుంది . కాంచిన దగ్గరనుంచి ప్రచురించే దాక ప్రసవ వేదన
ఆ పయిన బాధితుల రోదన ,అయినా అలా గుట్లు బయట పెట్టుట తగునా ?
మీకు కూడా నూతన సంవత్సర శుభా కాంక్షలు