29 నవం, 2008

ఎల్లుండి కి గుర్తు ఉంటారా?

ఈ ఆవేశం రేపు ఉంటుందా?ఈ దేశభక్తి ఎల్లుండికి పదిలమా?ఉగ్రవాదుల తుటాలకి నేలకొరిగిన అమరవీరులకి అశ్రుతర్పణం వదలడం లో sms ,లైవ్ షో లో ఫోన్ కాల్స్, కాసేపు చెమర్చిన అశ్రు నయనాలు?ఆ తర్వాత ఎవరి జీవితం వాళ్ళది.ఇంకో తీవ్రవాద చర్య జరిగేదాకా ముంబై లో నార్త్ ఇండియన్ నఖరాలు చేస్తే కాలు తీస్తా అంటాడు ఒక థాకరే.హైదరాబాద్ లో ఉగ్రవాదుల పేరిట అమాయకులైన ముస్లిం యువకుల్ని వేధిస్తే చంపేస్తా అంటాడు ఇంకో ఒవైసీ వెరసి ఎవడి రాజకీయాలు వాళ్ళవి.పార్లమెంట్ మీద దాడి చేసి సుప్రీం కోర్ట్ ఊరి శిక్ష విదించిన తీవ్రవాది కి ఊరి తీసే దమ్ము మనకి లేనప్పుడు బాగ్ నిండా granides తీసుకుని ak 56 చేతబూని వాడి బెడ్ రూమ్ లోకి వెళ్ళినట్టు గ స్టార్ హోటల్ లోకి కూడా వెళ్ళగలడు.రాజ్ ధాకరే ముంబై లో ఆ రాత్రి సుఖం గ నిద్రపోడానికి దక్షిణ ప్రాంతపు ఉన్నికృష్ణన్ , ఉత్తర ప్రాంతపు సింగ్ తాము శాస్వత నిద్ర లోకి వెళ్ళిపోవలసి వచ్చింది.ఇప్పుడు ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నారు వాడు విచారణలో నాకు కించిత్తు కూడా బాధలేదు పి పెచ్చు గర్వం గ వుండన్నాడట, రేపు కోర్ట్ విచారణలు మూడేళ్ళు సాగి వాడికి ఉరిశిక్ష పడినా ,వాడికి క్షమా బిక్ష కోరడానికి అన్ని రాజకీయ పార్టీ లు రెడీ, మైనారిటీ వోట్లు పోతాయేమో అని భయం.మరి ఇప్పుడు అసువులు బాసిన ఆ ప్రభుత్వ వుద్యోగుల కుటుంబ పరిస్తితి?అందుకే నా సూచన ఏంటంటే ఇలా విద్రోహుల ఉన్మాద చర్యకి విధి నిర్వహణ లో అసువులు బాసిన ప్రతి ఉద్యోగికి వాళ్ళు సర్వీసు లో ఉంటే ఎలా జీతం ప్రమోషన్స్ ఇతర సదుపాయాలు ఇస్తారో అవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి ఆతను రిటైర్ అయ్యే దాక కొనసాగించాలి. అంటే భౌతికం గ ఆ వ్యక్తి ఆ కుటుంబానికి లేక పోయిన ఆర్దికంగా తోడూ గా వునట్టే. పార్లమెంటు లో చట్టం తీసుకొచ్చి ఇంతకూ ముందు ఇలాగే అసువులు బాసిన అందరు ఉద్యోగులకి వర్తించేలా చెయ్యడమే వాళ్ళకిచ్చే నిజమైన నివాళి . అంతే గాని రెండు రోజుల తర్వాత వీళ్ళ పేర్లు చెప్పమంటే ఎంతమందు గుర్తు పెట్టుకుని చెపుతారు? ఆలోచించండి,మన స్టేట్ లో పాత బస్తి లో కరెంటు బిల్లు, వాటర్ బిల్లు వాసులు చేసే దమ్ము ఉద్యోగులకి లేదు. ఇంక ఉగ్రవాదం మీద పోరు కూడాను. కనీసం ఈ ఉగ్రవాద చర్యని mim పార్టీ ఖండించను కూడా లేదు.ముంబై లో కాబట్టి ఉగ్రవాదులు చచ్చారు గాని అదే హైదరాబాద్ లో అయితే ఈ పాటికి pia విమానం లో kudha haffiz అంటు చల్లగా వెళ్లి పోయేవారు.

19 నవం, 2008

మృష్టాన్న భోజనం /ముష్టి భోజనం

మన ఇంట్లో కడుపు నిండా తిని బ్రేవే మని త్రెంచ గలిగితే అదే మృష్టాన్న భోజనమని నేను ,ఇంట్లోనే కాకుండా ఎక్కడ తృప్తి గ తిన్నా అదే మృష్టాన్న భోజనమని మా ఫ్రెండ్ వాదన.ఆకలి తీర్చుకోవడం కోసం గడ్డి పచ్చడి తిని అదే విందు భోజనం అనుకోవడం ఎంతవరకు సమంజసం?అసలు బయట చిరు తిళ్ళు తినడం అవసరమా?పొరిగింటి పుల్లకూర రుచి అని ఇంట్లో వున్నా విందు భోజనం నచ్చదు గాని పక్కింట్లో పుల్లకూర మీదే ద్రుష్టి,ఇలా సాగి పోతున్న నా వాదనకి అడ్డుకట్ట వేస్తూ మా ఫ్రెండ్ బాస్ కడుపు కాలి ఆకలి వేస్తునప్పుడు ముష్టి భోజనం కూడా పరమాన్నం లానే అని పిస్తుంది, అలాగే ఆకలి తీరడం కోసం ముష్టి ఎత్తిన తప్పులేదు అంటు మా వాడు వాదిస్తున్నాడు.అందుకనేనా puutakullamma కాలం నుంచి ఫివె స్టార్ హోటల్స్ దాక బయట భోజనం డిమాండ్ తగ్గలేదు .ఇదంతా ఎప్పటి నుంచి వింటున్నాడో ఏమో ఆ పెద్దాయన మద్యలో కల్పించుకుని మీ ఇంట్లో ఆడవాళ్లు కూడా బయట తిండే బెస్ట్ అనుకుంటే అప్పుడు తెలుస్తుంది అంటు వీసా వీసా వెళ్ళిపోయాడు.అవాక్కవడం మా వంతయ్యింది .ఎందుకంటె మా వాడు భోజన ప్రియుడు తిండి చూస్తే నోరు కట్టుకోలేదు వాడికున్న షుగర్ ప్రాబ్లం దృష్ట్యా మేము ఇంటి భోజనం బయట భోజనం గురించి మాట్లాడుకుంటుంటే అ పెద్దమనిషి వేరేలా అర్ధం తీసుకుని మాకు క్లాస్సు పీకి చక్క పోయాడు.ఒకే విషయాన్నీ రెండు కోణాల్లో చూస్తే యెంత తేడ?ఇక్కడ నేను రాసింది కేవలం తిండి గురించి గానే భావించి నేటిజేన్స్ చదువు కో గలరు వేరే అర్ధం స్పురించిన యద్ భావం తద్ భవతి. చిత్త గించ గలరు.

15 నవం, 2008

తెలుసుకోవలసిన సమాచారం (కానీ ఇష్టం ఉండదు)

మొన్న దీపావళి వెళ్ళిన మర్నాడు హటాత్తుగా మా మావగారు కాలం చేసారు.ఉదయం 11 గంటలకి పొతే సాయంత్రం లోపల దహన సంస్కారాలు జరిపిస్తే మంచిదన్నారు.కానీ ఎక్కడ మొదలెట్టాలి ఎలా మొదలెట్టాలి,దుఖం లో వున్న భార్యని ఒక పక్క వోదారుస్తూ ?ఆ సందర్భంగా నాకు అర్ధం అయ్యిందేంటంటే ఇప్పుడు అంతా టైలర్ made arrangements .మనం ఎవరో ఒక పురోహితుడికి ఫోన్ చేస్తే వాళ్ళే అన్ని సామానులతో సహా గంట లో వచ్చేస్తారు.ఈ లోపల ఇంటిదగ్గర డాక్టర్ to డెత్ సర్టిఫికేట్,( ఒక వేళ హాస్పిటల్ లో పొఇ వుంటే వాళ్ళే ఇస్తారు),తీసుకుని bansilalpet కి వెళ్లి అది చూపించి 2000 దాక కడితే వాళ్ళే చితి ఏర్పాటు చేసి ,అరగంట ముందు వాన్ పంపిస్తారు ఇంటికి.ఈ లోపల ఒక గంట కార్యక్రమం వుంటుంది అది పూర్తి కాగానే ఇంక అంతిమ యాత్ర.ఆ తర్వాత రోజు ఉదయాన్నే వెళ్లి ఆస్తిక సంచయనం వుంటుంది అవి కూడా కొంత రుసుము తీసుకుని రెండు నెలల దాక అక్కడే lockers లో భద్ర పరుస్తారు.ఈ రెండు రోజుల కార్యక్రమానికి పురోహితుడు నాలుగు నుంచి అయిదు వేలు తీసుకుంటాడు(వస్తువులన్నీ అతనే తెచ్చుకుంటాడు).ఇక అ తర్వాత వైకుంఠ సమారాధన వరకు అన్ని కార్యక్రమాలకి దస దానాలతో సహా 16 వేలనుంచి 21 వేళ దాక తీసుకుంటారు.ఆ తర్వాత కుల సంప్రదాయాల్ని అనుసరించి నెల నెల మాసికలు అవి పెడితే 1600(మొత్తం బ్రహ్మలు భోజనాల to సహా)సంవస్తారికల కి మూడు రోజుల ప్యాకేజీ 17ooo.మొత్తం అంతా కలిపి 60000 దాక అవుతుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళు వున్న వాళ్ళు కనీసం ఒక 50000 అన్నా పక్కన పెట్టుకుని వుంటే చనిపోకుండానే వారి ఆత్మా సంతోషిస్తున్డి.ఫైనల్ గ చెప్పేదేమంటే అటువంటి విపత్కర పరిస్తితులలో సంయమనం కోల్పోకుండా dial for his final journey అని ఒక ఫోన్ కొట్టి డబ్బులు సిద్దం గ పెట్టుకుంటే మానవ జన్మ ఎత్తిన ఆ జీవికి సద్గతులకు మనం సాయం చేసినట్టే.

9 నవం, 2008

చింతకాయల బంగారులోకం

ఒకప్పుడు అమెరికా కి జాబు వీసా దొరికితే బంగారు లోకం లోకి అడుగు పెట్టినట్టే.ఇండియా నుంచి బోల్డు మంది అలా వెళ్లి లబ్డి పొందినవారే.చింతకాయల అని ఇంటి పేరును ముందుకు తగిలించు కున్న వారె.అదంతా గతం లోకి వెళ్లి పోతోంది. అమెరికా లో ఆర్దిక మాంద్యం తెలుగు వారి పాలిట శాపం గ మారినట్టు ఉంది.మొన్న us లో ఉద్యోగం పోయిందని భార్య పిల్లల్ని కదతేర్చి పారిపోఇన సంఘటన మరువక ముందే ,ఇంకో అమ్మాయిని కిరాతకంగా చంపేసారు.అసలు ఈ హత్యలకి కారణం ఏంటో కూడా అంతు పట్టడం లేదు. చదువుకునే అమ్మాయిల్ని డబ్బు కోసం హత్య చేసరనలెం.ఇండియా లో కన్నా అద్వాన్నం గా వున్నాయి అక్కడ శాంతి భద్రతలు.భారతీయుల దగ్గర దండి గా డబ్బులున్తయన్న భావనే అక్కడ నల్లజాతి నేరస్తులని ప్రేరేపిస్తున్న ఆం శమా ? తల్లిదండ్రుల్ని భందువుల్ని వదిలి తమ సొంత పేర్లని కూడా వదిలి ఇంటిపేరు ముందుకు తగిలించుకుని నానా కష్టాలు పడుతూ ఎప్పటికైనా ఇండియా కి పొఇ హాయ్ గా బతక క పోతామా అన్నా ఆశ తో వున్నా భారతీయులకి ఈ ఒబామా అన్నా ఆపన్న హస్తం అందిస్తాదేమో చూడాలి. లేక పొతే ఈ అమెరికా అర్దికా మాంద్యం లో సలభాళ్ళ మాడి పోయేది ఆంధ్రులే.