దేని ని కైనా రెడీ లో బ్రాహ్మల పై వున్నా అబ్యానతరకర సన్నివేసాలని తీసెయ్యాలని నిరసన వ్యక్తం చెయ్యడానికి మోహన్బాబు యింటికి వెళ్తున్న బ్రహ్మణ సమాక్య కార్యకర్తల్ని గుండాలతో దాడి చేయించిన మంచు విష్ణు , ఆ విజువల్స్ టివి లో చూస్తూ కూడా , పొగరు గా మా యింటి మీదకి వస్తే తాట తీస్తా , యిక్కడ గాజులు తోడిగించుకుని కూర్చోలేదు అంటూ ఆవేశ పడి పోయాడే గాని యిందులో బ్రాహ్మల మనో భావాలకి అభ్యంతరం గా వున్నా సన్ని వేసాలని తొలగిస్తాం , బాధ పెట్టి నందుకు క్షమించండి అనడం పోయి , సినిమా ని సినిమా గా చూసు ఎంజాయ్ చెయ్యాలి గాని అంటూ పిచ్చి పిచ్చి గా మాట్లాడాడు . అంతకు ముందు రోజు ''మొహం'' బాబు విరాళాల కోసం నా దగ్గరికి తిన గా వస్తే యిచ్చే వాడిని కదా ఈ గొడవ దేనికి అంటూ కించ పరిచే వ్యక్యాలే చేసాడు .గాని అరె నిజమే వొక వర్గం మనో భావాలు దెబ్బ తీసే విధం గా చేశామే అన్న పశ్చాతాపమే లేదు . పైగా ఏం పిక్కుంటారో పిక్కోన్డి టైపు లో మాట్లాడాడు .తప్పు చేసినప్పుడు తప్పయ్యిందని వొప్పుకుని దాన్ని సరిదిద్దు కుంటే సరి పోయే దానికి ఆ సినిమాలో బ్రహ్మణ కుర్రాడు మీదకి వస్తే నీ చేత కూడా తన్నులు తినడానికి గాజులు వేసుకు కూర్చో లేదు యిక్కడ అనట్టు గానే వుంది వాళ్ళ ప్రతి క్రియ .థర్డ్ పార్టీ ఎవరు ఆ సినిమా చూసినా ఆ కులం వాళ్ళని కించపరచడం స్పష్టం గా కని పిస్తూనే వుంటుంది .పదిహేన్నెల్ల క్రితం మలయాళం లో వచ్చిన కధనే మక్కి కి మక్కి కాపీ కొట్టి తిసామే గాని యిందులో మేం సొంతం గా జోప్పించింది ఏమి లేదని ఆవేశం లో నిజం కక్కేసాడు మంచు విష్ణు .
అంటే ఈ గొడవలు జరగా బట్టి తమ సినిమా కాపీ అన్న విషయం బయట పడింది గాని లేకపోతె కదా మాటలు పాటలు ప్రేక్షకులు మోహన్బాబు అండ్ ఫ్యామిలీ అని వేసుకుని వుండే వారు . పైగా తిరపతి వెళితే అక్కడ ప్రధాన అర్చకులు చాల కలం తర్వాత వొక మంచి కుటుంబ కదా చిత్రం చూసామని అస్వీరదించి పంపారట .పాపం రమణ దిక్షితులకి స్వామి వారి సేవకే టైం దొరకటం లేదంటే ఇలాంటి సినిమాలని చూసి మల్లి అస్వీర దించడం వొకటి .
పైగా సినిమా విడుదలైనా యిన్ని రోజులకి నిరసన వ్యక్తం అంటే దిని వెనక ఎవరున్నారో త్వరలో బయట పెడతా అంటూ వ్యాక్య నించాడు .నేను సినిమా మొదటి రోజే చూసి అదే రోజు చెప్పా బ్రహ్మల ను కించపరిచేవి గా వున్నాయి సన్నీ వేసాలని .యిప్పటి కైనా వాళ్ళు అహం వీడి క్షమాప్పన వేడుకుని అబ్యంతర సన్నీ వేషాలు తీసేస్తే పేర్లు , విశ్రాంతి , శుభం అన్నా మిగులు తాయి .
మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కవిని, ఆందోళనగా ఉన్నప్పుడు రవిని, ఆలోచనలో ఉన్నప్పుడు భావుకుడిని, చిలిపిగా ఉన్నప్పుడు ప్రేమికుడిని, వెరసి రవిగారిని..
31 అక్టో, 2012
ఆవేశం లో నిజం కక్కేసిన మంచు విష్ణు
25 అక్టో, 2012
బ్రాహ్మల్ని కించపరచడానికి'' దైనికనా రెడీ''
దైనికైనా రెడీ సినిమాకి కావాలని సెన్సార్ ఆఫీసర్ రాజ్యలక్ష్మి క్లియరెన్స్ యివ్వకుండా జాప్యం చేస్తున్నారని నిర్మాత
మోహన్ బాబు గగ్గోలు పెడితే ఏంటో అనుకున్నా గాని ఈ సినిమా చూసాకా ఆవిడ అబ్యంతరాలు పెట్టడం లో అర్ధం వుందని పించింది . మొత్తం పంతొమ్మిది కట్స్ చెపితే దెబ్బలాడి బలవంతం గా బయటకు తెప్పించుకునట్టు గా వుంది . సినిమాలో ఎక్కువ భాగం బ్రాహ్మల్ని సంభావన కోసం సొంగ కార్చుకుంటూ దేనికైనా రెడీ అనట్టు గా చూపించారు అదే డైలాగు బ్రహ్మానందం తో కూడా చెప్పించారు . ఎన్నాళ్ళు వాళ్ళని తిండి పోతుల్లగా , డబ్బుకు కక్కుర్తి పడే వాళ్ళలా చూపిస్తూ అదే హాస్యం అనుకోమనినవ్వు కొమంటే నవ్వుల పాలు అయ్యేది ఆ నిర్మాతలే . ఈ సినిమాలో కుడా చికెన్ ముక్కని , మటన్ ముక్కని ఆబగా బ్రాహ్మలు తిన్తునట్టు చూపించి వారిని యధా విధి గా అపహాస్యం చేసారు .యిదే విధం గా వేరే యే కులం వారి మనోభావాలను దెబ్బతీస్తూ చూపిస్తే ఈ పాటికి ఆ సినిమా రీళ్ళని నడి రోడ్డుమీద తగల బెట్టి వుండే వారు . మంచితనం , సంస్కారం సబ్యత చేతకాని తనం గా అయిపోయాయి .అదే నిమ్నజాతి కులాల మీద డైలాగు పక్కన బెట్టి వారి నాయకుల విగ్రహం చూపించి ఆ కాలని వాళ్ళు దొంగలు గా చూపిస్తేనే పెద్ద గొడవ అయ్యింది. యిందులో బ్రహ్మాన స్త్రీ గా వేసిన పాత్రతో యింటికి ఎవరు వచ్చినా అచ్చు మా ఆయన లానే వున్నారు అంటూ డబ్బు కోసం వెకిలి గా ప్రవర్తించేలా చూపించి మకిలి హాస్యం గా మలిచారు . ముద్ద పప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని తినేస్తా అని హీరో చేత డైలాగులు చెప్పించారు .బ్రహ్మాన స్త్రీ తో మా ఆయనకి తెలిస్తే నీ గు పగిలి పోద్ది అని చెప్పించి మళ్లీ బ్రహ్మానందం తో ఏం పగిలి పోద్ది అని రెట్టించి హీరో చేత నీ గుబ పగిలి పోద్దని ఆవిడా గారి ఉద్దేశం అని చెప్పించారు .యిలా చెప్పుకుంటూ పొతే చాలానే వున్నాయి . అదే మళ్లీ రాజుల కులం లో టివి దర్పం అంటూ ఆ కులాన్ని పొగిడారు .లోకువ గా వున్నా వాళ్ళని చుస్తే మొట్ట బుద్దని , సినిమా ఇండస్ట్రీ లో సగానికి పైగా వుండి వాటి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున బ్రాహ్మాల్ని మళ్లీ అదే సినిమాల్లో వెకిలి హాస్యం తో అపహాస్యం చేస్తున్నా కిమ్మనే వాడె వుండడు పోనీ లెద్దూ మన కెందుకు వాళ్ళ పాపాన వాళ్లే పోతారు అని సర్దుకు పోయే తనం తో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ వుండడం తో ఇలాంటి హాస్యం పేరు తో అపహాస్యం చేసే సినిమాలు వస్తూనే వుంటాయి . పోనీ సినిమా ఏమన్నా నా కళా ఖండమా అంటే డీ , రెడీ ని కలిపి తీసిన కాపీ సినిమా .అక్కడక్కడ బ్రహ్మనందంవల్ల పేలిన జోకులు తప్ప పనులు మానుకుని చూసే సినిమా మాత్రం కాదు . వొక నెలలో ఎలాగు టివి లో వచ్చేసే సినిమానే .
23 అక్టో, 2012
మారే హృదయం
మారే హృదయం
యెదలో అభయం
ఏదో విధం అయోమయం
తరచూ దానికి గాయం
అయినా సిద్దం మర్నాడు ఉదయం
తప్పేంటో వోప్పేంటూ తెలిసేలా లేదేమిటో
గమ్యం కాదని తెలిసినా అటు పయనమేమిటో
పశ్చాతాప్పం ఆవిరి అయిపోతున్నదేమిటో
తన మాటైనా తను వొకసారి విన దేమిటో
కొంచెం యిష్టం కొంచెం కష్టం
చివరికి తనకే నష్టం
హృదయ స్పందన మారిపోతున్నది మాత్రం స్పష్టం
పడలేదంటూనే పడుతూ వుంటే ఆగంటూ అగంటూ ఆపేదెలా
యిది జరిగిందేప్పుడో ఎద అడిగిన్దేప్పుడో ?
ఏదో విధం అయోమయం
యెదలో భయం
హృదయం మళ్ళి భారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)