ఆమె కి నాకు మద్య ఇదివరకటి ప్రేమ భావం లేదు .నే ను యింట్లో అడుగు పెట్టినప్పుడు కళ్ళలోఇదివరకటి మెరుపు యిప్పుడు కాన రావడం లేదు .భర్త ఉనికిని మర్చి పోయి కూడా ఎదురు వచ్చి రండి రండి అంటూ ఆహ్వానించిన అలనాటి రోజులనుంచి ,బెల్ కొట్టిన పదినిమిశాలకి కూడా వంటింటిలోంచి వచ్చి గడియ తీయని నేటి రోజులకి యెంత మార్పు .దానికి నా నోటినే నిందించు కోవాలేమో?ప్రేమ చిగురు తొడిగి న కొత్తల్లో అంతా అద్బుతం గా తను వొక దేవత లాగకని పిస్తుంది .మొగ్గలు తొడిగి ముగ్గులోకి దిగే వరకు బానే వుంటుంది .ఆ తర్వాతే అసలు కధ మొదలవుతుంది .తనలో యిదివరకు కనిపించని లోపాలు కనబడతాయి .వాళ్ళింటికి ఏ అతిధులు వచ్చినా నాకు అనుమానమే .నవ్వుతు మాట్లాడుతూ చొరవ చూపిస్తే నా లో అసహనం .ఆ అసహనం మనసులో ఉంచుకుని వుంటే పరిస్తితి యింతవరకు వచ్చేది కాదేమో?వెంటనే వున్నవి లేనివి ఊహించుకుని ఆమె ని మానసికం గా వేధించడం తోనా మీద విసుగు మొదలయ్యి అది అసహ్యం గా పరిమాణం చెందింది .కుర్చుని వేడి కాఫీ తో ముచ్చటించుకున్నా ఉదయాలు నేడు ఎదురు పడిన రెండు నిమిషాలకే భయంకరమైన వాగ్యుద్దలకి దారి తీస్తుంటే యింక మంచినీళ్ల కే దిక్కు లేదుకాఫీ లు ఎక్కడ . పోనీ అలాగని వెళ్ళడం మానేయొచ్చు గా మనసు ప్రశ్న .ఏమో ఏదో వొక ఉదయం శుభోదయం అయ్యి ఇదివరకటి రోజులు రావా అని చిన్ని ఆశ .విరిగిన మనసు ని అతికే పరికరాలు లేనప్పుడు విధి బలీయం అని తప్పుకున్నా ఆమె మధుర జ్ఞాపకాలతో గడిపేసి వుండే వాడినేమో? .
ఎప్పటి లాగే మనసు వద్దని చెబుతున్నా కాళ్ళు ఆటే లాగడం తో వాళ్ళింటికి వెళ్ళాను. .వచ్చిన అతిధి తో ఆమె నవ్వుతు మాట్లాడుతూ కాఫీ తాగుతూ మాట్లాడు తోంది .అతిధి కాఫీ తా గడం కంటే ఆమె అందాల్ని కళ్ళతో జుర్రుతూ చాలా సన్నిహితం గా కూర్చున్నాడు .,మొదట్లో నేను కుర్చునట్టు .ఏదైతే నేను చూసి తట్టుకోలేనో అదే సన్నివేశం యిప్పుడు నా ఉనికిని గుర్తిస్తూ అతిధి కొంచెం జరిగాడు గాని ఆమెలో యింత కుడా మార్పులేదు , పై పెచ్చు యిలా ఆస్వాదిస్తూ కాఫీ తాగి ఎనాల్లయ్యిందో అంటోంది అతిధితో . గుండెల్లో బాధ తన్నుకోస్తున్నా అదిమి పెట్టి కొంచెం గ్రిల్ తలుపు తీస్తారా ?అన్నాను . . ముభావం గానే తలుపు తీసి కాఫీ తేవడానికి వంటిట్లోకి వెళ్ళింది .అతిధి మొహం లో విజయ గర్వం తను యింతకు ముందు వచ్చినప్పుడు ఆ సాన్నిహిత్యం లో నే ను వుండేవాన్ని యిప్పుడు ఆ స్థానాన్ని అతిధి ఆక్రమించాడు . రేపెవరో అనుకుంటుంటే ఆమె వచ్చి కాఫీ బల్ల మీద పెట్టింది . మనసు చివుక్కు మంది యిది వరకు వేళ్ళతో పలకరిస్తూ స్పర్శించిన ఆ కప్ యెంత దూరం అయిపొయింది ?మళ్ళి అతిధి ,ఆమె తమ కబుర్లలో ములిగి పోయారు నా ఉనికిని ప్రశ్నిస్తూ .
కొత్తవాళ్ళు తప్ప పాతవాళ్లు మీకు యిష్టం ఉండరనుకుంటానా ప్రశ్నకి ఆమె లో ఆవేశం కట్టలు తెంచుకుంది .అవును కొత్తొక వింత పాత వొక రోత మీరు కుడా యింకో కొత్తవాళ్ళని చూసుకుని మమ్మల్ని వదిలి పొండి అంటూ రెండు చేతులు జోడించింది .
అలా పోలేకే కదా మీచూరు పట్టుకుని వెళ్ళాడు తున్నా. గుండెల్లో తిష్ట వేసావు ,యెంత తిట్టినా వదలలేక పోతున్నా .
అది ప్రేమ కాదు నీ వ్యామోహం , అది తీరిన రోజు నీలో ఈ ఆవేశం వుండదు తీ రనప్పుడే నీలో ఈ ఆక్రోశం ఆమె సమాధానం .
మరి తీర్చేయ్యి పోతా అన్నానో లేదో ఆమె చెయ్యి నా చెంప మీద దాక వచ్చి ఆగి పోయింది .అతిధి ముందు చాల అవమానం గా అనిపించింది . యిద్దరం వునప్పుడు యింత కన్నా ఘోరం గా తిట్టుకున్నా రోజులు వున్నాయి . అలాంటిది అతిధి వున్నాడనే ఆమెలో ఈ ఆవేశం .యింతలో అతిధి కల్పించుకుని సార్ మమ్మల్ని వొక అరగంట వొంటరి గా వదిలెయ్యండి చాలా మాట్లాడు కోవాలి అన్నాడు .ఆమె అతిధి ని వారిస్తుందేమో అనుకుంటే లోపలి కి వెళ్ళిపోయింది. నా లో ఆవేశం కట్టలు తెంచుకుంది .యిక్కడ వున్నవాళ్ళు చాలదా ?లోపల యింకెవరు ఉన్నారే లం .. అంటూ అరిచాను .
.అవునురా నువ్వు పరిచయం అయిన దగ్గరనుంచి నా బతుకు అదే అయ్యింది రా ఎవరు వచ్చినా అలాగే అంటున్నారు అంటూ ఏడ్చుకుంటూ గా బాల్కని లోకి పరిగెత్తి వొక్క ఉదుటున దుకేసింది .అతిధి బాల్కనీ కిందకి చూస్తూనే రక్తం మడుగులో వున్న ఆమెని చూస్తూనే అమ్మో హత్య హత్య అంటూ అరుస్తున్నాడు .నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది .ఆమె ఆత్మహత్య చేసుకుంటే దాన్ని హత్య గా చిత్రికరిస్తున్నాడు అతిధి .మొత్తం ఫ్లాట్ లో వున్నా జనం అంతా కింద పోగయ్యారు .ఎవరో పోలీసులకి ఫోన్ చెయ్యండి అంటున్నారు . అతిధి నే నే ఆమెని కిందకి తోసేసి చంపేసినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నాడు .యింతలో పోలీసులు ఐదో అంతస్తుకి వస్తున్న అలికిడి వినిపించింది .లేవండి లేవండి అంటూ అరుస్తున్నారు . లేవండి బారెడు పోదేక్కినా యింకా నిద్రేనా వాకింగ్ కి పోరా అంటూ అరుస్తున్నారు . నేను కళ్ళు తెరచి చుస్తే ఎదురుగా శ్రీమతి కుదుపుతూ నన్ను నిద్ర లేపుతోంది . అమ్మో యిది కలా ? నిజమై వుంటే తన జీవితం ఎమై పోయేది ?అసలు ఈ భందాలని అవసరమా ?మొదలో తుదిలో ఎప్పుడో వదిలెయ్య వలసినవే గా ?మద్యలో ఎందుకు ఈ వెతలు ?యిది యిచ్చే సుఖం కంటే దాంతో పాటే వచ్చే కష్టాలే ఎక్కువ .ఎట్ వాట్ కాస్ట్ ?వాట్ ఫర్ ?యివన్ని అవసరమా? ఈ రోజు నుంచి కొత్త ఉదయం స్వాగతం పలుకు తోంది అనుకుంటూనేను వాకింగ్ కి బయలు దేరాను . కళ్ళు తెలీకుండానే ఆమె యింటి వైపు నడిపిస్తున్నాయి . ఆఖరి సారి తనని చూసి వెళ్లి పోదామని వాళ్ళింటికి వెళితే ముందు గదిలో ఆమె భర్త లాప్టాప్ లో పనిచేసుకుంటూ నవ్వుతు విష్ చేసాడు .అతనికి ఎదురుగా వున కుర్చీలో కుర్చుని తను లేవలేదా అండి అని అడిగాను . . అదే యిదివరకు నేను రాగానే భర్త లోపలకి వెళ్లి మీ ఫ్రెండ్ వచ్చారు లేవవోయ్ అంటూ తన పనిలో నిమగ్నం అయిపోయేవాడు . ఈ రోజు కొత్త గా లేదండి అలిసి పోయింది పడుకుంది అంటే సరే వస్తానండి అని నేను లేవ బోతుంటే వొక నిమిషం కూర్చోండి మీతో మాట్లాడాలి అంటూ లాప్టాప్ పక్కన పెట్టి
చూడండి గత కొన్ని రోజులు గా గమనిస్తున్నా మీరిద్దరూ యిది వరకులా లేరు మీ కొట్లాటలు తారా స్తాయికి వెళ్లి పోయాయి .అయిన దానికి కాని దానికి కూడా కసురుకున్తున్నారు . మొదట్లో మీ భందం ఉక్కు గొలుసులా గా దృడం గా వుండేది .అప్పట్లో మీ యిద్దరిది ఏమి ఆశించని స్నేహమే. అది ఆ స్తాయి దాటి ముందుకు పోతున్న కొద్ది ఆమె మీద మీ అధిపత్యం పెరిగి ఆమె స్వేచ్ఛని ని హరించే స్తాయికి వచ్చేసింది .ఎవరు వాళ్ళ స్వేచకి భంఘం కలిగితే సహించరు . మీ మద్య యిపుడు సన్నటి దారపు భంధం కుడా లేదు . అది ఎప్పుడో తెగి పోయింది . మీరిద్దరూ ఆ ఆరోగ్యకరమైన స్నేహం స్తానంలో వుండి పోయి వుంటే ఈ పరిస్తితి వచ్చేది కాదు . యిది మరింత ముదిరి మీ రిరువురి జీవితాలు నాశనం కాకుండా ఫుల్ స్టాప్ పెడితే రెండు కుటుంబాలు బాగు పడతాయి . యింతకంటే చెప్పడానికి ఏమిలేదు అంటూ ముగించాడు . నాకు ఆ క్షణం లో ఆమె భర్త గీతోపదేశం చేసిన కృష్ణుడి లాగే కనబడ్డాడు . ఎంతటి ఔనత్త్యమ్ .యింకేవరన్న అయివుంటే నానా యాగి చేసి అవమాన కరమైన రీతిలో సాగనంపి వుండే వారు . ఆమె భర్త చేతులు పట్టుకుని నను క్షమించండి ,యింకేప్పుడు మీకు ఇబ్బంది కలగ చెయ్యను .నా పరిధులు దాటినా మాట వాస్తవమే .నేను నేటి నుంచి తన గతం లోకి వెళ్లి పోయి మీ భవిస్యత్తు బద్రం గా ఉండేలా చేస్తా అంటూ వేనక్కి తిరిగి పోయా . నా కల , యియన మాటలు నా పరిధుల్ని గుర్తు చేయొచ్చు గాని ఆమె మీద వున్న ప్రేమని చంప లేవు .తను నిద్ర లేచి నా ఫోన్ యింకా రాలేదేమిటా అని ఎదురు చూస్తూ ఉంటుందేమో? మూగబోయిన కోయిల ఆమె సెల్ అన్న విషయం ఆమె భర్త బహుసా చెప్పాడేమో?లిఫ్ట్ శబ్దం అయి వచ్చిన పద ధ్వనులు నావే అనుకుంటూ ఆమె గుమ్మం వరకు వచ్చి నిరాశ గా సోఫాలో కూల బడో చ్చేమో ?నేను ట్రాన్స్ఫర్ అయ్యి వేరే వూరు వెళ్లి పోయానన్న చిన్న అబద్దం కొన్నాలకి నా జ్ఞాపకాలని ఆమెలో చేరిపెయ్యచ్చేమో గాని , నిశిరాతిరి నిశబ్దం లో తరంగాలలో వచ్చిన ఆమె పలకరింపులు ,మనస్సునిస్సత్తువ గా అయినప్పుడు ఆమె యిచ్చిన హాస్యపు గుళికలు ,మరెన్నో మనసులో నిక్షిప్తమై పోయే వెలకట్టలేని లేని మధురానుభూతులు మోసుకుంటూ ఈ బాధని నేను తప్పకుండా అధిగమించా గలను .
8 కామెంట్‌లు:
రవి గారు. చక్కని ముగింపు ఇచ్చారు .ఇద్దరు వివాహితుల మధ్య స్నేహం కొనసాగడమే కష్టం. అలాంటిది అంతకు మించిన బంధం ని ఆశించిన అతనికి చివరికి అయినా వాస్తవం అర్ధమైంది.
కొన్ని అనుభూతులు ఉంటె జీవితం బాగుండును అనిపిస్తుంది. కానీ కొన్ని గరళాలు మ్రింగడం కూడా కష్టం.
మొదటి నుండి .. ఈ కథని నేను పాలో అవుతున్నాను. ఇలాంటి ముగింపు ఇస్తే బాగుండును అనుకున్నాను. :) మొత్తానికి సమాజంలో జరుగుతున్న కొన్ని(స్నేహం ముసుగులో) స్నేహ సంబంధాలని అరటి పండు ఒలిచిపెట్టినట్లు నగ్నంగా రచించారు. అందుకు అభినందనలు
మీ కథలో నాకు నచ్చనిది మరీ ఆమెని.. దిగజార్చారు. అలాగే ఆమె ,భర్త ,పిల్లలని కూడా.
ఇంత జరుగుతుంటే.. కుటుంబంలో వారికి తెలియకుండా ఉంటుందా? కుటుంబంలో నుండే వ్యతిరేకత మొదలవకపోతే.. అది కుటుంబం కాదండి. వ్యాపార బంధం అవుతుంది. ఆఖరికి భర్తకి ఔన్నత్యం అంటగట్టారు. :) బావుంది.
ఎప్పుడు చూసినా ఇలాంటి టపాలు రాస్తారు. ఈ టపా ఒట్టి కథ నిజమా? నిజమైతే మీకు భార్యా పిల్లలు లేరా? వాళ్ళు మీ బ్లాగు చదవరా?
ఇంత స్ట్రాంగ్ "భం"ధం అంత వీజీ గా ముగిసిద్దా?
వనజ గారు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు .హలా హలాన్ని గరళం లో దాచుకోబట్టే ముగింపు అలా ముగిసింది .
లేకపోతె పాత్రలు గతం లో కలిసి పోయి చరిత్రలో మిగిలిపోయేవి .ఆమె దేవతో?దెయ్యమో తెలీని స్తితిలోనే
హీరో ఆమె జీవితంలోంచి నిష్క్రమిస్తాడు .అందుకే ఆమె దిగజారిందో , యితని అనుభవంతో ఎగా బాకిందో కాలమే నిర్ణయించాలి .
సహనశీలి అయిన భర్త ఉండబట్టే ప్రమాదాలు లేకుండా విడి పోగాలిగారేమో?సాధారణంగా ఇలాంటి కధలో వొక టొ రెండో పాత్రలు
హత్యకి గురికావడం కద్దు .
అమ్మా అజ్ఞాత రచయితా సమకాలిన సమస్యలు తను చూస్తున్నవి వాస్తవికతని ప్రతిబింబ చేసేలా రాస్తూ
పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ నేను అని రాసినంత మాత్రాన దాన్ని రచయితకి ఆపాదించడం తగదు . వొక వేల యిది నా కధే అయితే
కుటుంబ వ్యవస్థ దెబ్బ తినేలా నా గుట్టు నేను బయట పెట్టుకోను కదా ?
బులబ్బాయి స్ట్రాంగ్ భంధం అలా ముగియకపోతే వేరేలాగా ముగిసి పోతుందేమో?
hala halam anna garalam anna okate kada Ravi gaaru..:-)
Halahalam = garalam kada?
బాబయ్య, మీరిచ్చిన జవాబుతో కళ్ళు తెరచుకొన్నాయి. నేనింకా ఈ కథల్ ఉ నిజమేమో అని భ్రమపడుతూండేవాడిని. మీ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతుండేవాడిని. మీరు మంచి రచయితే, కాని ప్రతి సారి కాపిలు టిపినిలతో సారి పెట్టుకొన్నారు :)
అజ్ఞాత గరళం అంటే భరించ దగ్గ విషం
హాలాహలం అంటే భయంకరమైన విషం
శివుడు మాత్రమే కంఠం లో దాచుకోనగాలిగిన విషం
పదప్రయోగం అర్ధం మొదట్లో వొకే గాని తర్వాత సుసైడల్ అని నా భావం .
కధలో కాపీలు , టిఫిన్ లతో సరిపెట్టక పొతే భోజనాల గురించి రాస్తారా
నీ అజ్ఞానం పాడుగాను .
కామెంట్‌ను పోస్ట్ చేయండి