17 సెప్టెం, 2011

అవధూతలు వుంటారు

మొన్న ఏదో పని మీద అమలాపురం వెళ్ళవలసి వచ్చింది .ఎప్పటి నుంచో మా సీనియర్ సహచరుడు వొక ఆయన అక్కడికి వెళ్లి నప్పుడు వీలుంటే దగ్గరలో ఐనవల్లి దగ్గర మూలపోలం అని వొక వూరు వుంది అక్కడ వెంకన్నబాబు అని వొక స్వామి వున్నారు మనిషిని చూడగానే మనసులో వున్నది చెప్పేస్తారు .మీరనుకున్తున్నది అవుతుందో లేదో కూడా చెప్పేస్తారు .ప్రయత్నించండి అన్నారు .యిది చెప్పి కూడా నాలుగేళ్ళ పైన అయిపొయింది .మేము వెళ్ళిన పని తొందరగా అయిపోవడం తో ఆ పని అవడం లో సహకరించిన పెద్ద మనిషిని యధాలాపం గా అడిగా మూలపోలం ఎక్కడో తెలుసా అని పెద్ద ఆశలు ఏవి పెట్టుకోకుండా . ఎందుకంటె అంతకు ముందే మా కార్ డ్రైవర్ ని అడిగితె తెల్ల మొహం వేసాడు .వెంటనే ఆయన సార్ నేనెప్పుడో యిరవై రెండేళ్ళ క్రితం వెళ్ళా మీకభ్యంతరం లేక పొతే నేను వస్తా అంటే మా ఫ్యామిలీ తో పాటే ఆయన కూడా డ్రైవర్ కి దారి చూపిస్తూ మద్యలో కనుక్కుంటూ చివరికి మద్యాన్నం మూడు గంటలకి వారింటికి చేరు కున్నాము .శనివారం , ఆదివారం ,మంగళవారం మాత్రమె ఆయన స్వామి ఆవాహన పొంది పూజా పీటం లో ఆహుతుల మనసులో ప్రశ్నలకి సమాధానం చెపుతారు . ఆ రోజు మంగళవారం అవడం తో అప్పటికే హాల్ నిండా వొక యాభై మంది దాక కుర్చుని వున్నారు .నా విసిటింగ్ కార్డు పంపడం తో కొంతసేపటి తర్వాత మా కుటుంబాన్ని ప్రత్యేకం గా వేరే గదిలో కూర్చో బెట్టారు .అక్కడ గొప్పతనం మన హోదా దీ కాదు వేంకటేశుని అనుగ్రహమే అని తర్వాత నాకు అర్ధంఅయ్యింది .ఆ గది లోకి కూడా యింకో మూడు నాలుగు కుటుంబాలు (చుట్టుపక్కల గ్రామాల్లో ప్రముఖులు )వచ్చి చేరాయి .అక్కడ గదిలో గోడలకి వేలాడదిసిన స్వామి ఫోటోల పక్కన పసుపుబట్టలతో వున్న యియన ఫోటోలు కూడా కని పిస్తే మా శ్రీమతి ఉండబట్టలేక ఏంటో వీళ్ళంతా దేవుడి తో సమానం గా ఫోటోలు పెట్టేసుకుంటారు వీళ్ళు కూడా దేవుడంతా గొప్ప వాళ్ళని అనుకుంటారా అని మెల్లగా అంది .టైం అప్పటి కే అయిదయింది . అయన బయటకు రాలేదు . నా కేమో రాజముండ్రి వెళ్లి గౌతమి పట్టుకోవాలి ట్రైన్ మిస్సవుతుందేమో అని భయం .చివరికి అయిదు ఇరవైకి పొట్టి గా చామన చాయ కలర్ తో పసుపు బట్టలతో సాధారణ వ్యక్తీ లా అనిపించే వ్యక్తీ వచ్చారు .అందరు ఆయన కి నమస్కరించి ఆశ్వేర్వచనం పొందు తుంటే నన్ను నేను పరిచయం చేసుకుని ఎప్పటి నుంచో రావాలనుకుంటే యిప్పటికి కుదిరిందని చెప్పా . దానికి ఆయన చిరునవ్వుతో స్వామి అనుకున్నప్పుడే అనుసంధానం చేస్తారు మీరు లోపల పూజా మందిరం లో ప్రశ్నకి సమాధానం విని వెళ్ళండి అన్నారు .యింక ఏమైతే అది కాని ట్రైన్ మిస్ అయితే మిస్ అవని విని వెళదామని ఆగాము . అక్కడ పూజ మందిరం లో వెంకటేశ్వర విగ్రహం అమ వారి విగ్రహాలు చక్క గా దండలతో అలంకరించ బడి వున్నాయి .అక్కడి వాత వరణం లో కూడా ఏదో శక్తి వున్న అనుభూతి కల్గింది.ముందుగా మమ్మల్ని పూజా మందిరం లోకి పిలచి తీర్దం యిచ్చారు . వెనకే మిగతా వాళ్ళు కూడా వచ్చి చేరారు . కొద్ది సేపటికే ఆ గది ఇరుకు గా మారి చిన్నప్పటి తోపులాటకి సిద్దం గా మారింది .యింకా హాల్ లో జనం మేమెప్పుడు బయట కోస్తామా వాళ్ళు దూరోచ్చని చూస్తున్నారు .యింతలో ఆయన కళ్ళు మూసుకుని దండం చేత్తో పట్టుకుని తన ఎదురు గా వున్న ఆమెతో ''ఏమి ఆశించి వచ్చావు స్వామి దగ్గరకి ?అనారోగ్యం తో బాధ పడుతున్న నీ కొడుకు ఆరోగ్యం గురుంచి వచ్చావా ?యింకా నలుగురు డాక్టర్లు మారాక తగ్గుతుంది . పూర్వ జన్మ ప్రారబ్దం అనుభవిస్తున్నాడు .సహనం వహించు నే చూసుకుంటా వెళ్లిరా '' అనగానే ఆమె ఆనంద భాస్పాలో కళ్ళ నిళ్లో తెలీని స్తితి లో తుడుచుకుంటూ ముందుకు జరిగింది . ఆమె వెనక వచ్చిన అతనికి నీ వ్యాపార విషయం లో ఆందోళన చెందకు ఆరు నెలల్లో అంతా సద్దుకుంటుందని చెప్పడం జరిగింది .
అలా జనం వోకర్ని వొకరు తోసుకుంటూ ఆయన ముందుకు వస్తుంటే ఆయన వాళ్ళకేసి చూస్తూ మనసులో మాటని చదువుతూ పరిష్కారం చెపుతున్నారు .యింక నా వంతు వచ్చింది .స్వామి శక్తి రూపమా ?విష్ణు రూపమా ?అని ఆలోచిస్తున్నావు (నా బుర్రలో ఈ సందేహం ఎప్పటి నుంచో వుంది స్వామికి శుక్ర వారం అభిషేకం చెయ్యడం లో అర్ధం శక్తి రూపమే అని )ఆది శక్తి శివ శక్తి రెండు నేనే .నీ పూజలు అలాగే కోన సాగించు .నీ మంచి మనసు ,ఇతరులకి సహాయ పడే గుణాన్ని బట్టే నీకు ఉద్యోగం లో మార్పు వచ్చింది .అందులో మంచే జరుగుతుంది . నీకు డిసెంబర్ రెండో వారం లోపు పదోన్నతి వస్తుంది .వెళ్లి రా . అని చెపుతుంటే నా కళ్ళలో ఆనంద భాష్పాలు జల జలా రాలాయి .ఎందుకంటె నేను నోరు తెరచి ఆయనని ఏమి అడగ లేదు . అదికాక యి విషయాలు యిన్కేవరి తోనూ చర్చించలేదు . అందుకే వొక విధమైన ట్రాన్స్ లోకి వెళ్లి పోయి బయటకు వచ్చా . మా శ్రీమతి విషయం లో కూడా నీ దగ్గర మోసపురితం గా వొకడు డబ్బు తీసుకున్నాడు అది నీకు మార్చి లో వస్తుందని చెప్పినప్పుడు ఆశ్చర్య పోవడం ఆమె వంతయ్యింది . ప్రస్తుతం ఆ వివాదం కోర్టు లో నడుస్తూ మా కనుకూలం గా తీర్పు వచ్చింది .ఆయన గురించి మా తో పాటు వచ్చినాయన ద్వార మరిన్ని విషయాలు తెలుసు కున్నాము . ఆయన చాలా ఏళ్ళ క్రితం నుంచే అవధూత లా వ్యవహరిస్తున్నారని బ్రహ్మ చారి లా వుంటూ తన దగ్గరికి వచ్చే వాళ్ళ యితి భాధలు తీరుస్తున్నారని చెప్పాడు .అయితే ఆయన శిష్య గణం కొంత అతి గా వ్యవహరిస్తున్నరేమో అని పించింది .వొక పక్క యియన ప్రశ్న సమాధానం చెపుతూ వుంటే గట్టి గా అరుస్తూ జనాల్ని కంట్రోల్ చెయ్యడం , మాట్లాడడం వంటివి చెయ్యడం జనాలు పళ్ళెం లో వంద అయిదు వందల నోట్లు వెయ్యగానే తీసి బిందె లాంటి హుండీ లో వెయ్యడం వంటివి .అవధూతల దగ్గర శిష్యగణం వారి మహిమల్ని ధన రూపం లోకి మారుస్తూ వుంటారేమో ?
ఈ ట్రిప్ లో నాకర్ధమయ్యింది ఏమిటంటే అవధూతలు అక్కడక్కడ యింకా వున్నారు వాళ్లతో అనుసంధానం అయ్యే సమయం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు .మరి అంతవరకూ మేర నంబర్ కబ్ ఆయే గా అనుకోవడమే .

17 ఆగ, 2011

నిజం గా కరణం మల్లిస్వరేనా ?

http://im.in.com/connect/images/profile/s_profile3/Karnam_Malleswari_65.jpg
నిన్న పొద్దున్నే ఆఫీసు కి వెళ్లి సీట్ లో కూర్చున్నానో లేదో సెల్ మోగింది .ఏదో తెలీని నంబర్ . అప్పటికి యింకా బిజీ కాక పోవడం తో ఎత్తా .అవతలి పక్కనుంచి ఆడ గొంతు .నేను కరణం మల్లిస్వరినండి మీ హెల్ప్ కోసం చేశా అని వినిపించింది .ఇప్పుడున్న సెల్ టెక్నాలజీ లో మగ గొంతు ని కూడా ఆడ గొంతుకు గా మార్చి మాట్లాడించడం సాధ్యమే కాబట్టి నేను మామూలు గా చెప్పండి అన్నా . . నా స్పందనకి ఆశ్చర్య పోయిన ఆమె నేను వోలిమ్పిక్ విజేతనండి అంది .
ఏమో లెండి కాక పొతే నేను బకరా అవ్వడం ఎందుకు , చెప్పండి ఏమి చెయ్యాలి అన్నా .వాళ్ళ తల్లి దండ్రులు యింక కొంత మంది కుటుంబ సబ్యులకి అత్యవసరం గా ఏదో సాయం కావాలంటే వివరాలు తీసుకుని మళ్ళి కొంత సేపటికి పని అయిపోయిందని చెపితే ఆమె చాలా సంతోషం గా మీకు ధన్యవాద్ అంది . అదేంటి మీరు తెలుగమ్మాయి కదా మీ భాష నార్త్ వాసన కొడుతోంది అన్నా . చినప్పటి నుంచి ఢిల్లీ లో శిక్షణ తీసుకోవడం తో తన తెలుగు కు తెగులు వచ్చిందని చెప్పింది .వాళ్ళది ఆముదాల వలసని ప్రస్తుతం ఎఫ్ సి అయి లో పని చేస్తూ ఢిల్లీ లోనే ఉంటున్నానని చెప్పింది .ఆమె మంచి మాటకారి సెల్ లోనే యిద్దరం పావు గంట హస్కు వేసుకున్నాం.వోలిమ్పిక్ మెడల్ తర్వాత అత్యంత ఆనందం పొదింది యీ క్షణమే ,అత్యవసర పరిస్తితులలో నా తల్లి దండ్రుల అవసరాన్ని తీర్చారు . అంటే భలే వారే నేను సైతం వోలిమ్పిక్ విజేత కి సాయ మొకటిని ఆహుతిచ్చా అన్నా . ఈసారి ఢిల్లీ వస్తే మా యింటికొచ్చి మా ఆతిద్యం స్వీకరించండి అంది . నేను కూడా హైదరాబాద్ వస్తే మీ ఆతిద్యం స్వీకరిస్తా అన్నా .దానికామె నవ్వేసి హైదరాబాద్ వస్తే ముందు సుబ్బిరామి రెడ్డి గారు వదలరు అయినా కూడా మీకు ధన్యవాదములు అంటూ ఫోన్ పెట్టేసింది .
యింతకీ ఆమె నిజం గా కరణం మల్లిస్వరేనా ?ఈ రోజు మళ్ళి చేసి చెక్ చేద్దామనుకున్నా గాని వీలు చిక్క లేదు . యింకో సారి ఫోన్ చేసి రాధ గారు వున్నారా అండి అని సెల్ లో అడిగితె లేదండి నేను కరణం మల్లిస్వరినండి అంటే వొకే కాదండి సుధ ని అంటే నే గొంతు లో పచ్చి వెలక్కాయ , చూడాలి ఏమవుతుందో ?

11 ఆగ, 2011

కొత్త పరిచయాలు -కొత్త విషయాలు


ఈ మద్య వుద్యోగం లో పోస్టింగ్ మారి మరింత బాద్యత పెరగడం తో బ్లాగ్ వైపు ద్రుష్టి సారించలేక పోతున్నా . అయితే ఈ రోజు మెయిల్ చెక్ చేస్తుంటే వొక అజ్ఞాత మీ బ్లాగ్ లో మీ కధానికలు లేక వేల వేల బోతోందంటే స్పూర్తి పొంది యిది రాస్తున్నా .వొక పది నెలల క్రితం వొక ఆమె ప్రభుత్వ పని రీత్యా నన్ను కలవడం జరిగింది .ఆమె కి ముప్పై అయిదేళ్ళ దాక ఉండొచ్చు .పొట్టి గా వున్నా తెల్ల గా బొద్దు గా అందం గానే వుంది .వాళ్ళ అబ్బాయిని కూడా వెంట బెట్టుకుని రావడం తో నిర్భయం గా కూర్చో మన్నా .ఆమె ప్రభుత్వ కార్యాలయాలు మూసేసే టైం కి రావడం తో నేను మా ప్యూను తప్ప మిగతా సిబ్బంది లేరు . ఆమె తన సమస్య చెప్పుకున్నాక పరిష్కారం చేసి స్టాఫ్ వెళ్లి పోవడం తో మర్నాడు ఉదయం మళ్ళి రావాల్సి వుంటుంది అని చెప్పా .ఈ మద్యలో ఆమె హావ భావ విన్యా సాలలో ఉత్సాహం ఉత్సుకతఎక్కువ గా కని పించాయి .(మరి నా చూపులు కూడా అపబ్రంసము చెంది ఉండ వచ్చు ). తన సొంత విషయాలు ఆమె చెప్పడం మొదలెట్టా గానే వాళ్ళ అబ్బాయి మమ్మీ పోదాం పోదాం అంటూ వొకటే నస .(వాళ్ళ నాన్న గారు యిచ్చిన ట్రైనింగ్ ఏమో).యింక చేసేది లేక వస్తానండి మళ్ళి రేపు రావడం కుదరదు మా కంపని స్టాఫ్ ని పంపుతా మీ సెల్ నంబర్ యిస్తే మీకు ఫోన్ చేసి పంపుతా అంటూ నా నంబర్ తీసుకుంది .అదిగో అలా మొదలయ్యింది కొత్త పరిచయం .పని అయిపోయాక థాంక్స్ అని ఫోన్ చేసి పెట్టేస్తే అక్కడి తో కధ కంచి కే అనుకున్నా ,మళ్ళి పది రోజులకి తనే మళ్ళి ఫోన్ చేసి ఏమండీ గుర్తు పట్టరా అంటే ఆమె పేరు తో పిలిచి మిమ్మల్ని వొక్క సారి చుసిన వాళ్ళు ఎవరన్న మరిచి పోతారా అన్సా .దానికామె అబ్బా నా పేరు తో సహా గుర్తు పెట్టుకున్నారు అంది .(ఆమె చేసిన రోజే నంబర్ సేవ్ చేసానని ఆమె కి తెలీదని నేననుకోను . )తనకేదో మళ్ళి సాయం కావాలంటే చేసి పెట్టా .అది మొదలు రోజు పదకొండు గంటలకి మిస్సేడ్ కాల్ యిచ్చేది .మనం చెయ్యగానే గంట వాయించేది .తను చేస్తే బిల్ ఎక్కువయితే వాళ్ళ ఆయన స్కాన్ చేస్తాడని చెప్పేది .తన ద్వార నాకు తెలిసిన కొత్త విషయాలు ఏంటంటే కృష్ణ కాంత్ పార్క్ లో వాకింగ్ కి వెళితే బకరా గాళ్ళు ఎక్కువ అని .తనని చూసి పెళ్ళికాని వాళ్ళ నుంచి పెళ్ళయిన వాళ్ళు కూడా చొంగలు కార్చుకున్టారని .ఎలాగో అలాగా పరిచయం పెంచుకుని పది నిమిషాల్లో సెల్ నంబర్ అడగ గానే యివిడ కూడా ధారాళం గా ఇచ్చేసేది .అలా నంబర్ తీసుకున్నా వాళ్ళలో టీ వి సీరియల్ హీరో లు విలన్లు , అప్కమింగ్ హీరో లు , వ్యాపార వేత్తలు వుండే వారు .అదేంటి అలా నంబర్ ఇచ్చేసారు అంటే నాదెం పోయింది వొక గంట సోది వాగుతాడు నెల అయ్యాకా బిల్లు చూసుకుని వాడే మానేస్తాడు అనేది .నాకర్ధం అయ్యింది ఏంటంటే వాళ్ళు నఖ శిఖ పర్యంతం ఈమె అందాల్ని వర్ణిస్తూంటే ఈమె రాణి లాగ ఫీల్ అయ్యి వాళ్ళని మాట్లాడ నిచ్చేది ఎవడన్న నాలాంటి వాడు సూక్తి ముక్తావళి మొదలెడితే వుంటానండి మా వాడు వచ్చే టైం అయ్యింది అని కట్ చేసేది , మళ్ళి చేస్తే మాత్రం బిజీ అని వచ్చేది .ఈ బకరాల లో వొక బకరాప్రైవేటు బ్యాంకు లోమాంచి ఉద్యోగం చేసుకుంటూ వుండే బ్రాహ్మిన్ బ్రహ్మ చారి .రోజు గంటల తరబడి సెల్ లో సొల్లు,కాళ్ళు అరిగి పోయేలా పార్క్ లో నడక .రేపు నా బర్త్ డే అందుకే వాకింగ్ కి రాను అంటే ఈ బకరా మర్నాడు డైమోండ్ రింగ్ కొని వాళ్ళింటికి వెళ్లి ఆమె వేలికి స్వయం గా తొడిగి కాలింగ్ బెల్ మొగ గానే గజ గజా వణికి ఆ వచ్చిన వాడి చేతిలో కూడా గిఫ్ట్ వుండి , వాడు నోరు విప్పే లోపే మా కజిన్ అని పరిచయం చేసినా గ్రహించ కుండా వెళ్లి పోయి మళ్ళి అయిదు నిమిషాలకే ఫోన్ చేసి నా గిఫ్ట్ నచ్చిందా అని అడిగితె, ఆ ఆ మళ్ళి మాట్లాడతా మా కజిన్ వున్నాడు అని చెప్పి కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్ళని కర్చీఫ్ తో తుడుచుకుని మర్నాడు మళ్ళి మామూలే .ఆది వారం పొద్దునే ఈమె వేరే యింకో వ్యక్తీ తో కలిసి మాంసం దుకాణానికి వెళ్ళిన సమయం లో ఈ బ్రహ్మ చారి బకరా ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగితె ఫలానా మాంసం దుకాణం లో అని చెప్ప గానే యీ క్షణమే నిన్ను చూడాలని వుంది అంటూ రెక్కలు కట్టుకుని వాలి పోయి పక్కనే యింకో వ్యక్తీ వున్నా కూడా అదేమీ పట్ట నట్టు గా ఆ సంచి యిలా యియ్యి అంటూ యింటి వరకు మోసుకొచ్చే వాడు .ఆ పక్కనున్న వ్యక్తీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ తోడూ గా మాంసం దుకాణానికి వస్తు ఉంటాడు ఆది వారం, నువ్వు బ్రాహ్మిన్ కదా యిలా ఈ సంచి మోస్తూ రాకు ఎవరన్న చూస్తే బావుండదు అని అంటే అమాంతం ఆ సంచి లోంచి పచ్చి మాంసం ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుని నమిలి మింగేసి చాలా యిప్పు డన్న నా ప్రేమని నమ్ము తావా ?యింక చాలు మీ ఆయన్ని వదిలేసి వచేయ్యి మొన్న నేను నీ దగ్గర దాచిన పది లక్షలు పట్టుకుని ఏ అస్సామో వెళ్లి హాయి గా కాపరం చేసుకుందాం ఎవరు గుర్తు పట్టరని యిత గాడి ప్రపోసల్ .ఆ తర్వాత ఇతను ఎప్పుడు చేసినా మీరు డయలు చేసిన నంబరు మరోసారి చూసుకోండి అనే వచ్చేది . (అదే ఆమె రింగ్ టోన్ గా పెట్టుకుందని యితనికి తెలిదు ). ఎప్పుడు యింటికి వెళ్ళినా ఎవరో వొక గెస్ట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ బహుమతులు పట్టుకుని కూర్చుని వుండేవారు .ఇతను తాగుడు కి బానిస అయి పోయి ఉద్యోగానికి సరిగా వెళ్లక వున్న వుద్యోగం వూడి పోయి ఈమె యింటికి వెళ్లి నా డైమొండు డబ్బులు యిచ్చేయ్యి అని అడిగితె నీకు నిజం గా నా మీద ప్రేమ వుంటే ఆ రెంటిని మన ప్రేమకి గుర్తు గా వదిలేసి నా జీవితం లోంచి వెళ్లి పో అని వెర్రి వెదవ ని చేసి పంపేసింది .
కొంత మంది ఆడవాళ్ళకి ఎప్పుడు తమ అందాన్ని పొగిడే మగాళ్ళు కావాలి , మళ్ళి వాళ్ళు కొంత కాలమే .మళ్ళి కొన్నాళ్ళు పోయాక మళ్ళి యింకో కొత్త మగాళ్ళు పరిచయం అవ్వాలి .మరిన్ని బహుమతులు తేవాలి .అసలు ఆరెంజ్ డైరెక్టర్ భాస్కర్ కూడా ఈమె భాదితుడయ్యాక కధ రివెర్స్ చేసి సినిమా తీసాడా అని పించింది .అయితే ఆమె కి నా కు గత ఆరు నెలలు గా సెల్ సంభంధాలు తెగి పోయాయి .ఎందుకంటె రేపు నా బర్త్ డే మీకు సెల్ లో దొరకను అని ఆమె అనడమే నా మౌనానికి కారణ మేమోతెలిదు .జూన్ లో తన బర్త్ డే కి బకరా గాడు డైమండు యిచ్చా డని తను చెప్పిన విషయం నేను యింకా మర్చి పోలేదు కాబట్టి .

25 జూన్, 2011

180 నచ్చింది కాని హిట్ కష్టమే


సిద్దార్ద్ ఎన్నో ఏళ్ళనుంచి చకోర పక్షిలా హిట్ కోసం ఎదురు చూస్తూ ఈ సినిమా మీద చాల ఆశలు పెట్టుకుని ,డైరెక్టర్ పనిలో వేలు పెట్ట కుండా చేసిన సినిమా .కదా పరం గా సినిమా వొకే .తెలుగు సినిమా ముగింపు కి భిన్నం గా వుంది (అసలు ముగింపు ఏమి చుపెట్టకుండా మన వుహ కే వదిలేస్తాడు ).అయితే ఇలాంటి కధ సగటు ప్రేక్షకుడికి ఎక్కడం కష్టం .క్లాస్ కి మాత్రమె నచ్చే సినిమా మాస్ ఎలిమెంట్స్ లేవు (సిద్దార్ద్ , ప్రియారామన్ లిప్ లాకిన్గ్స్ తప్ప). పైగా కధ చెప్పే విధానం లో వర్తమానం నుంచి ఫ్లాష్ బ్యాక్ లోకి మళ్ళి వర్త మానం లోకి వస్తూ ఎప్పుడు ఫ్లాష్ బాకో ఎప్పుడు వర్తమానమో అన్న సందేహం వస్తూ వుంటుంది .యిక కధ లోకి వస్తే వారణాసి లో గంగా నదిలో పడవ మీద వస్తూ హీరో కని పిస్తాడు .అక్కడ తండ్రికి పిండ ప్రదానం చేస్తున్న చిన్న పిల్లవాడు ఆ పని మద్యలో వదిలేసి బొమ్మ తో ఆడుకుంటుంటే వాళ్ళ తాత హీరో తో అందరు చిన్న పిల్లలా చావంటే భయం లేకుండా గడి పెయ్య గలిస్తే యెంత బావున్ను అంటే ఆ మాటలకి హీరో కి జ్ఞానోదయం అయ్యి హైదరాబాద్ వచ్చేసి ఆటో వాడు ఎక్కడకి వెళ్ళాలి అంటే రెండు వేళ్ళలో వొకటి పట్టుకోమని మారేడ్పల్లి పోనీ అంటాడు .ఆటో దిగి అక్కడే కనిపించిన పేపర్ బాయ్ సహాయం తో వొక యింట్లో అద్దెకి దిగి ఆరు నెలల అద్దె వొకే సారి యిచ్చి తను అన్ని రోజులే ఆ వూళ్ళో ఉంటా అంటాడు . అప్పటికే ప్రేక్షకులకి అంతర్లినం గా వున్న కధ అర్ధం అవుతుంది . అందరి కి సాయం చేస్తూ ,వీధి బాలల తో ఆడుకుంటూ వాళ్ళ బటానీలు తను అమ్మి పెడుతూ , వాళ్ళ పేపర్ తను వేస్తూ ఫోటో జర్నలిస్ట్ నిత్య మీనన్ కెమెరా కి చిక్కుతాడు . అప్పటి నుంచి ఆమె యితని వెంట పడుతూ పేరు చెప్పమంటే రెండు వేళ్ళ లో వొక వేలు పట్టుకో అని అమితభాచ్హన్ అంటాడు .రెండో వేలు పట్టుకుంటే సచిన్ అంటూ తన విషయాలు ఏమి చెప్పకుండా ఉంటాడు . .దాంతో ఉత్సుకత పెరిగి అతని గురించి తెలుసుకునే ప్రయత్నం లో విఫలం అవుతుంది . కాని తను వీధి బాలలు చదువు మాని పనులు చేసుకోవలసిన దుస్తితి ని పేపర్ లో సిద్దార్ద్ కోరిక మీద రాయడం తో సిద్దార్ద్ ఆమె ని అభినందిస్తాడు .వెంటనే ఆమె ఐ లవ్ యు అని చెప్పడం తో తను ఉంటున్న ఇల్లు ఖాలీ చేసేసి చెప్పకుండా వేల్లబోతాడు . అతన్ని బస్సు లో చూసి తన స్కూటీ తో వెంబడిస్తూ ఎదురు గా వస్తున్నా బస్సు గుద్దేసి కోమ లోకి వెళ్లి పోతుంది .వెన్నెముకకి అర్జెంటు ఆపరేషన్ అవసరం అవడం తో సిద్దార్ద్ ఆమెని అమెరికా లో హాస్పిటల్ కి తీసుకు వెళతాడు .అక్కడకి వెళ్ళగానే గతం తాలూకు కధ మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో వస్తుంది . తను చని పోయాడని అనుకోని యిప్పుడే కోలుకుంటు ఆనందం గా గడుపు తున్న తన భార్య చిరు నవ్వు మొఖం వొక్క సారి చూడాలని ఆమె పని చేస్తున్న ఆఫీసు కి వెళితే అక్కడ అతని స్నేహితుడు కనబడి నువ్వు బతికే వున్నవా రా యిప్పుడే నీ భార్య కి ఫోన్ చేసి చెపుతా ఆమె ఫ్రాన్సు వెళ్లి న్ది రేపు వస్తుంది అంటే వద్దు చెప్పొద్దూ ఆమె ని అదే అపోహ లో బతకని అంటాడు . లేదు నువ్వు రేపు ఫలానా హోటల్ కి సాయంత్రం అయిదున్నరకి రా ఆమె కి సర్ప్రైజ్ ఇద్దాం అంటాడు . తను రానని చెప్పి వెళ్లి పోతాడు . మర్నాడు నిత్య మీనన్ హాస్పిటల్ నుంచి డి స్చార్జ్ అయ్యాక ఆమె ని ఇండియా లో దింపడానికి ఎయిర్ పోర్ట్ దాక వచ్చి ఆమె ని ఫ్లైట్ ఎక్కించి తను యిప్పుడే వస్తానని తన భార్య ని చూడటానికి స్నేహితుడు చెప్పిన హోటల్ కి వచ్చి నవ్వుతు వున్న భార్య ని చూసి బయటకు వచ్చి స్నేహితుడి కి ఫోన్ చేసి తన సంతోషానికి తను ఎదురు పడి ఆటంకం కల్గిన్చనని వెళ్లి పోతాడు .ఎయిర్ పోర్ట్ కి వచ్చి వొక పిల్ల వాణ్ని గ్లోబ్ తిప్పి వేలు పెట్టి ఆపమని అది బ్రెజిల్ మీద ఆగితే అక్కడకి వెళ్లి చిన్న పిల్లలతో ఫుట్ బాల ఆడి రేపు వస్తవా అని అడిగితె ఏమో రేపు ఎవరికి తెలుసు అంటూ వెళ్లి పోతుంటే సినిమా ముగుస్తుంది . ఎందుకు సిద్దార్ద్ భార్య తను చని పోయడనుకుంటుంది ?నిత్య మీనన్ సాంగత్యాన్ని ఎందుకు వదిలేసి వెళ్లి పోతాడు ?180 కి అర్ధం ఏంటి అంటే సినిమా చూడాల్సిందే .కధ మొత్తం రాసేసి సినిమా చూడాల్సిందే ఏంటి తొక్క లాగ అంటే ఈ విషయం లో యింత కంటే ఏమి చెప్ప లేను .

10 జూన్, 2011

బండల్ బద్రీనాథ్


హిందూ దేవాలయాల మీద ముష్కరుల దాడిని తిప్పి కొట్టడానికి సర్వ సన్నదంగా ఉండేలా బాల్యం నుంచి శిక్షణ యిచ్చే వొక గురువు ,ఏక లవ్యుడిలా యిదంతా నేర్చేసుకునే బద్రీనాథ్ .వీళ్ళందరూ శిక్షణ అయిపోయాక వోకో క్షేత్రానికి వోకో క్షేత్ర పాలకుడిలాగా వుండి ఆ ప్రాంతాన్ని రక్షిస్తూ దేవుడి మీద భక్తీ ని పెంపొందిస్తు వుండాలి .బద్రీనాథ్ క్షేత్రానికి బద్రి అలాగే వెళతాడు .అక్కడకి వాళ్ళ తాత తో వచ్చిన అలకానందకి దేవుడి మీద నమ్మకం వుండదు .హటాత్తు గా సుస్తి చేసిన తాతని బద్రి వచ్చి బతికిస్తాడు .దేవుణ్ణి తులనాడినఅలకానంద తో వారం రోజుల్లో దేవుడి మీద నమ్మకం కలిగేలా చేస్తానంటాడు .ఈ ప్రయత్నం లో అలకానందకి బద్రి మీద ప్రేమ పుట్టేస్తుంది .ఆ ప్రేమ విజయం సాధించాలంటే బద్రీనాథ్ గుడి ఆరు నెలల పాటు మూసేసే ఆఖరి రోజు బ్రహ్మ కమలాన్ని దేవుడి ముందు పెట్టి తన కోరిక కోరుకుని మళ్ళి ఆరు నెలల తర్వాత గుడి తెరచే రోజు వచ్చి తీసుకోవాలి .అప్పుడు ఆ ప్రేమ ఫలిస్తుంది .తననే ప్రేమిస్తోందని తెలియని బద్రి అందుకు తన సహా కారాన్ని అందిస్తానని మాట యిస్తాడు . అలకానంద మేనత్తకి రౌడీయిజం చేసే సర్కార్ అనే విలన్ ని ప్రేమించి తండ్రి అభిష్టానికి వ్యతి రేకం గా పెళ్లి చేసుకుంటుంది . వొకానొక సందర్భం లో తనని అత్తా అని పిలవని అలకానందని తన కొడుక్కి యిచ్చి పెళ్లి చెయ్యాలని సర్కార్ ని వుసి గొలుపుతుంది .సరిగ్గా బద్రీనాథ్ లో పువ్వు పెట్టి బయటకు వచ్చే టైం కి విలన్ గ్యాంగ్ బద్రిని చంపెసామనుకుని పిల్లని ఎత్తుకు పోతారు బళ్ళారికి .క్షేత్ర పాలకుడి లాగ వుండి తన తర్వాత తక్షశిల లో శిక్షణ నిస్తూ ఆజన్మ బ్రహ్మ చారి లా ఉండవలసిన తన శిష్యుడు యిలా ప్రేమ లో పడి గమ్యం తప్పుతున్నాడని అపార్దం చేసుకునే గురువు ,విలన్ వుండే బళ్ళారికి బద్రీనాథ్ నుంచి రైల్లో వెళ్లి క్షణాల్లో అడ్డు వచ్చిన వాళ్ళని నరికేసి అలకానందని అరగంట లో బద్రీనాథ్ గుడి తెరిచే సమయానికి తీసుకు వచ్చే హీరో ,పువ్వు తీసుకుని గుడి బయటకు వచ్చి తను ప్రేమించింది బద్రి నే అని చెప్పే హీరోయిన్ ,తొక్కలో శిక్షణ కంటే ప్రేమే గొప్పదని నువ్వు కాక పొతే మీ అబ్బాయికి యిస్తా లే శిక్షణ అని యిద్దరిని కలిపే గురువు ,నన్ను చంపకు నీకో దణ్ణం అనే విలను .యిది కధ .చిన్ని కృష్ణా నిను చేరి తంతు అనుకునే ప్రేక్షకులు .సోమ వారం లోపు చూడక పొతే మీరు యి సినిమాని టివి లో మాత్రమె చూడగలరు .అల్లు అర్జున్ బాగానే చేసాడు డాన్సులు ఫైట్స్ కాని కధ లో దమ్ము లేక పొతే తను మాత్రం ఏం చేస్తాడు .మీది తెనాలే అనట్టు గా యి సినిమాలో మీది పేటె (చిలకలూరి పేట )మాది పేటె అని పెట్టారు . హాస్యం అపహాస్యం.ప్రకాష్ రాజ్ గురువు ,రావు రమేష్ అతని అనుచరుడు నటన ప్రదర్శించడానికి అవకాశాలు తక్కువ , యింక హాస్య నటులు బ్రహ్మానందం , ధర్మ వరపు , వేణు వగైరా యిలా వచ్చి అలా వెళ్లి పోవడమే గాని పెదవులు కుడా వికసించవు .మగధీర లాభాలు యి సినిమా వల్ల వచ్చే నష్టం తో చెల్లు . మంచి పాయింట్ తీసుకున్నా మద్యలో ఎక్కడో క్లారిటీ పోయింది .హిందూ దేవాలయాల మీద దాడిని తిప్పి కొట్టడానికి సుక్షితులైన సైనికులు అవసరం అయితే వారిని ఎవరైనా ప్రేమిస్తే పెళ్లి చేసి మళ్ళి వాళ్ళ పిల్లలకి శిక్షణ ఇవ్వబడును . గురువుకు మరణం లేదు . వారు అయిదువందల ఏళ్ళు అవలీలగా బతక గలరు .యింక మీ వోపిక .