15 సెప్టెం, 2012

లైఫ్ ఈజ్ సగం బ్యూటిఫుల్


ఈ రోజు అనుకోకుండా  సినిమాక్స్  లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రత్యేకమైన షో కి వెళ్ళడం జరిగింది .ఏడు గంటల షో అయినా గాని బర్ఫీ హిందీ సినిమా అయ్యేదాకా వొక అరగంట వేచి ఉండాల్సి వచ్చింది . అక్కడేశేఖర్  కమ్ముల కనిపిస్తే గుడ్ లక్ చెబుతూ ఎలా వుంది టాక్ అని అడిగానో లేదో అప్పుడే కరెంట్ పోయింది .ఆ చీకటి లోనే పాపం శేఖర్ కమ్ముల నాట్ బాడ్ అన్నాడు .గొంతులో ఉత్సాహం ఎక్కువ విశ్వాసం తక్కువ కని పించాయి .యింతలో బర్ఫీ సినిమా అవడం తోటే అనుష్క , తాప్సి ,మంచు లక్ష్మి , సానియా మిర్జా  తదితరులు బయటకు వస్తు కని పించారు .

యింక ఈ సినిమా కి వస్తే మొదటి సగం చూడగానే బాబోయి ఈ శేఖర్ కి హ్యాపీ డేస్ ఇన్ఫ్లుయెన్స్ పోలేదని పిస్తుంది .చాలా సీన్లు తిన్నగా అందులోంచి తెచ్చినవే . క్రికెట్  ఆడే సీన్ ,ఆంటీ (అంజలా జవేరి )వెనక టైసన్ పాత్ర లాంటి కుర్రాడు వెంట బడడం  యిలా చాల వున్నాయి . మొదటి సగం గోల్డ్ ఫేజ్  లో వుండే రిచ్ పిల్లలకి బి   బ్లాక్ లో వుండే  మధ్య తరగతి కుర్రాలకి మద్య జరిగే కొట్లాటలే .మిగతా సగం మాతృదేవోభవ తల్లి సెంటి మెంట్ తో సాగే కదా .
అమల తన ముగ్గురు పిల్లలని  హైదరాబాద్ లో వుండే మావయ్య యింటికి పంపిస్తుంది చదువుకుని బాగు పడమని .హీరో కొట్లాటలలో పడితే అతని చెల్లెలు ప్రేమలో పడి గమ్యం పక్కకి వెళుతున్న సందర్భం లో తల్లి కి కాన్సెర్ అని తెలిసి మళ్ళి వాళ్ళ గమ్యం వైపు వెళ్లి సాధించడమే టూకి గా కదా . సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ బాగా దట్టించి కొన్ని సీన్స్ లో ప్రేక్షకుల కళ్ళు చమర్పించ జెయ్యడం లో శేఖర్ విజయం సాధించాడని చెప్పవచ్చు .కాని మొదటి సగం భరించి మళ్ళి లోపలకి వచ్చినప్పుడే కళ్ళు చేమర్చేది .లేకపోతె ప్రచారం లో చేబుతునట్టు గా యిది శేకర్ కి మన సినిమాగానే మిగిలి పోతుంది .కొత్త వాళ్ళలో నాగరాజ్ పాత్రధారి కి మంచి గుర్తింపు వస్తుంది . తెలంగాణా పోరాడు ఆంధ్ర పోరి లవ్ స్టొరీ బానే వుంది .
ఏంది ఈ అండి ముచ్చట మనదంతా తెలంగాణా నీ యమ్మ ఏందే, నీ అయ్యా అంటూ దిల్ ఖులాయించి మాట్లడుడే అంటే ఆమె
కొన్ని రోజులకి నిన్ను పెళ్ళిచేసుకుంటా అని అతను చెప్పగానే వద్దండి నాకు అటువంటి ఉద్దేశం లేదండి , మీరు నువ్వు అనమన్నారని అన్నా గాని ప్రేమ ఎక్కువయ్యి కాదండి అంటే ఏంది నేను తెలంగాణా అని సోచయిస్తున్నవా వంటి డైలాగులు వున్నాయి .
 
రచయిత మనసులో కొన్ని పాత్రలు ఎప్పటికి సజీవం గా వుండి పోయి ఏ కధ రాస్తున్నా మళ్ళి అవే అవే వస్తుంటాయి నా కధలలో సుధా లాగ పాపం కమ్ముల మీద హ్యాపీ డేస్ పాత్రలు కుమ్ముకున్నాయి.రెండేళ్ళు కష్ట పడి తీసినా యిష్ట పడి చూసే జనం కష్టమే .నష్టం నుంచి బయట పడాలంటే మొదటి సగం నిడివి కత్తిరించి , సెకండ్ హాఫ్ సెంటిమెంటు మీద ఆశ పెట్టుకోవడమే .

2 సెప్టెం, 2012

ఏదైనా కొన్నాళ్ళే


ఎందుకో కో మరి ఈ స్దబత ?గత కొంత కాలం గా . పని వత్తిడి వల్లేమో ?బ్లాగ్  లో భావాలూ పంచుకుని ఊరట చెందే అవకాసం కూడా రావడం లేదు .ఏవి నిరుడు కురిసిన హిమసముహాలు ?లేదా హిమసముహాలు అలాగే వుండి  వుంటాయి మనం చూసి ఆస్వాదించే మనసు సమయం లేక సమూహాలు గా మిగిలి పోయి వుంటాయి .ప్రేమ ఉదృతం గా వునప్పుడు అది తప్ప ఏమి కనబడదు .అది తగ్గినప్పుడే వాస్తవాలు కనిపించి భాద్యతలు గుర్తుకొస్తాయి .రాత్రి ఎనిమిందింటికి ఆఫీసు నుంచి బయలు దేరుతూ యిప్పుడు మీ యింటికి వస్తున్నాను అంటే అంతకన్నానా అంటూ ఆనందం గా ఆహ్వానించే స్నేహితురాలు /ప్రియురాలు కొన్నాళ తర్వాత అదే సమయానికి  అదే ప్రశ్నకి సమాధానం గా ఈ టైం లోనా ?అంటూ సమాధానం యిస్తే ఉదృతి తగ్గి వాస్తవాలు కళ్ళముందు కని పిస్తున్నాయని అర్ధం .అదేంటి కాఫీ నే గా తాగేది ?అతని ప్రశ్న .అవుననుకో చూసే వాళ్ళు ఏమనుకుంటారు ?ఆమె సమాధానం .మరి యిన్నాళ్ళు గాంధారి పుత్రులా ?కళ్ళుమూసుకుని   వున్నారా ?యీవేళ మాత్రం నే వస్తానంటే అలిచిప్పలా కళ్ళు పెద్దవి చేసుకుని వాళ్ళ పనులు మానుకుని నే రాగానే వీళ్ళెం   చేస్తారా అని తలుపులు తీసుకుని చూడ టానికి అతని లో ఆవేశం .అబ్బ ఎప్పుడు నీ కోణం లోనే గాని నా తరఫున ఆలోచించావా ?ఏ టైం లో పడితే ఆ టైం లో వస్తే ?ఆమె మాట పూర్తయ్యే లోపే అతను  నా కు వీలయిన టైం లో నే వస్తా అయినా జనాల కోసం బతుకు తున్నవా ? నీ కోసం బతుకు తున్నవా ?ఆ జనాలేమన్న నీకు అన్నం పెడుతున్నారా ?నీ ప్రేమ ఉదృతం గా వునప్పుడు రాని  ఈ జనాలు యిప్పుడే ఎలా వచ్చారు ?నీ కిప్పుడు మొహం మొత్తిందని చెప్పు నీ నిజాయితీకి పాదాభివందనం చేసి నే తప్పుకుంటా .అంతే గాని జనాల వంక చెప్పకు వాళ్ళు మొదటి రోజు నుంచి వున్నారు వాళ్ళ వాళ్ళ కోణాలనుంచి మనల్ని గమనిస్తూనే వుంటారు .ప్రేమ తారా స్తాయికి వెళ్ళే వరకు ఏ అడ్డంకులు కనబడవు అక్కడ నుంచి కిందకి జారడం మొదలవ్వా గానే అప్పటి వరకు కనబడని జనాలు ,కులాలు ,మానాలు అన్ని గుర్తుకు వస్తాయి .ఏ భందాలయినా కొన్నాళ్ళే బావుంటాయి అవసరాలు తీరి పోయాక కొత్త తీరాలు వెత్తుకుంటూ పాత కెరటాలని వదిలించు కోవడం కోసం వంకలు వెతుక్కుంటాయి .యీ ప్రక్రియ వొక నిరంతర ప్రవాహం .యిక్కడ పాత్రలు అవే పాత్ర దారులు మారతారు .మరో గమ్యం వైపు సాగి పోతారు .
వొక సుధ  కావచ్చు,రాధిక కావచ్చు .సీత కావచ్చు .వీళంతా ఎవరు అంటే ?వీళ్ళకి  పరిచయం అయ్యి ప్రస్తుతం విడి పోయారో ?లేదో తెలీని స్తితి లో వున్న వాళ్ళ మాజీ తాజా స్నేహితుల  అనుమతి తో వొక ఉద్గ్రంధం రాయవలసి రావొచ్చు .అందుకని ప్రస్తుతం యిక్కడ కామా పెడుతున్నా . వాళ్ళు వప్పుకుంటే మాత్రం రాస్తాను సుమా .

13 జులై, 2012

మరుజన్మ ఉందా ?

ఈగ సినిమా చూసాక మళ్ళి పునర్జన్మల మీద ఆలోచన మళ్ళింది . .ఈ జన్మలో మనకి సాయం చేసిన వారు , మననుంచి సాయం పొందిన వారు , మనల్ని ద్వేషిస్తున్నవారు , ప్రేమిస్తున్నవారు అందరు కిందటి జన్మ లో లింకులేనేమో అని పిస్తుంది .మొదటి సారి చూసినా కొంతమంది మీదా ఏదో తెలీని అభిమానం పుట్టుకొస్తుంది .యిన్కొంతమందితో ఎప్పటినుంచి పరిచయం వున్నా ఏహ్య భావం తోనే వుంటాం .జీవితం అంతా రుణాను భంధాలతోనే నడుస్తుంది . చని పోయాక కూడా ఈ పగలు ప్రేమలు వెంటాడతాయ ?అది ఏ రూపం లో వున్నా ప్రతిబిమ్బిస్తాయా ?లేదా చని పోయే ముందు బలం గా అనుకుంటూ చని పొతే పునర్జన్మలో అవి సాధించడం కోసమే పుడతామా? .
అసలు ప్రేమ అనేది ఉందా ?కామం అనే గమ్యానికి ప్రేమ అనేది వొక ముసుగేనా ?
ప్రేమకి కామానికి మద్య ఏదన్నా విభజన రేఖ ఉందా ?లేక వొకే మైదానం లో అవి రెండు గమ్యాలా?
యిలా ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ యింటికి వెళుతుంటే వొక్క సారి పెద్ద శబ్దం తో ఈ లోకం లోకి వచ్చా

 నాముందు కారు కింద ఎవరో అమ్మాయి స్కూటర్ తో సహా కింద పడి పోయి వుంది .రక్తం మడుగులో సృహ తప్పి .నేను వొక ఉదుటున కార్ డోర్ తీసుకుని ముందుకి వెళ్ళే లోపు చుట్టూ జనాలు వచ్చి ఆమె చుట్టూ మూగి పోయారు .ఎక్కువ మంది బతికిందో చనిపోయిందో చూడ దానికి వచ్చిన వాళ్ళే గాని చొరవ తీసుకుని సహాయం చేసే వాళ్ళు కనబడలేదు .మరి నువ్వో నా మనసు ప్రశ్నించింది .యిప్పుడు ఈ మెడికో లెగల్ కేసు నెత్తిన పెట్టుకుని పరోపకారి పాపన్నా లా సహాయం చెయ్యడం అవసరమా ?సెల్ తీసి నూట ఎనిమిదికి కొట్టి వివరాలు చెప్పే లోపే తెలిసిందండి ఎవరో యింతకు ముందే చెప్పారు వస్తున్నాం అంటూ సమాధానం విని మనం ఆలోచించే లోపు ఆదుకునే వారు యింకా వున్నారు లోకం లో అని పించింది .
సరే అంబులెన్సు వస్తుంది గా వాళ్ళే చూసుకుంటారు అనుకుంటూ కార్ కేసి అడుగులు వెయ్య బోయా . మనసెందుకో వప్పుకోవడం లేదు మళ్లీ గుంపు లోకి అడుగు పెట్టా . కొంచెం తోసుకుని లోపలి వెళ్ళడం వొక గాలి తిమ్మెర శరీరాన్ని తాకుతూ రోడ్డు మీద పడి మొఖం నిండా కప్పి వున్న ఆమె చున్ని ని తొలగించడం వొకే సారి జరిగింది .నేను ఉత్సుకత తో ఆమె మొఖం కేసి చూసా , నమ్మలేక పోయా మళ్లీ దగ్గర గా వెళ్లి చూసా అంతే నా కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది .అవును తనే ఎవరి కోసం అయితే నేను గత పది ఏళ్ళు గా కళ్ళలో వత్తులు పెట్టుకుని మరి వెతుకు తున్నానో , ఎవరైతే నా జీవితం లో ప్రేమ మధురిమలని నింపి ఆనందపు అంచులలో మధురామ్రుతాలని పంచి వసంత కోకిల లా వెళ్లి పోయి నా నిన్నలలో కలిసి పోయిన నా స్వప్న సుందరి . తనే వోకప్పటి నా హిమాని .
అందానికి ప్రతి రూపం అయ్యి సయిన మందిరం లో రాజ హంసలా పడుకుని ఎన్నో సార్లు నయనానదం కలిగించిన ఆమె ఈ రోజు నడి రోడ్డు మీద దిక్కు లేకుండా చావు బతుకుల మద్య అసహాయ స్తితిలో కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి . యింతలో అంబులెన్సు వచ్చింది . బాగ్ లో సెల్ ఉందేమో చూడండి వాళ్ళ వాళ్లకి ఫోన్ చెయ్యాలి అంటున్నారు . నేనే వాళ్ళ వాడిని అంటూ అంబులెన్సు లో కూడా అనుసరించా .వాళ్ళు ప్రబుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్ళ బోతుంటే నేను కార్పోరాట్ ఆసుపత్రికి మళ్ళించా .ఆమె సృహలో లేదు తలకి పెద్ద దెబ్బే తగిలింది . రక్తం యింకా వస్తోంది .హాస్పిటల్ లోకి వెళ్ళ గానే ఆమె ని అయిసియు లోకి తరలించారు .బ్రెయిన్ స్కాన్ తీసి అర్జెంటు గా ఆపరేషన్ చెయ్యాలి ముందు లక్ష రూపాయలు కట్టండి అంటె నా డెబిట్ కార్డు తీసి కట్టేసా . డబ్బు వచ్చాక మీరు ఏమవుతారు ఆమె కి అని అప్పుడు అడిగారు .దారిన పోయే దానయ్య ముందు పని చూడండి డబ్బు వచ్చింది కదా అని అరిచా .అసలు తను పెళ్లి అయ్యాక అమెరికా వెళ్లి పోయిందని చూచాయ గా తెలుసు హైదరాబాద్ ఎప్పుడు వచ్చిందో ?ఎక్కడ ఉంటోందో ?కనీసం వొక ఫోన్ కూడా లేదు మేము విడి పోయాక . తన పెళ్ళికి పిలిస్తే వెళ్లి చెయ్యి కలిపినప్పుడు కళ్ళలో నీళ్ళు తెచ్చుకుని వేళ్ళతో నా అరచేయ్యిని గోకుతూ వీడ్కోలు తీసుకున ఆ స్పర్స మళ్లీ యిలా సృహలేని స్తితిలో అయిసి యు కి వెళుతునప్పుడు నా వేళ్ళతో ఆమె ని తాకినప్పుడు పునరావృత్తం అవుతుందని అనుకోలేదు .
రాత్రంతా అయిసియు బయటే గడిపా .వాళ్ళ వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో ?తెల తెల వారు తుండగా ఆమె ఆపరేషన్ విజయవంతం అయ్యిందని సృహ లోకి రావడానికి యింకొన్ని గంటలు పడుతుందని వొక నిమిషం చూసి రావడానికి అనుమతి యివ్వడం తో లోపలి వెళ్ళా .ప్రశాంతం గా నిద్ర పోతునట్టు గా వుంది .అదే చిరునవ్వు మొఖం .మా యిద్దరి మద్య సన్నీ హితం తారా స్తాయి లో వున్నప్పుడు తను నా చేతిలో చెయ్యి వేసి నిమురుతూ ఈ ప్రేమ యిలా ఎప్పటికి కోన సాగుతుందా ?కాల గమనం లో మనం విడి పోయి ఎవరి జీవన పయనం లో వాళ్ళు సాగి పోతునప్పుడు మన మద్య కనీసం మాటల రాక పోకల్ని అయినా కోన సాగించ గలమా ?అని కళ్ళలో నీళ్ళు పెట్టుకుని అడుగుతుంటే పో పిచ్చి మొద్దు అటువంటి స్తితి మన మద్య ఎప్పుడు రాదు . వొక వేళ వచ్చినా యిద్దరం బలం గా మనసులో వొకరి తో వొకరు మాట్లాడుకోవాలి అనుకుంటే అదే క్షణం సాధ్య పడుతుంది . కలవాల్లాన్నంత బలమైన కోరిక మనసులో కలిగితే మనం కలవకుండా ఆపడం ఎవరి తరం కాదు అని వోదర్చా .కాల గమనం లో ఆమె వుహించినట్టే ఆమె కి వేరే వాళ్లతో పెళ్లి అయిపోవడం తన గతకాలపు స్మృతులు ఎట్టి పరిస్తితుల్లో భర్తకి తెలికుడదన్న ముందు జాగర్త చర్య వల్ల ఆమె ఏ నాడు నా తో ఏ విధమైన సంభందము పెట్టుకోలేదు అంతకు ముందు మేము అన్ని విధాలా హద్దులు మీరినా కూడా .
రాత్రంతా నిద్రలేక పోవడం , యింట్లోకుడా ఎవరో కావలిసిన వాళ్ళకి హాస్పిటల్ సాయం అవసరం అయితే యిక్కడే వుండి పోతున్నా అని చెప్పడం తో వాళ్ల కంగారుని తగ్గించడం కోసం వొక రెండు గంటలు యింటికి వెళదామని యింటి కొచ్హా .మంచం మీద పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది .మెలుకువ వచ్చేటప్పటికి చీకటి అయిపోయి వుంది . అంటె నేను పొద్దుట నుంచి రాత్రి దాక వొళ్ళు తెలీకుండా నిద్ర పోయానా ?మెలుకువ రాగానే హిమాని ని హాస్పిటల్ లో జాయిన్ చేసిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే హాస్పిటల్ కి పరిగెత్తా .అయిసియు లో వాకబు చేస్తే పోద్దునీ సృహ లోకి రాగానే తను వాళ్ల హబ్బి నెంబర్ కి రింగ్ చేస్తే అయిన వచ్చి అగైనిస్ట్ మెడికల్ ఎడ్విజే డిశ్చార్జ్ చేయించుకుని మెరుగైన వైద్య సౌకర్యం కోసం అమెరికా తీసుకు పోతునట్టు చెప్పారని తెలిసింది .మళ్లీ జీవితం లో ఆమెని నేను కలవలేక పోవచ్చు . ఎప్పటికి ఆమెకి తన ప్రాణా పాయ స్తితిలో నేను నా ధర్మం నిర్వర్తిన్చినట్టు తేలిక పోవచ్చు .నేను ఆమె దృష్టిలో కాల గర్భం లో కలిసిపోయిన కా (ప్రే )మికుడిగా మిగిలి పోవచ్చు . అయినా నా గుండె లోతుల్లో ఆమె మీద వున్న చెదరని ప్రేమ ఏవిధమైన గుర్తింపుని కోరుకోవడం లేదు .ఆమె మళ్లీ జన జీవన స్రవంతిలో కలిసిపోయి ఎప్పటి లాగే నవ్వుతు నవ్విస్తూ అప్పుడప్పుడు నన్ను తలచుకుంటే నా కాదే చాలు పదివేలు . ''మరు జన్మ ఉన్నదో లేదో ?మరి అపుడి మమతలేమవుతాయో ?మనిషికి మనసే తీరని శిక్ష దేముడిలా తీర్చుకున్నాడు కక్షా' కార్ స్టార్ట్ చేసి యింటికేసి సాగి పోతుంటే ఎఫ్ ఏం లో పాట. మరి మరు జన్మ ఉందా ?

24 జూన్, 2012

తిండి లో కూడా వివక్షా?

                  అప్పుడే ఆఫీసు నుండి వచ్చా. అప్పటికే తొమ్మిది అవుతోంది .అంతలో సెల్ మోగింది .ఎవరా అని విసుక్కుంటూ తీసా .సినిమా ప్రోడుక్షన్ మేనేజర్ .సార్ బావున్నారా ? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో వెంకటేష్ బాబు మహేష్ బాబు  కాంబినేషన్ లో పెళ్ళిచూపుల  సీన్ వుంది  స్నేహితుడి గా వొక్క రోజు షూటింగ్ రెండు మూడు డైలాగ్స్ కుడా వున్నాయి రాగలరా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ పొద్దున్నే కార్ పంపిస్తాను అన్నాడు .యింతకు ముందు రెండు మూడు సినిమాల్లో వెయ్యడం తో కొద్దో గొప్పో పరిచయాలు ఏర్పడ్డాయి . అయితే ఆ తర్వాత రోజు నేను కచ్చితం గా ఆఫీసు లో అటెండ్ అవ్వవలసిన మీటింగ్ సంగతి గుర్తుకు వచ్చి ఆ ఆఫర్ ని సున్నితం గా తిరస్కరించా .కొంచెం సమయం యిచ్చి చెప్పి వుంటే నటించేవాడినని  యింకో సారి చూద్దామని చెప్పి ఫోన్ పెట్టేసా .ఎంతో  మంది సినిమాలో వొక్కసారి కని  పిస్తే చాలు అని అర్రులు చాస్తుంటే  వచ్చిన అవకాశాన్ని వాడుకోలేని పరిస్తితి . నటన వొక  హాబీ అంతవరకే వుద్యోగం వొక భాద్యత అందులో ప్రబుత్వ అధికారి గా అది భగవంతుడు యిచ్చిన వరం .అరె వొక్క రోజు కుడా లీవ్ పెట్టుకోలేమా అనుకుని మళ్ళి  పెద్ద గీత ముందు నటన చిన్న గీత అనుకుని మర్నాడు పని లో ములిగి పోయా .మీటింగ్ అవ్వగానే ముందు గా మా లంచ్  అయ్యాక కింద స్టాఫ్ ని లంచ్ కి పిలుస్తారు .ఈ వివక్ష అన్ని చోట్ల వ్యాపించి వుంది . నా మూడు సినిమా షూటింగ్ అనుభవాలు గుర్తుకు వచ్చాయి .
       అక్కడ కుడా కార్వాన్ (ఎసి సదుపాయం తో పాటు యితర సౌకర్యాలు అన్ని వుండి షూటింగ్ స్పాట్ లో రెస్ట్ తీసుకోవడానికి పెట్టె బస్సు )కేవలం హీరో హీరోయిన్ లేదా బ్రహ్మానందం  స్తాయి కమెడియన్ కి మాత్రమె .మిగతా వాళ్ళు అంతా అక్కడ దగ్గరలో వేసిన చైర్స్ లో కూర్చో వలసిందే . వోకో సారి అందరికి సరపడా కుర్చీలు వుండవు .అందుకే ఆక్టర్  సహాయకులు కుర్చీలు మోసుకుంటూ తిరుగుతారు .యిక్కడ కూడా  మూడు గ్రూప్స్ గా కూర్చుంటారు ,హీరో ,డైరెక్టర్ , ప్రొడ్యూసర్ , స్టార్ కమెడియన్ వొక చోట కూర్చుంటే ,కేరక్టర్ అర్తిస్త్స్ ,యితర చోటా మోట నటులు వొక చోట .సాంకేతిక నిపుణులు మరో చోట .యిందులో మొదటి గ్రూప్ కి అరార కొబ్బరి నీళ్ళు ,ఫ్రూట్ జ్యూసులు వస్తే మిగతా వాళ్ళకి టీ మంచి నీళ్ళు  వస్తుంటాయి .యింక భోజనాల దగ్గర అయితే తేడా యింకా కని పిస్తుంది . మొదటి గ్రూప్ కి రెండు మూడు ప్రత్యేకమైన నాన్ వెజ్  తో పాటు అయిటేమ్స్ తో పాటు వడ్డన సదుపాయం వుంటుంది .రెండో గ్రూప్ కి ప్రత్యేకమైన ఐటం వుండనప్పటికి వడ్డన సదుపాయం వుంటుంది . యిక మూడో గ్రూప్ ఎవరికి వారే వడ్డిన్చుకోవాలి .యింక రామారావు గారి హయాములో అయితే అయన తిన్నాకే మిగత వారు  తినాలిట చెయ్యి కడుక్కుందుకు వచ్చినా కూర్చున్న వాళ్ళంతా చేతులు కట్టుకుని నిల బడాలి ట .ఎన్ని సార్లు సెట్ లోకి వస్తే అన్ని సార్లు లేచి నిలబడి నమస్కారం చెప్పాల్సిందే . లేక పొతే వాడి పాత్ర నిడివి తగ్గిపోవలసిందే .అయితే నా విషయం లో ఆ యిబ్బంది ఎదురవ్వ లేదు వేసింది చిన్న నిడివి వున్నా పాత్రలే అయినా నా ఉద్యోగ రీత్యా నాకు అవసరమైన దాని కన్నా ఎక్కువ మర్యాద చేసి కొండక చొ కార్వాన్ లో కుడా విశ్రాంతి తీసుకున్న సందర్భాలు వున్నాయి .
 అయితే నేను షూటింగ్ స్పాట్ లో చూసి బాధపడిన వివక్ష నా మీటింగ్ తర్వాత లంచ్ లో కుడా కనిపించి (కింద స్టాఫ్ ని తర్వాత చెయ్యమనడం )యింకో ఆఫీసర్ తో స్టాఫ్ ని కుడాయిప్పుడే  రమ్మంటే  ?అని నేను అనే లోపే వుర్కోండి సార్  యిప్పుడు మనతో లంచ్ అలవాటు చేస్తే రేపు మనతో కలిసి మందు కొడతా మంటారు . అప్పుడు చనువు పెరిగి చంక ఎక్కుతారు పని ఎలా రాబడతాం?బ్రిటిష్ వాడి పద్దతే కరెక్ట్ ఎక్కడి వాడిని అక్కడే ఉంచాలి ,లేక పొతే తాళం తప్పుతుంది . అంటూ చికెన్ వడ్డించు కోవడానికి  ముందుకు పోయాడు . ఈ వ్యవస్థ మారదు .పైకి ఎదిగిన కొద్ది ఇగో లు పెంచుకోవడమే గాని భుజం మీద చెయ్యి వేసి పని చేసే తత్త్వం ఎక్కడా రాదేమో . అయితే నే విన్నది ఏంటంటే కొల్లివుడ్ (కేరళ లో )లో లైట్ బాయ్ నుంచి హీరో వరకు వొకే చోట కుర్చుని  అందరు అవే ఇటేమ్స్ తింటారని .మరి అన్ని చోట్ల ఈ వ్యవస్థ వస్తే బానే వుంటుంది ముఖ్యం గా ఆఫీషియల్ మీటింగ్స్ లో .

29 మే, 2012

మరి అది ఎప్పుడో ?

 
 
చాలా కాలం నుంచి నెట్ వైపు ద్రుష్టి పెట్టె సమయం  దొరక్క కొంచెం  తాత్కాలిక వియోగం వచ్చింది బ్లాగ్ తో .
ప్రస్తుతం వొక వారం ట్రైనింగ్ ప్రోగ్రాం నిమిత్తం బరోడా రావడం తో కొచెం సమయం చిక్కింది మళ్ళి   బ్లాగ్ దురద తీర్చు కోవడానికి .విశాలమైన కాంపస్ లోఆఫీసర్స్ కోసం నిర్మించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ .ఎదురుగుండా పెద్ద ఉద్యాన వనం .అందులో వాకింగ్ చేద్దామని వుబలాట పడి వెళితే మొహమాట పడి తలకాయ దించుకోవలసిందే .అక్కడా ఆడా మగ వయసుతో సంభంధం లేకుండా బహిరంగం గానే ముద్దు ముచ్చటలో  ములిగి పోయి కని పిస్తారు .యిక్కడ ఏడున్నర అయినా చీకటి పడదు అయినా వాళ్ళకి తేడా పడదు .ఈ గాలి నేల లో ఏమన్నా తేడా ఉందా అని వొక స్నేహితున్ని అడిగితె యిక్కడ ఆడ వాళ్ళు పెళ్ళయ్యాక డరోడా స్టీమర్ లా తయారయ్యి ముద్దు ముచ్చటకి పనికి రాకుండా పోతారు కాబట్టి అదేదో పెళ్ళికి ముందే కానిచ్చేస్తారని అతని ఉవాచ .ఏంటో ప్రపంచం లో కామం కామన్ అయిపొయింది ఈ మద్య అనిపించింది .ప్రతి భంధం  అక్కడికే దారి తీస్తోంది చివరికి .పరిచయం అయిన పది నిమిషాలకే  పదనిసల టాపిక్ లోకి వెళ్లిపోతుంటే లోకం చాలా ఫాస్ట్ అనుకోవలసి వస్తోంది .అక్కడ జంటలు పార్క్ లోంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరి  దోవన వాళ్ళు అపరిచితులు లాగ పోతున్నారు అదేంటో ?ప్రేమ ఎక్కువుంటే అక్కడ కామం వుండదు .కామం మాత్రమే వున్న చోట వాళ్ళ అవసరాలు మాత్రమె వాళ్ళిద్దర్నీ కలిపి ఉంచు తాయి .అవసరాలు తీరవు అని తెలిసిన మరుక్షణం మరో గూటికి చిలక యెగిరి పోవును .అందుకే ఏ ప్రేమికులకైనా మొదట్లో వున్న ఉదృతి , మాటల వెల్లువ రాను రాను తగ్గి పోయి , యింకేంటి యింకేంటి స్తాయి లో ఆగి పోతారు మళ్ళి యింకో కొత్త వాళ్ళు వచ్చే దాక .దీనికి భిన్నం గా నాకు తెలిసిన వొక ఆద్యాత్మిక  ప్రేమికుల కదా రాసుకున్నా .ఆకర్షణ , ప్రేమ , కామం దాటి ఎంతో ఎత్తులో నే చూసిన మరో మరోచరిత్ర . అయితే ప్రచురించ డానికి అతను అనుమతించక పోవడం తో అది కంచికి చేరని కధ గా వుండి పోయింది . ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకానికి  , ఏళ్ళ వెళాల మదిలో రగిలే  అగ్ని జ్వాలకి వున్న తేడా నిజమైన ప్రేమకి కామానికి  మద్యన  వున్న పొంతన .వొక మంచి కధ రాయాలని ఉంది . కామం లేని ప్రేమ కధ .పాత్రలు కళ్ళని దాటి కిందకి రాని కధ .యెంత దూరం లో వున్నా అంత చేరువలో వున్న అనుభూతి కి లోనయ్యే ప్రేమికుల కధ .వుసులాడు  కోకుండానే మాటలకందని మధుర భావాల్ని సొంతం చేసుకున్న ప్రేమికుల కధ .అంతులేని ఆ కధ .వొక రోజు వొకరి కోసం  వొక్క సారి రాయాలని ఉంది . మరి అది ఎప్పుడో ?