29 మే, 2012

మరి అది ఎప్పుడో ?

 
 
చాలా కాలం నుంచి నెట్ వైపు ద్రుష్టి పెట్టె సమయం  దొరక్క కొంచెం  తాత్కాలిక వియోగం వచ్చింది బ్లాగ్ తో .
ప్రస్తుతం వొక వారం ట్రైనింగ్ ప్రోగ్రాం నిమిత్తం బరోడా రావడం తో కొచెం సమయం చిక్కింది మళ్ళి   బ్లాగ్ దురద తీర్చు కోవడానికి .విశాలమైన కాంపస్ లోఆఫీసర్స్ కోసం నిర్మించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ .ఎదురుగుండా పెద్ద ఉద్యాన వనం .అందులో వాకింగ్ చేద్దామని వుబలాట పడి వెళితే మొహమాట పడి తలకాయ దించుకోవలసిందే .అక్కడా ఆడా మగ వయసుతో సంభంధం లేకుండా బహిరంగం గానే ముద్దు ముచ్చటలో  ములిగి పోయి కని పిస్తారు .యిక్కడ ఏడున్నర అయినా చీకటి పడదు అయినా వాళ్ళకి తేడా పడదు .ఈ గాలి నేల లో ఏమన్నా తేడా ఉందా అని వొక స్నేహితున్ని అడిగితె యిక్కడ ఆడ వాళ్ళు పెళ్ళయ్యాక డరోడా స్టీమర్ లా తయారయ్యి ముద్దు ముచ్చటకి పనికి రాకుండా పోతారు కాబట్టి అదేదో పెళ్ళికి ముందే కానిచ్చేస్తారని అతని ఉవాచ .ఏంటో ప్రపంచం లో కామం కామన్ అయిపొయింది ఈ మద్య అనిపించింది .ప్రతి భంధం  అక్కడికే దారి తీస్తోంది చివరికి .పరిచయం అయిన పది నిమిషాలకే  పదనిసల టాపిక్ లోకి వెళ్లిపోతుంటే లోకం చాలా ఫాస్ట్ అనుకోవలసి వస్తోంది .అక్కడ జంటలు పార్క్ లోంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరి  దోవన వాళ్ళు అపరిచితులు లాగ పోతున్నారు అదేంటో ?ప్రేమ ఎక్కువుంటే అక్కడ కామం వుండదు .కామం మాత్రమే వున్న చోట వాళ్ళ అవసరాలు మాత్రమె వాళ్ళిద్దర్నీ కలిపి ఉంచు తాయి .అవసరాలు తీరవు అని తెలిసిన మరుక్షణం మరో గూటికి చిలక యెగిరి పోవును .అందుకే ఏ ప్రేమికులకైనా మొదట్లో వున్న ఉదృతి , మాటల వెల్లువ రాను రాను తగ్గి పోయి , యింకేంటి యింకేంటి స్తాయి లో ఆగి పోతారు మళ్ళి యింకో కొత్త వాళ్ళు వచ్చే దాక .దీనికి భిన్నం గా నాకు తెలిసిన వొక ఆద్యాత్మిక  ప్రేమికుల కదా రాసుకున్నా .ఆకర్షణ , ప్రేమ , కామం దాటి ఎంతో ఎత్తులో నే చూసిన మరో మరోచరిత్ర . అయితే ప్రచురించ డానికి అతను అనుమతించక పోవడం తో అది కంచికి చేరని కధ గా వుండి పోయింది . ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకానికి  , ఏళ్ళ వెళాల మదిలో రగిలే  అగ్ని జ్వాలకి వున్న తేడా నిజమైన ప్రేమకి కామానికి  మద్యన  వున్న పొంతన .వొక మంచి కధ రాయాలని ఉంది . కామం లేని ప్రేమ కధ .పాత్రలు కళ్ళని దాటి కిందకి రాని కధ .యెంత దూరం లో వున్నా అంత చేరువలో వున్న అనుభూతి కి లోనయ్యే ప్రేమికుల కధ .వుసులాడు  కోకుండానే మాటలకందని మధుర భావాల్ని సొంతం చేసుకున్న ప్రేమికుల కధ .అంతులేని ఆ కధ .వొక రోజు వొకరి కోసం  వొక్క సారి రాయాలని ఉంది . మరి అది ఎప్పుడో ?

3 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

After a long time! రాయండి రాయండి. చదివి అభిప్రాయాన్ని తెలుపుతాము!

sitamahalakshmi చెప్పారు...

the day will come just wait

అజ్ఞాత చెప్పారు...

మీరేమి చెప్పదలుచుకున్నరో మరింత వివరంగా చెప్పండి.