8 జన, 2012

అలా ముగిసింది ?

                  
 
                     రోజులో కొంత సమయాన్ని సుధ తో సరదాగా సెల్లు కబుర్లు చెప్పుకుంటూ కొత్త ఉత్సాహం పొంది రోజంతా తాజా గా వుండడం అలవాటయ్యి పోయి , గత నాలుగు రోజులు గా తనతో మాట్లాడక మనసంతా గజి బిజీ గా తయారయ్యి  యింక ఉండ బట్ట లేక   మార్నింగ్ వాక్ కి వెళుతూ వాళ్ళింటికి వెళ్లి తనని వొకసారి చూసి పోదామని తలుపు కొట్టా. ,అప్పటికే ఎనిమిది దాటింది .నిద్ర మత్తులో లేచి తలుపు తీసింది .తను ఏదో అనే లోపే నేనే సారీ అండి మీ తాజా  కొత్త మిత్రుడు యిపాటికే మిమ్మల్ని సెల్ చేసి నిద్ర లేపి వుంటాదనుకుని వచ్హా అన్నా .అన్నానో లేదో ఆమె సెల్ మోగడం ఆమె దాన్ని చెవిలో పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళడం వొకే సారి జరిగి పోయాయి .వాళ్ళ హబ్బి యింక బెడ్ రూం లో పడుకునే వున్నాడు .నేనే అక్కడ సోఫాలో కూలబడి ఆమె యెంత ఆనందం గా ఆ ఫోన్ లో మాట్లాడుతుందో గమనిస్తున్నా .యింతకు ముందైతే వంటింటి దాక వెళ్లి ఆమె కాఫీ పెడుతుంటే మాట్లాడుకోవడం రివాజ్.యిప్పుడు కనీసం కూర్చొన్డని    కూడా అనకుండా గజేంద్ర మోక్షం లో శ్రీహరి లా సిరికిన్చేప్పాడు టైపు లో వెళ్లి పోయింది .మాటల బట్టి కొత్త వలస కొత్త స్నేహితుడని అర్ధం అవుతోంది . ఆయనా గాని కన్ఫం చేసుకోవడానికి అతని సెల్ కి కొట్టా యధా విధి గా ''మీరు కాల్ చేస్తున్న కస్టమర్ మీ మాజీ కస్టమర్ తో బిజీ గా వున్నారు '' అని అనిపించింది .యిరవై  నిముషాలు అయినా ఆమె వంటింట్లో సొల్లు కబుర్లే గాని బయటకు రావడం లేదు .వాళ్ళ  ఆయన గురక పెట్టి మరి నిద్ర పోతున్నాడు .అదృష్ట వంతుడు నిద్ర లేని నిసి  రాత్రులు నాకు  బారెడు పొద్దెక్కినా గురక పెట్టె పట్ట పగళ్ళు శ్రీవారికి . కొన్ని జాతకాలు  అంతే.
''అదేంటి రా యింకా చూపించు కాలేదా ?ఈ రోజే వెళ్లి చూపించు కో అసలే ఈ మద్య కళ్ళు  తిరుగు తున్నాయి అంటున్నావ్ ?''(అండి నుంచి రా కి ఎదిగి పోయేంత దగ్గర అయ్యారని ఆమె మాటలలో అర్ధం అవుతోంది,ఎవరి రోగం ఎవరికి అంటూ కుందో ఖర్మ )ఆమె మాటలే విని పిస్తున్నాయి
''జర్నీ సినిమా బావుందా ?అయితే ఈ రోజే మా ఆయనని తీసికెళ్ళమని చెపుతా  నువ్వు చూసింది ప్రతిది నేను చూడవలసిందే . ఎంతైనా మనిద్దరం కడ దాక జర్నీ చెయ్యవలసిన వాళ్ళం కదా ?''అంటూ విరగ బడి నవ్వుతోంది. (యింతకీ కడ దేర్స్తున్నది ఎవరు ?)ఆమె కిటికీ కి ఆనుకుని అలా సెల్ లో మాట్లాడు తోందే గాని నా ఉనికిని అస్సలు పట్టించు కోవడం లేదు . కనీసం కాఫీ పెట్టడానికి పొయ్యి కూడా వెలిగించడం లేదు .
ఇలాంటి త్రునికరణ భావం నేనెపుడు చూడ లేదు వెళ్ళిన అయిదు నిమిషాల్లోనే వేడి వేడి కాఫీ తో యిద్దరికీ తీసుకొచ్చి డైనింగ్టేబుల్ దగ్గర కళ్ళలో కళ్ళు బెట్టి మరి మాట్లాడేది .దూరం పెరిగిందనుకున్నా  గాని అక్కడ
ఆఘాదమే   వుందని అప్పుడే తెలిసింది .ఈ అవమానం భరించడం నా వల్ల కాలేదు . సోఫా లోంచి లేచి గుమ్మం వైపు రావడం ఆమె చూస్తూనే వుంది . తలుపు తీసుకుని లిఫ్ట్ నొక్కడం కూడా ఆమె కి కనిపిస్తోంది . కాని అవెం పట్టనట్టు తన కబుర్లలో పడి పోయి కనీసం నన్ను ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదు . ఆమె నవ్వు నన్ను పోరా అని ఎక్కిరించి నట్టు అయ్యింది .నీకు అవతలి వ్యక్తీ అంత యిష్టం అయినంత మాత్రాన యింటికొచ్చిన  నీ నిన్నటి వ్యక్తీ ని అంత గా గాయ పరచాలా ?నీ జర్నీ లో నేనుకూడా కొంత కాలం తోడూ గా వచ్చాను గా ?ఏమన్నా గాని ఈ మానసిక వ్యధ భరించడం కష్టం అయిపోతోంది .భగవంతుడే ఏదన్నా పరిష్కారం చూపిస్తే బావుండును .స్నానం చేసి పూజ లో కూర్చున్నా .అష్తోత్రాలు  సహస్రాలు అయిపోయాయి . కళ్ళు మూసుకుని అలా చాలా సేపు కూర్చున్నా .నా సమస్యకి వొక పరిష్కారం గోచరించింది .వెంటనే లేచిమేమిద్దరం ఆదివారపు సాయంత్రాలు వెళ్ళే గుడి కి వెళ్లి యిద్దరం కలిసి చదివే అన్నపూర్ణా స్టకం , లింగాష్టకం చదువుకుని  దర్సనం అయ్యాక గుళ్ళో కూర్చుని ''గుడ్ బై   ఫర్ ఎవెర్'' అని మెస్సేజ్ తన నెంబర్ కి పంపి  సెల్ తీసుకుని సుధ నంబర్, వాళ్ల ఆయన నెంబర్ డిలీట్ చేసేసా .ఎప్పుడు పేరు చూసి డైల్ చెయ్యడమే గాని నంబర్ గుర్తు పెట్టుకునే అలవాటు ఎప్పుడో పోయింది . నాకేమో అపరిచితుల నంబర్ నుంచి వచ్చే కాల్స్ అటెండ్ అయ్యే అలవాటు లేదు . అసలు యిప్పటి ఆమె మానసిక స్తితిలో ఆమెంతట ఆమె నాకు ఫోన్ చేసే అవకాశమే లేదు . వుండి వుంటే ఫోన్ చేసి కనీసం అలా వెళ్లి పోయారెంటి ? అని అన్నా అడిగి వుండేది . నేనే ఎప్పుడన్నా మనసు వుండ బట్టలేకఈ నాలుగు రోజుల్లో  ఆమె కి చేస్తే  అప్పుడు కూడా ఎంగేజే  అది విని మనసు బాధ పడటం   . సో యిప్పుడు ఆ పరిస్తితి లేదు కాబట్టి నా గ్రహస్తితి ఏమన్నా మారి మళ్లీ ఎప్పటి లాగ నేను  హ్యాపీ గా హాయ్ గా జోకులు వేస్తూ నా దైనందిన జీవితం గడుపు తానని నా ఆశ .యింటి  కొచ్చి గార్డెన్ లో మొక్కలకి నీళ్ళు  పోస్తున్నా . బయట మందార పూలు విచ్చు కోవడానికి సిద్దం గా వుండి అందం గా రేకలు ఊపు తున్నాయి  . కనకాంబరాలు  గాలికి తలలు ఊపుతూ నా నిర్ణయాన్ని సమర్దిస్తునట్టు గా అనిపించింది . రోజు పోస్తున్నానిన్నిలా లేదే మొన్నిలా లేదే అనిపించింది . అవును మరి ఎలా వుంటుంది ఆ టైం లో కూడా సెల్ లో ఆమె తో సొల్లు కొడుతూ ఈ ప్రక్రుతి అందాలూ పట్టించుకుంటే గా ?
                               ''రమేష్ గాన్ని వదిలేసావెంట్రా ? ''
సాయిబాబా బండి  తోసుకుంటూ అదే టైం లో వచ్చి బిక్షాటన చేసే భార్య భర్త  వాళ్ల పిల్లాడి తో అంటున్నారు .
అవును సుధది  వాళ్ల ఆయనది తీసేసా  గాని ఆ రమేష్ దే తియ్య లేదు గా ? రేపు టెంప్ట్ అయ్యి వాడి నంబర్ కి కొట్టి అదిఎంగాజ్ లో వుంటే మళ్లీ ఈ వేదన మొదలేగా . వెంటనే భగవంతుడి కి ధన్య వాదాలు చెప్పి అది కూడా తీసేసా .నంబర్లు అయితే తీసేసా, మనసులోంచి తీసేయ్య గలనా ?అలా ముగుస్తుందా మళ్లీ అలా మొదలవుతుందా ?కాలమే నిర్ణయించాలి .(అంతులేని కధ )
(మళ్లీ తొక్క లాగ ఆఖర్న కధ అని ముక్తాయింపు వొకటి అనుకుంటే నేనేం చెయ్యలేను  )



4 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కొన్ని అనవసరపు పరిచయాలు..వదిలించుకునే ముందు..కళ్ళు తెరవడం సహజమే.. మోహంలో పడి మొహం పగల కొట్టుకోవడం కన్నా..వేరొక బుద్ధి మాలిన పని ఉంటుందా? నాకు ఈ ముక్తాయింపు బాగా నచ్చింది.సుధ జీవితంలో వ్యధ కాకుండా ఉంటే మంచిదండీ..

Unknown చెప్పారు...

సుధ లాంటి వాళ్ళ జీవితం వ్యధ కాకూడదనే
యిన్నాళ్ళు తాపత్రయ పడ్డా వనమాలి గారు
ఆమె లాంటి వాళ్ళలో లో మార్పు రావడం అసంభవం
మనం నంబర్ డిలీట్ చేసి మౌనంగా వుంటే
వాళ్ళు హమ్మయ్య అనుకుంటూ
కొత్త స్నేహితులతో సరస సల్లాపాలు
ఆడుతూ ఆనందం గా వుంటారే గాని
మనసులో వొకసారి కూడా తల్చుకోరు
మనతో మాట్లాడే ప్రయత్నం కూడా చెయ్యరు
యిన్నాళ్ళు మోసపోయి నందుకే ఈ బాధ
మళ్ళి యింకో బకరా తయారవుతున్నాడే అనే ఈ బాధ .
యిదో అంతు లేని వ్యధ .

జ్యోతిర్మయి చెప్పారు...

అసలు బకరా ఆమె భర్త కదా..

Unknown చెప్పారు...

కాదా?