14 నవం, 2009

బిగ్ ఎఫ్ ఏం లో బాలల దినోత్సవం ఫోటోలు




సినిమాల్లో వేసిన బాల నటులతో యి రోజు 92.7 బిగ్ ఎఫ్ ఏం వాళ్ళువొక ప్రోగ్రాం నిర్వహించారు . విలేజ్ లో వినాయకుడు లో వేసిన మా అబ్బాయికి కూడా ఆహ్వానం అందడం తో వెళ్ళాడు . ఆ సందర్భంగా తీసిన ఫొటోస్.ఇక్కడైతే సేఫ్ గా పడి వుంటాయని ,మంచు లక్ష్మి (మోహన్ బాబు daughter )తో ఫోటో బాగా వచ్చిందని నమ్మకం తో లోడ్ చేస్తున్నా .

5 నవం, 2009

విలేజ్ లో వినాయకుడు లో నేను


ఇంతకూ ముందు నా పోస్ట్స్ లో షూటింగ్ అనుభవాలు రాసాను .ఏదో సరదాగా వేసాను కాబట్టి డబ్బింగ్ చెప్పేసాక ఆ విషయం మర్చి పోయా కుడా .నిన్న సడన్ గా యూనిట్ వాళ్ళు ఫోన్ చేసి అమీర్ పేట బిగ్ సినిమా లో ప్రివ్యూ వుంది రమ్మంటే వెళ్ళా .మొత్తం కుటుంబ సమేతంగా .(మా పిల్లలు కూడా వేసారు కాబట్టి) .సినిమా చూసాక సంతోషం వేసింది నెల్లాళ్ళు రాజోలు లో మండు టెన్డల లో కష్ట పడి నందుకు సత్ఫలితమే వచ్చింది .నేను నటించన మూడు సన్నివేశాలు కూడా ప్రేక్షకులు బానే రిసివు చేసుకున్నారు .అంతకు ముందు జోష్ సినిమాలో ప్రకాష్ రాజ్ పక్కన సూట్ వేసుకుని కూర్చున్నా , మొదటి సారి డైలాగులు చెప్పింది యి సినిమాలోనే .మా అబ్బాయి చేసిన సన్నీ వేశాలకి కూడా నవ్వులు రువ్వాయి .రేపు శనివారం ఫస్ట్ షో కి అందులో నటించిన నటీ నటులతో దేవి దియేటర్ లో ప్రేక్షకుల మద్య లో కుర్చుని చూడాలని ప్లాన్ చేసాము . ఇంతకీ నా పాత్ర ఏమై వుంటుంది అబ్బా ?ఆశ , దోస , అప్పడం , వడ అంత ఈజీ గా చెప్పేస్తే ఇంట్రెస్ట్ ఏమి వుంటుంది ?చూసి మీరే కని పెట్టండి .యి సినిమాని తప్పకుండా కుటుంబ సమేతం గా వెళ్లి చిరు నవ్వు తో చూడొచ్చని హామీ ఇస్తున్నా .

1 నవం, 2009

పిడతకంది పప్పు

మొన్ననే కాకినాడ లో చుట్టాల పెళ్ళికి వెళ్ళవలసి వచ్చింది మా అమ్మ గారి నిర్భంధం వల్ల.చుట్టూ పక్కల వున్న ద్రాక్షారామం , కోటిపల్లి , సామర్లకోట లో ప్రసిద్ధ శివాలయాల దర్సనం అయిపోయాక ఇంకా సమయం వుండడం తో వొకసారి చినప్పుడు సెలవలకి వెళ్లి గడిపిన మా అమ్మమ్మ గారి ఇంటిని చూడాలని పించింది ,చాల ఏళ్ళ క్రితమే మా అమ్మమ్మగారు పోయిన కొత్తల్లోనే ఆ ఇల్లు అమ్మేసారు .అది సూర్యారావుపేట లో దయల్బాగ్ స్టోర్స్ వీధి లో వుండేది .ఆ యింటి తో చినప్పటి జ్ఞాపకాలు చాలా వున్నాయి .
ఎదురుగుండా డాక్టర్ నారాయణ మూర్తి గారి ఇల్లు .అప్పట్లోనే అయన పేరున్న డాక్టర్ ,వాళ్ల అమ్మాయి , అబ్బాయి నా యీడు వాళ్లే రెడ్ కాన్వెంటు లో చదువుతూ వుండేవారు ,అప్పట్లో కాకినాడలో రెడ్ కాన్వెంటు , బ్లూ కాన్వెంటు ప్రసిద్ది చెందిన స్కూళ్ళు .వాళ్ళు పుట్టపర్తి సాయిబాబా భక్తులు . ప్రతి గురువారం వాళ్ళింట్లో భజనలు చేసి ప్రసాదం పంచేవాళ్ళు .సెలవలకి వెళ్ళినప్పుడు నేను భజనలకి వెళ్ళే వాణ్ణి , వొకసారి (ఆ వయసులోనే) వాళ్ల అమ్మాయిని ఇంప్రెస్స్ చేసేద్దామని నేను పాడతా అంటూ వొక పిలుపులో పిలిచితే అంటూ వెంకటేశ్వర భక్తీ గీతం అందుకుంటే వాళ్ల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడి ఏమి అనలేక భజన అయిపోయాక సాయిబాబా భజనలో వేరే పాటలు పాడాకుడదని చెప్పారు ,ఆ ఇల్లు ఇప్పటికి అదే shape లో వుంది పాతకాలపు వాసనలతో .ఆ విధి లో అప్పట్లో వాల్లోక్కరికే కార్ వుండేది . దాన్ని స్టార్ట్ చెయ్యాలంటే ముందు జెడ్ shape రాడ్ తో తిప్పేవారు .మా ఇంటి పక్కనే భానుడి గారి ఇల్లు వుండేది ఇప్పుడది మొండి గోడలతో వుండి పోయింది .దాన్ని చూసే మా అమ్మమ్మ గారి ఇల్లు గుర్తు పట్టా . ఇప్పుడు అక్కడ క్యారియర్ ఏ సి షో రూం వచ్చేసింది వొకప్పుడు పిల్లలం అంతా అక్కడే నూతి గట్టు దగ్గర , జామి చెట్ల కింద ఆడుకుంటూ వుండే వాళ్ళం . సాయంత్రం ఆరు దాటగానే వీధి బయటకు వచ్చి ఎదురు చూసే వాళ్ళం పిడత కందిపప్పు మూడు చక్రాల బండి కోసం .దూరం నుంచి గుడ్డి దీపం పెట్టుకుని బండి ని రెండు చక్రాల మీద తోసుకుంటూ వచ్చే ఆ ముసలి అబ్బి కోసం .పది పైసలకే బోల్డు ఇచ్చేవాడు .ఆ రుచి ఎప్పటికి మర్చి పోలేను , ఆ బండిని అతను గాంధి నగరం పార్క్ దాక తోసుకుని వెళ్లి అక్కడే అమ్ముకునే వాడు .నేనెప్పుడు కాకినాడ వెళ్ళిన గాంధీనగరం పార్క్ దగ్గర పిడత కంది పప్పు మిస్ అవ్వను .కార్ ని పార్క్ దగ్గరే ఆపించేసి డ్రైవర్ ని నేను వాక్ చేసి వస్తా నువ్వు బయట వుండని వెళ్లి చుట్టూ తిరిగి చుస్తే ఎక్కడ బండి కనబడ లేదు ,నిరాశగా కార్ ఎక్కుతూ యధాలాపం గా డ్రైవర్ ని అడిగా ఇక్కడ పిడతకంది పప్పు ఎక్కడ దొరుకుతుందని .అదేదో విదేశి కంది పప్పేమో సారూ అడుగుతున్నారు రిస్క్ ఎందుకని సుపెర్మర్కేట్ లో దొరకచ్చేమో బాబయ్య అంటూ నీళ్ళు నములు తున్నాడు .ఇంతలొ నా కావలసిన బండి కని పించగానే కార్ ఆపమని బండి దగ్గర కెళ్ళి పిడత కందిపప్పు కట్టమన్న నా కేసి ఎగా దిగా చూసి అటుకుల బటనీల పప్పేనా బాబయ్య అని అడుగుతున్నా బండివాన్ని అవునని తలూపి ,ఇప్పుడు ఆ పేరు ఎవరు వాడటం లేదా అన్నా ,వొకప్పుడు అటుకుల మద్యలో పిడత వేడి వేడి ధీ పెట్టి బుడ్డి దీపం వెలుగు లో అమ్మే వాడండి మా అయ్యా ఇప్పుడు అవన్నీ మారి పోయి యి బళ్ళు వచ్చేసయండి ఆయీ .అంటూ రెండు పొట్లాలు నా చేతి లో పెడితే డ్రైవర్ కి వొకటి ఇచ్చి నేనొకటి తీసుకుని తింటే అదే రుచి , అదే జ్ఞాపకం . బండి లో వున్న ఎఫ్ ఏం రేడియో నుంచి గుర్తు కొస్తున్నాయి గుర్తు కొస్తున్నాయి అంటూ వస్తున్న పాట యద్రుచ్చికమో ,బగవద్విదితమో గాని నా చుట్టూ అప్పుడు అప్పటి బాల్య స్నేహితులు , ఎదురింటి నుంచి ఆసక్తి గా గమనిస్తున్న డాక్టర్ గారి అమ్మాయి వల్లి కళ్ళ ముందు మెదిలి , కళ్ళ నుంచి ఆనంద భాష్పాలో ?అసృధారలో జల జల రాలుతుంటే కారం ఎక్కువయ్యిందా బాబయ్య అంటూ అడుగుతున్నా బండి వాడి పిలుపుతో యి లోకం లోకి వచ్చి ఇంకో రెండు పొట్లాలు అమ్మకి కూడా కట్టించుకుని భారం గా కార్ లో అడుగు పెట్ట గౌతమి కి టైం అవుతోందని .

15 అక్టో, 2009

నడక లో మరో లాభం


నడక లో ఆరోగ్యం తో పాటు మరి కొన్ని లాభాలు వున్నాయని యి రోజే తెలుసు కున్నా .యి రోజు రోజు టైం కన్నా కొంచెం ఆలస్యం గా నడకకి బయలు దేరా .ఎప్పుడు వెళ్ళే రూటే . బ్రిడ్జి ఎక్కటానికి కొంచెం ముందే కార్ లోంచి వొక ఆమె నన్ను చూసి చేతులు వుపుతోంది , గతంలో యిలాగే వొక ఆమె వుపితే నేను వుపా ఆమె కార్ ఆపి నా దగ్గర గా వస్తుంటే మీరు అన బోతున్నా ఇంతలొ నా వెనక నుంచి ఇంకో అతను వచ్చి ఏంటి ఇంత లేట్ అనుకుంటూ ఇద్దరు అదే కార్ లో నా కళ్ళ ముందే దుమ్ము లేపుకుంటూ వెళ్లి పోవడం గుర్తు కు రావడం తో వెనక ఎవరన్నా వున్నారేమో చూసుకుంటే ఎవరు లేరు . అయితే నడకలో నా ముందు వెళ్ళే వాళ్ళు వాళ్ళలో వాళ్లే ఏదో మాట్లాడేసుకుంటూ చేతులు గాలిలో వుపేస్తూ , మళ్ళి నవ్వుకుంటూ వెళ్ళే వాళ్ళు వొకరిద్దరు ఎదురవుతూ వుంటారు . మానసిక వత్తిడి బాగా ఎక్కువై పోయి చెప్పుకోడానికి ఎవరు లేక పొతే ఇలాంటి పరిస్తితి వస్తుందని మా డాక్టర్ ఫ్రెండ్ చెప్పాడు . అయితే ఇది మరింత ముదిరి పోయి కార్ లో వెళ్ళే ఆడ మగ కుడా గాల్లో చేతులు కాళ్ళు వుపుకుంటూ వెళ్ళే అంత అయిపోయిందని ఆమెని చూసి నవ్వుకుంటూ ముందుకి వెళ్లి పోయా ఏమి వూప కుండా . ఆమె అయినా గాని ఆపకుండా వుపుతూ టక్కున నా దగ్గరకి వచ్చి బ్రేక్ వేసింది .తీరా చుస్తే ఏడేళ్ళ క్రితం నా స్నేహితురాలు తారక .వొక్క సారి గా అన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఎక్కడ సంభాషణ మొదలెట్టాలో ఆలోచించే అంతలోనే మీ సెల్ నెంబర్ చెప్పండి నే చేస్తా ప్రస్తుతం మా అమ్మాయిని దింపి నేను ఆఫీసు కి వెళ్లి పోయే హడ విడిలో వున్నా అంటే ఇచ్ఛా . తర్వాత తనే చేసింది కొంచెం సేపటికి .
రోజు తను ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళే టైం నేను నడకలో ఫుట్ పాత్ మీద నడుస్తూ కని పించే టైం వొకటే నట .గత నేల్లాలుగా చూస్తూ ట్రాఫిక్ మద్యలో ఆపి పిలవలేక వెళ్లి పోతోంది . యి రోజు నాకు కొంచెం లేట్ అయ్యి బ్రిడ్జి మొదట్లోనే కనబడటం తో పట్టు కో గలిగినది .అంటే యిలా మనకి తెలీకుండా చాల మందే observe చేస్తారన్న మాట . యి రోజు ఇతను ఇంకా రాలేదేమిటో అని మన కోసం చమ్మ గిల్లు నయనమ్ములు కూడా వుండు నేమో అని కాస్త ఎక్కువగానే వూహించుకుని మర్నాడు పొద్దున్నే లేవడానికి స్పూర్తి పొందనన్న మాట .ఆమె ఏడేళ్ళ క్రితం గవర్నమంట్ జాబ్ వదిలేసి సాఫ్ట్వేర్ కి జంప్ అయ్యి బెంగుళూరు వెళ్ళడమే తెలుసు తర్వాత టచ్ లో లేను . ఇప్పుడు నడక పుణ్యమా అని మళ్ళి ఇన్నాళ్ళకి .సో నే చేపోచ్చేదేంటంటే పార్కులు ,ఇళ్ళలోనూ నడవడం మానేసి చక్క గా footpath ల మీద పొద్దున్నే నడిస్తే ఇలా తప్పి పోఇన స్నేహితులు దొరికే అవకాశం కూడా వుండును . కాబట్టి పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం ఫుట్ పాత్ కు .

20 సెప్టెం, 2009

నా బ్లాగ్ సంవత్సరీకం


అబ్బే కంగారు పడకండి నేను పెట్టిన శీర్షిక నాకు తెలుగు సరిగ్గా రాక పెట్టింది కాదు . గత సెప్టెంబర్ లో'' సెప్టెంబర్ మాసం , అక్టోబర్ మాసం''అంటూ పాడుకుంటూ ఎవరో రావాలి అంటూ నా బ్లాగ్ వొక సుముహుర్తన్ని మొదలేట్టేసా .మూడు నెలల లోనే అది వొక మహా సంచలనానికి నాంది వాచకంఅవుతుందని అని ఆ సమయం లో నాకు తెలీదు . మెల్లిగా నాకు తోచింది రాసుకుంటూ ముందుకు సాగుతుంటే చాలా మంది బ్లాగర్లు తమ కామెంట్స్ తో ప్రోత్సహించే వారు .వొక రోజు'' ఈ తెలుగు'' సమావేశాలు ఆదివారం మధ్యానం కేబిఆర్ పార్క్ లో జరుగు తున్నాయని దాన్లో హైదరాబాద్ లో వున్న బ్లాగర్లు అంతా పాల్గొంటారని తెలిసి నేను వెళ్ళడం జరిగింది. అక్కడే ఎందరో మహా మహులు (తాడేపల్లి ,వివేన్ , పద్మనాభం ,కత్తి, జ్యోతి , అరుణ ఇంకొందరు )పరిచయం అయ్యారు .ఇంక సాహిత్య పిపాసకుడనై గ్రోలేయ్యడమే అనుకుంటూ ఇంటి మొఖం పట్టా .ఇంతలోనే జ్యోతి గారు నా బ్లాగ్ కి templetes పెట్టి మెరుగులుదిద్దుతానంటే పాస్ వర్డ్ ఇస్తే దాన్నొక సుందర వనం లా తీర్చి దిద్దారు .ఇది జరిగిన కొన్నాళ్ళకి నెక్లస్ రోడ్ లో పుస్తక ప్రదర్సన లో తెలుగుబ్లాగ్స్ ప్రచారం కోసం (వాస్తవానికి ఈ తెలుగు ప్రచారం కోసం )వొక స్టాల్ కేటాయించారని మన బ్లాగర్లు కుడా వీలు చూసుకుని కొంత సమయం కేటాయిస్తే బావుంటుందని మిత్రులు చెప్పడం తో అంతా కూడ బలుక్కుని వొక సాయంత్రం అక్కడ కలిసాం .అప్పుడే మరి కొంత మంది బ్లాగర్లు (రమణి , నేనులక్ష్మి ,చక్రవర్తి స్వాతి దంపతులు ,సుజాతగారు మరికొంత మంది )ముఖాముఖి పరిచయం అయ్యారు .అక్కడే జ్ఞాన ప్రసూనా గారు బూర్లు , జ్యోతి గారు రవ్వ లడ్డులు తెచ్చి అందరికి ఇచ్చారు .నేను ఇంటికి రాగానే అందరికన్నా ముందు యి విషయాల్ని బ్లాగ్ లో పెట్టాలని ''మన సంత బ్లాగర్స్ ''http://ravigaru.blogspot.com/2008/12/blog-post_25.హ్త్మ్ల్ అంటూ రాసేసా.
అందులో జ్యోతి గారు తెచ్చినవి లడ్డులా ? సున్నున్దలా అని వాదాలు సరదాగా జరగడం తో అవికూడా రాసా. అంతే అంతవరకు ఆహ వోహో లో తప్ప సరదాకి కుడా వుహు లు చూడని సదరు బ్లాగర్ బయన్కరమైన కామెంట్ రాసారు (యి మద్యనే సదరు బ్లాగర్ నా బ్లాగ్ లో రాసిన కామెంట్స్ అన్నికుడా డిలీట్ చేసుకున్నారని ఇప్పుడే గ్రహించా)దానికి నేను ఎంతొ వినమ్రంగా వివరణ ఇచ్ఛా కుడా . ఇంతలొ మరో ప్రమదావనం సభ్యురాలు మాది సంత అంటావా అన్నా ఆయీ అంటూ మీదకి వచ్చారు కామెంట్ రూపం లో వారికీ కుడా వివరణ ఇవ్వడం జరిగింది .అక్కడితో యి సమస్య సద్దు మనిగిందని అనుకున్నా గాని నివురు గప్పిన నిప్పులా అవకాశం కోసం చూస్తున్నారని అప్పుడే తేలి లేదు .ఇంతలొ అరుణ గారు ''ఎవరికి తెలియని కధలివిలేhttp://arunam.blogspot.com/2009/01/blog-post_8969.htm '' అంటూ బోల్డు గా శృంగార సంబందమైన సబ్జెక్టు మీద తన బ్లాగ్ లో రాసారు . దానికి నేను రెండు సినిమా సంఘటనలు ఉదహరిస్తూ వారిని అభినందిస్తూ రాస్తే ఆమె కామెంట్ ని ప్రచురించ కుండా రవిగారు మీరు రాసిన సంఘటనలు ఎబ్బెట్టు గా అని పించి ప్రచురించలేదు అంటూ వివరణ ఇచ్చారు , దానికి ప్రతి గా నేను జనాలు అపార్ధం చేసుకోకూడదని నా బ్లాగ్ లోనే'' అరుణగారు తొలగించిన నా కామెంట్స్ అంటూ రాసా''(http://ravigaru.blogspot.com/2009/01/blog-post_15.హ్త్మ్ల్) , అంతే అవకాశం కోసం ఎదురు చూస్తున్న సదరు బ్లాగర్ మీరు రాసింది ఆస్సిలమే , అందుకే ఆడవాళ్ళూ స్వేచ్ఛా గా రాయలేక పోతున్నారు అని కామేంటారు దానికి కుడా నేను వివరణ ఇచ్ఛా . యి సంధర్బం లో మరువం ఉష గారు తన కామెంట్ ద్వారా నన్ను సమర్దించడం నాకు మానసిక బలాన్ని ఇచ్చింది.ఇంతలొహతా ట్టు గా నా బ్లాగ్ రూపు రేఖలు మారి పోయి (templetes ని లేపెయ్యడం తో )అప్సరస లా వుండే బ్లాగ్ కోతి లా తయారయ్యింది .
దాంతో ''కుళ్ళుమోతు కోతి '' అన్న నా పోస్ట్ లో ఎవరో templetes మార్చి వుండడం చేతా నా బ్లాగ్ రూపు రేఖలు మారి వుంటాయని అనుమానం వ్యక్తం చేశా .అంతే అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్టు గా సదరు బ్లాగర్ ప్రమదావనం లో వాడికి , వాడి బ్లాగ్ కి పాడి కట్టాలి , దానికి మన మహిళలంతా నడుం కట్టాలి అంటూ వాళ్ళని వుసి గోలిపితే వాళ్ళలో వున్న కొంత మంది హితులు యి విషయాన్నీ మనకి చేర వేసారు దాంతో'' ప్రమదావనం లో చర్చించ వలసినంత అవసరమా? ''http://ravigaru.blogspot.com/2009/01/blog-post_29.హ్త్మ్ల్ అంటూ నేను పోస్ట్ రాసాను .ఎప్పటినుంచో సదరు బ్లాగర్ మీద కోపం తో వున్న కొంతమంది dhoommachara ,కాగడా రూపం లో వాళ్ళ కోపాన్ని వెళ్ళ గక్కారు .అదే సమయం లో బ్లాగ్స్ లోకి ప్రవేశించిన మలకపేట రౌడీ (మిత్రుడు భరద్వాజ్ )నిస్పక్సపాతం గా తనదైన శైలి లో కామెంట్స్ రాస్తూ కెలకడం మొదలెట్టాడు .ఇప్పుడు పరిస్తితి నా చెయ్యి దాటి పోయి ఎక్కడికో వెళ్లి పోయింది .ఇందులో ఇశన్ మాత్రం నా ప్రమేయం గాని , ప్రోద్బలం గాని ఏమి లెవ్ .ఇక అక్కడినుంచి కాగడ నేనని , ధూం నేనని ప్రచారం మొదలైతే ''దేవి కరుణించుము '' అంటూ పోస్ట్ రాసి నేను కాదు మొర్రో అని మొత్తు కోవలసి వచ్చింది .
అసలు బ్లాగింగు కి వచ్చిన వుద్దేశం మనసులో భావాలకి అక్షర రూపం ఇచ్చుకుందామని వస్తే వేరే వాళ్ళ మనస్సులో భావాలకి వ్యంగ రచనలు రాయవలసిన పరిస్తితి దాపురించింది .కాలాంతరమున బ్లాగర్లు నిజం గ్రహించడం తో అంతా చప్ప బడి కాగడ , ధూం కూడా యాదృచ్చికం గా మరుగున పడి ,నేనుకూడా కోతుల్ని మానేసి పందికొక్కుల మీద , నా నడకల మీద రాసుకుంటూ మెల్లిగా ట్రాక్ లో పడి ''వొక విటుడి ఆత్మ కధ ''http://ravigaru.blogspot.com/2009/04/blog-post_13.హ్త్మ్ల్ రాసా.నేను ట్రాక్ లో పడ్డా గాని, అప్పట్లో నేను'' కూడలి లో కాక హోటల్'' పెట్టిన కొత్తలో ప్రోత్సహించిన ఎంతొ మంది బ్లాగ్మిత్రులు వొక సుజాతగారు ,ఉషగారు , నాకు బ్లాగ్ పెట్టడానికి స్పూర్తి అయిన నిషిగంధ గారు ,ఉమాశంకర్ ,ఇంక ఎందరో మళ్ళి నా బ్లాగ్ లో దర్సన భాగ్యం కలగ చెయ్యలేదు .పైన చెప్పిన గొడవల్లో వారి వర్గం , వీరి వర్గం , వైరి వర్గం గా విడగొట్టి బ్లాగ్ లోకాన్ని మూడు ముక్కలు గా చెయ్యడం తో స్వేచ్చగా బ్లాగరులు చదివి తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటం గా పెట్టె పరిస్తితి మృగ్యం. వాళ్ళు మాత్రం ఇంకా ట్రాక్ లో పడినట్టు గా లేదు. ..నేను ఏ వర్గానికి చెందకుండా అందరి వాడులా బ్లాగ్ లోకం లో రాసుకు పోవడమే ద్యేయం గా పెట్టుకున్నా .యి సంవత్సరీకం సందర్భంగా పాత ద్వేషాలకి పిండ ప్రదానం గావించి (నా బ్లాగ్ ని పాడి కట్టించి నట్టు గా భావించి ) యదావిధిగా కూడలి లోనా త్రి స్టార్ హోటల్ కి విచ్చేసి మా చే వండి వడ్డించ బడిన పోస్ట్స్ లో మీకు నచ్చినవి గ్రహించి , నచ్చనివి త్యజించి ,మా సాహితి దేవతలను తరింప జేయ ప్రార్దన . యి సందర్బంగా దస గాయత్రి మంత్రం జపిస్తూ సర్వె జనా సుఖినో భవంతు . అనట్టు టిప్స్ రూపం లో మీ కామెంట్స్ పడెయ్యడం మాత్రం మరువకండే.