6 అక్టో, 2008

బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీరు

బ్రహ్మి కి పెళ్లై ఏడేళ్ళు అయిపోయింది అందుకే రిమ్మ తెగులు పుట్టింది.భార్యని పట్టించు కోడం మానేసి చాల రోజులై పోయింది.ఆమె కూడా అంతే ఎప్పుడూ laptop పెట్టుకుని తన పనేదో తాను చేసు కుంటూ ఉంటుంది. .బాబు చిన్నవాడు కావడం తో రాత్రి 8 కే నిద్ర పోతాడు. ఇంక బ్రహ్మి రాత్రి రెండు దాక నెట్ మిద పడి ఒకటే చాటింగ్,హిమాని అతని జీవితం లో ఒక నిశి రాత్రి నెటిజెన్ గ rediff chatలో పరిచయం అయి అక్కడి నుంచి యాహూ మెస్సెంగెర్ దాక ఎదిగింది.కానీ అంతకంటే ముందుకి పోలేక పోతున్నాడు ఫోనే నెంబర్ ఇవ్వదు.హైదరాబాద్ లోనే సాఫ్టువేరు ఇంజనీరు తనలాగే ఏ కంపెనీ నో తెలియదు.కానీ ఇద్దరి భావాలూ ఒకటే .భగవంతుడు యెంత అన్యాయం చేస్తుంటాడు,హిమాని ని తన జీవితం లో భార్య గా పెట్టకుండా ఆ పిచ్చి పార్వతిని పడేసాడు.హిమాని చాట్ లో యెంత రొమాంటిక్ గా వుంటుంది.గంటలు నిమిషాల్లా గడిచి పోతాయి.ఏమన్నా సరే తనిచ్చిన హింట్స్ తో రేపు saturday తనని కని pettali . tankbund కి మార్నింగ్ 11 కి వచ్చి 5 మినుట్స్ లో వెళ్లి పోతానని చెప్పింది అంతే అ 5 నిమిషాల లో నేను తానెవరో కని పెట్టి నే వెళ్లి మాట్లాడ గలగాలి.ఏంటో ఉత్సాహం తో నిద్ర పట్టడం లేదు బ్టహ్మికి.తన రెండు నెలల కృషి ఫలించే క్షణాలు దగ్గరి కొచ్చేశాయి.ఎన్నాళ్ళో వేచిన హృదయం దూరం గా రేడియో లో పాట.ట్యాంక్ బండ్ కి పదింటికే వచ్చేసాడు .వేమన విగ్రహం దగ్గర తిష్ట వేసాడు. తాను వస్తుందా వస్తే అందం గా వుంటుందా ఎక్కడకి తీసుకెళ్ళాలి ?ఏంటో ఇంట టెన్షన్ తన పెళ్లి చుపులప్పుడు కూడా ఇంట పద లేదు, ఖర్మ ఇప్పుదేవరన్న చుస్తే?అబ్బ అసలు ఎ వెదవ తెన్సిఒన్స్ లేకుండా నెట్ లో సరదాగా చాట్ చేసుకోవడం లో ఉన్నా హాయి యి రియాల్టీ షో లో లేదేమో అనిపిస్తోంది. కళ్ళ ముందు భార్య బాబు గుర్తో చ్చారు,ఛి వద్దు నే తప్పటడుగులు వెయ్యను బుడి బుడి అడుగులు వేస్తున్న నా బాబు సాక్షిగా అనుకుంటూ కళ్ళలో నిల్లు తుడుచుకుని వెనక్కి దిరిగి పోయాడు.ఆ రాత్రి తన పార్వతి ని దగ్గర గా తీసుకుని ప్రేమ గా మాట్లాడుతుంటే అబ్బ మీరు నెట్ లోనే కదన్దొఇ నిజ జీవితం లో కూడా ప్రేమ ముర్తులే మీ హిమాని సాక్షి గా అంటు పాతవాటి నవ్వుతోంది. అంతే తన పార్వాతే హిమాని .మనసు ఆనందం తో బరువెక్కింది బుడి బుడి అడుగుల బుజ్జిగాడు పడి పోకుండా మంచం ఎక్కుతున్నాడు.

7 కామెంట్‌లు:

నవ్వులాట శ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగుంది ,మినీ కథ గా

చైతన్య.ఎస్ చెప్పారు...

బాగుంది.

Unknown చెప్పారు...

thx srikanth and chaitanya.

Unknown చెప్పారు...

కథ బాగుంది కాని కొంచం అప్పుతచ్చులు సవరణ చేసిఉంటే ఇంకా బాగుండేది (ఉదా కి. కళ్ళలో నిల్లు తుడుచుకుని వేణు దిరిగి పోయాడు - ఎవరీ వేణు?)

Unknown చెప్పారు...

కే గారు అచ్గ్గు తప్పులు నేనూ గమనించినా ఏమి చెయ్యలేక పోయా అదేంటో ఆఖరి పేరాల లో అనువాదం (తెంగ్లిష్ టు తెలుగు)దిద్దు దామంటే బ్లాగ్ సహకరించటం లేదు యెంత దాని నెత్తి మీద మౌస్ తో కొట్టిన ఏమి రావటం లేదు సో ఆ అప్పు తచ్చులు,ఇంక పూర్తి expertise సాధించలేదేమో అయిన ముందు ముందు వేరే మార్గం ఉందేమో వెతుకుతా, మీ కు కూడా thx కానీ మీ బ్లాగ్ ని ఎందుకు పబ్లిక్ చెయ్యలేదో?

Ramani Rao చెప్పారు...

కథ బాగుంది. కనువిప్పులా.. చాటింగ్ భాగోతాలు ఇలాగే ఉంటాయి. కంటిన్యూ చేయండి ఇలానే. అచ్చుతప్పులు పంటి కింద రాయి లాంటివే, కాని రాకుండా చూసుకోడం సులభమే కాస్త సాధన చేస్తే.

Unknown చెప్పారు...

రమణి గారు ఇది నిజంగా కనువిప్పు తెప్పించే కధే. నా క్లోజ్ ఫ్రెండ్ కే జరిగింది అయితే కధ లో లా వెంటనే కను విప్పు కల గ లేదు.ఆమె అతనితో మొత్తం డబ్బులు ఆరోగ్యం అన్ని ఖర్చు పెట్టించాక గాని భార్య పిల్లాడు గుర్తు రాలేదు .అలా అని మంచి వాళ్ళు లేక పోలేదు అందుకే ఈ చాట్ భారతం నుంచి చాటు భారతం లోకి వెళ్ళాక పోవడమే ఉత్తమ మని అనుభవజ్ఞుల భోగట్టా.