13 జులై, 2012

మరుజన్మ ఉందా ?

ఈగ సినిమా చూసాక మళ్ళి పునర్జన్మల మీద ఆలోచన మళ్ళింది . .ఈ జన్మలో మనకి సాయం చేసిన వారు , మననుంచి సాయం పొందిన వారు , మనల్ని ద్వేషిస్తున్నవారు , ప్రేమిస్తున్నవారు అందరు కిందటి జన్మ లో లింకులేనేమో అని పిస్తుంది .మొదటి సారి చూసినా కొంతమంది మీదా ఏదో తెలీని అభిమానం పుట్టుకొస్తుంది .యిన్కొంతమందితో ఎప్పటినుంచి పరిచయం వున్నా ఏహ్య భావం తోనే వుంటాం .జీవితం అంతా రుణాను భంధాలతోనే నడుస్తుంది . చని పోయాక కూడా ఈ పగలు ప్రేమలు వెంటాడతాయ ?అది ఏ రూపం లో వున్నా ప్రతిబిమ్బిస్తాయా ?లేదా చని పోయే ముందు బలం గా అనుకుంటూ చని పొతే పునర్జన్మలో అవి సాధించడం కోసమే పుడతామా? .
అసలు ప్రేమ అనేది ఉందా ?కామం అనే గమ్యానికి ప్రేమ అనేది వొక ముసుగేనా ?
ప్రేమకి కామానికి మద్య ఏదన్నా విభజన రేఖ ఉందా ?లేక వొకే మైదానం లో అవి రెండు గమ్యాలా?
యిలా ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ యింటికి వెళుతుంటే వొక్క సారి పెద్ద శబ్దం తో ఈ లోకం లోకి వచ్చా

 నాముందు కారు కింద ఎవరో అమ్మాయి స్కూటర్ తో సహా కింద పడి పోయి వుంది .రక్తం మడుగులో సృహ తప్పి .నేను వొక ఉదుటున కార్ డోర్ తీసుకుని ముందుకి వెళ్ళే లోపు చుట్టూ జనాలు వచ్చి ఆమె చుట్టూ మూగి పోయారు .ఎక్కువ మంది బతికిందో చనిపోయిందో చూడ దానికి వచ్చిన వాళ్ళే గాని చొరవ తీసుకుని సహాయం చేసే వాళ్ళు కనబడలేదు .మరి నువ్వో నా మనసు ప్రశ్నించింది .యిప్పుడు ఈ మెడికో లెగల్ కేసు నెత్తిన పెట్టుకుని పరోపకారి పాపన్నా లా సహాయం చెయ్యడం అవసరమా ?సెల్ తీసి నూట ఎనిమిదికి కొట్టి వివరాలు చెప్పే లోపే తెలిసిందండి ఎవరో యింతకు ముందే చెప్పారు వస్తున్నాం అంటూ సమాధానం విని మనం ఆలోచించే లోపు ఆదుకునే వారు యింకా వున్నారు లోకం లో అని పించింది .
సరే అంబులెన్సు వస్తుంది గా వాళ్ళే చూసుకుంటారు అనుకుంటూ కార్ కేసి అడుగులు వెయ్య బోయా . మనసెందుకో వప్పుకోవడం లేదు మళ్లీ గుంపు లోకి అడుగు పెట్టా . కొంచెం తోసుకుని లోపలి వెళ్ళడం వొక గాలి తిమ్మెర శరీరాన్ని తాకుతూ రోడ్డు మీద పడి మొఖం నిండా కప్పి వున్న ఆమె చున్ని ని తొలగించడం వొకే సారి జరిగింది .నేను ఉత్సుకత తో ఆమె మొఖం కేసి చూసా , నమ్మలేక పోయా మళ్లీ దగ్గర గా వెళ్లి చూసా అంతే నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది .అవును తనే ఎవరి కోసం అయితే నేను గత పది ఏళ్ళు గా కళ్ళలో వత్తులు పెట్టుకుని మరి వెతుకు తున్నానో , ఎవరైతే నా జీవితం లో ప్రేమ మధురిమలని నింపి ఆనందపు అంచులలో మధురామ్రుతాలని పంచి వసంత కోకిల లా వెళ్లి పోయి నా నిన్నలలో కలిసి పోయిన నా స్వప్న సుందరి . తనే వోకప్పటి నా హిమాని .
అందానికి ప్రతి రూపం అయ్యి సయిన మందిరం లో రాజ హంసలా పడుకుని ఎన్నో సార్లు నయనానదం కలిగించిన ఆమె ఈ రోజు నడి రోడ్డు మీద దిక్కు లేకుండా చావు బతుకుల మద్య అసహాయ స్తితిలో కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి . యింతలో అంబులెన్సు వచ్చింది . బాగ్ లో సెల్ ఉందేమో చూడండి వాళ్ళ వాళ్లకి ఫోన్ చెయ్యాలి అంటున్నారు . నేనే వాళ్ళ వాడిని అంటూ అంబులెన్సు లో కూడా అనుసరించా .వాళ్ళు ప్రబుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళ బోతుంటే నేను కార్పోరాట్ ఆసుపత్రికి మళ్ళించా .ఆమె సృహలో లేదు తలకి పెద్ద దెబ్బే తగిలింది . రక్తం యింకా వస్తోంది .హాస్పిటల్ లోకి వెళ్ళ గానే ఆమె ని అయిసియు లోకి తరలించారు .బ్రెయిన్ స్కాన్ తీసి అర్జెంటు గా ఆపరేషన్ చెయ్యాలి ముందు లక్ష రూపాయలు కట్టండి అంటె నా డెబిట్ కార్డు తీసి కట్టేసా . డబ్బు వచ్చాక మీరు ఏమవుతారు ఆమె కి అని అప్పుడు అడిగారు .దారిన పోయే దానయ్య ముందు పని చూడండి డబ్బు వచ్చింది కదా అని అరిచా .అసలు తను పెళ్లి అయ్యాక అమెరికా వెళ్లి పోయిందని చూచాయ గా తెలుసు హైదరాబాద్ ఎప్పుడు వచ్చిందో ?ఎక్కడ ఉంటోందో ?కనీసం వొక ఫోన్ కూడా లేదు మేము విడి పోయాక . తన పెళ్ళికి పిలిస్తే వెళ్లి చెయ్యి కలిపినప్పుడు కళ్ళలో నీళ్ళు తెచ్చుకుని వేళ్ళతో నా అరచేయ్యిని గోకుతూ వీడ్కోలు తీసుకున ఆ స్పర్స మళ్లీ యిలా సృహలేని స్తితిలో అయిసి యు కి వెళుతునప్పుడు నా వేళ్ళతో ఆమె ని తాకినప్పుడు పునరావృత్తం అవుతుందని అనుకోలేదు .
రాత్రంతా అయిసియు బయటే గడిపా .వాళ్ళ వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో ?తెల తెల వారు తుండగా ఆమె ఆపరేషన్ విజయవంతం అయ్యిందని సృహ లోకి రావడానికి యింకొన్ని గంటలు పడుతుందని వొక నిమిషం చూసి రావడానికి అనుమతి యివ్వడం తో లోపలి వెళ్ళా .ప్రశాంతం గా నిద్ర పోతునట్టు గా వుంది .అదే చిరునవ్వు మొఖం .మా యిద్దరి మద్య సన్నీ హితం తారా స్తాయి లో వున్నప్పుడు తను నా చేతిలో చెయ్యి వేసి నిమురుతూ ఈ ప్రేమ యిలా ఎప్పటికి కోన సాగుతుందా ?కాల గమనం లో మనం విడి పోయి ఎవరి జీవన పయనం లో వాళ్ళు సాగి పోతునప్పుడు మన మద్య కనీసం మాటల రాక పోకల్ని అయినా కోన సాగించ గలమా ?అని కళ్ళలో నీళ్ళు పెట్టుకుని అడుగుతుంటే పో పిచ్చి మొద్దు అటువంటి స్తితి మన మద్య ఎప్పుడు రాదు . వొక వేళ వచ్చినా యిద్దరం బలం గా మనసులో వొకరి తో వొకరు మాట్లాడుకోవాలి అనుకుంటే అదే క్షణం సాధ్య పడుతుంది . కలవాల్లాన్నంత బలమైన కోరిక మనసులో కలిగితే మనం కలవకుండా ఆపడం ఎవరి తరం కాదు అని వోదర్చా .కాల గమనం లో ఆమె వుహించినట్టే ఆమె కి వేరే వాళ్లతో పెళ్లి అయిపోవడం తన గతకాలపు స్మృతులు ఎట్టి పరిస్తితుల్లో భర్తకి తెలికుడదన్న ముందు జాగర్త చర్య వల్ల ఆమె ఏ నాడు నా తో ఏ విధమైన సంభందము పెట్టుకోలేదు అంతకు ముందు మేము అన్ని విధాలా హద్దులు మీరినా కూడా .
రాత్రంతా నిద్రలేక పోవడం , యింట్లోకుడా ఎవరో కావలిసిన వాళ్ళకి హాస్పిటల్ సాయం అవసరం అయితే యిక్కడే వుండి పోతున్నా అని చెప్పడం తో వాళ్ల కంగారుని తగ్గించడం కోసం వొక రెండు గంటలు యింటికి వెళదామని యింటి కొచ్హా .మంచం మీద పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది .మెలుకువ వచ్చేటప్పటికి చీకటి అయిపోయి వుంది . అంటె నేను పొద్దుట నుంచి రాత్రి దాక వొళ్ళు తెలీకుండా నిద్ర పోయానా ?మెలుకువ రాగానే హిమాని ని హాస్పిటల్ లో జాయిన్ చేసిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే హాస్పిటల్ కి పరిగెత్తా .అయిసియు లో వాకబు చేస్తే పోద్దునీ సృహ లోకి రాగానే తను వాళ్ల హబ్బి నెంబర్ కి రింగ్ చేస్తే అయిన వచ్చి అగైనిస్ట్ మెడికల్ ఎడ్విజే డిశ్చార్జ్ చేయించుకుని మెరుగైన వైద్య సౌకర్యం కోసం అమెరికా తీసుకు పోతునట్టు చెప్పారని తెలిసింది .మళ్లీ జీవితం లో ఆమెని నేను కలవలేక పోవచ్చు . ఎప్పటికి ఆమెకి తన ప్రాణా పాయ స్తితిలో నేను నా ధర్మం నిర్వర్తిన్చినట్టు తేలిక పోవచ్చు .నేను ఆమె దృష్టిలో కాల గర్భం లో కలిసిపోయిన కా (ప్రే )మికుడిగా మిగిలి పోవచ్చు . అయినా నా గుండె లోతుల్లో ఆమె మీద వున్న చెదరని ప్రేమ ఏవిధమైన గుర్తింపుని కోరుకోవడం లేదు .ఆమె మళ్లీ జన జీవన స్రవంతిలో కలిసిపోయి ఎప్పటి లాగే నవ్వుతు నవ్విస్తూ అప్పుడప్పుడు నన్ను తలచుకుంటే నా కాదే చాలు పదివేలు . ''మరు జన్మ ఉన్నదో లేదో ?మరి అపుడి మమతలేమవుతాయో ?మనిషికి మనసే తీరని శిక్ష దేముడిలా తీర్చుకున్నాడు కక్షా' కార్ స్టార్ట్ చేసి యింటికేసి సాగి పోతుంటే ఎఫ్ ఏం లో పాట. మరి మరు జన్మ ఉందా ?

5 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

రవిగారు,

మరో జన్మలో అమెరకా లో మీకీ రుణానికి బాకీ చెల్లు !

చీర్స్
జిలేబి.

జలతారు వెన్నెల చెప్పారు...

కుచ్ పాకర్ ఖోనా హై
కుచ్ ఖోకర్ పానా హై
జీవన్ కా మత్లబ్ తో ఆనా ఔర్ జానా హై
దో పల్ కా జీవన్ సే ఎక్ ఉమ్ర్ చురాని హై
జిందగీ ఔర్ కుచ్ భీ నహీ తేరీ మేరీ కహాని హై

Unknown చెప్పారు...

అంటే వచ్చ్చే జన్మలో నేను అమెరికా వెళ్ళినప్పుడు హిమాని కార్ కింద పడితే ఆమె నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసి ఋణం తీర్చుకుంటుందని జిలేబి భావనా?

ఏంటో రుణాను భంద రూపేణా కార్ కింద పడాలయా అనుకోవాలేమో ?

వెన్నెల గారు తేరి మేరి కహాని కి బీచ్ మే గం హై

ఈ కధ హిమాని చదివినట్టు గా వుంది .నీ అందమైన అబద్దం బావుంది అని సందేశం పంపింది .

అంటే తన గుర్తింపు కోసం నేనేమి సాయం చెయ్యలేదు కాబట్టి ఆ క్రెడిట్ భర్త ఎకౌంటు లేనే వుండి పోనీ .

తన సాంగత్యం లో ఎన్నో సాయంత్రాలు నేను పొందిన అనుభూతి ముందు లక్ష లాంటి చిన్న విషయాలు లక్ష్య పెట్టాను .

sasi చెప్పారు...

రవి గారు, నమస్థే.మేము 26,27 మూలపొకం కు వెళదాము అని అనుకుంటునాము. దయచేసీ అమలాపురం నుంచి మూలపొకం కు ఎలా వెళ్ళాలో చెప్పగలరు.
-----sasikala

Unknown చెప్పారు...

శశికళ గారు ఆ వూరి పేరు మూలపొలం . అమలాపురం నుంచి పదిహేను కిలోమీటర్లు .ముక్తేశ్వరం తర్వాత వస్తుంది .మిగతవిషయలకి నన్ను మెయిల్ లో కాంటాక్ట్ చెయ్యండి .