20 జన, 2011

కాగడా వుయి మిస్ యు



ఈ వేళ పొద్దున్నే మిత్రుడు ఫోన్ చేసి నీ కి విషయం తెలుసా కాగడా ని నిన్న రాత్రే ఎవరో హత్య చేసేసారట ఆ మాట వింటూనే నమ్మ బుద్దికాలేదు .కిందటి వారమే కలిసాడు .కక్షలు కార్పణ్యాలు పక్కన బెట్టి ప్రశాంత జీవనం గడుపుతా అందుకే బ్లాగులకి దూరం గా ఉంటున్నా అని చెప్పాడు అలాంటిది ఈ రోజు ఏవిటి ఈ దుర్వార్త ,.ప్రమాదవనం సబ్యులు వోకరోకరికి విషయం తెలిసి సెల్లులు అలుపు లేకుండా మొగుతున్న్నాయి .మూడు నెలల క్రితమే అయన ప్రియురాలు కార్ ప్రమాదం లో పోవడం యింతలోనే యీయన హత్య మరి ఆ పసి పిల్లలకి పాపం ఆ ప్రియురాలి భర్తే దిక్కు .ఆ పిల్లలకి రక్త పరీక్షా గట్రాలు చెయ్యకుండా చూసుకుంటే కాగడా ఆత్మ శాంతిస్తుంది .పాపం ఆ ప్రియురాలి భర్త పరిస్తితి తలచుకుంటే గుండె తరుక్కు పోతోంది యెట్లా తట్టు కుంటాడో? చనిపోయాక తెలిసే నిజాలు తెలుసుకుని .ఎప్పుడు సొంత భర్తలా కలివిడి గా వుండే వాడు .బ్లాగులో రాసినవి కొన్నే అయినా జీవిత సత్యాలు కాచి వడ బోసినట్టు రాసే వాడు .బ్లాగ్ లోకం లో అతను తెలీని వాళ్ళు ఎవరు లేరంటే అతిశయోక్తి కాదు .వ్యంగానికే ప్రాధాన్యం యిచ్చాడు గాని ముంచుకొస్తున్న రోగాన్ని పట్టించుకునే వాడు కాదు .మొన్న ఆ మద్య సెల్ లో మాట్లడుతునప్పుడు ఆప కుండా దగ్గుతుంటే అడిగా అదేంటి ఆరోగ్యం బాలేదా అని అంటే నవ్వుతు భోగం కావలిసిన వాడు రోగం గురించి భయ పడితే ఎలా అంటూ నవ్వాడు .అదేదో ప్రాస కోసం పడుతున్న ప్రయాసే అనుకున్నా గాని ఆ ఆయాసం వెనక పాయసం లాంటి కధ వుందని అప్పుడు తేలి లేదు .అతనికి వైద్యం చేసిన వైద్యుడు మొదట్లో లూనా మీద వచ్చి యిప్పుడు అయి టెన్ స్తాయికి ఎదిగాడు అతని రోగం తో పాటే . యెంత చిలిపి గా ఉండేవాడో అంటూ వాళ్ళ పనిమనిషి కాగడా బాడి మీద పడి ఏడుస్తుంటే ఆపడం ఎవరి తరమూ కాలేదుట , ఆ తర్వాత ఆయన చేతికి ఉండ వలసిన బంగారపు ఉంగరాలు , బ్రేసు లెట్టు , మేడలో గొలుసు కుడా ఎవరికి కని పించ లేదుట .
యిదంతా నిజం కాదని చెపుతూ నువ్వొక్క సారి వచ్చి బ్లాగులో అల్లరి చెయ్యవా కాగడా .

14 జన, 2011

స్వీట్ మిరపకాయ్


రవితేజ మిరపకాయ్ సూపర్ హిట్ అని చెప్పలేం గాని వినోదాత్మక చిత్రం అని చేపోచ్చు .రవితేజ మార్క్ హాస్యాన్ని ఇస్ట పడే వాళ్ళకి తప్పకుండా నచ్చు తుంది . కదా పరం గా రోటిను కధే .విదేశాల్లో వున్న అండర్ వరల్డ్ డాన్ కిట్టు భాయి ఆచూకి కని పెట్ట డానికి పోలీసు ఇన్స్పెక్టర్ కాలేజీ లెక్చరర్ గా జాయిన్ అయ్యి విలన్ కూతుర్ని ప్రేమలో పడేసి తద్వారా విలన్ ఆట కట్టించాలని ప్లాన్ . యి లోపు వేరే అమ్మాయి తో నిజంగానే ప్రేమలో పడడం వీళ్ళ మద్య అపోహలు ఆఖర్న విలన్ ఆట కట్టడం ప్రేమికుల మద్య అపోహలు తొలగడం విలన్ కూతురు పక్కకి తప్పుకోవడం . యిదే కధ , అయితే కధనం లో ఎక్కడా బోర్ కొట్ట కుండా రవితేజా మార్క్ డైలాగులతో సాగి పోతుంది . సునీల్ రవితేజ మద్యన ,బ్రహ్మాజీ ఆలి మద్యన సీన్స్ బానే పేలాయి .కొన్ని క్రూడ్ జోక్స్ కుడా వున్నాయి .హీరొయిన్ ఎవరు చూడ కుండా సెల్ ని జాకెట్ లో పెట్టుకుంటే సునీల్ చూస్తాడు . ఏంట్రా తనని అలా చూస్తున్నావ్ అని హీరోయిన్ తల్లి అడిగితె జాకెట్ లో ఏముందో చూస్తున్నా అంటాడు సునీల్ .బ్రహ్మాజీ ని ఉద్దేశించి ఆలి తో రవి తేజా ''గజని సినిమా లో మనం అంతా హీరోయిన్ ని చూస్తే మనోడు అమీర్ ఖాన్ ని చూస్తాడు ,సిక్స్ ప్యాక్ లో సెక్స్ ప్యాక్ వెతుక్కునే టైపు అంటాడు'' .పేద రాయుడు సినిమాలో ఫిష్ దైలోగ్ కి వెటకారం గా హీరోయిన్ తో రవితేజ చెబుతాడు . , అలాగే శంకరా భరణం లో ''శారదా'' కి కూడా పేరడీ గా డైలాగు చెప్పించారు .ఆఖర్న కొంచెం ట్విస్టులు కూడా యిచ్చి ప్రేక్షకులు ఊహించని చిన్న మలుపులు కూడా పెట్టాడు ''.ఏంటి యిది కూడా పిత్తేసాడా మీ దగ్గర ''అంటూ బాస్ దగ్గర రవితేజా అనడం నాచురాలిటి అని సర్ది పెట్టు కోవాలేమో ? పాటలు ,మితి మీరని ఫైటులు వొకే .రవి తేజ తనదైన స్టైల్లో చాలా ఈజీ గా చేసుకుంటూ పోయాడు .రిచా మొద్దు మొద్దు గా నటించింది .బ్రాహ్మిన్స్ ని అపహాస్యం చెయ్యడం యిందులోను కోన సాగింది . మా యింటికి భోజనానికి వస్తే ముద్ద పప్పు , నెయ్యి ఆవకాయతో భోజనం పెడతా అని శాస్త్రి గారి కూతురు గా వేసిన రిచా హీరో తో అంటుంది .యింకో సందర్భం లో రిచా స్నేహితురాలు ఆమె ని ఉద్దేశించి నువ్వేమో వోడిలిపోయిన కొత్తిమీర కట్ట ఆమె ఏమో చికెన్ పిజ్జా అంటుంది .వొక వర్గాన్ని లోకువ చేస్తూ (లోకువ గా వున్న వాణ్ణి చూస్తే మొత్త బుద్ది టైపు లో ) చూపించే సన్నీ వేసాలకి సెన్సార్ కత్తెర వెయ్యడం సమంజసం .అదే వేరే కులాలని అనడం సంగతి దేవేడెరుగు ,అంబేద్కర్ విగ్రహం వున్న కాలని నుంచి గుండాలు వచ్చినట్టు వొక సినిమాలో చూపిస్తే యెంత రాద్దాంతం చేసి ఆ సీను తీసే దాక వదల లేదు .సరే ప్రస్తుతం సబ్జెక్టు అది కాదు కాబట్టి మొత్తానికి మిరపకాయ్ తియ్యగానే వుంది అని చేపోచ్చు .

5 జన, 2011

జ్యోతి ది అనవసరపు రాద్దాంతం


విజయవాడ సిపీ పై ఆంధ్ర జ్యోతి అనవసరపు రాద్దాంతం చేస్తోందని పొద్దు ట నుంచి టీ వి ఛానల్స్ చూస్తున్న ఎవరి కన్నా అర్ధం అవుతుంది .ఆయనేదో సెల్ లో సొల్లు కబుర్లు చెప్పుకుంటే , అది అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ప్రోత్సహిస్తుంటే అక్కడికేదో ఆయన రేప్ చేసినంత బిల్డ్ అప్ ఇవ్వడం అవసరమా ?యిది కేవలం వార్త ని సేన్షేషణ్ చేసేసి టీ ఆర్ పీ రేట్పెంచుకునే చీప్ ట్రిక్. నిన్నటి దాక సూరి హత్య కేసు వెనక పడిన చానల్స్ యిప్పుడు ఆంధ్రజ్యోతి అందించిన ఉప్పుతో బిరియాని వండి వడ్డించారు .అయన యిచ్చిన సంక్షిప్త సందేశాలలో అసబ్యత ఎక్కడ వుంది మారిన యిప్పటి మోరల్ వాల్యూస్ లో?మనం అన్ని మాట్లాడుకుందాం దగ్గర అయ్యాక సెక్స్ తో సహా అన్నాడు .అయిన పని వత్తిడి నుంచి కాస్త ఉపసమనం పొంద డానికి సెల్ సొల్లు ని ఆసరా గా తీసుకుంటే తప్పేంటి ? తన వృత్తి కి న్యాయం చేస్తూ సొంత లాభం కొంత చూసుకుంటే యింత ఆడి పోసుకోవాలా ?ఎప్పుడు పనులు బిజినెస్సేనా?అని రావు గోపాలరావు అనట్టు పొద్దున్నే ఆఫీసు కి వచ్చాక కాసేపు నచ్చిన వాళ్లతో సెల్లు విప్పి మాట్లాడి ఆఉత్సాహం తో రెచ్చి పోయి పని చేస్తే తప్పేంటి ?ఆ పనేదో యింట్లో చేసుకోవచ్చు గా అంతే యింట్లో అదెలా వీలు పడుతుంది ?కుటుంబ సబ్యుల ముందు సెల్ మాట్లడుతునప్పుడు అచ్చులు హల్లులు తప్ప పదాలు రావు . హా ఉ హా తప్ప .
అయిన ప్రబుత్వ ఉన్నతాధికారులు మనుషులు కారా ?వారికీ వొక అచ్చట ముచ్చట ఉండదా ?తమ తో పని మీద వచ్చిన వాళ్ళు ఆ పని అయిపోయాక థాంక్స్ అని వెళ్లి పోకుండా సార్ మీ నెంబర్ యిస్తార ఎప్పుడన్నా అవసరం పడినప్పుడు తలచు కోడానికి అంటూ అందమైన ఆమె అడుగుతుంటే నహీ యైసా కభి నహి హోగా అనడానికి యిక్కడ ప్రవరాక్యులు ఎవరూ వుండరు కదా? మొహమాటానికి పోయో ఎలాగు నెట్ లో వుంటుంది కదా అనో యిస్తే యింక తర్వాత అసలు కధ మొదలవుతుంది .ముందు గా సంక్షిప్త సందేశాలు పంపేది వాళ్ళే మనం స్పందిస్తే నెక్స్ట్ సెల్లు మోగడం తద్యం .వొక వేల వదిలేస్తే వాళ్ళ స్నేహితురాలికిచ్చి ఫోన్ చేయిస్తారు రాంగ్ నంబర్ లా మాట్లాడిస్తూ .యిదొక విష వలయం తప్పించు కోవడం అసాద్యం .సీతారామాంజనేయులు అవతలి వ్యక్తీ స్పందిస్తేనే మాట్లాడాడు గాని తనకి తానూ గా వెంట పడి మాట్లాడ లేదు గా ?మారిన యిప్పటి నీతి సూత్రాలలో అతను చేసింది తప్పులోకి రాదు .లివింగ్ రిలషన్ నడుస్తున్న ఈ రోజుల్లో సెల్ లో సెక్స్ గురించి పరాయి ఆడ వారి తో మాట్లాడటం( అది కూడా వారి యిష్టం తోటే )తప్పనడం ఎంతవరకు సబబు ?ఆయన ఆవిడ కుటుంబ వ్యవస్తను చిన్న భిన్నం చెయ్యకుండా చిన్న చిన్న గా స్వీట్ నతింగ్స్ చెప్పుకోవడం భారం దించు కోవడమే . ఆయనకీ ఆవిడ వొక అవుట్ లేట్ మాత్రమె .
అయినా యిదంతా ఆ వంశి వాళ్ళ కజిన్ నీ పావులా వాడుకుని తనని ట్రాప్ చెయ్యడానికే అని చెపుతుంటే నమ్మక పోవడానికి ఏముంది ?అది జరగా డానికి పూర్తి అవకాశం వుంది . అది కాకా ఆ డాక్టర్ కల్పన ఆయనకి నేను సిస్టర్ లెక్క అని చెప్పుకుంది కదా ?అయినా ఆయన మాట్లాడిన ఆడవాళ్ళ సెల్ నంబర్ టీ వి ల లో యివ్వడం ఎంతవరకు సబబు ? ఛానల్స్ మద్య పోటిలలో వ్యక్తుల ప్రవేటు జీవితాలకి బద్రత లేకుండా పోయింది .వొకరికి ముదము యింకొకరికి ఆముదము .ఏమి చేతుము .

1 జన, 2011

కొత్త సంవత్సరం మొదటి రోజు

నేను జనవరి ఫస్ట్ న పుట్టడం తో నా బర్త్ డే ని ప్రపంచం మొత్తం జరుపు కుంటారు .అది వేరే విషయం .నాకు చాలా ఏళ్ళనుంచి కొత్త సంవత్సరం వచ్చే కొన్ని నిమిషాల ముందే (11.50)పూజా మందిరం లో కూర్చుని మొదటి యిరవై నిమిషాల సమయం దైవ ప్రార్ధన లో గడపడం అలవాటు .ఈ సారి కూడా అదే పద్దతి పాటించా .పార్టిలకి వెళ్ళినా కొత్త సంవత్సరం రావడానికి అరగంట ముందే యింటికి వచ్చేస్తా .పొద్దున్న లేచాక అందరికి సంక్షిప్త సమాచారాలు పంపడానికే గంట అవుతుంది .ఇంట్లోనే లంచ్ చేసి బిగ్ సినిమా లో గలివర్ ట్రావేల్స్ త్రీ డీ సినిమాకి కుటుంబ సమేతం గా వెళ్ళాము .టికెట్స్ కి 666 కాక మళ్ళి త్రీ డీ కల్లజోడుకి మనిషికి రెండు వందలు (డిపాజిట్ ). వెళ్ళే టప్పుడు కళ్ళ జోడు యిస్తే రెండు వందలు యిస్తాడు .చినప్పుడు గలివర్ ట్రావాల్స్ కధలు చదివి ఆ అద్బుతపు ప్రపంచాన్ని మనో ఫలకం లో ముద్రించుకున్న మనం ఈ తొక్కలా సినిమా గుడ్డెద్దు కళ్ళజోడు తగిలించుకుని చూస్తే మాత్రం నిరాస చెందడం ఖాయం .ఎక్కడా వొక చిన్న ఎఫెక్ట్ కూడా లేదు . ఈ మాత్రం దానికి త్రీ డీ యందుకో మరి?వెయ్యి రూపాయలు దోబ్బించు కున్నాక తెలిసిన నగ్న సత్యం ఏంటంటే యే భాషలో సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం ?ప్రతి సినిమానీ జేబుకి చిల్లు పెట్టుట ఖాయం . సాయంత్రం యింటికొచ్చి గుడికేలితే అదృష్ట వశాత్తు అస్సలు రద్దీ లేదు . అంతా పొద్దున్నే వచ్చేసినట్టు వున్నారు . ప్రశాంతం గా స్వామి దర్సనం చేసుకుని హోటల్ కి డిన్నర్ కి వెళితే అక్కడ రష్ చూస్తే మతి పోయింది . పేరు నమోదు చేసుకుని గంట వెయిట్ చేసాక గాని మన టర్న్ రాలేదు . పాపం గేటు దగ్గర తెల్ల డ్రెస్సు వేసుకుని టోపీ పెట్టుకుని మీసాలు చుట్టుకుని వెళ్ళే వాళ్ళకి వంగి వంగి సలాములు కొడుతున్నా అతనికి పది రూపాయలు యిచ్చిన వాళ్ళు లేరు .ఏమన్నా అతనికి వెళ్ళే టప్పుడు భారీగా యిద్దమనుకుని అయిపోయాక చూస్తే వాల్లేట్ పార్కింగ్ డ్రైవర్ తప్ప అతను కనబడ లేదు ,ప్రాప్తా ను సారమే ఏదన్నా వస్తుందేమో?మొత్తానికి మొదటి రోజు బానే గడిచింది .అయితే అంత గంట సేపు కస్టపడి సంక్షిప్త సందేశాలు పంపితే దానిలో నాల్గవ వంతు మంది మాత్రమె ధన్య వాదాలు తెలిపారు .సమయా భావం వల్లే అని భావిస్తున్నా ఎందుకంటె వాళ్ళు నిర్లక్ష్యం చేసే స్తాయి లో మాత్రం లేనన్నది నిర్వి వాదాంసం . రేపు స్పందిస్తే ఖర్చు కలిసోస్తుందన్న పొదుపు చింతనా కూడా అయి ఉండొచ్చు .
పుట్టిన రోజు పండగే అందరికి మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి ?